శ్రీ సత్యసాయి జిల్లా, కొత్తచెరువు లో వదాన్య జన సొసైటీ ఆద్వర్యం లో విద్యార్థులకొరకు నిర్వహించిన ప్రతిభా పరీక్ష కొరకు జిల్లా నలుమూలల విద్యాలయాల నుండి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరు అయ్యారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులు ఆయిన వారికి మంచి పారితోషకం ఉండటంతో విద్యార్థులు తమ ప్రతిభను చూపడానికి ఉత్సాహంగా హాజరు అయ్యారు
వదాన్య జన సొసైటీ ఆద్వర్యంలో కొత్తచెరువులోని జిల్లాపరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో మరియు జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన ప్రతిభా పరీక్ష కొరకు తమ ప్రతిభను చూపడానికి విద్యార్థి, విద్యార్థినుల ఉత్సాహంగా హాజరు అయ్యారు. పరీక్ష కొరకు విద్యార్థులనుంది ఎటువంటి రుసుము తీసుకోకుండా నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులకు ప్రోత్సాహకరంగా పారితోసకం ప్రకటించబడింది. మొదటి 30 ర్యాంకుల వారికి బహుమానములు ప్రకటించారు. అందులో మొదటి ర్యాంకు పొందిన వారికి రూ15,000గాను రెండవ ర్యాంక్ రూ12,000గాను మూడు రూ10,000 నాలుగు నుంచి ఎనిమిది కి రూ5,000గాను 9 నుంచి 15 రూ2,500గాను 15 నుంచి 25 వరకు రూ2,000 తదుపరి రూ1,500 గాను ప్రకటించారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి