google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : వైభవంగా శ్రీవారి మల్లపూల ఉత్సవం - గ్రామాల్లో పోలీసులు కార్టన్ సెర్చ్ - శ్రీస్వామివారి హుండీ ఆదాయం 71,70లక్షలు

24, మే 2024, శుక్రవారం

వైభవంగా శ్రీవారి మల్లపూల ఉత్సవం - గ్రామాల్లో పోలీసులు కార్టన్ సెర్చ్ - శ్రీస్వామివారి హుండీ ఆదాయం 71,70లక్షలు

$$$__________@@@__________$$$

వైభవంగా శ్రీవారి మల్లపూల ఉత్సవం


శ్రీసత్యసాయిజిల్లా కదిరి మే23(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గురువారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీస్వామి వారికి మల్లెపుల ఉత్సవం వైభవంగా నిర్వహించారు.శ్రీ లక్ష్మి నరసింహస్వామివారికి  ప్రితికరమైన వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం నుండి శ్రీస్వామివారి మూలవర్లకు ప్రత్యేక అభిషేకములు,అర్చనలు, నివేద సమర్పించి.సాయంత్రం వేళ శ్రీస్వామివారు(శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభూల స్వామి వారు) ఆలయము నుండి ప్రత్యేకముగా అలంకరించిన పల్లకిలో మద్దిలేరు వాగు సమీపంలో మల్లెపుల మండపమునకు మంగళవాయిద్యములతో ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.

ఉత్సవము  విశిష్టత వివరించిన అర్చకులు

స్వామి వారి బ్రహ్మోత్సము అనంతరము వైభముగా నిర్వహించే ఉత్సవము మల్లెపూల ఉత్సవమని, శ్రీ ఖాద్రీ క్షేత్రములో స్త్రీల సౌభాగ్య చిహ్నలైన కదిరి మల్లెపూలు,కదిరి కుంకుమ,గాజులు,కదిరి దవనముపై అర్చకులు విశేషముగా అబివర్ణంచారు.పత్రము,పుష్పము,ఫలము తోయం అను గీతా వాక్యనుసారం భక్తులు స్వామి వారి అనుగ్రము పొందుటకు అత్యంత భక్తి శద్దలతో కదిరి మల్లెలు సమర్పించి స్వామి అనుగ్రహన్ని పొందుతారుని,గ్రీష్మ తాపన్ని తగ్గించే ఔషధ గుణం కూడ కదిరి మల్లెలలో కలదని,ప్రతి వైశాఖ పౌర్ణమికి ఈ మల్లెపుల తిరుణాలను వైఖానస అగశ్రాస్త్ర ప్రకారము నిర్వహించి శ్రీవారు అనుగ్రహము పొందడం ఆనవాయితీగా వస్తోందని,మల్లెపుల మండపము నందు శ్రీవారికి అస్థాన పూజలను వైఖానన అగమోక్తముగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నివేదన ప్రసాదమును భక్తులకు వితరణ,కార్యక్రములు అనంతరము శ్రీస్వామివారికి ప్రత్యేక పల్లకిలో తిరుమాడ వీధుల్లో విహారిస్తూ భక్తాదులకు దర్శనమిస్తూ ఆలయములోనికి యధావిధిగా ప్రవేశించారు.

$$$__________@@@__________$$$

గ్రామాల్లో పోలీసులు కార్టన్ సెర్చ్

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే23(విజయస్వప్నం.నెట్)

జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గురువారం గ్రామాల్లో సిఐ రాజేంద్రనాధ్ యాదవ్,ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు.జూన్ 4న ఓట్లు లెక్కింపు ప్రక్రియలో భాగంగా కొండకమర్ల, కుసుమవారిపల్లి,దిగువపల్లి తదితర గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి, ఈసందర్భంగా సిఐ మాట్లాడుతూ.... మండలంలోని గ్రామాల్లో ఏలాంటి సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు, ఘర్షణలు జరగకుండ ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సమస్యాత్మక గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల ఇళ్ళల్లో మారణాయుధాలు,ఇతర ఘర్షణలకు సంబంధించిన వస్తు సామాగ్రి గృహాల్లో ఉంచుకోరాదాని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ నియమావళి మేరకు కౌంటింగ్ ముగిసిన తరువాత గ్రామాల్లో అలజడులు సృష్టించిన, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కోడ్ నిబంధనల పాటించాలని, ప్రజలందరూ సహకరించాలని ఆయన వారు కోరారు.అనంతరం గ్రామాల్లో కార్టన్ సెర్చ్ నిర్వహించి, పోలీస్ బృందంతో కలిసి ఇళ్ళల్లో సోదాలు చేపట్టారు.

$$$__________@@@__________$$$

శ్రీస్వామివారి హుండీ ఆదాయం 71,70లక్షలు


శ్రీసత్యసాయిజిల్లా కదిరి మే23 (విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గురువారం శ్రీస్వామివారి  హుండిల లెక్కింపు కార్యక్రమము నిర్వహించారు.హుండి లెక్కింపు పూర్తైన నగదు రూ.71,70,337/-లు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. సదరు మొత్తము 50 రోజులకు సంబంధించిందని,హుండీ లెక్కింపు కార్యక్రమము రేపు 24వతేది శుక్రవారము కూడ కోనసాగుతోందని ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు.హుండి లెక్కింపు కార్యక్రమములలో శ్రీసత్యసాయిజిల్లా దేవాదాయశాఖ సీనియర్ సహాయకులు రమేష్ బాబు పర్యవేక్షించారు. దేవస్థానము సిబ్బంది, యస్.బి.ఐ. బ్యాంకు కదిరి మేనేజర్ యం. శ్రీరాఘవేంద్ర, సిబ్బంది  పాల్గొన్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి