ఓట్ల లెక్కింపు ప్రక్రియ కీలకం
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే24(విజయ స్వప్నం.నెట్)
జూన్ 4వ తేదీ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కీలకమని,కౌంటింగ్ కేంద్రాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల నిర్వహణ అధికారులకు(ఆర్ఓలకు)జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రిటర్నింగ్,సహాయక రిటర్నింగ్,అదనపు సహాయక రిటర్నింగ్ అధికారులకు సమావేశం ఏర్పాటు చేసి ఓట్లు లెక్కింపుపై ఆయన ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు వివరించారు.ఎన్నికల నిర్వహణలో ఆఖరి ఘట్టం కోట్ల లెక్కింపు కీలకమని సిబ్బందికి అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలన్నారు. సిబ్బంది సైతం గుర్తింపు కార్డులకు ధరించి కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించాలన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ కుమార్, సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్వో కొండయ్య, రిటర్నింగ్ అధికారులు భాగ్యరేఖ, వెంకటశివారెడ్డి, వంశీకృష్ణ, గౌరీశంకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఓడిచెరువు మండలానికి పాఠ్యపుస్తకాలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే24(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయానికి శుక్రవారం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు చేరినట్లు ఎమ్మార్సీలు తెలిపారు. మండల వ్యాప్తంగా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మొదటి విడతగా పాఠ్యపుస్తకాలు వచ్చినట్లు పేర్కొంటూ.... మిగిలిన పాఠ్యపుస్తకాలు త్వరలో వస్తాయని తెలిపారు.పాఠశాలలు పునః ప్రారంభం కాగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తామని ఉపాధ్యాయుల ద్వారా సమాచారం.
$$$__________@@@__________$$$
కౌంటింగ్ లో పొరపాట్లు ఉండకూడదు: కలెక్టర్ అరుణ్ బాబు
శ్రీసత్యసాయిజిల్లా హిందూపురం(పుట్టపర్తి)మే24(విజయస్వప్నం.నెట్)
జూన్ నాలుగో తేదీ నిర్వహించే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా తగిన ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులకు శ్రీసత్యసాయిజిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సూచించారు.శుక్రవారం ఆయన ఈవీయంలు భద్రపరిచిన నాయనపల్లివద్ద బిట్ కళాశాల వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో స్ట్రాంగ్ రూములను సీసీ కెమెరా ఫుటేజులను పరిశీలించారు.తదుపరి రికార్డులు తనిఖీ చేసి,మూడంచల భద్రత సిబ్బందికి సూచనలు సలహాలిచ్చారు
కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాట్లపై అడిగి తెలుసుకుని పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కౌంటింగ్ సిబ్బంది ఏజెంట్లు కూర్చునేందుకు వీలుగా టేబుల్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు కట్టిదిచంగా ఉండాలన్నారు.ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు అన్ని రకాల భద్రత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతపై సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జెసి అభిషేక్ కుమార్,సబ్ కలెక్టర్ అపూర్వ భారత్,ఆర్వోలు వంశీకృష్ణ, గౌరీ శంకర్ తదితర నియోజకవర్గాల సహాయక ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
సజావుగా పది సప్లిమెంటరీ పరీక్షలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే24(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో విజ్ఞాన్ పాఠశాలలో శుక్రవారం పది సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు హాజరైయ్యారు. పరీక్షలు సజావుగా జరిగినట్లు విద్యాధికారులు తెలిపారు.
$$$__________@@@__________$$$
వైభవంగా చిన్నమ్మతల్లి గ్రామోత్సవం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే25(విజయస్వప్నం.నెట్)
మండలంలోని డబురువారిపల్లి పంచాయతీ బత్తినపల్లిలో శనివారం గౌను ఓబులప్ప, కేశప్ప, చిన్నప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా చిన్నమ్మతల్లి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామస్తులతో కలిసి పసిబాల చిన్నమ్మతల్లి ప్రతిమకు ఆభరణాలు ప్రత్యేక పెట్టెలో ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆభరణాల పెట్టెతో పురవీధుల్లో డప్పు వాయిద్యాలతో భక్తులకు దర్శనమిస్తూ ఊరేగించి అనంతరం చిన్నమ్మతల్లి మెట్టినిల్లు నల్లమాడ మండలం వంకరకుంట పంచాయతీ వాసిరెడ్డిపల్లికి ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు గౌను వంశీయులు తెలిపారు. మే31 అమడగూరు మండలంలో.... అమడగూరు మండలంలోని రెడ్డివారిపల్లి గ్రామంలో ఈనెల 31వతేది అక్కదేవతల ఎలవగంప ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఓప్రకటనలో పేర్కొన్నారు. అక్కదేవతల ఎలవగంప ఉత్సవ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదాలు స్వీకరించి అక్కదేవతల కృపకు పాత్రులు కావాలని కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి