శ్రీసత్యసాయి జిల్లా సంక్షిప్త సమాచారము
పుట్టపర్తి - ఓడిచెరువు, జనవరి 31
మండలంలోని భవన నిర్మాణ కార్మికులకు ఇళ్లస్థలాలు కేటాయించి, గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ..... చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం రెండవ రోజుకు కొనసాగించగా.... సిఐటియూ జిల్లా,డివిజన్,మండల నాయకులు లక్ష్మినారాయణ, కుళ్లాయప్ప తదితరులు సంఘీభావం తెలిపారు.ఈకార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కిష్టప్ప,కార్యదర్శి రవి,కోశాధికారి సూరి,శ్రీనివాసులు,మహేంద్ర,సహాయ కార్యదర్శి కేశవ,రమణప్ప,మహిళ నాయకురాలు మనీ, గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.
కదిరి - రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజు కొనసాగాయి.రాయలసీమ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుగుణమ్మ మాట్లాడుతూ....సర్వేనెంబర్ 83 కుంభకోణం పై విచారణ జరిపించాలని,సర్వే 1735-1ఏ1లోఉద్యోగులకు ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని,అర్హులైనపేదలకుఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని,పేదల ముసుగులో ధనవంతులకు పట్టాలు యిచ్చిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు
పుట్టపర్తి, కదిరి - కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పైన పశ్చిమబెంగాల్లో మాల్దారులు కారు పైన దుండగులు దాడి చేయడం హేయమైన చర్య అంటూ శ్రీ సత్యసాయి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగ్గటి మునికుమార్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు.భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా చేపట్టిన రాహుల్ యాత్రలను అడ్డుకోవడం గానీ,అన్యాయంగా కారు పైన రాళ్లు వేసి దాడి చేయడం సబబు కాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఏ రాజకీయ పార్టీ నాయకుని కూడా జరగకూడదని,రాహుల్ గాంధీ కారుపై దాడిని ఖండిస్తున్నట్లు అయన తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా - అయోధ్య శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఆహ్వానం కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు బుధవారం శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీసీతారాములు వారి కళ్యాణం కార్యక్రమంలో సేవలు అందించినట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి,ఓబీసీ మోర్చా కదిరి డివిజన్ నాయకులు గొడ్డేండ్ల వెంకటేష్ తెలిపారు(విజయస్వప్నం.నెట్ రిపోర్టర్,కదిరి)
పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ శిక్షణ తరగతులు
శ్రీసత్యసాయి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కదిరి డివిజన్ పరిధిలోని సాంఘిక సంక్షేమ బాల బాలికల వసతి గృహల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులకు ప్రేరణ అవగాహన శిక్షణా తరగతులు నిర్వహణ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఓడిచెరువు(శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో)సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహములో నిర్వహించగా (డిఎస్సిడబ్లీయ్యుఓ)ఈఓ ఐ. శివ రంగప్రసాద్,కదిరి ఏఎస్డబ్లీయ్యుఓ జి. రెడ్డిబాలాజీ,సహాయ సాంఘిక సంక్షేమాధికారి వారి కార్యాలయం పరిధిలోని వసతి గృహ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.ఈసందర్బంగా వారు పరీక్షలు సమీపిస్తున్నందున ఒత్తిళ్లతో కాకుండా,ప్రశాంతంగా ఏకగ్రతతో చదవాలని తదితర అంశాలపై ప్రేరణ అవగాహన ఒక రోజు శిక్షణ తరగతులు 90 మంది విద్యార్థిని, విద్యార్థులకు(కస్తూరిభా బాలికల పాఠశాల విద్యార్థినిలు)నిర్వహించినట్లు వార్డన్ ఎన్. రవీంద్ర రెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో వసతి గృహల వార్థన్లు,ఉపాధ్యాయులు,సిబ్బంది పాల్గొన్నారన్నారు.
జిల్లా పౌర సంబంధాలాధికారికి ఘన సన్మానం
గణతంత్ర దినోత్సవ వేడుకలలో శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవలకు అవార్డు అందుకున్న జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.వేలాయుధంకి(డిఐపిఆర్ఓ)బుధవారం కదిరి నియోజకవర్గానికి సంబంధించిన చిన్న పత్రిక మీడియా ప్రతినిధులు,వివిధ కళాకారులు పుట్టపర్తి చిత్రావతి నది రోడ్డు సమీపంలో డిఐపి ఆర్వో కార్యాలయములో ఆయనకు శాలువా కప్పి (డిఐపిఆర్ పి)ఘనంగా సన్మానించారు.
డీఎస్సీ ద్వారా నియమించబడే ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాలు గౌరవ వేతనం
ఇస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఎన్నో ఉద్యమాల ద్వారా రద్దు కాబడిన అప్రెంటిస్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించడమేనని డిటిఎఫ్ భావిస్తోందని,కావున డియస్సి ద్వారా చేపట్టే నియామకాలు అన్ని రెగ్యులర్ నియామకాలు గానే ఉండాలని వారిని పూర్తి వేతనంతో నియమించాలని డిటీఎఫ్ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి గౌస్ లాజమ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.డియస్సి ద్వారా చేపట్టే నియామకాలు అన్ని రెగ్యులర్ నియామకాలు గానే ఉండాలని వారిని పూర్తి వేతనంతో నియమించాలని వారు ఈసందర్బంగా తెలిపారు.
రజతోత్సవ పోస్టర్లు విడుదల చేసిన ఉపాధ్యాయులు
నల్లమాడ జనవరి31 - నల్లమాడ మండలం,దొన్ని కోట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో బుధవారం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రజతోత్సవాల(25 వార్షికోత్సవ)వేడుకకు సంబంధించిన పోస్టర్లు ప్రధానోపాధ్యాయులు గీత,రాష్ట్ర నాయకులు షర్ఫోద్దిన్,జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ ఆధ్వర్యంలో విడుదల చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు డిటిఎఫ్ రజితోత్సవాలను ఫిబ్రవరి 10,11 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ....ఉపాధ్యాయు లకు సంబంధించిన ఆర్థిక బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని,2004 ముందు ఉద్యోగ,ఉపాధ్యాయ నియామకాలపై నోటిఫికేషన్ జారీ చేసిన సంవత్సరం తర్వాత నియామించిన ఉపాధ్యాయులకు ఆయా శాఖల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మెమో 57 అనుసరించి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని 12వ పే కమిషన్ ఆలస్యమైనందున మధ్యంతర భృతి (ఐ.ఆర్)45 శాతం చెల్లించాలని,ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ....రజతోత్సవ వేడుకలలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బయప్పరెడ్డి,సుధాకర్ రెడ్డి,నారాయణ,సిద్దయ్య,బాబా ఫక్రుద్దీన్,జయరాం నాయక్,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
రామప్పనాయుడు సేవలు మరువలేనివి:మాజీమంత్రి పల్లె శ్రీ సత్యసాయి జిల్లా జనవరి31(విజయస్వప్నం. నెట్)ఓడిచెరువు మండలం చింతమాను పల్లి పంచాయతీ,నాయనవారి పల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,మాజీ ఎంపీపీ,మాజీ కదిరి మార్కెట్ చైర్మన్,మాజీ రాష్ట్ర రైతు సంఘ నాయకులు బోయపాటి రామప్పనాయుడు (85) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందిన విషయం తెలుసుకొన్న మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం వారి స్వగ్రామంలో సందర్శించి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ రామప్పనాయుడు ప్రజలు మెచ్చిన నాయకుడని,మృధుస్వభావని,ఆయన తెదేపాకు చేసిన సేవలు మరువలేనివన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వైజాగ్ లో క్రికెట్ సందడి....! మరో రెండు రోజుల్లో విశాఖ వేదికగా భారత్, ఇంగ్లాడ్ జట్లు తలబడబోతున్నాయి. చాలా రోజుల తర్వాత విశాఖలో జరగబోయే క్రికెట్ మ్యాచ్ కోసం అభిమానుల్లో ఉత్సహం, తమ అభిమాన క్రీడాకారులను నేరుగా చూడడానికి ఎదురు చూస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి