శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్ 08(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మండల కేంద్రంలో సోమవారం జ్ఞానసాయ విద్యానికేతన్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులతో కలిసి కరస్పాండెంట్ కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు క్రోథి నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బెల్లం-ఆనందానికి, ఉప్పు-ఉత్సహం, వేపపువ్వు-బాధ కలిగించే అనుభవాలు, పులుపు-నేర్పగా వ్యవహరించాల్సిన పరిస్థితులు, మామిడి-కొత్త సవాళ్లు, కారం-సహనం కోల్పోయిన దృఢంగా వుండడం అంటూ ఉగాది షడ్రుచులు విశిష్టతను విద్యార్థులకు తెలిపారు. అనంతరం విద్యార్థులతో స్వతహాగా ఉగాది పచ్చడి తయారు చేయించారు.
$$$__________@@@__________$$$
ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సేవాలు చిరస్మరణీయం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్ 09(విజయస్వప్నం.నెట్)
అనంతపురం, శ్రీసత్యసాయిజిల్లాల్లో పేదల ప్రజల శ్రేయస్సు కోసం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చేపట్టిన సేవా కార్యక్రమాలు చిరస్మరణీయమని సిపిఎం నాయకులు వివి రమణ కొనియాడారు.మండల పరిధిలోని సున్నంపల్లి పంచాయతీ గ్రామ డాక్టర్ అంబేద్కర్ కాలనీలో మంగళవారం ఆర్డీటి వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా కాలనీవాసులతి కలిసి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈసందర్భంగా వివి రమణ మాట్లాడుతూ.... కరువు జిల్లా అనంతపురం కళ్యాణదుర్గంలో 1969లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ పేదల శ్రేయస్సు కోసం ఆర్డీటి సంస్థ ఏర్పాటు చేసి విద్యా,వైద్యం, ఉపాధి సేవా కార్యక్రమాలు చేపట్టి పేదల ఆరాధ్య దైవంగా చిరస్థాయిగా నిలిచారన్నారు.మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు, విద్యా సంస్థలు ఏర్పాటు చేసి పేదల అభివృద్ధి దిశగా అడుగులు వేయించాలని, పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆర్డీటి ఆసుపత్రులు స్థాపించి మెరుగైన వైద్యసేవలు అందించారని కొనియాడారు.అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.
జిల్లా ప్రజలు సిరి సంపదలతో వర్థిలాలి: జిల్లా సంయుక్త కలెక్టర్
ఘనంగా సర్వత్రా ఉగాది వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఏప్రిల్09(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లాలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, విజయాలతో వర్థిలాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో క్రోథి నామ తెలుగు నూతన సంవత్సర చైత్ర మాసం ప్రారంభ ఉగాది వేడుకలు సంప్రదాయబద్ధంగా వేద మంత్రాలతో దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా దేవతామూర్తులను అలంకరించి నిర్వహించిన పూజా కార్యక్రమాలో జాయింట్ కలెక్టర్ దంపతులు పాల్గొని అర్చక పురోహితులతో ఆశీర్వాదాలు తీసుకొన్నారు. ఈకార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, ధర్మవరం ఆర్డీవో వెంకటశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్వత్రా ఉగాది వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు, అమడగూరు, నల్లమాడ, పుట్టపర్తి, కొత్తచెరువు, కదిరి, నల్లచెరువు తదితర మండలాల పరిధిలో గ్రామాల్లో మంగళవారం చైత్ర మాసం ప్రారంభం, క్రోథి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆయా ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గృహాల్లో వివిధ పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు.ఉగాది పచ్చళ్ళు తీర్థప్రసాదాలు అందజేశారు.అమడగూరు చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. నల్లచెరువు మండలంలోని ఓరువాయి గ్రామ దేవత శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో,గాండ్లపెంట మండలంలోని కాటరుపల్లి వేమన ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి షడ్రుచుల ఉగాది పచ్చడి విశిష్టత, పంచాంగం పఠనం చదివి వినిపించారు. ఓడిచెరువు మండలంలోని తుమ్మలకుంట్లపల్లి శ్రీదండు మారెమ్మ తల్లి, చౌడేంపల్లి గ్రామ దేవత చౌడేంపల్లి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి