మండలంలో భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం
మృతుని కుటుంబాన్ని పరామర్శ
మండల పరిధిలోని ఇనగలూరు పంచాయితీ గాజుగుంటపల్లి గ్రామంలో మంగళవారం తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పర్యటించి,భాదితులను పరామర్శించారు.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ని, అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసి జైలుకు పంపిన నేపథ్యంలో ఆయన అక్రమ అరెస్టుకు,అన్యాయమని గాజుగుంటపల్లి గ్రామంలో మేకల రామచంద్ర భావోద్వేగంతో మృతి చెందారు.చంద్రబాబు పట్ల,మృతి చెందిన కుటుంబాలను చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి, చంద్రబాబు నిర్దోషిగా బయటికి రావాలని కార్యక్రమం చేపట్టింది.అందులో భాగంగానే గాజుకుంటపల్లిలో మృతుని కుటుంబాన్ని పరామర్శించి,కుటుంబ సభ్యులను ఓదార్చి,తన వంతు సాయంగా 3 లక్షల రూపాయలు చెక్కును అందజేశారు.తెలుగుదేశం పార్టీ, నాయకులకు, కార్యకర్తలకు, ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆమె మనోధైర్యం కల్పించారు. నారా భువనేశ్వరి గ్రామానికి చేరుకోవడంతో ఈ ప్రాంతంలోని తెదేప నాయకులు కార్యకర్తలు, అధిక సంఖ్యలో వచ్చి ఆమెకు, ఘన స్వాగతం పలికారు.ఈమె వెంట, పుట్టపర్తి నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు, పరిటాల సునీత, జిల్లా అధ్యక్షులు బి.కె, పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మండల కన్వీనర్, జయచంద్ర, పిట్ట ఓబుల్ రెడ్డి, పీట్ల సుధాకర, అంజన్ రెడ్డి, రాజారెడ్డి, రామ నాయుడు, సూరి, చంద్ర, చవట కృష్ణయ్య, తోపాటు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
______________________________
మహిళ ఆర్థికాభివృద్ధి సాధించాలన్నదే జగన్ ద్యేయం
రూ. 12.56 కోట్ల చెక్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
శ్రీసత్యసాయిజిల్లా,ఫిబ్రవరి13(విజయస్వప్నం.నెట్)
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.వైయస్సార్ ఆసరా నాలుగో విడత రుణమాఫీ మొత్తం రూ 12.56 కోట్లు చెక్ ను మహిళా సంఘ ప్రతినిధులకు అందజేశారు. మండల కేంద్రంలోని వైయస్సార్ కూడలి సమీపంలో ఓడిచెరువు,అమడుగూరు,నల్లమాడ మండలాలకు చెందిన పొదుపు సహాయ మహిళా సంఘాల సభ్యురాలతో మంగళవారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మూడు మండలాల నుంచి భారీ ఎత్తున మహిళలు హాజరయ్యారు.ఈ వై.ఎస్.ఆర్ ఆసరా " నాలుగవ విడత పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అధితులుగా శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైయస్సార్ ఆసరా,వైయస్సార్ చేయూత,జగనన్న విద్యా దీవెన,జగనన్న వసతి దీవెన లాంటి పథకాల ద్వారా ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ధి సాధించాలని జగన్ సంకల్పించినట్లు చెప్పారు అందులో భాగంగా పెద్ద ఎత్తున వివిధ పథకాల ద్వారా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన నగదుతో తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు.గత ప్రభుత్వం మహిళలకు ఏ సంక్షేమ అభివృద్ధి పథకాన్ని అందించింది లేదన్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ మోసపూరిత వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని ఆయన తెలిపారు.ప్రభుత్వ పథకాల కారణంగా నేడు కుటుంబ విషయాల్లో మహిళలు నిర్ణయాత్మకంగా,వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. మహిళల ఆరోగ్యం కోసం అంగన్ వాడీల ద్వారా సంపూర్ణ పోషణ రూపంలో పోషకాహారం, ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత వైద్యం, జనని సురక్ష యోజన, తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్, వంటి పథకాలెన్నో ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ పథకాల అమలు ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను జగనన్న ప్రభుత్వం మహిళలకు అప్పగించిందన్నారు వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం చేసుకోవాలని అందుకు మహిళలు తమ ఓటును ఫ్యాను గుర్తుకు వేసి వేయించి గెలిపించాలని కోరారు. జగనన్న ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని అన్నారు. అనంతరం ఓడి చెరువు మండలంలోని 704 సంఘాల్లోని 6985 సభ్యులు కు గాను రూ. 5.26 కోట్లు, అమడుగూరు మండలంలోని 448 సంఘా ల్లో ని 4359 మంది సభ్యులకు గాను రూ. 3.20 కోట్లు నల్లమాడ మండలంలోని 572 సంఘాలకు గాను 5791 సభ్యులకు రూ. 4.10 కోట్లు మొత్తం మూడు మండలాల కు గాను నాల్గవ విడత కింద రూ. 12.56 కోట్ల రూపాయల మెగా చిక్కును మహిళా సంఘాలకు అందజేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి స్వయం సహాయక సంఘ సభ్యులు పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది వాలంటీర్లు,మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యులు,వైకాపా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
____________________________
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి