వర్షం కోసం గంగమ్మగుడిలో ప్రత్యేక పూజలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే26(విజయస్వప్నం.నెట్)
మండలంలోని సున్నంపల్లి పంచాయతీ గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీ ఏటి గంగమ్మతల్లి ఉపాలయంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు నరసింహులు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ గంగమ్మతల్లికి వివిధ పుష్పాలతో అలంకరించి,దీపధూప నైవేద్యాలు సమర్పించి, కర్పూర హారతి నీరాజనాలతో పూజలు నిర్వహించారన్నారు.అమ్మవారికి కాయ కర్పూరం సమర్పించి దర్శనం చేసుకొన్న గ్రామస్తులకు,భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారన్నారు.
$$$__________,@@@__________$$$
31న గోరంట్ల మండలంలో అక్కదేవతల పరష
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే26(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా గోరంట్ల మండలంలోని మలసముద్రం గ్రామంలో ఈనెల 31వతేది శుక్రవారం శ్రీఅక్కదేవతల ఎలవగంప ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పూజారి, నిర్వాహకులు రవికుమార్,చక్రి ప్రకటనలో తెలిపారు. అక్కదేవతల ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు,గ్రామస్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు,అన్నప్రసాదాలు స్వీకరించి,అక్కదేవతల కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి