కిసాన్ మోర్చా ఆర్గానిక్ ఫార్మింగ్ రాష్ట్ర కన్వీనర్ గా చింత శరత్ కుమార్ రెడ్డి
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి/కదిరి ఏప్రిల్23(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు మండలం తుమ్మల పంచాయతీ వెంకటనారాయణపల్లి గ్రామానికి చెందిన చింత శివారెడ్డి,పద్మావతమ్మ దంపతుల నాలుగవ కుమారుడు చింత శరత్ కుమార్ రెడ్డి విద్యాభ్యాసం తుమ్మల హైస్కూల్లో,ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల కదిరి,ప్రభుత్వం డిగ్రీ కళాశాలకదిరి,న్యాయవిద్య ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు.హై స్కూల్ స్థాయి నుండి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రేరణతో 1998లో జాతీయ విద్యార్థి సంస్థ ఏబీవీపీలో చేరి వివిధ విద్యారంగ సమస్యలపై ఉద్యమాలు చేస్తూ విద్యార్థులను జాతీయ భావాలు వైపు నడిపించడంలో ముందున్నారు.కదిరి కేంద్రంగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ....విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారు.2002 నుండి ఏబీవీపీలో పూర్తి సమయవ్వయ కార్యకర్తగా, ఉమ్మడి రాష్ట్రం కరీంనగర్ కేంద్రంగా విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ అనేకమంది కార్యకర్తలకు స్ఫూర్తినిస్తు వారిలో జాతీయ భావాలు కల్పిస్తూ సేవాలు అందిస్తూ.తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్,నల్గొండ తదితర జిల్లాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ చింత శరత్ కుమార్ రెడ్డి గుర్తింపు పొందారు.2010 నుండి జర్నలిస్టుగా పనిచేస్తూ ప్రస్తుతం ఇండియన్ వాయిస్ దినపత్రిక ఎడిటర్ గా కొనసాగుతున్నారు.విద్యార్థులు రాజకీయాలకు రావాలని ఉద్దేశంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
2015 నుండి కదిరి కేంద్రంగా సేవా భారతి కార్యదర్శిగా పరిసర గ్రామాలలో మంచినీటి సౌకర్యం లేని గ్రామాలకు ట్యాంకుర్లతో నీటి సరఫరా చేయడం,పసు గ్రాసం లేక ఇబ్బంది పడుతున్న పశువులకు పశుగ్రాసం పంపిణీ చేపట్టారు.సేవ భారతి ఆధ్వర్యంలో మాధవ గురుకులం వ్యవస్థాపకులుగా అమ్మానాన్న లేని అనేకమంది విద్యార్థులకు ఒక ఆసరాగా మాధవ గురుకులం ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర రాజధానికి రైలు సౌకర్యం లేదని గ్రహించి రైలు సాధించాలనే సంకల్పంతో ప్రజా ఉద్యమం నిర్మాణం చేపట్టి విద్యార్థి,ఉపాధ్యాయ కార్మిక,రాజకీయ,మేధావులతో సంతకాల సేకరణ చేసి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి కదిరి మీదుగా మచిలీపట్నం వెళ్తున్న రైలు సాధించడంలో శరత్ కుమార్ రెడ్డి కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడుతున్న రైలు నడుస్తున్నది అంటే అది శరత్ కుమార్ రెడ్డి తోనే సాధ్యమైందని చెప్పాలి.శ్రీ విజ్ఞాన్ విద్యాసంస్థలలో వృత్తి విద్య కోర్సులతో వందలాది మంది విద్యార్థులకు ఉపాధి కల్పిస్తున్నారు.కదిరి ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడుతున్నదని,ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే హంద్రీనీవా సృజల స్రవంతి ద్వారా ప్రతి చెరువును నింపాలని కోరుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోచ్చారు.15 సంవత్సరాల పాటు విద్యార్థి నాయకునిగా పది సంవత్సరాలు గా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవాలు అందిస్తున్న యువ విద్యావంతుడు శరత్ కుమార్ రెడ్డికి జాతీయస్థాయిలో అనేకమంది నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులలో ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా ఆర్గానిక్ ఫార్మింగ్ రాష్ట్ర కన్వీనర్ గా శరత్ కుమార్ రెడ్డిని నియమించారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలలో వస్తున్న ఆరోగ్య సమస్యలను మార్పులు ఆహారంలో వస్తున్న మార్పులు వీటన్నిటికీ కారణం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు మార్చుకొని యాంత్రికరణ ద్వారా వ్యవసాయం చేయడంతో రైతులలో ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల అవగాహన సన్నగిల్లుతుందని వాటిని అవగాహన కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గానిక్ ఫార్మింగ్ పెంచి నాణ్యమైన ఆహార ఉత్పత్తుల తయారుచేసి ప్రజలకు చేరువేసేందుకు కృషి చేస్తానని ముఖ్యంగా చదువుకున్న యువతను ఆర్గానిక్ ఫార్మింగ్ మళ్లించి వ్యవసాయం భారం కాకుండా వ్యవసాయం ప్రజలకు దగ్గర చేసే విధంగా కృషి చేస్తానని నూతనంగా కిషన్ మోర్చా ఆర్గానిక్ ఫార్మింగ్ రాష్ట్ర కన్వీనర్ గా ఎంపికైన చింత శరత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని తన నియమకం సహకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరికి,కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార్ స్వామికి,తెరాస ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డికి,జిల్లా పార్టీ అధ్యక్షులు జిమ్ శేఖర్ కి,భారతీయ జనతా పార్టీ జిల్లా ఇంచార్జ్ బాలకృష్ణ యాదవ్ కి,జోనల్ ఇంచార్జ్ చంద్రశేఖర్ కి, కిషన్ మోర్చా అధ్యక్షులు కేశవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
$$$__________@@@___________$$$
వైకాపా సీనియర్ నాయకులు తెదేపాలోకి చేరిక
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్23(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ప్రమోద్ రెడ్డి, మహేష్ రెడ్డితో పాటు దాదాపుగా 200 కుటుంబ సభ్యులు మంగళవారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరిన వారిలో మైనారిటీలు,మహిళలు,యంపిటిసి అభ్యర్థులు వాలంటీర్లు తదితరులు ఉన్నట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.వైకాపా నుండి తెదేపాలోకి చేరిన వారికి మాజీమంత్రి పల్లె కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.అంతక ముందు తెదేపా నాయకులు,కార్యకర్తలు గ్రామ ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
$$$__________@@@___________$$$
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్23(విజయస్వప్నం.నెట్)
అమడగూరు మండలం తుమ్మల పంచాయతీ,వెంకటనారాయణపల్లి గ్రామానికి చెందిన చింత శివారెడ్డి పద్మావతమ్మ దంపతుల నాలుగవ సంతానం జన్మించిన చింత శరత్ కుమార్ రెడ్డి విద్య అభ్యాసం తుమ్మల ప్రభుత్వ పాఠశాల,జూనియర్ కళాశాల,కదిరి ప్రభుత్వం డిగ్రీ కళాశాల కదిరి న్యాయవిద్య ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. స్థాయి నుండి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రేరణతో 1998 లో జాతీయ విద్యార్థి సంస్థ ఏబీవీపీలో చేరి అనేక విద్య రంగ సమస్యలను పోరాటం చేస్తూ విద్యార్థులను జాతీయ భావాలు వైపు నడిపించడంలో ముందున్నారు కదిరి కేంద్రంగా అనేక విద్యార్థి ఉద్యమాలను నాయకత్వం వహిస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారు , 2002 నుండి ఏబీవీపీ పూర్తి సమయ కార్యకర్తగా కరీంనగర్ కేంద్రంగా విద్యార్థి ఉద్యమాలను నాయకత్వం వహిస్తూ అనేకమంది కార్యకర్తలకు స్ఫూర్తినిస్తు వారిలో జాతీయ భావాలు కల్పిస్తూ పని చేయడం జరిగింది .తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, అనేక జిల్లాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి చింత శరత్ కుమార్ రెడ్డి.2010 నుండి జర్నలిస్టుగా పనిచేయడం జరిగింది, ఇండియన్ వాయిస్ దినపత్రిక ఎడిటర్ గా కొనసాగుతున్నారు. విద్యార్థుల్లో రాజకీయాలకు రావాలని ఉద్దేశంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది.
2015 నుండి కదిరి కేంద్రంగా సేవా భారతి కార్యదర్శిగా ఈ ప్రాంతంలో చాలా గ్రామాలలో మంచినీటి సౌకర్యం లేని గ్రామాలు ట్యాంకులతో నీటి సరఫరా చేయడం, పసు గ్రాసం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పశువులకు పశుగ్రాసం పంపిణీ చేయడం జరిగింది. సేవ భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాధవ గురుకులం వ్యవస్థాపకులుగా ఉండి అమ్మానాన్న లేనటువంటి అనేకమంది విద్యార్థులకు ఈరోజు ఒక ఆసరాగా మాధవ గురుకుల ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం రాజధాని కి రైలు సౌకర్యం లేదని గ్రహించి రైలు సాధించాలనేటువంటి సంకల్పంతో ప్రజా ఉద్యమం నిర్మాణం చేసి విద్యార్థి ,ఉపాధ్యాయ కార్మిక ,రాజకీయ, మేధావులతో సంతకాల సేకరణ చేసి ఢిల్లీ వెళ్లి కదిరి మీదుగా మచిలీపట్నం వెళ్తున్న రైలు సాధించడంలో శరత్ కుమార్ రెడ్డి కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉన్నది, ఈ ప్రాంతంలో ఈరోజు ప్రజలకు ఉపయోగపడుతున్న రైలు నడుస్తున్నది అంటే అది శరత్ కుమార్ రెడ్డి తోనే సాధ్యమైందని చెప్పాలి , శ్రీ విజ్ఞాన్ విద్యాసంస్థలలో వృత్తి విద్య కోర్సులు ఏర్పాటుచేసి వందలాది మంది విద్యార్థులు ఉపాధి కల్పించడం జరిగింది. కదిరి ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడుతున్నదని ఈ ప్రాంతం సస్యములు కావాలంటే హంద్రీనీవా సృజల స్రవంతి ద్వారా ప్రతి చెరువును నింపాలని కోరుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. 15 సంవత్సరాల పాటు విద్యార్థి నాయకునిగా పది సంవత్సరాలు గా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో నిత్యం అందుబాటులో ఉంటూ యువకుడు విద్యావంతుడు అయినా శరత్ కుమార్ రెడ్డి గారికి జాతీయస్థాయిలో అనేకమంది నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాడు . ఆంధ్రప్రదేశ్‌లో రైతులలో ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా ఆర్గానిక్ ఫార్మింగ్ రాష్ట్ర కన్వీనర్ గా శరత్ కుమార్ రెడ్డి నియమించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలలో ప్రజలలో వస్తున్న ఆరోగ్య సమస్యలను మార్పులు ఆహారంలో వస్తున్న మార్పులు వీటన్నిటికీ కారణం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు మాని యాంత్రికరణ ద్వారా వ్యవసాయం చేయడంతో రైతులలో ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల అవగాహన సన్నగిల్లుతుందని వాటిని అవగాహన కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గానిక్ ఫార్మింగ్ పెంచి మంచి ఆహార ఉత్పత్తుల తయారుచేసి ప్రజలకు చేరువేందుకు కృషి చేస్తానని ముఖ్యంగా చదువుకున్నటువంటి యూత్ యువకులను ఆర్గానిక్ ఫార్మింగ్ మళ్లించి వ్యవసాయం అన్నది భారం కాకుండా వ్యవసాయం ప్రజలకు దగ్గర చేసేది కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా తనపై ఉంచిన నమ్మకాన్ని తన నియమకం సహకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార్ స్వామి గారికి, తెరాస ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు జిమ్ శేఖర్ గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా ఇంచార్జ్ బాలకృష్ణ యాదవ్ గారికి, జోనల్ ఇంచార్జ్ చంద్రశేఖర్ గారికి, కిషన్ మోర్చా అధ్యక్షులు కేశవ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
$$$__________@@@___________$$$
భక్తిశ్రద్ధలతో కుంభకూడు ఉత్సవ పూజలు
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్23(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమైయ్యాయి. ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో మొదటి రోజు అమ్మవారి ఆలయంలో కుంభకూడు ఉత్సవం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆనావాయితీ మేరకు చీకిరేవుపల్లి గ్రామానికి చెందిన నేసే కులస్తులు జొన్నలు రాసిగా పోసి,శిఖరంపై పసుపు,కుంకుమ వివిధ రకాల పుష్పాలతో అలంకరించి,అనంతరం అమ్మవారికి ధూపదీప పూజలు నిర్వహించి, జంతు బలిదానం చేసి కుంభకూడుపై సమర్పించారు. కుంభకూడు ఉత్సవ కార్యక్రమంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పాల్గొని కుంభకూడు జొన్నలు తీసుకెళ్లి వెళ్లి పంట పొలాల్లో,గృహాలల్లో చల్లించుకున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి