వడ్డెర్ల సహకారంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తాను
:మల్లెల జయరాం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్15(విజయస్వప్నం.నెట్)
వడ్డెర్ల సహకారంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి వడ్డెర్ల ఆత్మగౌరవాన్ని చాటుటని ఉమ్మడి అనంతపురం జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల జయరాం పేర్కొన్నారు.మండల కేంద్రంలో సోమవారం వడ్డెర్ల సంక్షేమ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ.... త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.2001 నుండి దాదాపుగా 20 ఏళ్ళుగా తెదేపాలో ఉంటూ అధిస్థానం పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, గతంలో రెండు సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా వేయగా, భవిష్యత్తులో సముచిత న్యాయం కల్పిస్తామని తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో నామినేషన్లు ఉపసంహరణ చేసుకొన్నారని ఆయన తెలిపారు.వడ్డెర సోదరి సోదరుల ఆత్మగౌరవం చాటి చెప్పడానికి వడ్డెర్ల సహకారంతో పాటు అందరి ఆశీస్సులతో మే నెలలో జరిగే ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
$$$__________@@@__________$$$
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ వసతి సౌకర్యాలు కల్పించాలి
:అఖిల భారత చిరంజీవి యువత, కదిరి నియోజకవర్గం అధ్యక్షులు లక్ష్మణ కుటాల
శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్15(విజయస్వప్నం.నెట్)
కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ పరీక్షలు చేసుకోవడానికి పరికరాలు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రధానంగా పేద ప్రజల అవస్థలు వర్ణనాతీతమని,కదిరి నియోజకవర్గంలో 10 మండలాలకు కలిపి కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మాత్రమే ప్రధానంగా సర్వజనాసుపత్రి అధారంగా వుందని,సర్వజన ఆసుపత్రికి కి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారని,అందులో డయాలసిస్ చేసుకొనే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారని, వీరికి ఒక్కొక్క సందర్భంలో ఒక నెల రోజుల పైబడి వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల కిడ్నీ రోగులు అనంతపురం,తిరుపతి లాంటి నగరాలకు వెళుతున్నారని,దీని కారణంగా పెద్ద మొత్తంలో ఖర్చుల భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ....డయాలసిస్ పరికరాలను,వైద్య నిపుణులను,గదులను కేటాయించి,కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్సల కొరకు విచ్చేసే కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్న వారి సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ సోమవారం కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరిడెంటెంట్ వైద్యాధికారి హుస్సేన్ కి వినతి పత్రం అందజేశారని అఖిల భారత చిరంజీవి యువత, రామ్ చరణ్ ఫౌండేషన్ కదిరి డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ కుటాల తెలిపారు.ఈకార్యక్రమంలో రాజేంద్ర,చంద్ర శేఖర్ తనకంటి,సోము శేఖర్,కృష్ణకాంత్,చక్రి,మధు,అరవింద్,కార్తిక్ తదితర ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఇట్లు,
లక్ష్మణ కుటాల,
అఖిల భారత చిరంజీవి యువత కదిరి నియోజకవర్గం అధ్యక్షులు,
శ్రీ సత్యసాయి జిల్లా.
$$$__________@@@__________$$$
వడ్డెరలను మోసం చేసిన పచ్చ పార్టీకి వడ్డేర్లు బుద్ధి చెప్పాలి
శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెదేపా నుండి వైసీపీలోకి చేరిక
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్15(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపాలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయని,ఓడిచెరువు మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన వడ్డెర ఆత్మీయ సమావేశంలో తెదేపాకు చెందిన 650 కుటుంబాలు వైకాపాలోకి చేరాయని మండల వైకాపా శ్రేణులు తెలిపారు.వైసీపీలోకి చేరిన వారిలో వీరప్పగారిపల్లి గ్రామానికి చెందిన బాబు, సునీత, నాగరాజు, మమత, నాగమ్మ, ఉత్తమ్మ రమణప్ప, రాజగోపాల్, వెంకటాపురం గ్రామానికి చెందిన ప్రతాపరెడ్డి, నారాయణరెడ్డి నారాయణప్ప, శివప్ప, శ్రీనివాసులు చిన్నరమణప్ప, పి.గంగన్న, ఎం.జయరాం, తిరుపాల్, మల్లప్ప, అజయ్, మురళీధర్ రెడ్డి, గంగరాజు, సున్నంపల్లి నాగరాజు, కిష్టప్ప, మురళి, రామప్ప, లక్ష్మీదేవి, సురేష్, సూరప్ప, ఆంజనేయులు, సుభద్ర,ల క్ష్మీపతి, రాజు, వెంకట్, రాజు, కార్తీక్, కుసుమ వారి పల్లి శ్రీనివాసులు, లక్ష్మీదేవి, సిద్ధార్థ, అశోక్ కుమార్, వెంకటరమణ, నరసింహ, లక్ష్మీనారాయణ, వెంకటరమణ, దామోదర్, శంకరయ్య, వెంకటరమణ, నాగేంద్ర, ఆదినారాయణ, రాజేష్, మారుతి, బాలాజీ, రాజా, భాస్కర్, వెంకటేష్, విష్ణనాయక్, భార్గవ్, ప్రకాష్, అజయ్, ఈశ్వర్, శివనందన్, మనోహర్, రామాజీ, నాయుడు, ఆదినారాయణ, నారాయణప్ప, వెంకటేష్, రాఘవ, శివనాథ, విష్ణు, నాగరాజు, చిన్న రాయుడు, చిన్న రాయుడు, అశ్వర్థ నారాయణ, మహమ్మదాబాద్
రంగమ్మ, రమణమ్మ, ఇ.రమణమ్మ, సరోజన, విజయ, చిన్న నారాయణ, ఉత్తమ, గంగులమ్మ, కే.గంగులమ్మ, సుజాత, షబ్బీర్, ఇంతియాజ్, ఫయాజ్, ఉస్మాన్, బాబా పీర్ల, కాజాపీర్, వసీం, భాస్కర్, సయ్యద్ భాష, రెడ్డివారిపల్లి పార్వతి, గంగులప్పా, వెంకటరమణ, రమణప్ప, శాంతమ్మ, వెంకటనారాయణ, బసప్పగారిపల్లి గంగరాజు, వెంకటరమణ, గంగరాజు, చంద్ర, అంజి, పురుషోత్తం, చిన్న రామాంజులు, ఉత్తప్ప, ఈశ్వర్, శ్రీరాములు, శంకరయ్య శివ వెంకటరాముడు, వెంకటరమణ, ఓడిచెరువు కె.చిన్న, నరసింహులు, బి. రమణమ్మ, జి.మస్తానమ్మ, వెంకటనారాయణ, ఎంమనోహర, సి.వెంకటేష్, రాజమ్మ, పార్వతి, మంజుల, ఉత్తప్ప, లక్ష్మీనారాయణ, శివమ్మ ,మంజునాథ, ఈశ్వరయ్య, శివమ్మ, తులసి, బాబా ఫక్రుద్దీన్, కుల్లాయప్ప, మునెప్ప, అనితమ్మ, నాగరత్నమ్మ, వెంకటరమణ, రామలక్ష్మమ్మ, నాగులమ్మ,కనక పరమేశ్వరి, శాలమ్మ, నాగలక్ష్మి ,నరసింహులు, సుజాత, వెంకటేష్, రమణప్ప, మనోహర్, వెంకటరమణ, ఆంజనేయులు, వెంకటేష్, సాలమ్మ ,గంగాద్రి ,అపర్ణ,చంద్రకళ,జి.చంద్రకళ,శ్రీనివాసులు,శాంతమ్మ,నాగభూషణ,వేణుగోపాల్,నరసింహులు.అమడగూరు మండలంలో రవణప్ప,చల్లా శ్రీనివాసులు,లక్ష్మన్న,వెంకటరమణ,చల్లా రామంజి ,వెంకటరమణ,ఓలిపీ ఆదినారాయణ,చెన్నారెడ్డి,సుధీర్,గంగులప్ప,అంజినమ్మ,లక్ష్మన్న,రామప్ప,వెంకటరమణ,నాగేష్,రామప్ప,చౌడమ్మ,రామప్,పవన్,ఓడిచెరువు,నల్లగుట్లపల్లి కుంచపురామాంజి,వెంకటరమణ,ఉపేంద్ర,చంద్ర,శ్రీనివాసులు,చెర్లోపల్లి చల్ల వెంకటరమణ,రామాంజనేయులు,చిన్నరమణప్ప,శ్రీనివాసులు ఈశ్వరయ్య,తదితరులు వైసీపీలో చేరారు.పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైకాపా కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.... పుట్టపర్తి నియోజకవర్గంలో పచ్చపార్టీని భూస్థాపితం చేయాలని.ప్రతి ఇంటికి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందాయని,పేద వర్గాల ప్రజల్లో సంతోషం చూడాలని అనేక సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని,జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని,పచ్చ పార్టీ నాయకులు అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతోందని, వైకాపా విజయం కోసం ప్రతీ కార్యకర్త శ్రమించాలని,పుట్టపర్తి నియోజకవర్గంలో ఎగిరెది వైసిపి జెండనేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు.ప్రతి పక్షాలు చేసే అబద్ధపుప్రచారాలు కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
తలుపులలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో బీసీ రాష్ట్ర సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్
శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్15 (విజయస్వప్నం.నెట్)
కదిరి డివిజన్ పరిధిలో సోమవారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పై కదిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్.షాన్ వాజ్ తో కలిసి ప్రచారం చేపట్టిన్నట్లు బిసి రాష్ట్ర సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్ తెలిపారు.ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో లో హామీలను వివరిస్తూ....ఇప్పుడున్న ఉపాధి హామీ కూలిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 400 రూపాయలు చేస్తుందని హామీ ఇచ్చారని,అలాగే కాంగ్రెస్ పార్టీ పేదలకు సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు,ప్రతి ఇంటికి 500 కే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పేదలకు మేలు చేసే పథకాలను ప్రవేశపెడుతుందని ప్రజలకు వివరించినట్లు తెలిపారు. పధకాలను అమలు చేయాలంటే.... ప్రతి ఒక్కరూ మేనెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన, అతి పవిత్రమైన ఓటును హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో, కేంద్రంలో గెలిపించి మరల ఆనాటి స్వర్ణ యుగాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందామని తెలిపారన్నారు.ఈ కార్యక్రమంలో మెదర నాగ భూషణం,ఆశ్రప్,బాబా,ఆరీఫ్,నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.
$$$__________@@@__________$$$
అనంతపురంలో తెదేపా అభ్యర్ధి ప్రచారం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్15(విజయస్వప్నం.నెట్)
అనంతపురం రుద్రంపేట పంచాయతీ, అనంతపురం అర్బన్ కేంద్రంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యులు పాల్గొని ప్రచారం చేపట్టిన్నట్లు కొండకమర్ల పంచాయతీ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఇస్మాయిల్ తెలిపారు.ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యనిర్వాహక కార్యదర్శి డేగుల కృష్ణమూర్తి,అనంతపురం మాజీ మేయర్ స్వరూప, రెండవ డివిజన్ ఉపాధ్యక్షుడు నీట్టూర్ శివాజీ, దలవాయి వెంకటనారాయణ పాల్గొన్నారని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి