వైకాపా భారీ ప్రచార బైక్ ర్యాలీ
ఎమ్మెల్యేకు గజమాలతో స్వాగతం పలికిన ఓడిచెరువు ప్రజానీకం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే08(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలం కేంద్రంలో స్ధానిక బస్టాండ్ వద్ద ఎన్నికల ప్రచార రోడ్ షో బుధవారం నిర్వహించగా పుట్టపర్తి శాసనసభ్యులు, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.ప్రముఖ సింగర్ మంగ్లీ సోదరి నిర్మల రాథోడ్ కార్యక్రమంలో పాటలతో అలరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట మాట్లాడుతూ....దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగనన్నదని,వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నదని,ప్రతి ఇంటికి సంక్షేమం,ప్రతి ఒక్కరి మోములో సంతోషంగా చూడాలని జగనన్న ప్రభుత్వ లక్ష్యమని,ప్రజలకు పాలనను చేరువ చేయాలని గ్రామస్థాయిలో గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు,విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి ప్రజలకు పాలనను చెరువ చేసామన్నారు.రెయిన్ గన్ల పేరుతో 450కోట్లు దోచుకుని ప్రజలను మోసం చేసిన వ్యక్తి కావాలో.. 864 కోట్లతో 193 చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం చేపట్టిన మీ బిడ్డ శ్రీధర్ రెడ్డి కావాలో ఆలోచించాలని,పేద ప్రజలను దోచుకుని పెత్తందారులకు కట్టబెడుతున్న బీజేపీ తో జత కట్టిన పచ్చ పార్టీ కావాలో,పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేసే వైకాపా కావాలో ప్రజలు ఆలోచించి 13వతేది జరిగే ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ముందుగా వైకాపా శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని గజమాలతో సత్కరించి వైకాపా శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
$$$__________@@@__________$$$
ఎన్నికల పోలింగ్ కు 48 గంటల ముందు మద్యం బంద్
జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
శ్రీసత్యసాయిజిల్లా మే08(విజయస్వప్నం.నెట్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13న లోకసభ శాసనసభ ఎన్నికల నిర్వహణలో భాగంగా 48గంటల(రెండు రోజుల పాటు) ముందు 11వతేది శనివారం సాయంత్రం 7గంటల నుండి 13వతేది సోమవారం సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని,మద్యం క్రయవిక్రయాలపై నిషేధం విధించినట్లు శ్రీసత్యసాయిజిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం ఓప్రకటనలో తెలిపారు.అలాగే జూన్ 4వతేది కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఈసందర్భంగా ఆయన తెలిపారు.
$$$__________@@@__________$$$
తెదేపాలోకి పలు వైకాపా కుటుంబాలు చేరిక
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు (పుట్టపర్తి)మే08(విజయ స్వప్నం.నెట్)
మండలంలోని సున్నంపల్లి పంచాయతీ చౌడేపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు కార్యకర్తలు బుధవారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో తెదేపాలోకి చేరినట్లు తెలిపారు.గౌనిపల్లి గ్రామంలో వైకాపాకు చెందిన 20 కుటుంబాలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.వీరికి తెదేపా కండువాలు కప్పి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెదేపాలోకి ఆహ్వానం పలికారు.ఈసందర్భంగా మాజీమంత్రి పల్లె మాట్లాడుతూ.... వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెదేపా జాతీయ అధ్యక్షులు,మాజీమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని పలువురు నాయకులు,కార్యకర్తలు తెదేపాలోకి చేరినట్లు ఆయన పేర్కొన్నారు.మే 13వతేదిన తెదేపా సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపా,జనసేన,బిజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిని, ఎంపీ అభ్యర్థి బీకే పార్ధసారధిని గెలిపించాలని,చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన ఈసందర్భంగా పిలుపునిచ్చారు. వైకాపా నుండి తెదేపాలోకి చేరిన వారిలో భాస్కర్ రెడ్డి,శంకర్ రెడ్డి,జయచంద్ర రెడ్డి,రాంశెట్టి,రామచంద్ర, రాజారెడ్డి, వెంకటరమణ, రాజగోపాల్, శివనారాయణ, నరసింహా, నాగలక్ష్మి, బాబు, శ్రీనివాసులు, రాణి, సుధాకర్, వెంకటేష్, రాజశేఖర్, పెద్ద మునిస్వామి, ఆదినారాయణ, మునిస్వామి, రామకృష్ణ, రంగప్ప, చిన్న మునెప్ప,అమర్ నాథ్ తదితరులు ఉన్నారు. ఈకార్యక్రమంలో మాజీ జెడ్పీ సభ్యులు పిట్టా ఓబుళరెడ్డి, మండల కన్వీనర్ జయచంద్ర, తెదేపా నాయకులు కార్యకర్తలు నాగేంద్ర,నంది నరసింహులు, భైరిశెట్టి, రమణారెడ్డి, బోనాల రామాంజీ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
బి.యిడ్ చదువుతున్న ఉపాధ్యాయులకు వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి: డిటిఎఫ్
శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి)మే09(విజయస్వప్నం.నెట్)
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్ విజయస్వప్నం.నెట్ ప్రతినిధితో గురువారం మాట్లాడుతూ.... జి.ఓ 342 ప్రకారం ఫర్మీషన్ పొంది ఇన్ సర్వీసు లో బీఈడీ చదువుతున్న ఉపాద్యాయులకు వార్షిక ఇంక్రిమెంట్ నిలుపుదల చేయకుండా,యధావిధిగా వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేసేలా డిడీవోలకు క్లారిఫికేషన్ ఇవ్వాలని వారు ఈసందర్భంగా కోరారు.
$$$__________@@@__________$$$
వైకాపాను వీడి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరిక
శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి) మే09(విజయస్వప్నం.నెట్)
సింగిల్ విండో మాజీ అధ్యక్షులు ఉంట్ల మహేశ్వర్ రెడ్డి,మాజీ ఎంపిటిసి రఘునాథ్ రెడ్డి,ఉప సర్పంచ్ వెంకటస్వామిరెడ్డి తోపాటు 25 వైకాపా కుటుంబాలు తెదేపాలోకి చేరారు.పుట్టపర్తి కార్యాలయంలో గురువారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో వీరు తెదేపా కండువాలు కప్పుకొని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఓడిచెరువు సింగల్ విండో మాజీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి,తిప్పేపల్లి మాజీ ఎంపీటీసీ రఘునాథ్ రెడ్డి,ఉపసర్పంచ్ వెంకటస్వామి రెడ్డి,మదన్ మోన్మోహన్ రెడ్డి, రామచంద్రారెడ్డి,లక్ష్మీపతి రెడ్డి,రాఘవేంద్ర,జె.వెంకట్రాంరెడ్డి,వై.ఆదినారాయణరెడ్డి,మందల మధు,సద్దా చలపతితో పాటు తిప్పేపల్లి గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వైకాపాని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.ఈ సందర్భంగా వైకాపాను వీడిన నాయకులు మాట్లాడుతూ....పుట్టపర్తి నియోజకవర్గంలో తెదేపా,జనసేన,బిజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూరమ్మ గెలుపు కోసం కష్టపడి పని చేస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వారు తెలిపారు.మన పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమన్నారు.పుట్టపర్తి నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే పల్లె సింధూరమ్మ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వారు పేర్కొన్నారు.
$$$__________@@@__________$$$
భాస్కర్ సారధ్యంలో సవితమ్మకు ఘన సన్మానం
శ్రీసత్యసాయిజిల్లా గోరంట్ల (ఓడిచెరువు)మే09(విజయస్వప్నం.నెట్)
అఖిల భారత వలస కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు మందడి భాస్కర్ సారధ్యంలో పెనుగొండ తెదేపా,జనసేన,బిజెపి ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మకు ఆమె భర్త వెంకటేశ్వర్లకు స్థానిక తెదేపా కార్యాలయంలో గురువారం పూలమాలలు,బొక్కేలు దుశ్శాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉన్న తెలుగు వలస కార్మికులను ఓటర్లు కోసం ప్రతిరోజు అక్కడ కలిసి రాబోయే ఎన్నికల్లో పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మకు ఓట్లు వేయాలని ఎన్నికల ప్రచారం చేస్తునట్లు భాస్కర్ సవితమ్మ వివరించారు.ఈ సందర్భంగా సవితమ్మ మాట్లాడుతూ వలస కార్మికులను విరివిగా కలిసి తెదేపాకి ఓట్లు వేసే విదంగా వారిలో చైతన్యం తీసుకురావాలని భాస్కర్ కు సవితమ్మ సూచించినట్లు తెలిపారు.అలాగే తెదేపా గెలుపు కోసం బెంగళూరులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న భాస్కర్ టీమ్ ను సవితమ్మ అభినందించారు. భవిష్యత్ లో వలస కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటానని భాస్కర్ కు సవితమ్మ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పచ్చ అశోక్, ఉపాధ్యక్షుడు రామ్మోహ నాయుడు,కార్యదర్శి ఆంజనేయులు.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
సంవత్సరాల ముందు ఉన్న టోకెన్ ఐ.డి సేకరించడం సాధ్యం కాదు...
గడువును జూలై నెలాఖరు వరకు పెంచాలి.... ప్రాతినిధ్యం :-
ఏపిజిఎల్ఐ యాప్(నిధి పోర్టల్) అప్డేషన్ లో ఉన్న సమస్యలపై ఏడిని కలసి ప్రాతినిధ్యం చేసిన డిటిఎఫ్ శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్, జిల్లా ఉపాధ్యక్షులు శేషగిరి
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే09(విజయస్వప్నం.నెట్)
మిస్సింగ్ క్రెడిట్స్ ను భర్తీ చేసే ప్రక్రియను డిపార్ట్మెంట్ చూసుకోవాలని,ఉపాధ్యాయులకు ఆ పని సాధ్యం కాదని,సంవత్సరాల ముందు ఉన్న టోకెన్ ఐ.డి సేకరించడం సాధ్యం కాదని,మినహాయింపు లేనిదే జీతాల బిల్లు సబ్మిట్ కానందున ఆమేరకు మిస్సింగ్ క్రెడిట్స్ ను భర్తీ చేయాలని కోరారు.గత సంవత్సర కాలంగా సర్వీసెస్ లేనందున పెంచిన మొత్తాలు పెంచిన తేదీ నుండి కాకుండా యాప్ అప్డేట్ చేసిన తేదీ నుండి రావడం జరుగుతుందని ఏడి దృష్టికి తీసుకెళ్ళనట్లు డిటిఎఫ్ శ్రీసత్యసాయిజిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్,ఉపాధ్యక్షులు శేషగిరి గురువారం తెలిపారు.గతేడాది జూలై 1వతేది(01-07-2023) నుండి రుణాలు/ పాక్షిక ఉపసంహరణ/డెత్ క్లెయిమ్స్ పెండింగ్ లో ఉన్నాయని,వెంటనే దరఖాస్తులకు అవకాశం కల్పించి మంజూరు చేయాలని కోరినట్లు డిటిఎఫ్ శ్రీసత్యసాయిజిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్, ఉపాధ్యక్షులు శేషగిరి కోరినట్లు తెలిపారు.ఇటీవల ఏపి.జి.యల్ ఐ డిపార్ట్మెంట్ నుండి ప్రింటెడ్ బాండ్లు సంబంధిత ట్రెజరీల ద్వారా డి.డి.ఓ లకు పంపారని,అయితే ఇంకా 40% మందికి బాండ్లు పంపిణీ కాలేదని,వాటిని కూడా వెంటనే పంపిణీ చేయాలని,సంవత్సరాంతమున అన్ని విభాగాల వివరాలను ప్రభుత్వానికి నివేదించే కార్యక్రమం,విద్యార్థుల మార్కుల కన్సాల్డేషన్ చేసే కార్యక్రమం,ఎన్నికల విధులు ఉండడంతో యాప్ లో నమోదు చేయవలసిన వివరాలను నమోదు చేయలేని పరిస్థితి ఉందని, ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే ఉపాధ్యాయులు యాప్ మీద దృష్టి పెట్టే అవకాశమున్నందున ఈ గడువును జూలై నెలాఖరు వరకు పెంచాలని కోరినట్లు తెలిపారు.పెంచిన మొత్తం కన్న తక్కువ మొత్తం కనపడుతున్నదని తెలుపగా అలాంటి కేసులను పరిష్కారం చేస్తామని తెలిపారన్నారు. ఏడి సందేశం*
యాప్ లో ఉన్న సమస్యలపై వస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు అధికారులకు పంపి యాప్ అప్డేషన్ కార్యక్రమం చేస్తున్నామని,అన్నీ సౌకర్యాలు త్వరలో పూర్తి చేస్తామన్నారు.మీ చెల్లింపులను స్పిప్పుల కన్నా యాప్ లో డౌన్ లోడ్ చేసుకొని చెక్ చేసుకొని చూస్తే అప్డేట్ సమాచారం తెలుస్తుందన్నారు.
$$$__________@@@__________$$$
గర్భవతుల హై రిస్క్ పరిస్థితులు నివారిద్దాం: వైద్యాధికారి భానుప్రకాష్
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే09(విజయస్వప్నం.నెట్)
ముందస్తుగా అవగాహన కలిగి ఉండి గర్భవతుల హై రిస్క్ పరిస్థితులను నివారించగలిగితే సాధారణ ప్రసవాలతో ఆరోగ్యవంతమైన పిల్లలను సంతానంగా పొందవచ్చని ఓడిచెరువు మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి భాను ప్రకాష్ పేర్కొన్నారు.గురువారం స్థానిక మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో యధావిధిగా ప్రతి నెల నిర్వహించే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమంలో వైద్యాధికారి భానుప్రకాష్ పాల్గొని మాట్లాడారు.భౌతిక వీక్షణ హై రిస్క్ లక్షణాలు అయిన యుక్త,మేనరిక వివాహాలు,40 సంవత్సరాలు పైన గర్భవతి వయస్సు,35 సంవత్సరాలు పైన ప్రసవం,145 సె.మీ. లోపు ఎత్తు,42 కేజీల లోపు బరువు,వంధత్వం తర్వాత గర్భధారణ అలాగే వైద్య సంబంధమైన హైరిస్క్ అంశాలు అనగా దీర్ఘకాలిక రుగ్మతలు,గర్భస్రావ గత చరిత్ర,కవలలు,పిండం అసాధారణ స్థితి,తీవ్ర రక్తహీనత,గుండె జబ్బులు, మధుమేహం,హెచ్ఐవి,థైరాయిడ్,కామెర్లు తదితర విషయాల పట్ల అవగాహన ఏర్పరచుకొని జాగ్రత్తలు తీసుకుంటే ముందస్తుగా ప్రమాద సంకేత ప్రసవాలను నివారించవచ్చని ఆయన సూచించారు.ఆరోగ్య విద్యలో భాగంగా ఐరన్,ప్రోటీన్లు,విటమిన్లు,ఖనిజాల తో పోషకాహార ప్రాముఖ్యత,పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వాతావరణ అనుకూలంగా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణ,క్రమం తప్పకుండా గర్భవతి పరీక్షలు,ప్రసవ ప్రణాళిక, ఆసుపత్రిలో ప్రసవం ప్రాముఖ్యత,ప్రభుత్వ ఆరోగ్య ప్రోత్సాహక పథకాల వినియోగం తదితర విషయాలపై ఆయన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి హాజరైన 61 మంది గర్భవతులలో 19 మందిని హై రిస్క్ వారిగా గుర్తించి అవసర,అత్యవసర చికిత్సలు, మిగత వారికి చిరు వ్యాధుల చికిత్స అందించి,13 మందికి ఉచిత స్కానింగ్,మందుల పంపిణీ చేశారు.కాగా ఈ కార్యక్రమంనకు హాజరైన గర్భవతులకు,వారి సహాయకులకు కదిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి పృథ్వి,నితిన్ సహకారంతో భోజన సౌకర్యం కల్పించారు.వీరి సేవా భావనకు సిబ్బంది, గర్భవతులు,సంరక్షకులు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆరోగ్య,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైకాపాలోకి 10 కుటుంబాలు చేరిక
శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి)మే09(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 10 తెదేపా కుటుంబాలు గురువారం పుట్టపర్తి కార్యాలయంలో పుట్టపర్తి శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరినట్లు వైకాపా శ్రేణులు తెలిపారు.గ్రామానికి చెందిన ఉతప్ప,గంగులమ్మ,చిన్ననరసింహ,కిష్టప్ప,నారాయనప్ప,నాగప్ప,వరలక్ష్మి,లక్ష్మన్న,మారక్కా,కాంతమ్మ తదితరులు వైకాపాలో చేరిన వారిలో ఉన్నారన్నారు.చేరినవారికి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు.వైయస్ జగన్ మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే 13వతేది వైకాపా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి,మరోసారి వైఎస్ జగనన్నని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ వంశీకృష్ణ
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే09(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని ఎంబి క్రాస్ గ్రామ సమీపంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం ఎన్నికల నిబంధనల ప్రకారం ఎస్ఐ వంశీకృష్ణ పోలీసులతో కలిసి వాహనాలను తనిఖీలు నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ.... ఏలాంటి అనుమతులు లేకుండా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం,నగదు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ కు ముందు (48 గంటలు)11వతేది శనివారం సాయంత్రం నుండి 13వతేది సోమవారం సాయంత్రం వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి