google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : ఫ్లాష్....లారీ అదుపు తప్పి బోల్తా పడి డ్రైవర్ మృతి - శ్రీసత్యసాయిజిల్లా వ్యాప్తంగా ఓటింగ్ శాతం

15, మే 2024, బుధవారం

ఫ్లాష్....లారీ అదుపు తప్పి బోల్తా పడి డ్రైవర్ మృతి - శ్రీసత్యసాయిజిల్లా వ్యాప్తంగా ఓటింగ్ శాతం

సమస్యాత్మక కేంద్రాలపై పటిష్ట నిఘా

: జిల్లా ఎస్పీ మాధవరెడ్డి

శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి)మే12జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత బందోబస్తుతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు.ఆదివారం పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని  ఆయన పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ .... సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో  నిర్వహించేందుకు లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నట్లు తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో 3200 మంది పోలీసులు పాల్గొంటున్నారని,13 కేంద్ర సాయుధ బలగాలు ఇప్పటికే విధుల్లో ఉన్నారని,199 సమస్యాత్మక పోలింగ్ బూతుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.అవసరమైన ప్రాంతాల వద్ద  సీసీ కెమెరాలు, విడియో కెమెరాలు,డ్రోన్ కెమెరాల ఏర్పాటు చేశారని, ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించే వాతావరణం కల్పించామని, పోలింగ్ నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎలాంటి వారైనా హద్దు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆదివారం ఎస్పీ మాధవరెడ్డి గోరంట్ల,

హిందూపురం,పుట్టపర్తి కేంద్రాల్లో రిసెప్షన్ కౌంటర్లు, స్ట్రాంగ్ రూములు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆయన పరిశీలించి, భద్రత ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.పోలింగ్ సరళి,కేంద్రాల్లో పరిస్థితుపై కమాండ్ కంట్రోల్ స్ట్రాంగ్ రూమ్ నుండి పర్యావరణ ఉంటుందని తెలిపారు.

$$$__________@@@__________$$$

పోలింగ్ కు పటిష్ట చర్యలు

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే12(విజయసవప్నం.నెట్)

పోలింగ్ సజావుగా జరగాలని పటిష్ట చర్యలు చేపట్టామని, జిల్లాలోని 1873 పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, సమస్యాత్మకమైనవి గుర్తించిన 299 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ మరింత పకడ్బందీగా నిర్వహిస్తున్నారని, పోలింగ్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని, ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు ఆదివారం ఓప్రకటనలో తెలిపారు.

$$$__________@@@__________$$$

శ్రీసత్యసాయిజిల్లా వ్యాప్తంగా ఓటింగ్ శాతం

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) పుట్టపర్తి మే13(విజయస్వప్నం.నెట్)

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు ఈవిధంగా.... పెనుగొండ నియోజకవర్గంలో అత్యధికంగా 78:77 శాతం కాగా, కదిరి నియోజకవర్గంలో 72:24 శాతం అత్యల్పంగా నమోదైంది. ధర్మవరం 76:10,పుట్టపర్తి 75:22, మడకశిర 74:25, హిందూపురం 73:32, రాప్తాడు 73:01 నమోదైనట్లు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం అధికారులు ద్వారా సమాచారం.               ఎన్నికల ప్రక్రియను జిల్లా ఎస్పీ పర్యవేక్షణ    జిల్లా వ్యాప్తంగా సోమవారం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ,పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పర్యవేక్షించారు.ఉదయం నుండి కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి ఎస్పీతో కలిసి జిల్లా ఎన్నికల అబ్జర్వర్లు జిల్లా వ్యాప్తంగా  పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ సరళి, పరిస్థితులను అడిగి తెలుసుకుని అక్కడిక్కడే సిబ్బందిని అప్రమత్తం చేశారు.

$$$__________@@@__________$$$

ఏపీఆర్డీసి ప్రవేశానికి విద్యార్ధి యశ్వంత్ ఎంపిక

శ్రీసత్యసాయిజిల్లా (ఓడిచెరువు)మే14(విజయస్వప్నం.నెట్)

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 మంగళగిరి బోర్డ్ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో ఓడిచెరువు మండలంలోని తుమ్మలకుంట్లపల్లి పంచాయతీ ఎగువ చెర్లోపల్లి గ్రామానికి చెందిన యరమనేని రామకృష్ణ, ఇందిరమ్మ దంపతుల కుమారుడు యశ్వంత్ నాయుడు 66వ రాంక్ తో 76 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.ఏఫ్రిల్ 25న ఏపీఆర్డీసి ప్రవేశానికి పరీక్షలు నిర్వహించగా, మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో (బీకాం ప్రవేశానికి) యరమనేని విద్యార్ధి యశ్వంత్  నాయుడు ప్రతిభతో ఎంపికైన సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి యశ్వంత్ నాయుడు అమడగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సిఈసి గ్రూపులో 875 మార్కులు సాధించి కళాశాలలో ద్వితీయ స్ధానంలో నిలిచి, ఏపీఆర్డీసి ప్రవేశానికి ఎంపికపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ.... విద్యార్థికి(కుమారుడికి)స్వీట్ అందించారు.అమడగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ప్రభాకర్, అధ్యాపక బృందం విద్యార్థి యశ్వంత్ నాయుడుకి అభినందనలు తెలిపారు.

$$$__________@@@__________$$$

ఫ్లాష్....ఫ్లాష్....


శ్రీసత్యసాయిజిల్లా (అమడగూరు)మే14(విజయస్వప్నం.నెట్)

మండలంలోని వెంకటనారాయణపల్లి క్రాస్ సమీపంలో మంగళవారం సాయంత్రం కల్వర్టు వద్ద లారీ అదుపు తప్పి బోల్తా పడి డ్రైవర్  మృతి చెందినట్లుగా సమాచారంగా ఉంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

$$$__________@@@__________$$$

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు మే14(విజయస్వప్నం.నెట్)

మండలంలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం రాత్రి చేలూరు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా బొలెరో వాహనం ఢీ కొనగా ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా,మరొకరి తీవ్ర గాయాలు అయ్యినట్లు స్థానికులు సమాచారం అందించారు.చినగానిపల్లి పంచాయతీ కమ్మవారిపల్లి  గ్రామానికి చెందిన గంగులప్ప కుమారుడు గంగాధర్ తో కలిసి చేలూరు నుండి ద్విచక్ర వాహనంలో వస్తుండగా పాల వ్యాన్ ఢీ కొనడంతో చినగానిపల్లి పంచాయతీ ఎంపీటీసీ నారాయణ కుమారుడు  పవన్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి