6, ఫిబ్రవరి 2024, మంగళవారం

శ్రీసత్యసాయి జిల్లా లో పెనుగొండ జాతీయ రహదారిపై చిరుతకు ఆక్సిడెంట్. - పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన -7 వ అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలలో కదిరి విద్యార్థుల ప్రతిభ - భజన కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేత - కానిస్టేబుల్ గణేష్ మృతి



శ్రీసత్యసాయిజిల్లా,పెనుగొండ ఫిబ్రవరి06(విజయస్వప్నం.నెట్ )

పెనుగొండ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం చిరుతపులిని ఢీ కొట్టగా తీవ్రంగా గాయపడినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.పశు సంవర్ధక వైద్యాధికారిణి జాహ్నవి సంఘటన స్థలానికి చేరుకొని మాట్లాడుతూ.... వాహనం బలంగా ఢీ కొనడంతో చిరుతకు అంతర్గతంగా తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. పుట్టపర్తి కరుణ సోసైటీ సభ్యులు చిరుతకు ప్రధమ చికిత్సలు అందించగా, మెరుగైన వైద్య చికిత్సల కోసం తిరుపతికి తరలిస్తున్నట్లు అటవీ అధికారుల సమాచారంగా ఉంది.

________________________________

8వరోజు భవన నిర్మాణ కార్మికుల దీక్షలు

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఫిబ్రవరి06(విజయస్వప్నం.నెట్)

సిఐటియూ జిల్లా,డివిజన్,మండల నాయకులు రమణ, లక్ష్మినారాయణ, కుళ్లాయప్ప, పోరాటాల శ్రీరాములు ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ... .భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం 8వరోజుకు చేరుకున్నాయి. ఇళ్లపట్టాలు పంపిణి చేసే వరకు దీక్షా శిబిరంలో వివిధ దశల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాలు ఉదృతం చేస్తామని వారు పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో భవన కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

________________________________

సర్పంచుల నిధుల కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్ళితే.... 

అరెస్టులు సబబు కాదు::-- పంచాయతీరాజ్, సర్పంచుల సంఘం 


శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి06(విజయస్వప్నం.నెట్)

జాతీయ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు ఎలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మంగళవారం బయల్దేరి ఆర్టీసీ బస్సులో వెళ్తూ ఉండగా పోలీసులు అడ్డుకొని  బస్సును వేరే మార్గం వైపు మళ్ళించి అక్రమ అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలించారని ఓడిచెరువు మండలానికి చెందిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యుడు, మాజీ ఎంపిపి ఇస్మాయిల్ తెలిపారు. అయన మాట్లాడుతూ  వైయస్సార్ ప్రభుత్వం సర్పంచ్లకు రావలసిన నిధుల కోసం అనేక మార్లు ఉద్యమాలు చేసి, అర్జీల రూపంలో విన్నపించుకున్న  రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా సర్పంచుల ప్రాధాన్యతలను విస్మరించిందని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం  14,15 ఆర్థిక సంఘం ద్వారా 8629.79 కోట్ల నిధులు సర్పంచుల బ్యాంకు ఖాతాల నుంచి మళ్ళించి సర్పంచులకు మొండిచేయి చూపిస్తున్నారు. సర్పంచులకు ఇవ్వాల్సిన నిధులు, విధులు కోసం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా దౌర్జన్యంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించి సాయంత్రం వరకు పెట్టి సొంత పూచికత్తుతో వదిలిపెట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధానం మార్చుకోకపోతే,ఉద్యమం ఉదృతం  చేస్తారని సర్పంచ్ సంఘాల నాయకులు హెచ్చరించారన్నారు. 


ఈ కార్యక్రమంలో  డేగుల కృష్ణమూర్తి,రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యదర్శి ముత్యాలప్ప,సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి,గోనుగుంట్ల భూషణ్, ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శంకర్ రెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గం సర్పంచ్ల సంఘం కన్వీనర్, పొన్నూరు స్వామి,రాయదుర్గం నియోజవర్గం సర్పంచ్ల సంఘం కన్వీనర్ తదితర రాష్ట్రంలోని సర్పంచులు,రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యులు పాల్గొన్నారని అయన తెలిపారు.

________________________________

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన




శ్రీసత్యసాయి జిల్లా,అమడుగూరు ఫిబ్రవరి06(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో మంగళవారం పాఠశాల విద్యార్థులకు సమావేశం ఏర్పాటు చేసి పర్యావరణం వాటి విశిష్టత అంశంపై ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు అవగాహనా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ఓఆర్ఇఎస్టిలో పొందుపరిచిన ప్రతి అక్షరానికి అర్థం తెలిపి,ఆహారం, ఆక్సిజన్,రేయిన్స్,ఎకో సిస్టం,సాయిల్ కన్జర్వేషన్,టెంపరేచర్ బ్యాలెన్స్,అడవి అందిస్తుందని,కనుక మొక్కలు, చెట్ల సంరక్షణ ప్రాముఖ్యతపై వివరిస్తూ.... వీటినితిరిగి ఇవ్వకపోతే జరిగే పరిణామాలగురించి విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినట్లు డాక్టర్ భాస్కర్ నాయుడు తెలిపారు.పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు ప్రతిజ్ఞచేశారు.అటవీ ప్రాంతాలలో స్వేచ్ఛగా జీవించే లక్షల ఎకరాలు అడవులు కాలిపోకుండా మీ వంతు బాధ్యతగా రక్షించుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అప్పుడే వారి రుణం తీరుతుందని విద్యార్థులకు వివరిస్తూ.... శక్తివంతంగా జ్ఞానవంతంగా బాధ్యతగా ఎలా ఉండాలన్న విషయాలను స్పష్టంగా తెలిపారన్నారు..ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గాయత్రి,పాఠశాల ఇంచార్జ్ విజయ్ దేవరెడ్డి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

________________________________

7 వ అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలలో కదిరి విద్యార్థుల ప్రతిభ



శ్రీసత్యసాయి జిల్లా, ఫిబ్రవరి06(విజయస్వప్నం.నెట్)

ఫిబ్రవరి3,4 తేదీల్లో విశాఖపట్నం రాజీవ్ గాంధీ ఇండోర్ పోర్ట్ స్టేడియంలో 7 వ అంతర్జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ 2024 యునైటెడ్ షోటోఖాన్ కరాటే డో ఇండియా,మహిరా షోటోఖాన్ కరాటే డో ఇండియా టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి తాజోద్దీన్ బాబు, యునైటెడ్ షోటోఖాన్ కరాటే డో ఇండియా అధ్యక్షులు హైదర్ అలీ ఆధ్వర్యంలో ఈ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారని, ఈ పోటీలకు ముఖ్య అతిధులుగా సినీ హీరో కరాటే లెజెండ్ సుమన్ తల్వార్ ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులకు కరాటే వాటి వల్ల ప్రయోజనాలు తదితర అంశాలపై సూచించారని, విద్యార్థుల ప్రతిభకు అభినందనలు తెలిపారన్నారు. కరాటే మాస్టర్ షాకీర్ కి మెమోంటో తో సత్కరించారని,

ఈ పోటీలలో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి జైన్ పాఠశాల నుండి దైవీక్ 2 కాంస్య పతకాలను,శ్రీ శాంతినికేతన్ పాఠశాల నుండి మహమ్మద్ కైఫ్ 1 బంగారు పతకాన్ని ,రీదా ముస్కాన్ 2 బంగారు పతకాన్ని,వాల్మీకి పాఠశాల నుండి గీతా 1 బంగారు,1 సిల్వర్ పతకాన్ని ,ఖాద్రీ పాఠశాల నుండి వైష్ణవి 1 బంగారు పతకాన్ని, 1 కాంస్య పతకాన్ని,సెయింట్ మేరీ పాఠశాల నుండి కృష్ణ కీర్తి 2 కాంస్య పతకాన్ని,సెయింట్ థామస్ పాఠశాల నుండి మహమ్మద్ ఫేహిం 1 బంగారు పతకాన్ని1సిల్వర్ పతకాన్ని, భవిష్య పాఠశాల నుండి 1బంగారు పతకాన్ని,1 సిల్వర్ మెడలను,ఓడిసి శ్రీ విజ్ఞాన్ సీబీఎస్ఈ పాఠశాల నుండి రీహన 1 కాంస్య పతకాన్ని వివిధ పాఠశాలల నుండి 9 మంది విద్యార్థిని విద్యార్థులు 17 విభాగాలలో పాల్గొనగా 7 బంగారు పతకాలను,3వెండి పతకాలను,6 కాంస్య పతకాలను మొత్తం 16 పతకాలను సాధించి కదిరి విద్యార్థులు వారి సత్తా చాటారన్నారు.ఈ కార్యక్రమంలో పతకాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు,శిక్షణ ఇచ్చిన గురువు షాకిర్కి,స్కూల్ ప్రధాన ఉపాధ్యాయని, ఉపాద్యాయులు,ఉపాధ్యాయ బృందం వారి తల్లిదండ్రులకు సినీ హీరో సుమన్ తల్వార్ అభినందనలు తెలిపారన్నారు.

________________________________

భజన కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేత 



శ్రీసత్యసాయిజిల్లా, పెనుకొండ 06(విజయస్వప్నం.నెట్)

జానపద వృత్తి కళాకారుల సంఘం అనంతపురం,శ్రీసత్యసాయి ఉమ్మడి జిల్లా పెనుగొండ మండలంలో మంగళవారం ప్రభుత్వం మంజూరు చేసిన భాషా సాంస్కృతిక గుర్తింపు కార్డులను నాగలూరు,బండపల్లి భజన, సంకీర్తన కళాకారులకు జానపద వృత్తి కళాకారుల సంఘం నాయకులు  అందజేశారు.రాష్ట్ర కమిటీ నాయకులు,శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు ఎం.నారాయణ ఆధ్వర్యంలో పెనుగొండ మండల అధ్యక్షులు నాగార్జున సమక్షంలో నాగలూరు,బండ్లపల్లి గ్రామ జానపద వృత్తి కళాకారులకు గ్రామ ఆర్చకుల చేతుల మీదుగా గుర్తింపు కార్డులను పంపిణీ చేసినట్లు తెలిపారు.అలాగే తిరుపతి పట్టణంలో హిందూధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఏర్పడిన భజన బృందాల దరఖాస్తుల నమోదు, చేర్పులు,మార్పులు తదితర అంశాలపై సమీక్షించినట్లు వారు జానపద వృత్తి కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.నారాయణ ఈసందర్బంగా తెలిపారు.

________________________________

శ్రీసత్యసాయిజిల్లా(విజయస్వప్నం.నెట్)

కదిరి సేవా భారతి ఆధ్వర్యంలో ఈనెల 21 తేది ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల మైదానంలో శ్రీ అయోధ్య సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహణలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో శ్రీరాములు రధయాత్ర  చేపడుతూ.... భక్త జనులను అహ్వానిస్తున్నట్లు సేవా భారతి సభ్యులు తెలిపారు. అందులో భాగంగా మంగళవారం తనకల్లు  మండలంలో చెక్కొలపల్లి ఆలయంలో సమావేశం ఏర్పాటు చేసి శ్రీసీతారాముల కళ్యాణంలో పాల్గోనాలని తెలిపారు.రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్, ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

________________________________


తిరుపతి,ఫిబ్రవరి 06(విజయస్వప్నం.నెట్)

2013 బ్యాచ్ పీసీ166, గణేష్ ఏపి పోలీస్ శాఖ 14వ బెటాలియన్ లో విధులు నిర్వహిస్తూ....రెడ్ శ్యాండిల్ తిరుపతికి డెప్యూటేషన్ పై వెళ్లిన కానిస్టేబుల్ గణేష్ మంగళవారం తెల్లవారుజామున పోలీస్ బృందంతో కలసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం స్మగ్లర్లు కారుతో ఢీ కొట్టి వెళ్ళి పోవడంతో కానిస్టేబుల్ గణేష్ మృతి చెందినట్లు పోలీసుల సమాచారం.

________________________________

శ్రీసత్యసాయి జిల్లా,ఓబుళదేవరచెరువు ఫిబ్రవరి07(విజయస్వప్నం.నెట్)

పెనుకొండ ఉపసంచాలకులు, పశు సంవర్ధక శాఖ అధికారి సిహెచ్ సత్యప్రకాష్ అధ్యక్షతన ఎం.కొత్తపల్లి రెవిన్యూ గ్రామము తిప్పేపల్లి రైతు భరోసా కేంద్రం పరిధిలో రైతులకు పశు విజ్ఞాన బడి  కార్యక్రమముపై సమావేశం ఏర్పాటు చేశారు

ఈ కార్యక్రమంలో రైతులకు పాడి  పశవుల భీమా అవశ్యకత గురించి,గాలికుంటు టికాలు ప్రాముఖ్యత, హెల్త్ కార్డుల ప్రాముఖ్యత,పాడి పశువులలో పాల నాణ్యతను ఎలా అభవృద్ధి చేసుకోవాలో పాడి రైతులకు అవగాహన కల్పించారు.ముఖ్యంగా పశు భీమా-రైతులకు ధీమా అంటూ రైతుతో కలసి నినాదాలు చేశారు..ఈ కార్యక్రమములో మండల పశు వైద్య అధికారి సి.ప్రవీణ్ కుమారి,పశు సంవర్ధక సహాయకులు జోష్ణ ప్రియ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి