వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యం లో రామాలయానికి బీరువా వితరణ
మండల శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆర్ /జి టీం ఆధ్వర్యంలో ఓడిచెరువు మండల కేంద్రంలోని పాత రామాలయం దేవస్థానములో పూజా సామాగ్రి కొరకు చిన్న బీరువాను ఆలయ నిర్వాహకులకు అందజేశారు. దేవస్థానంలో శ్రీ సీతారామలక్ష్మణులు ఆంజనేయుడు,వినాయకస్వామివారు,అదే విధముగా గ్రామ దేవతలు ఓబులమ్మ,ఓబులప్పల ఉత్సవ విగ్రహాల భద్రత దృష్ట్యా చిన్నపాటి బీరువాను ఆర్/జి టీం సభ్యులు దేవాలయానికి అందజేశారన్నారు.అదే విధముగా కమిటీ మరెన్నో దైవ కార్యక్రమాలు,కమిటీ ఆధ్వర్యం లో ప్రసాద పంపిణీ,కోవిడ్ సమయములో ఇతర రాష్ట్రాలనుండి వచ్చిన బొగ్గు తయారీ కూలీలకు బియ్యము,కూరగాయలు పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భముగా శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి అధ్యక్షుడు నరేష్ బాబు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా వున్నటువంటి వినాయక ఉత్సవ కమిటీలు కేవలం వినాయక చవితి మాత్రమే కాకుండా ప్రతీ దైవ శుభ కార్యక్రమములో పాల్గొని, ప్రతీ పండుగను వైభవంగా నిర్వహించాలని,అదే విధముగా వీలు ఉన్నప్పుడు దేవాలయాలను సందర్శించి అక్కడి సమస్యలను గ్రహించి టీం సభ్యులు తమవంతు సహాయ సహకారాలతో దేవాలయాల అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.
ఈ కార్యక్రమములో ఆలయ కమిటీ పిట్టా ప్రభాకరరెడ్డి, కే.నాగేశ్వరయ్య, పి.నాగరాజయ్య, ఆలయ నిర్వాహకులు శ్రీనివాసులు రెడ్డి, దివాకర్ రెడ్డి, శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి (ఆర్ /జి టీం) అధ్యక్షులు ఏ.నరేష్ బాబు, ఉపాధ్యక్షులు ఎస్.అరవింద్, కార్యదర్శి ఈ.రమణ,ప్రధాన కార్యదర్శి టీ.గణేష్, కోశాధికారి ఈ.శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు యు.సతీష్, బి.నారాయణస్వామి, ఈ.హరి తదితరులు పాల్గొన్నారు.
______________________________
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో ఈరోజు శనివారము 17వ తేదీన బజ్జీలు జరిగాయి తిరుపతి అన్నమయ్య పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయ శంకర స్వామి ఆధ్వర్యంలో భజన్లు జరుగుతున్నాయి గాండ్ల పంట కాశి అన్నపూర్ణేశ్వరమ్మ అన్నపూర్ణేశ్వరమ్మ కాసినాయన ఆశ్రమం పీఠాధిపతి ఆంజనేయ స్వామి కదిరి శివారెడ్డి స్వామి రంగప్ప స్వామి నరసింహారావు రామస్వామి అచల గురు రమణ స్వామి కుటాగల ఆదినారాయణ పాత బత్తులపల్లి రమణా స్వామి ఉడుములకుర్తి రామయ్య స్వామి ముదిగుబ్బ డప్పు మాస్టర్ గంగప్ప స్వామి గంగప్ప స్వామి ఓబులేష్ స్వామి బాలయ్య స్వామి నల్లచెరువు గంగాధర స్వామి తనకల్లు ఆంజనేయస్వామి అమ్మడు గురు వెంకటరమణ స్వామి భజన బృందం కోటపల్లి సుబ్బారెడ్డి గంగాధర స్వామి భజన బృందం మొలకలచెరువు లక్ష్మీదేవి భజన బృందం యామల గొంది రవి స్వామి భజన బృందం ఈ భజనలు రాగాలపల్లి అరుణమ్మ నారప్ప స్వామి భజన బృందం ఇదేవిధంగానే ప్రతిరోజు భజన జరగాలని లక్ష్మీ నరసింహ స్వామి భజన వాళ్లకు అందరికీ స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాం
______________________________
అప్పులు బాధతో యువరైతు ఆత్మహత్య
శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి17(విజయస్వప్నం.నెట్)
పంటలు సాగు చేసేందుకు ఓ యువరైతు వరుసగా నాలుగు బోరు బావులు తవ్వించినా చుక్కనీరు పడకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక బలవన్మరణం చెందిన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా ఓబుళదేవర చెరువు మండలం మల్లాపల్లిలో చోటుచేసుకుంది.మృతుడు తండ్రి లక్క సముద్రం ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు....తన కుమారుడు అజయ్(బొలోరో వాహనం నడుపుకొంటు)వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడని,గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల పొలంలో వేసిన బోరు నుంచి నీరు రాకపోవడంతో ఇటీవల వరుసగా నాలుగు బోరు బావులు తవ్వించాడని చుక్కనీరు కూడా పడలేదని,సాగుచేసిన వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోవడంతో కుమారుడు కలత చెందేవాడని,అప్పులు అధికం కావడం వాటిని ఎలా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురై వ్యవసాయ పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారన్నారు.ఘటనా జరిగిన స్థలం నల్లమాడ మండల పరిధిలో కావడంతో నల్లమాడ పోలీసులు పరిశీలించి,మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరికి తరలించి,కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు.
మల్లాపల్లికి చెందిన యువరైతు అజయ్ మృతి చెందిన విషయం తెలుసుకొన్న మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కదిరి ఆసుపత్రికి చేరుకొని మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థికసాయం చేసినట్లు స్థానికులు తెలిపారు
______________________________
అయోధ్య శ్రీసీతారాముల కళ్యాణం చూద్దాం రారండి
శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి17(విజయస్వప్నం.నెట్)
ఈ నెల21 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కదిరి సేవభారతి ఆధ్వర్యంలో అయోధ్య శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కదిరి జూనియర్ బాలుర కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ పేర్కొన్నారు. అందులో భాగంగా కదిరి పట్టణంలోని అడపాలవీధి ఇంటింటికి తిరిగి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలు అందిస్తూ కల్యణమహోస్తావానికి ఆహ్వానించినట్లు అయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జెట్టి ఆంజనేయులు,కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు మార్కండేయ,ఆనంద్,ఆసాది సాయి దినేష్,యువమార్చా పట్టణ నాయకులు జెట్టి ఉదయ్ కిరణ్,నితీష్,ఆసాది పవన్ తదితరులు పాల్గొన్నారు.
______________________________
అరెస్టు లతో ఉద్యమాన్ని ఆపలేరు
శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి17(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలోని కమ్మవారిపల్లి పాఠశాల ఉపాధ్యాయులు,డిటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లజామ్ కు శనివారం పోలీసులు నోటీసులు అందజేశారు.శాంతియుత ఉద్యమాలను ఆపడం సమంజసం కాదని సిపియస్ ఉద్యమకారులు/డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో ఈనెల 18న(నేడు)జరిగే ఓటు ఫర్ ఓ పి ఎస్ చలో విజయవాడ కార్యక్రమాన్ని ఎక్కడకక్కడ భగ్నం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఉద్యోగస్తునికి,ఉపాధ్యాయునికి నోటీసులు ఇస్తూ ఉద్యమాన్ని అణిచివేయడం ప్రజాస్వామ్య విలువలను విస్మరించడమేనని,ఉద్యమాలను నోటీసులతో అణిచివేయడం ఏమాత్రం సమంజసం కాదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నో రాష్ట్రాలు హామీ ఇవ్వకపోయినా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని,పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని విన్నవించారు.లేని పక్షంలో నిరంతరం ఉద్యమాలు ఉదృతంగా ఉంటాయని, ఇందులో భాగంగా ఈనెల 18న ఆదివారం విజయవాడ నడిబొడ్డున జరిగే ఓటు ఫర్ ఓ పి ఎస్ కార్యక్రమాన్ని ప్రతి ఉద్యోగి,ప్రతి ఉపాధ్యాయుడు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అయన కోరారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా/అనంతపురం జిల్లా (విజయస్వప్నం.నెట్)
నేడు సిఎం జగన్ అనంతజిల్లాకు రాక సిద్ధం సభలో రాష్ట్ర ప్రజలకు వరాలు 18న రాప్తాడు సిద్ధం సభలో సిఎం వైకాపా మేనిఫెస్టో ప్రకటన రైతులకు రుణమాఫీ, బీసీలకు, పేద, మధ్య తరగతి వర్గాలకు వరాలు ప్రకటించే అవకాశం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి