గౌనిపల్లిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు సెప్టెంబర్15(విజయస్వప్నం.నెట్)
మండలంలోని అల్లాపల్లి పంచాయతీ గౌనిపల్లి జిల్లా ఉన్నత పాఠశాలల్లో ఆదివారం 1980-81 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ మకార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ పాల్గొని తమ తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.రోజంతా ఉత్సాహంగా,ఉల్లాసంగా గడుపుతూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.ప్రధానోపాధ్యాయులు జయంచంద్రరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పూర్వ విద్యార్థులను ఉద్దేశించి సందేశమిచ్చారు.ప్రతి పూర్వ విద్యార్థి సేవా గుణాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు.అనంతరం పూర్వ విద్యార్థులందరూ కలిసి గురువులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులైన విద్యార్థులు మాట్లాడుతూ ... కొన్నేళ్ల తర్వాత అందర్నీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఉపాధ్యాయుల చల్లని దీవెనల వల్లనే మేము ఈ స్థాయి ఉన్నామని తెలిపారు.ఈకార్యక్రమంలో చలపతి,రాజారెడ్డి,శ్రీనివాస గుప్త,జనార్ధన్ గుప్త,మంజుల,రత్నకుమారి,రమణరెడ్డి,శ్రీనివాసరెడ్డి,నారాయణరెడ్డి,గోవిందరెడ్డి,ఈశ్వర్ రెడ్డి,తిరుపతమ్మ,నాగలక్ష్మి తదితర పూర్వ విద్యార్ధులుపాల్గొన్నారు. అనంతరం సహచర పూర్వ విద్యార్థి తంగేడుకుంట గ్రామానికి చెందిన ఉత్తప్ప 10000 రూపాయలు ఉగ్గి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రామ్మోహన్ రెడ్డికి 3000 ఆర్థిక సాయం అందించారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజాల్లా (ఓడిచెరువు)కదిరి, సెప్టెంబర్16(విజయస్వప్నం.నెట్)
కదిరి డియస్పిగా శివనారాయణస్వామి సోమవారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డిఎస్పీ శ్రీలత తిరుపతి మహిళా పోలీసుస్టేషన్ డిఎస్పీగా బదిలీపై వెళ్ళాగా,కదిరి పట్టణ డిఎస్పీ కార్యాలయంలో నూతన డిఎస్పీగా శివనారాయణస్వామి భాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు.
$$$__________@@@__________$$$
ఎబివిపి సదస్సు విజయవంతం
శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు)కదిరి,సెప్టెంబర్16(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో ఆదివారంబివిపి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శ్రీసత్యసాయిజిల్లా కన్వినర్ వాసుదేవ మాట్లాడుతూ ఈనెల 14,15 తేదీలలో నెల్లూరులో ఎబివిపి నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు విజయవంతంగా నిర్వహించారనీ తెలిపారు.ఈ సమావేశాల్లో ఎబివిపి జాతీయ సహ సంఘటన కార్యదర్శి ఎస్.బాలకృష్ణ,ముఖ్య అతిథిగా పాల్గొన్నారని తెలిపారు.రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యారంగంలో జరుగుతున్న మార్పులపై,విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన క్షేత్రస్థాయి కార్యవర్గ సభ్యులతో చర్చించినట్లు పేర్కొన్నారు.దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన,రాష్ట్ర స్థితిగతులు,విద్యారంగంలో పరిస్థితులు తదితర అంశాలపై సమీక్షించారన్నారు.విద్యారంగ స్థితి అనే రెండు ప్రత్యేక తీర్మానాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.అలాగే ఏబీవిబి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో చేయబోయే కార్యాచరణను కూడా ప్రకటించినట్లు తెలిపారు.రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన తెదేపా కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఎన్నికల ముందు రాష్ట్రంలోని విద్యార్థులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా వీలైనంత త్వరగా ఆమలు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం వహించడం,డ్రగ్స్ పై 2024 ఉక్కు పాదంతో అణిచివేయాలని పేర్కొన్నారు.
$$$__________@@@__________$$$
వాహనాలను తనిఖీ చేసిన ఎస్ఐ
శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు)అమడగూరు,సెప్టెంబర్ 16(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో సోమవారం మండల రెవిన్యూ కార్యాలయం వద్ద ఎస్ఐ వెంకటనారాయణ వాహనాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,హెల్మెట్, సీట్ బెల్ట్లు తప్పక ధరించాలని,పరిమితికి మించి ప్రయాణికులను వాహనాల్లో తరలించరాదని,అతివేగం ప్రమాదకరమని,మద్యం సేవించి,సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని చెప్పారు.ఈసందర్భంగా పలు వాహనాలదారుల రికార్డులు పరిశీలించి,రికార్డులు సరిగా లేని వాహనాలకు జరిమానా విధించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
సమాజాభివృద్ధికి తోడ్పాటు నివ్వండి
మీ కష్టసుఖాల్లో మీవెంట మేము ఉంటాం
పాత్రికేయుల సంక్షేమ నిధికి రూ.లక్ష విరాళంగా ప్రకటించిన మాజీ మంత్రి పల్లె
పాత్రికేయుల సభలో మంత్రులు సబితా,సత్యకుమార్,ఎంపీ బీకే పార్ధసారధి,ఎమ్మెల్యే ఎంఎస్ రాజు,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరు
శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి16(విజయస్వప్నం.నెట్)
సమాజాభివృద్ధికి పాత్రికేయులు తమ వంతు పాత్ర పోషించాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.పుట్టపర్తి సాయి ఆరామంలో సోమవారం జరిగిన సత్యసాయి జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల మహా సభలో మంత్రులు సబితా,సత్యకుమార్,ఎంపీ పార్థసారథి,మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతోపాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.ప్రభుత్వానికి మీడియా కళ్లు చెవులులా పనిచేస్తోంది.2014 లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అప్పటి సమాచార శాఖ మంత్రిగా పాత్రికేయుల అభ్యున్నతికి కృషి చేశానని, తెదేపా ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమ నిధికి 100 కోట్లు నిధులు మంజూరు చేసిందని,జర్నలిస్టులకు 10లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించారని,పాత్రికేయుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు.శ్రీసత్యసాయి జిల్లాలో ముఖ్యంగా జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.పుట్టపర్తి నియోజకవర్గ పాత్రికేయులకు 2024-25 నాటికి 106 మందికి లక్షా 32వేల 500 రూపాయలు స్వయంగా చెల్లించినట్లు తెలిపారు.భవిష్యత్ లో పాత్రికేయుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మీడియా వల్లే తాను అత్యున్నత స్థాయికి ఎదిగానని,వారు నా కుటుంబ సభ్యుల్లా భావించి అన్ని విధాలుగా ఆదుకుంటానని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.ప్రతి పాత్రికేయుడు సమాజాభివృద్ధికి మంచి కథనాలు అందించాలని సూచించారు.ప్రజలకు, ప్రభుత్వానికి మీడియా వారధిగా పనిచేయాలని సూచించారు.ఒక మంచి అంశాన్ని సమాజానికి అందించే విషయంలో పాత్రికేయుడు పూర్తి అవగాహన ఉండాలన్నారు.పాత్రికేయుల అభివృద్ధికి తగిన సహకారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అందిస్తామని హామీ ఇచ్చారు..అనంతరం పాత్రికేయుల సంక్షేమ నిధికి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లక్ష విరాళంగా ప్రకటించారు.అలాగే మంత్రి సత్య కుమార్ జన్మదిన సందర్భంగా మాజీ మంత్రి జర్నలిస్టుల తరపున శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు
ఈకార్యక్రమంలో ఏపి యు డబ్లూ జే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు ఐ.వి సుబ్బారావు,ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షులు పుల్లయ్య,ప్రధాన కార్యదర్శి బాబు,ఐజేయు సభ్యులు అయ్యన్నగారి శ్రీనివాసులు, అనంతపురం జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్,శివ,హరికృష్ణ,నాగరాజు,రాజు,మార్కెండేయులు,ప్రభాకర్ నాయుడు,వ్యాఖ్యాత ఉద్దండం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రులకు, ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ మంత్రి,పాత్రికేయ రాష్ట్ర నాయకులకు శాలువా కప్పి సన్మానించారు.
$$$__________@@@__________$$$
ఉలవల కోసం రైతులు నమోదు చేసుకోవాలి
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్16(విజయస్వప్నం.నెట్)
మండల వ్యాప్తంగా రైతులు ఉలవల కోసం ఆధార్ కార్డుతో రైతులు నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారి తెలిపారు. అందులో భాగంగా సోమవారం కార్యాలయంలో ఏహెచ్ఏలు లలిత,సరస్వతి రైతుల ఆధార్ కార్డుల మేరకు పేర్లు, భూమివివరాలు నమోదు చేసుకుని, అలాగే ఈకేవైసి వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు.
$$$__________@@@__________$$$
నూతన పశువైద్యాధికారి ధనుంజయ బాధ్యతలు స్వీకరించిన
శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు) అమడగూరు సెప్టెంబర్16(విజయస్వప్నం.నెట్)
మండల నూతన పశు వైద్యాధికారిగా ధనుంజయ సోమవారం బాధ్యతలు చేపట్టారు.ఆయన ఆళ్లగడ్డ మండల పశు వైద్యాధికారిగా పనిచేస్తూ బదిలీపై ఆమడగూరు మండల పశువైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా భాధ్యతలు చేపట్టిన పశువైద్యాధికారి ధనుంజయ మాట్లాడుతూ మండలంలో పాడిఆవులు,గొర్రెలు,మేకలు తదితర పశువు సంరక్షణపై దృష్టిసారిస్తాన్నారు.పాడిరైతులకు అందుబాటులో ఉండి పాడి పరిశ్రమ, మూగజీవాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మండల కేంద్రమైన ఆమడగూరుకు పశు వైద్యాధికారి గత రెండు సంవత్సరాలుగా ఇన్చార్జ్ అధికారులే విధులు నిర్వహిస్తున్నారని,పశువైద్యాధికారిగా సోమవారం బాధ్యతలు స్వీకరించడంతో పాడి రైతులు, పశు పెంపకపుదారులు తదితర రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
$$$__________@@@__________$$$
ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,సెప్టెంబర్17(విజయస్వప్నం.నెట్)
భారతీయ జనతా పార్టీ సేవా సప్తాహం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఇందుకూరి సురేంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 74వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆమడగూరు పంచాయతీ గ్రామంలో మోదీ జన్మదిన సందర్బంగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు.అలాగే పరిసరాల్లో పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఆర్గానిక్ శరత్ కుమార్ రెడ్డి,బీజేపీ నాయుకులు ఐ.రాము,సుబ్బిరెడ్డి,గంగులప్ప,తిప్పన్న,వెంకటనారాయణ,పురుషోత్తం,విశ్వాహిందూ పరిషత్ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
స్వచ్ఛతాహి సేవలో భాగస్వాములు కావాలి
స్వభావ్ స్వచ్ఛత -సంస్కార్ స్వచ్ఛత ప్రారంభం
అమడగూరు, జనసేన న్యూస్ సెప్టెంబర్17
మండల కేంద్రంలో మంగళవారం స్థానిక బస్టాండ్ ప్రాంతంలో స్వభావ్ స్వచ్ఛత- సంస్కార్ స్వచ్చత కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్టాండ్ ప్రాంతంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి స్వచ్ఛత మన బాధ్యత అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మునియప్ప మాట్లాడుతూ చిన్న,పెద్ద,విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, స్వఛ్ఛభారత్ కేంద్రం ప్రారంభించడంతో స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందని,సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు నిర్వహించి,మహాత్మా గాంధీకి ఘనమైన నివాళి అర్పించేందుకు స్వచ్ఛ తాహి సేవ కార్యక్రమం గొప్ప అవకాశమన్నారు.ప్రజలందరూ తమ తమ చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛతకు మారుపేరుగా మన మండలాన్ని తీర్చిదిద్దాలని ఆయన కోరారు.అలాగే హరిత రాయబారులకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మునియప్ప, ఎంఈఓ జిలాన్ భాష, హెడమాస్టర్ శ్రీధర్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి చంద్ర,సర్పంచ్ షబ్బీర్, ఆరోగ్య,ఆశా వర్కర్లు,బీజేపీ కార్యవర్గ సభ్యులు శరత్ కుమార్ రెడ్డి,సురేంద్ర రెడ్డి, ఐ. రాము,పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఓడిచెరువు ఎంపిడిఓ ఆధ్వర్యంలో....
ఓడిచెరువు మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామంలో మంగళవారం స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిణి వరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమం గురించి స్వఛ్ఛభారత్ సేవలతో కలిసి గ్రామాల్లో గృహాల పరిసరాల్లో, పాఠశాలల ఆవరణల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని,బ్లీచింగ్ పౌడర్ చల్లడం తదితర పారిశుద్ధ్య శుభ్రత అంశాలపై అవగాహన కల్పిస్తూ పురవీధుల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్,సచివాలయ ఉద్యోగ సిబ్బంది, అంగన్వాడి ఆరోగ్య,ఆశా సిబ్బంది, యానిమేటర్లు, స్వచ్ఛభారత్ కార్మికులు,పాఠశాల విద్యార్థులు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
అధైర్య పడవద్దు అండగా ఉంటా
బాధిత కుటుంబాలకు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భరోసా
శ్రీసత్యసాయిజాల్లా,ఓడిచెరువు,సెప్టెంబర్17(విజయస్వప్నం.నెట్)
అధైర్యపడవద్దు మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.ఓడిచెరువు మండలంలోని వేమారెడ్డిపల్లికి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు పీట్ల నాగరాజు కుమారుడు మహేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మంగళవారం గ్రామంలోని భాధితుడి గృహానికి వెళ్లి పార్థివ దేహన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.మృతుడు మహేశ్ తండ్రి నాగరాజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.బాధలో ఉన్న ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందించారు.అనంతరం మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు ఇటీవలే మృతి చెందగా భార్య శివమ్మను పరామర్శించి ఓదార్చారు. ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందించారు.అక్కడి నుంచి ఈడిగ కృష్ణమూర్తి భార్య సరస్వతమ్మ మృతి చెందారు.ఆమె భౌతికాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.రోదిస్తున్న ఆకుటుంబాన్ని మాజీ మంత్రి ఓదార్చారు.ఈకార్యక్రమంలో తెదేపా,జనసేన,బిజెపి నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి నామినేటైన ఉమ్మడి అనంత జిల్లా యువకులు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) కదిరి,సెప్టెంబర్18(విజయస్వప్నం.నెట్)
కదిరి నియోజకవర్గానికి చెందిన బాదుల్లా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హార్రర్ వెబ్ సిరీస్ ఇగ్బో ఎంతో థ్రిల్లింగ్ గా సాగే ఈ వెబ్ సిరీస్ బెస్ట్ షార్ట్ ఫిలిం డైరెక్టర్ అవార్డుకు నామినేట్ అయ్యాడని,అదేవిధంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం, కంబదూరు మండలం మారుమూల నూతిమడుగు గ్రామానికి చెందిన కే.కార్తీక్ అనే యువకుడు మహాశివ అనే షార్ట్ ఫిల్మ్ లో మహాశివుని ఆలయం విశిష్టత,ప్రాధాన్యత కథనం మీద సాగే బడ్జెట్ షార్ట్ ఫిలింగా 30 రోజులలో షార్ట్ ఫిల్మ్ ని చిత్రీకరించారని,.అయితే ఈ రెండు లఘు చిత్రాలు ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ ఆఫ్ ఒడిస్సాలో 2024 అక్టోబర్ 17న భువనేశ్వర్ లో వీరిరువురికి అవార్డు ప్రదానం కార్యక్రమంలో అవార్డు తీసుకోబోతున్నారని ఇగ్బో వెబ్ సిరీస్ డైరెక్టర్ బాదుల్లా, ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ వారు వెబ్సైట్ ద్వారా అధికారికంగా ప్రకటించారని తెలిపారు. అవార్డు అందుకుంటున్న యువ దర్శకులను పలువురు అభినందించారు.
$$$__________@@@__________$$$
నా ఉపిరి ఉన్నంత వరకు పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా....
ఈ గడ్డ ప్రజల రుణం తీర్చుకోలేనిది:-మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
అడుగడుగునా మాజీమంత్రి పల్లె కు ప్రజలు నీరాజనాలు.
తమ్ముళ్ళ ఆధ్వర్యంలో గజమాలలు,భారీ కేక్ లు ఏర్పాటు
శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు) పుట్టపర్తి సెప్టెంబర్18(విజయస్వప్నం.నెట్)
నా ఊపిరి ఉన్నంతవరకు పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ గడ్డ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. మాజీ మంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా బుధవారం పుట్టపర్తి లో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు.
పుట్టపర్తి రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో...
పుట్టపర్తి మున్సిపల్ పరిధిలో రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో వందలాది మంది అభిమానులు తరలి వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గజమాల భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు. మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెదేపా శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు.
తెలుగు యువత ఆధ్వర్యంలో ...
పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ఎదురుగా తెలుగు యువత నాయకులు అంబులెన్స్ రమేష్,గంగాధర్,చలపతి,రామగిరి శేఖర్, జనార్దన, కొనప్ప,వైవి చౌదరి, కిరణ్ ఆధ్వర్యంలో 60 మంది ప్రభుత్వ విద్యార్థులకు పుస్తకాలు, నోట్ పుస్తకాలు , పెన్నులు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
ఐటీడిపి అధ్యక్షుడు జయప్రకాశ్ ఆధ్వర్యంలో ..
ఐ టి డి పి నియోజకవర్గ అధ్యక్షుడు జయప్రకాశ్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో మాజీ మంత్రిని సత్కరించారు వారి ఏర్పాటుచేసిన కేక్ ను కట్ చేసి అందరికీ పంచి పెట్టారు.
సామకోటి ఆధ్వర్యంలో మహాగని మొక్క నాటిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి. మాజీ మంత్రి జన్మదినం సందర్భంగా డాక్టర్ శంకరనారాయణ మొక్కలు పంపిణీ చేశారు.
కొత్త చెరువు లో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి నీరాజనాలు పలికారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు.
ఓడిచెరువులో....
ఓడిచెరువు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్, నాయకులు జయచంద్ర,బొడ్డు జయన్న ,తుమ్మల మహబూబ్ బాషా,సాదిక్,జౌళి బాబా,లక్ష్మీనారాయణరెడ్డి,ఎద్దులనరసింహరెడ్డి,శివశంకర్ రెడ్డి,చంద్ర,వెంకట రంగారెడ్డి,శ్రీనివాసులు, హిందూపురం పార్లమెంట్ సభ్యులు వైదేహి,కొండకమర్ల తెదేపా నాయకులు,కార్యకర్తలు స్థానిక తెదేపా కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.తదితరులు పాల్గొని మాజీమంత్రి పల్లె కి పూలమాల వేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.నల్లమాడ మండల నాయకులు బి.నాగభూషణ నాయుడు,శంకర్ తదితరులు పాల్గొని మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.బుక్కపట్నం మండలం నుంచి మండల కన్వీనర్ మల్లిరెడ్డితో పాటు మండల టిడిపి నాయకులు భారీగా తరలివచ్చి మాజీ మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
ఆమడగూరులో...
మండలం నుంచి మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి తోపాటు టీడీపీ నాయకులు కృష్ణమూర్తి గోపాల్ రెడ్డి రాజారెడ్డి ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కాలనాయక్,కుమార్ రెడ్డి తదితరులు పూలబొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
మామిల్లకుంట క్రాస్ ఆధ్వర్యంలో ...
పుట్టపర్తి మండల టిడిపి నాయకులు మామిళ్ళకుంట క్రాస్ లో మండల కన్వీనర్ విజయ్ కుమార్ తో పాటు టిడిపి మండల నాయకులు కార్యకర్తలు కేకే ఏర్పాటు చేసి మాజీమంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు.పుట్టపర్తి మున్సిపాలిటీకి చెందిన టిడిపి నాయకులు మండల కన్వీనర్ రామాంజనేయులు, సుధాకర్ మహమ్మద్ రఫీ ,రత్నపు చౌదరి గంగాధర్ నాయుడు సురేష్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.అంతక ముందు స్వగృహంలో మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, పివీవికే విద్యా సంస్థల ఛైర్మన్ పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి కలిసి కేక్ కట్ మిఠాయిలు పంచిపెట్టారు.
$$$__________@@@__________$$$
తుమ్మలకుంట్లపల్లి తెదేపా నాయకులు విరాళాలు సేకరణ
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్18(విజయస్వప్నం.నెట్)
మండలంలోని తుమ్మలకుంట్లపల్లి గ్రామంలో బుధవారం తెదేపా నాయకులు,కార్యకర్తలు వరద బాధితుల కోసం విరాళాలు సేకరించారు.అనంతరం సేకరించిన 45 వేల రూపాయలు పుట్టపర్తి తెదేపా కార్యాలయంలో మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి లక్ష్మీనారాయణకు అందజేశారు. ఈకార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు జెన్నే వెంకటేష్ నాయుడు,మునినాయుడు(ముసలిరెడ్డి)రవి,గౌస్ ఫీరా,జనార్ధన్ రెడ్డి,హారున్,ఇర్ఫాన్,శ్రీరామ్ నాయుడు,వేణు,నర్సింహులు, ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్,సాంభనాయుడు, వెంకటేష్(చిన్నన్నయ్య)తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
విద్యార్ధులు నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,సెప్టెంబర్18(విజయస్వప్నం.నెట్)
అమడగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అండర్ 17,అండర్14 క్రీడ పోటీలలో ప్రతిభ కనబరిచి పలువురు విద్యార్థులు నియోజకవర్గస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన పోటీల్లో మండలంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వాలీబాల్ మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి విద్యార్థులు గౌతమ్ సాయి,హరినాథ్,నరేష్,బాబు,మంజునాథ్ లు నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు మండల విద్యాధికారి జిలాన్ బాషా తెలిపారు.అలాగే కబడ్డీ పోటీల్లో చందన,దీక్షిత,లయశ్రీ,హరిణి, స్పందన విద్యార్థినీలు నియోజకవర్గస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయులు శ్రీధర్ బాబు, అమడగూరు ఉన్నత పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులు షబ్బీరబాష,చెన్నకేశవులు,పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది.
$$$__________@@@__________$$$
గుర్తు తెలియని వాహనం ఢీకొని జింకకు గాయాలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,సెప్టెంబర్18
అమడగూరు -బిళ్ళూరు రోడ్డు మార్గాన బిళ్ళూరు క్రాస్ వద్ద ఒక జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో జింక ముందు కాళ్ళకు గాయాలు కావడంతో గమనించిన స్థానికులు ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే పోలీసులకు,అటవీ అధికారులు సమాచారం అందించారు.వేంటనే అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని జింకను స్వాధీన పరుచుకొని మెరుగైన చికిత్స కోసం మండల పశువైద్యాశాలకు తీసుకెళ్లినట్లు అటవీ శాఖ అధికారి హరి,ఎస్ఐ వెంకటనారాయణ తెలిపారు.
$$$__________@@@__________$$$
జూనియర్ కళాశాల ప్రారంభ ఏర్పాట్లు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్19(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జూనియర్ కళాశాల ప్రారంభ ఏర్పాట్లపై గురువారం మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయిని శోభారాణి, ఉపాధ్యాయ బృందంతో సమీక్షించారు.ఈనెల 21న శనివారం జూనియర్ కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సూచనల మేరకు మంత్రులు సబితా,సత్యకుమార్,ఎంపీ బీకే పార్ధసారధి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్,ఉన్నతాధికారులకు ఆహ్వానం పత్రికలు పంపుతున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల కమిటీ ఛైర్మన్ ముద్దలపల్లి శ్రీనివాసులు, టైలర్ నిజాం,చాంద్ బాష,షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
రైతులకు సబ్సిడీ ఉలవలు పంపిణీ
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,సెప్టెంబర్ 19(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో గురువారం ప్రభుత్వం రైతులకు సబ్సిడీతో అందించిన ఉలవల ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు వ్యవసాయాధికారి ఇలియాజ్ తెలిపారు.ఎంపిపి షామీర్ పర్వీన్ భాను,మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి,సర్పంచ్ ముద్దలపల్లి గోవిందు, తెదేపా నాయకులు,కార్యకర్తలు టైలర్ నిజాం,పీట్లా సుధాకర్,చాంద్ బాషా,ముద్దలపల్లి శ్రీనివాసులు, మహబూబ్ బాషా,సౌదీ నాగరాజు,షాను,ఆరీఫ్, ఏహెచ్ఏలు లలిత,సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
గ్రామస్థాయిలో స్వచ్ఛహితా సేవ కార్యక్రమాలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) సెప్టెంబర్19(విజయస్వప్నం.నెట్)
స్వభావ్ స్వచ్ఛత -సంస్కార్ స్వచ్ఛత కార్యక్రమాలు గ్రామస్థాయిలో నిర్వహించే ఏర్పాట్లపై గురువారం ఎంపిడిఓ వరలక్ష్మి సచివాలయ ఉద్యోగ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.ఈకార్యక్రమంలో ఈఓఆర్డిడీ రాజశేఖర్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు రామలింగారెడ్డి,శ్రీకాంత్, సచివాలయ ఉద్యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
భోజనశాలను పరిశీలించిన మాజీ జెడ్పీటీసీ
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్19(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి సందర్శించి మధ్యాహ్న భోజనశాలను పరిశీలించి,మధ్యాహ్న ఏజెన్సీలతో మాట్లాడుతూ.... గదులు, నీళ్లు సౌకర్యాలపై అడిగి తెలుసుకుని,అనంతరం సంహఫంక్తి భోజనాలు చేసి, నాణ్యమైన పౌష్టికాహారం అందించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ ఛైర్మన్ ముద్దలపల్లి శ్రీనివాసులు, తెదేపా నాయకులు నిజాం, చాంద్ బాష,షబ్బీర్,వంటి మాస్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు సెప్టెంబర్19(విజయస్వప్నం.నెట్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,శ్రీసత్యసాయిజిల్లా ఎస్జీఎఫ్ వారి ఆదేశాల మేరకు విద్యార్థులకు నేటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే మండల స్థాయి క్రీడా పోటీలు గురువారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారని మండల విద్యాధికారులు సురేష్,రమణ,పాఠశాల ప్రధానోపాధ్యాయిని శోభారాణి,మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పిడి గోపీనాథ్ తెలిపారు.ఈ పోటీలు అండర్ 14,అండర్ 17 విభాగాలలో బాలురు,బాలికలకు క్రీడల్లో పాల్గోంటారని,ఇందులో భాగంగా వాలీబాల్, కబడ్డీ,ఖోఖో,చెస్, యోగ,అథ్లెటిక్స్ క్రీడలు నిర్వహిస్తున్నరని,ఈ పోటీలు 19న గురువారం బాలికలకు, 20న బాలురకు టోర్నమెంట్ కం సెలక్షన్స్ పద్ధతిలో నిర్వహించి,ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నియోజకవర్గ స్థాయిలో ఎంపిక చేస్తారని,ఈ మండల స్థాయి టోర్నమెంట్లో మండలంలోని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చాన్నారు.
$$$__________@@@__________$$$
నేడు ఓడి చెరువు మండలంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పర్యటన
శ్రీసత్యసాయిజాల్లా,ఓడిచెరువు,సెప్టెంబర్20(విజయస్వప్నం.నెట్)
తెదేపా కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడిచెరువు మండలం తుమ్మలకుంట్లపల్లి పంచాయతీ లో శనివారం (నేడు) నిర్వహించే ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే కార్యక్రమానికి పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్య అతిథిగా ఉదయం 10 గంటలకు హాజరుకానున్నారనో,ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,జన సేన,బిజెపి నాయకులు హాజరుకానున్నారని, ఈకార్యక్రమానికి మండల అధికారులు,ఉద్యోగులు స్థానిక ప్రజాప్రతినిధులు,
తెదేపా స్థానిక నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు హాజరుకావాలని తెదేపా శ్రేణులు తెలిపారు. ముందుగా మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవం ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జూనియర్ కళాశాలను నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం.
తుమ్మలకుంట్లపల్లిలో నిర్వహించే ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే కార్యక్రమానికి పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హాజరుకానున్నారు. దయచేసి ఈ కార్యక్రమానికి పుట్టపర్తి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరు కావాలని శుక్రవారం ఎమ్మెల్యే పీఆర్వో సంతోష్ రెడ్డి ఈసందర్భంగా కోరారు.
$$$__________@@@__________$$$
ముగిసిన మండల స్థాయి క్రీడా పోటీలు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్20(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పరిషత్ పాఠశాలలో గత రెండు రోజుల నుంచి జరిగిన మండల స్థాయి క్రీడా పోటీలు నేడు శుక్రవారం ముగిశాయని,ఈ క్రీడా పోటీల్లో మండలంలోని 13 ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని,అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారుల్లో 98 బాలికలు,115 మంది బాలురును నియోజకవర్గ స్థాయికి ఎంపిక చేసినట్లు మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గోపీనాథ్ తెలిపారు.నేడు చివరి రోజు జరిగిన బాలుర అండర్ 14 విభాగంలో కబడ్డీ కోకో వాలీబాల్ నందు జిల్లా పరిషత్ హైస్కూల్ ఓడి చెరువు విజయం సాధించారని, అండర్ 17 విభాగంలో వాలీబాల్ నందు జిల్లా పరిషత్ హై స్కూల్ ఓడిచెరువు విజయం సాధించగా,అండర్ 17 విభాగంలో కబడ్డీలో గౌనిపల్లి పాఠశాల విద్యార్థులు విజయం సాధించారని,అండర్ 17 విభాగంలో ఖోఖో నందు వశిష్ట స్కూల్ విజయం సాధించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులు దానమయ్య,రాంబాబు,జనార్ధన్,బాబా,బేబీ పాల్గొన్నారని తెలిపారు.
$$$__________@@@__________$$$
వరద బాధితుల కోసం విరాళాలు సేకరణ
శ్రీసత్యసాయిజిల్లా)ఓడిచెరువు) అమడగూరు,సెప్టెంబర్20(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామంలో శుక్రవారం శ్రీరామకృష్ణా విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి విజయవాడ వరద బాధితుల కోసం విరాళాలు సేకరించారు.ఈసందర్భంగా కరస్పాండెంట్ కే. భారతి మాట్లాడుతూ వరద బాధితుల కోసం తమ వంతు సహాయంగా 9,600 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ పంపినట్లు తెలిపారు.విద్యార్థిని,విద్యార్థులకు,ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తోపాటు తుమ్మలప్ప,విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
పేదల సంక్షేమం తెదేపా ధ్యేయం
తమది జవాబుదారీ ప్రభుత్వం
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు)అమడగూరు,సెప్టెంబర్ 20(విజయస్వప్నం.నెట్)
పేదల సంక్షేమమే తెదేపా ధ్యేయమని తమది జవాబుదారీ ప్రభుత్వమని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పూలకుంట్లపల్లి పంచాయతీలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డితో పాటు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలసి ప్రారంభించారు.ముందుగా ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే సింధూర రెడ్డి సందర్శించి విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధించారు. పాఠశాలకు సక్రమంగా హాజరుకావాలని అందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగం పొంది సమాజాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.అనంతరం కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఆమడగూరు మండల పరిధిలోని పూలకుంట్లపల్లి పంచాయతీ నుంచి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లు రూ.3000 నుంచి ఒకే సారి రూ.4000 లకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచి అత్యంత సాహోపేతమైన నిర్ణయం తీసుకున్నారనీ పేర్కొన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కల్పించారని,ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1న జీతాలు చెల్లింపు చేపట్టి భరోసా ఇచ్చారని,విజయవాడలో వరద బాధితులను కంటికి రెప్పలా 10 రోజుల పాటు బస్సులో ఉండి ఓ తండ్రిలా ప్రజల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని కొనియాడారు. నిరుద్యోగ యువతీ యువకులకు అండగా 16 వేల437 మందికి ఉద్యోగాలు కల్పించడానికి తెదేపా ప్రభుత్వం మెగా డీఎస్సీ నీ ప్రకటించడం హర్షించదగ్గ శుభ పరిణామన్నారు.పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అన్న క్యాంటీన్ ద్వారా రూ.5 లకే కడుపు నిండా నాణ్యమైన భోజనం అందించే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్ లకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని అందులో భాగంగా పుట్టపర్తిలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించినట్లు గుర్తు చేశారు. పంచాయతీలకు రూ. 1452 కోట్లు మంజూరు చేసి పంచాయతీలకు ప్రాణం పోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రన్న కూటమి ప్రభుత్వం అన్నారు. వెనుకబడిన సత్యసాయి జిల్లాలో కీయా వంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పరిశ్రమ రావడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమే అన్నారు.అదే విధంగా పుట్టపర్తి నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమడగూరు మండలానికి ఉపాధి హామీ పథకం ద్వారా రూ.3 కోట్లతో నిధులు మంజూరు అయ్యాయని, ఇందులో 1 కోటి మంజూరు చెసినట్లు తెలిపారు.త్వరలో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.గ్రామానికి శ్మశానం,త్రాగునీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జగన్ పాలనలో ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితి
మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
జగన్ పాలనలో అన్ని రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి గత ఐదేళ్ల లో సాగిందన్నారు.జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల ఆస్తులను కొట్టేయాలని ప్లాన్ వేశాడని,అది ఎన్నికల్లో పూర్తిగా బెడిసి కొట్టి ప్రజలు వైకాపానీ తరిమి కొట్టారన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ యాక్ట్ రద్దు చేశారని,అదే విధంగా విజయవాడ వరద బాధితులను ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని మాజీమంత్రి పల్లె పిలుపునిచ్చారు. అనంతరం పూలకుంట్లపల్లి పంచాయతీ లో రూ.13 లక్షలతో సీసీ రోడ్లును ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రామనాథరెడ్డి,ఎంపిడిఓ మునెప్ప,పీఆర్ ఇంజనీర్ గుప్తా, సర్పంచులు, తెదేపా నాయకులు మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మెన్ కృష్ణమూర్తి,మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసులురెడ్డి,ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కాలే నాయక్,మాజీ సర్పంచ్ కాంతమ్మ ,రామనాయక్,కృష్ణారెడ్డి,రాజారెడ్డి,నంజప్ప,అధి కారులు,జన సేన,బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాలు పూలకుంట్లపల్లిలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. చిన్నారులకు అన్న ప్రయసం చేశారు.
$$$__________@@@__________$$$
విద్యతోనే ప్రతి ఒక్కరికీ సమాజంలో తగిన గుర్తింపు:-పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
క్రమశిక్షణతో కూడిన విద్య అలవర్చుకోండి:- ఎంపీ పార్థసారథి
చదువే అన్నింటికీ మూలం
మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
శ్రీసత్యసాయిజాల్లా,ఓడిచెరువు సెప్టెంబర్ 21(విజయస్వప్నం.నెట్)
విద్యతోనే ప్రతి ఒక్కరికీ సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు.
పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడిచెరువు మండల కేంద్రంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.కోటి 14 లక్షల 50 వేల తో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనాన్ని శనివారం పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి పాటు హిందూపురం ఎంపీ పార్థసారధి,మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి లు ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ....చదువుతోనే ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు.పేద విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు.ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.పేద విద్యార్థుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు.మంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని ఎంపీ పార్థసారథి విద్యార్థులకు పిలుపునిచ్చారు.ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం నిధులకు వెనుకాడకుండా వారి అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు.గత ప్రభుత్వంలో జగన్ నాడు..నేడు పథకం తీసుకొచ్చి రంగులు మార్పు తప్ప విద్యాభివృద్ధికి ఏ మాత్రం పాటు పడలేదని పేర్కొన్నారు.చదువు ఉంటేనే భవిష్యత్తులో ఎక్కడైనా రాణించవచ్చునని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.చదువే అన్నింటికీ మూలమన్నారు. ఎంత కష్టమైన తమ పిల్లలను బాగా చదివించుకోవాలని అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.విద్యాభివృద్ధికి తెదేపా కూటమి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందనీ,ప్రతి విద్యార్థి బాగా చదువుకొని మంచి ఉద్యోగం, ఉపాధి పొందాలని నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ పత్తి చంద్రశేఖర్,లాయర్ రాజశేఖర్,మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి,మండల కన్వీనర్ జయచంద్ర విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో డిఇఓ మీనాక్షి,మండల ఎంపిపి పర్వీన్ భాను,ఎంఈఓలు lరమణ,సురేష్ బాబు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం వరద బాదితుల సహాయార్థం విద్యార్థులతో పాటు పలువురు నాయకులు 5లక్షల రూపాయలు నగదును ఎమ్మెల్యేకి అందజేశారు.
$$$__________@@@__________$$$
వరద బాధితుల ఆర్థిక చేయూత
శ్రీప్రగతి విద్యానికేతన్ విద్యార్థుల సేవాగుణం
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు సెప్టెంబర్ 21(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలోని శ్రీ ప్రగతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ బృందం విరాళాలు సేకరించకుండ సొంతంగా రూ.7500 నగదును ఆమడగూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో శనివారం డిడి తీసి విజయవాడ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎం రిలీఫ్ ఫండ్)కు నగదును పంపినట్లు కరస్పాండెంట్ బి.విజయమ్మ,మంజునాథ తెలిపారు.వరద బాధితుల కోసం తమ వంతు సహకారం అందించిన విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులకు,పాఠశాల ఉపాధ్యాయ బృందానికి పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సేవా గుణాన్ని పలువురు అభినందించారు.
$$$__________@@@__________$$$
ఓడిచెరువులో వరద బాధితులకు విరాళాలు వెల్లువ
4 వ తరగతి విద్యార్థి చందన స్పందనతో కదిలిన టీడీపీ తమ్ముళ్లు
రూ.5 లక్షల రూపాయల విరాళాల నగదును పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ఎంపీ పార్థసారథి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కి అందజేత
శ్రీసత్యసాయిజాల్లా,ఓడిచెరువు,సెప్టెంబర్ 21(విజయస్వప్నం.నేట్)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేవ స్ఫూర్తితో పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపుతో ఓడిచెరువు మండల తెలుగు తమ్ముళ్లులో ఒక్కసారిగా కదలిక వచ్చింది.దీనికి మద్దతుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4వతరగతి విద్యార్థి చందన రూ.2000 విరాళాం ఇవ్వడంతో దీనికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆ చిన్నారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునివ్వడం తో ప్రజలు ఒక్కసారిగా వరద బాధితులను ఆడుకోవడానికి అనేక మంది ముందుకు కదిలిలారు.ఓడి చెరువు మండల కేంద్రంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి శనివారం జూనియర్ కళాశాల ప్రారంభించారు.మండలం జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి,,ఎంపీ బికే పార్ధసారధి,మాజీ మంత్రి పిలుపు మేరకు పలువురు తెదేపా నాయకులు, మకార్యకర్తలు,అభిమానులు విరాళాలు అందించడానికి స్పందించి సుమారు 5లక్షల రూపాయల నగదును విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతికి అందించారు.విరాళాలు అందించిన దాతలు ...మండల తెదేపా కన్వీనర్ జయచంద్ర :25వేలు,తంగేడు కుంట శ్రీనివాసులు,శేఖర్ 50వేలు,రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కాలే నాయక్ : 25వేలు,బోరు రమణ:50 వేలు,ఓడిచెరువు మండల డీలర్స్ అసోషియేషన్ 1లక్ష రూపాయలు,కొండకమర్ల పంచాయతీ గ్రామస్తులు అందించిన నగదు జాకీర్ ఆధ్వర్యంలో 45వేలు,మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి 10 వేలు,తుమ్మల మహబూబ్ బాషా 10వేలు,
జౌళి బాబా 10వేలు, బోడెద్దులపల్లి సోము 10వేలు,నల్లగుట్లపల్లి శ్రీనివాస్ నాయక్ 10వేలు,లాయర్ గౌతం 10వేలు,బోయపల్లి శివారెడ్డి10వేలు,చౌట కిష్టప్ప (తంగేడుకుంట)10వేలు,శివశంకర్ రెడ్డి(వంచిరెడ్డిపల్లి) 10వేలు,
డాక్టర్ జాకీర్ కొండక మర్ల 10వేలు,సున్నంపల్లి రంగారెడ్డి10వేలు,
బొడ్డు జయన్న 5వేలు,ఎద్దుల నరసిం రెడ్డి 5వేలు(మండల మాజీవైస్ ఎంపిపి )మాజీ సర్పంచ్ రామాంజీనాయక్ (తిప్పేపల్లి) 5వేలు,
సునీల్ (ఓడిచెరువు) 5వేలు,శ్రీరాములు (క్రాసింగ్) 5వేలు, నరసింహనాయుడు 5వేలు, షబ్బీర్(సప్లయర్) 5వేలు, తెదేపా మాజీ కన్వీనర్ రాజారెడ్డి 5వేలు,భాస్కర్ (తిప్పెపల్లి)5వేలు, టైలర్ నిజాం(ఒడిసి) 5వేలు,
బాలు(తంగేడు కుంట)5వేలు,
శ్రీనివాసులు(మిడ్డేమిల్స్) 5వేలు,కంచి సురేష్ (మామిళ్ళకుంట్లపల్లి)5వేలు,
చంద్రశేఖరరెడ్డి మనం పాత్రికేయుడు(వంచిరెడ్డీపల్లి) 5వేలు,ముద్దలపల్లి శ్రీనివాసులు (ఓడిసి స్కూల్ కమిటీ చైర్మన్)5వేలు,
శివారెడ్డి(డబురువారిపల్లి) 5వేలు,
బాబాసాహెబ్ పల్లి రామంజి 3వేలు,లక్ష్మీనరసు 2వేలు,గోవింద్ రెడ్డి 2వేలు,మస్తానమ్మ 2వేలు,అఖిల 3వేలు,చందన 2వేలు సేకరించిన విరాళాలు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కి అందజేశారు.
$$$__________@@@__________$$$
తుమ్మలకుంట్లపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సారధ్యంలో....
శ్రీసత్యసాయిజాల్లా ఓడిచెరువు సెప్టెంబర్ 21(విజయస్వప్నం.నెట్)
ఎన్డీయే కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఓడిచెరువు మండలంలోని తుమ్మలకుంట్లపల్లి పంచాయతీలో గ్రామంలో శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,జన సేన నాయకులు పత్తి చంద్రశేఖర్,బిజెపి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మాట్లాడుతూ పరిపాలన అనుభవం ఉన్న గొప్పవ్యక్తి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రజా పాలన ఏ విధంగా ఉంటుందో ఈ 100 రోజుల పాలన నిదర్శనం అన్నారు.అనంతరం ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి వాటి పరష్కారానికి తప్పక కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం గ్రామానికి మొదటి విడతగా మంజూరైన 8లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డితో కలిసి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ జయచంద్ర,మాజీ జెడ్పీ సభ్యులు పిట్టా ఓబుళరెడ్డి, సర్పంచ్ వేళమద్ది శ్రీదేవి,ఈఓఆర్డి రాజశేఖర్,ఏఈ రామసూరరెడ్డి,జేసీ దీపికా,ఏఓ ఇలియాజ్,వెలుగు ఏపిఎం రమణప్ప వివిధ శాఖల అధికారులు,తెదేపా నాయకులు,లాయర్ రాజశేఖర్,అంజనప్ప, కాలేనాయక్,చౌట కిష్టప్ప,వెంకటేష్ నాయుడు,మునినాయుడు,హారున్,గౌస్ ఫీరా,జనార్ధన్ రెడ్డి, వేణు,ఇర్ఫాన్,నర్సింహులు,బాబు,గంగాధర, చిన్నన్నయ్య,సాంభనాయుడు, సికిందర్,రవీ,శ్రీరామ్ నాయుడు, ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్ తదితర ఎన్డీయే కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
అక్రమ మట్టి తరలింపు పై విచారణ జరిపించాలి:-సిపిఐ డిమాండ్
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్ 21(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని ఇనగలూరు పంచాయతీ గాజుకుంటపల్లి గ్రామంలో 267 సర్వే నెంబర్లో ప్రభుత్వ గుట్ట పరంబోకులో ఎన్ ఎస్ పి ఆర్ సంస్థ ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించకుండ దాదాపుగా 60 ఎకరాల్లో మొత్తం మట్టిని అక్రమంగా రోడ్డుకు తరలించారని,కాంట్రాక్టర్లకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ కోట్ల రూపాయలు మిగిల్చుకున్నారని,దీనిపైన సమగ్ర విచారణ నిర్వహించాలని శనివారం సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు,మండల కార్యదర్శి చలపతినాయుడు,రైతు సంఘం నాయకులు పూల శ్రీనివాసులు,కార్యకర్తలతో కలిసి అక్రమ మట్టి తరలింపు ప్రాంతాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వేమయ్య మాట్లాడుతూ ఎన్ ఎస్ పి ఆర్ అనే సంస్థ గనుల శాఖకు వైయస్సార్ ప్రభుత్వంలో 2023లో రాయల్టీ 2 ఎకరాల విస్తీర్ణానికి రాయల్టీ కట్టిందని అది కూడా పూర్తిగా కాలపరిమితికి కట్టి దాదాపు 60 ఎకరాల విస్తీరంలో ఉన్నటువంటి గుట్ట మొత్తం తవ్వి నేషనల్ హైవే రోడ్డుకు తరలించారని,ఈ గుట్టలో పశువులకు మేతకు సంబంధించి అదేవిధంగా ఎన్నేళ్ళుగా సంరక్షించుకున్న వేపచెట్లు,పలవర చెట్లు,పెద్ద పెద్ద వృక్షాలను పెకిలించి వేశారని,దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.అక్రమం మట్టి తరలింపు అడ్డుకోవాలని, అక్రమ మట్టి తరలింపు చేసిన వారిపైన సమగ్ర విచారణ జరిపి ఎంత మేరకు అక్రమ మట్టి తరలించారో అంత మొత్తం కాంట్రాక్టర్ నుంచి ప్రభుత్వం వసూలు చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా అక్కడ మట్టి తరలింపు ఆపాలని లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రత్నబాయ్,గంగులప్పా, సుధాకర్,రవి,రామచంద్ర,రమణ,వెంకటరమణ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,సెప్టెంబర్ 22(విజయస్వప్నం.నెట్)
హెల్మెట్లు ధరించి రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ వెంకటనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రెవిన్యూ కార్యాలయం వద్ద ఎస్ఐ వెంకటనారాయణ వాహనాల తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.హెల్మెట్ లు తప్పక ధరించాలని,పరిమితికి మించి ప్రయాణికులు వాహనాల్లో తరలించరాదని,అతివేగం ప్రమాదకరమని మద్యం సేవించి వాహనాలలో నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.వాహనదారులకు హెల్మెట్ వాడకం పై అవగాహన కల్పించారు,మానవ జీవితం చాలా విలువైనదని,తొందర పాటు వలన నిర్లక్ష్యం పడవద్దని,ప్రయాణ సమయంలో కుటుంబం వుందని ఆలోచనతో ముందుకు వెళ్ళాలని,వాహనదారులకు సూచనలు సలహాలు ఇచ్చి,పలు వాహనాలకు రికార్డులు పరిశీలించి,రికార్డులు సరిగా లేని వాహనాలకు జరిమానా విధించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
బిజేపీ సభ్యత్వాల నమోదుకు విశేష స్పందన
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,సెప్టెంబర్22(విజయస్వఫ్నం.నెట్)
బీజేపీ ఆధ్వర్యంలో సభ్యత్త్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని కసముద్రం గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ లో నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరిస్తూ సభ్యత్వ నమోదు చేయించినట్లు తెలిపారు.బీజేపీ పార్టీపై గ్రామీణ ప్రాంతాల్లో విశేష స్పందన లభిస్తోందని,మహిళలలో ప్రధాని మోడీపై మంచి అభిప్రాయం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఇందుకూరి సురేంద్రారెడ్డి,కిసాన్ మోర్చారాష్ట్ర ఆర్గానిక్ కన్వీనర్ శరత్ కుమార్ రెడ్డి,తిప్పన్న,మస్తానప్ప, శివప్ప,బాబూసాబ్,శీనా, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఆశ్రమానికి అదనపు గది కేటాయించండి
వృద్ధాశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి వినతి
శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు) అమడగూరు,సెప్టెంబర్23(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని గాజులపల్లి కూడలి వద్ద నిర్వహిస్తున్న మాతృశ్రీ వృద్ధాశ్రమానికి అదనపు గదిని కేటాయించి ఆశ్రయం కల్పించాలని నిర్వాహకురాలు అరుణజ్యోతి ఎంపీడీవో మునియప్పకు సోమవారం వినతిపత్రం అందజేశారు.ఇప్పుడున్న ప్రభుత్వం నిర్మించిన భవనంలో అనుమతి తీసుకుని 20 మంది వృద్ధులకు సేవా దృక్పథంతో ఆశ్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.అయితే ఇదే భవనంలో మరొక గది అదనంగా ఉండడంతో ఆగదిలో సామాగ్రి నిల్వ కోసం వేరొకరు వాడుకుంటున్నారని,ఆశ్రమంలో ఉన్న వారికి స్థలం సరిపోకపోవడంతో వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారని కావున అధికారులు స్పందించి ఆశ్రమ నిర్మాణం అయ్యేంతవరకు ఇప్పుడున్న అదనపు గదిని తమకు ఉపయోగకరంగా ఉండడానికి వాడుకునేలా అనుమతులు ఇవ్వాల్సిందిగా మండల ఎంపీడీవో మునియప్పకి వినతిపత్రం అందజేశారు.ఎంపీడీవో మునియప్ప మాట్లాడుతూ ఆగదిని పరిశీలించి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని ఆశ్రమ నిర్వాహకురాలుకి భరోసా కల్పించారు.
$$$__________@@@__________$$$
చినగానిపల్లిలో పౌష్టికాహార మాసోత్సవం
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు, సెప్టెంబర్23(విజయస్వప్నం.నెట్)
మండలంలోని చినగానిపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణ మాసోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ గంగాదేవి హాజరై మాట్లాడుతూ.... అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే పౌష్టికాహారం తప్పనిసరిగా చిన్నారులకు అందించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని దీంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుండగలరని,ఆకుకూరలు,పండ్లు,కూరగాయలు,చిరుధాన్యాలతో ఆహారం పిల్లు తీసుకోవాలని సూచించారు.గర్భిణీ సమయంలో 6 నెలల పాటు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారం క్రమం తప్పకుండా ప్రతి రోజూ తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుండాలని, ఆరు నెలలు నిండిన శిశువు నుండి మూడేళ్ల వయసు వరకు బాలామృతం అందిస్తే చిన్నారుల ఎదుగుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు.వివిధ రకాల పోషకాల బాలామృతం ప్రతి రోజూ వంద గ్రాముల చొప్పున అందించాలని ఆమె సూచించారు.పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు.ఈకార్యక్రమంలో అంగన్వాడీ బోధకులు బి.క్రిష్ణమ్మ, పివీ. రమణమ్మ, డి.పద్మా, స్వర్ణమ్మ, మమత, చౌడమ్మ, సుశీల, అరుణ, సుమతి, ఆరోగ్య, స్రవంతి, శోభ, ఎంఎస్కే గంగాదేవి, బాలింతలు, గర్భిణులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
హిందూ దేవాలయాలను కాపాడే బాధ్యత మనందరిదీ
శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు) అమడగూరు,సెప్టెంబర్23(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలోని స్థానిక చౌడేశ్వరి కళ్యాణ మండపంలో సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఐక్యవేదిక సదస్సు నిర్వహించారు.ఈకార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అతి పవిత్ర దైవంగా కొలిచే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో గత ప్రభుత్వంలో అధికారులు కల్తీకి పాల్పడుతూ జంతువుల కొవ్వును,ఫిష్ ఆయిల్ ను, వినియోగించడంలో కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వీరిపై విచారణ జరిపి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ధర్మ ప్రచారకర్త శ్రీనివాస్ గుప్తా,ప్రఖండ కార్యదర్శి రమేష్, ఓం ప్రకాష్ స్వామి,మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం,ఉపాధ్యక్షులు అంజి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
అక్రమ మట్టి తరలింపు పై చర్యలు తీసుకోవాలి
-కలెక్టర్ కి సిపిఐ నాయకులు వినతి
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి, సెప్టెంబర్23(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండల పరిధిలోని ఇనగలూరు పంచాయతీ గాజుకుంటపల్లి గ్రామ పరిధిలో 267 సర్వే నెంబర్లు 60 ఎకరాల ప్రభుత్వ గుట్టలో 2023 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మట్టిని అక్రమ పద్ధతుల్లో నేషనల్ హైవే రోడ్డుకు గుత్తేదారులు తరలించారని,దీనిపైన సమగ్ర విచారణ నిర్వహించాలని సోమవారం మీకోసం సమస్యల పరిష్కార వేదికలో శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ కి వినతి పత్రం అందజేశారని సిపిఐ నాయకులు తెలిపారు.ప్రభుత్వానికి రావలసినటువంటి ఆదాయానికి గండి కొడుతూ ఎన్ఎస్పీఆర్ అనే సమస్థ ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ కట్టకుండా దాదాపు సంవత్సరం నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో గల మట్టిని అక్రమంగా రోడ్డుకు వినియోగించిందని,దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారన్నారు.కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు,మండల కార్యదర్శి చలపతినాయుడు, కార్యవర్గ సభ్యులు సుధాకర్,రవి తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.
$$$__________@@@__________$$$
రైతుల సూచన సలహాల కోసమే పొలం పిలుస్తోంది...
శ్రీసత్యసాయిజాల్లా ఓడిచెరువు/అమడగూరు, సెప్టెంబర్24(విజయస్వప్నం.నెట్)
రైతులు సాగుచేసిన పంటకు సంబంధించి సూచనలు సలహాలు అందించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు మండల వ్యవసాయ అధికారి ఇలియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని బాబాసాహెపల్లి మామిళ్ళకుంట్లపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బాబాసాహెపల్లలో రైతు టీ రంగారెడ్డి , మామిళ్ళకుంట్లపల్లిలో వై. రామస్వామి రెడ్డి లు సాగుచేసిన వేరుసెనగ పంటను పరిశీలించి రైతులకు తగిన సూచనలు సలహాలు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ వెంకటేష్, పట్టు పరిశ్రమ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ నాగేశ్వరయ్య, వీ ఏ ఏ శ్రావణి,లలితా బాయి, అంజినాయక్, ఎంపీఈఓ సరస్వతి, టిడిపి నాయకులు నిజాం పొగాకు షబ్బీర్ సౌదీ నాగరాజు రాష్ట్ర బీసీ సెల్ నాయకులు అంజినప్ప, సుధాకర్ రెడ్డి కంచి సురేష్, పీట్ల సుధాకర్, చికెన్ షాను, అంగడి భాష,తదితరులు పాల్గొన్నారు.
అమడగూరులో పొలం పిలుస్తోందిపై అవగాహన...
అమడగూరు మండలంలో సాగుచేసిన పంటకు సంబంధించి రైతులకు అవగాహన కల్పిస్తూ....సూచనలు సలహాలు అందించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు మండల వ్యవసాయ అధికారి వెంకటరమణాచారి పేర్కొన్నారు.మండలంలోని పేరంవాండ్లపల్లి గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి,ఏఓ రైతులు వేరుశనగ సాగుచేసిన పంటలను పరిశీలించి ఈసందర్భంగా రైతులకు సూచనలు సలహాలు అందించినట్లు తెలిపారు.ఏపిసిఎన్ఎఫ్,ఆర్ వైఎస్ఎస్ రవీంద్ర రెడ్డి,దామోదరరెడ్డిలు మాట్లాడుతూ....విత్తన శుద్ధి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు,రసాయన మందులు వాడటంతో భూ సాంద్రత క్షీణించి పంట దిగుబడి తగ్గుతుందని,పంటలలో వివిధ రకాల తెగుళ్ళలను, పురుగులు ఆశించకుండా వివిధ రకాల కషాయం ద్వారా నివారించే విధానం గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో విహెచ్ఏ పవన్ కళ్యాణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
విరబూసిన బ్రహ్మ కమలం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్ 24(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని వేమారెడ్డిపల్లి గ్రామానికి చెందిన టీవీ5 రిపోర్టర్ గోపీనాథ్ రెడ్డి స్వగృహంలో సోమవారం రాత్రి బ్రహ్మ కమలం విరబూసింది.దీంతో బ్రహ్మ కమలానికి గోపి నాథ్ రెడ్డి ప్రవీణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు వికసించిన బ్రహ్మకమలం వృక్షానికి పూజలు నిర్వహించారు.
$$$__________@@@__________$$$
విస్తృతంగా బిజేపీ సభ్యత్వాల నమోదు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్24(విజయస్వప్నం.నెట్)
మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బిజేపీ సభ్యత్వాల నమోదు విస్తృతంగా చేపడుతున్నట్లు బిజేపీ నాయకులు రంగారెడ్డి, డాక్టర్ హరికృష్ణ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పేర్కొన్నారు.బిజేపి సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో భాగంగా వారం రోజులుగా గ్రామాల్లో పర్యటించి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన పథకాలను, ఏపీలో చేపట్టిన అభివృద్ధిపై విసృతంగా ప్రచారం చేస్తూ....ప్రజలకు అవగాహన కల్పించి బిజేపి సభ్యత్వాల నమోదు చేస్తున్నారని,ప్రజల నుండి ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై విశేష స్పందన లభిస్తోందని, బిజేపీ బలోపేతానికి కృషి చేస్తామని వారు ఈసందర్భంగా తెలిపారు.కార్యక్రమంలో బిజేపీ జిల్లా కార్యదర్శి అశ్వర్ధప్ప,నాగన్న,బిజెవైయం కార్యదర్శి నరేష్,రమణారెడ్డి, నీలకంఠ రెడ్డి,రామిరెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
భజన కళాకారులతో ఇంటింటా హిందూ ధర్మ ప్రచారం
శ్రీసత్యసాయిజిల్లా(ఉమ్మడి అనంత జిల్లా) సెప్టెంబర్24(విజయస్వప్నం.నెట్)
జానపద వృత్తి కళాకారుల సంఘం,హిందూ ధర్మ ప్రచార భజన కళాకారులు సంయుక్తంగా ఇంటింటా ధర్మ ప్రచారం కార్యక్రమం మంగళవారం ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లి ఆర్డిటి కమ్యూనిటీ భవనంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిర్వహించినట్లు అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎం.నారాయణ తెలిపారు.దొరిగల్లు గ్రామం శ్రీఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి నాణెము,అక్షింతలు,పసుపు,కుంకుమ గోవిందా నామాల కరపత్రాలు రెండు భజన బృందాల సభ్యులకు అందించారని,సాయంత్రం ముదిగుబ్బ మండలం మంగళమడక గ్రామంలో జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు పులిమామిడి యాదగిరి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ధర్మ ప్రచారం నిర్వహించారన్నారు
ఈకార్యక్రమంలో జానపద వృత్తి కళాకారుల సంఘం ముదిగుబ్బ మండలం అధ్యక్షులు ఆంజనేయులు,కార్యదర్శి కిష్టప్ప,భగవద్గీత ప్రచారకులు గంగులప్ప,బుక్కపట్నం మండలం(అగ్రహారం) గురువులు శ్రీనివాసులు,ఉపాధ్యక్షులు శివారెడ్డి,రాము.శ్రీనివాసులు,మంగళమడక గ్రామ భజన బృందం సభ్యులు పాల్గొన్నారని తెలిపారు.
$$$__________@@@__________$$$
తిరుమల తిరుపతి విషయంపై ప్రధాని మోడీ నిర్ణయం అవసరం
ప్రధానికి లేఖ రాసిన స్టేట్ ఆర్గానిక్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్24(విజయస్వప్నం.నెట్)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి విశిష్టత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తమ జీవిత కాలంలో ఒకసారైనా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి హిందువు ఒక్క కోరిక అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో ప్రాంతీయ పార్టీలు తమ అవసరాల కోసం స్వామివారి సన్నిధి స్వామి వారి యొక్క ప్రసాదాన్ని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నాయనే భావన ప్రతి హిందువు నోట వ్యక్తం చేస్తున్నారని స్టేట్ ఆర్గానిక్ సెల్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి పేర్కొంటూ దేశ ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. యావత్ హిందూ సమాజం యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జాతీయస్థాయిలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం భారతదేశంలో ఉన్న 80 శాతం హిందువుల మనోభీష్ట మేరకు జాతీయస్థాయిలో దేవాలయాల పరిరక్షణ కోసం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రత్యక్షమైన బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రాంతీయ పార్టీలు తమ స్వార్థానికి రాజకీయ అవసరాల కోసం స్వామివారి సన్నిధి,స్వామి ప్రసాదాన్ని వాడుకోవడం హిందూ సమాజం జీర్ణించుకోలేక పోతుందని, సున్నితమైన విషయంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని దేశప్రజలందరూ కేంద్రం ప్రభుత్వం వైపు చూస్తున్నారన్నారు.సాధరణ సభ్యత్వాల నమోదు కోసం గ్రామీణ ప్రాంతాల్లో (బిజేపీ) నాయకులు పర్యటిస్తున్న సందర్భంలో ప్రజలు 500 ఏళ్ళుగా వివాదంలో వున్న అయోధ్య రామాలయం నిర్మాణం చేపట్టి ప్రధాని నరేంద్ర మోడీ చూపించిన చొరవ అధ్భుతంగా వుందని కొనియాడారని,తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో నరేంద్ర మోడీ మాత్రమే నిర్ణయం తీసుకొంటారని ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్నారు.మాకు ఎదురైన అనుభవాలను, ప్రజల అభిప్రాయాలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి ఉత్తరం ద్వారా తీసుకొస్తున్నారని ఆర్గానిక్ సెల్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
$$$__________@@@__________$$$
ఘనంగా దినదయల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు/అమడగూరు సెప్టెంబర్25(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో బుధవారం పండిట్ దినదయల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాం వద్ద మండల బిజేపీ అధ్యక్షులు రంగారెడ్డి ఆధ్వర్యంలో దినదయల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.దినదయల్ ఉపాధ్యాయ మార్గదర్శకుడని భారతీయ జనసంఘ్, ఆర్ఎస్ఎస్ లో తనదైన శైలిలో ముద్ర వేసారని,శ్యామ్ ముఖర్జీ మరణించిన తర్వాత పండిట్ దినదయల్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ సంస్థ అధ్యక్షుడిగా సేవలందించారని, పండిట్ దినదయల్ అత్యంత ఆథ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి అన్నారు. మానవతా వాదంతో ఎన్నో మార్పుల కోసం శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఆర్గానిక్ సెల్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి పేర్కొంటూ....నాటి జనసంఘ్ నేటి భారతీయ జనతా పార్టీగా అవతరించి, ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈకార్యక్రమంలో బిజేపీ జిల్లా నాయకులు డాక్టర్ హరికృష్ణ,కార్యవర్గ సభ్యులు అశ్వర్ధప్ప,బిజెవైయం కార్యదర్శి నరేష్, నాగన్న,సురేష్ ,వీరాంజీ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దినదయల్ కు ఘన నివాళులు
అమడగూరు మండల కేంద్రంలో బుధవారం బీజేపీ మండల అధ్యక్షులు ఇందుకూరి సురేంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారతమాత ముద్దుబిడ్డ,ఏకాత్మ మానవతా వాద సిద్ధాంతకర్త,అంత్యోదయ స్ఫూర్తిప్రధాత,భారతీయ జన్ సంఘ్,బీజేపీ మూలపురుషుడు శ్రీ పండిట్ దీనదయల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారు బోధించిన సిద్ధాంతాలను అనుసరిస్తూ,వారి అకుంఠిత కార్యదక్షత,దేశభక్తితో స్ఫూర్తి పొందుతూ వారికి మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళి అర్పించారని తెలిపారు.
ఈకార్యక్రమంలోఐ.రాము, గంగులప్ప,వెంకటనారాయణ,నారిసింహులు, తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
స్వచ్ఛతా హి సేవతోనే... సంపూర్ణ ఆరోగ్యం
శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు)అమడగూరు,సెప్టెంబర్25(విజయస్వప్నం.నెట్)
స్వచ్ఛత మీసేవ కార్యక్రమం ద్వారా అవగాహన కల్గివుండాలని, స్వచ్చతాహి సేవ తోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆర్డబ్ల్యూఎస్ మండల కోఆర్డినేటర్ ఆదినారాయణ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని చినగానపల్లి గ్రామపంచాయతీలో స్వచ్ఛతాహి సేవపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో హ్యాండ్ వాష్(చేతుల శుభ్రతపై)కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ ను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు.స్వచ్ఛభారత్ ను స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా స్వచ్ఛత మీసేవ కార్యక్రమం ద్వారా 15 రోజులు పాటు మండలంలోని అన్ని గ్రామాలలో పరిసర పరిశుభ్రత పాటించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. గ్రామాలలో ప్రజలు తమ ఇంటి పరిసరాలలో పరిశుభ్ర పాటించి స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యాన్ని సాధించాలన్నారు. అనంతరం టెలివిజన్ ద్వారా ప్రభుత్వం చేపట్టే స్వచ్ఛత మీ సేవపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర,సరస్వతి, పంచాయతీ కార్యదర్శి నరేంద్ర,ఆర్డబ్ల్యూఎస్ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు,వైద్య సిబ్బంది, ఆరోగ్య,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
తనకల్లు మండలం నూతన ఎసైగా కే.గోపి భాధ్యతలు
మర్యాదపరంగా కలిసిన ఎన్డీయే నాయకులు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)తనకల్లు సెప్టెంబర్25(విజయస్వప్నం.నెట్)
మండల పోలీసుస్టేషన్ లో మంగళవారం ఎస్ఐ కే.గోపినాథ్ నూతనంగా భాధ్యతలు చేపట్టారు.లేపాక్షి మండల పోలీసుస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోపిని తనకల్లు మండల పోలీసుస్టేషన్ కు బదిలీ ప్రక్రియలో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు నియమించగా ఆయన భాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. నూతనంగా భాధ్యతలు చేపట్టిన ఎస్ఐ కే.గోపిని పోలీసుస్టేషన్ లో తెదేపా జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణం,వాల్మీకి అధ్యక్షుడు అశోక్,తెలుగు యువత ప్రధాన కార్యదర్శులు పులి మహేష్,పులిబిడ్డ నరసింహులు,ఎస్టీ సెల్ నాయకులు రూప్లానాయక్, సోషల్ మీడియా కన్వీనర్ వేణు,దిలీప్,దాబా నారీ,ఎస్సీ సెల్ నాయకులు ఓబులేసు, జనసేన మండల ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, మైనార్టీ సెల్ నాయకులు అర్షద్ తదితర కూటమి నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
$$$__________@@@__________$$$
వికసించిన బ్రహ్మ కమలాలు
కమలాలకు మహిళలు ప్రత్యేక పూజలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,సెప్టెంబర్25(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలోని రెడ్డిస్ హోటల్ యజమాని అంజనమ్మ ఇంటి పెరటి తోటలో మంగళవారం రాత్రి బ్రహ్మ కమలాలు వికసించాయి.సాధారణంగా బ్రహ్మం కమలాలు రెండు లేదా మూడు పువ్వులు వికసించడం రివాజుగా వుంది.అయితే ఈ మొక్కకు 30 నుంచి 40 కమలాలు ఒకేసారి విరగపూయడంతో కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల మహిళలు అక్కడికి చేరుకుని బ్రహ్మకమలం మొక్కకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
$$$__________@@@__________$$$
స్వర్ణాంధ్ర 2047కు ప్రజా అభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్ ఎంపీడీవో మునియప్ప
శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు)అమడగూరు,సెప్టెంబర్26(విజయస్వప్నం.నెట్)
మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో గురువారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఎంపీడీవో మునియప్ప స్వర్ణాంధ్ర 2047 కు సంబంధించి క్యూ ఆర్ కోడ్ విడుదల చేశారు.ఆయన మాట్లాడుతూ ప్రతి మండల, మున్సిపాలిటీ నుంచి ఈరోజు నుండి శుక్రవారం పదివేల మందికి తగ్గకుండా ప్రజాభిప్రాయాలు తెలుసుకొనుటకు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి వాటిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావలసిన విలువైన సలహాలను పొందుపరచవచ్చునని,దీనికోసం అన్ని ప్రభుత్వా,మరియు ప్రైవేటు,బస్ స్టాండ్, పాఠశాలలు,ఆసుపత్రిల్లో క్యూ ఆర్ ఏర్పాట్లు చేశారని,అంతేకాకుండా సచివాలయ సిబ్బందికి విధులు కేటాయించి స్వర్ణాంధ్ర 2047 కి సంబంధించిన లక్ష్యాన్ని చేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన కోరారు.
$$$__________@@@__________$$$
ఎస్సీ కార్పొరేషన్ ట్రాక్టర్లు పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు)అమడగూరు,సెప్టెంబర్ 26(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ కల్పించి డ్రైనేజీ వ్యవస్థ కోసం,మంజూరు చేసిన ఎండి సిఎంసి ట్రాక్టర్ల వాహనాలను గురువారం జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారయ్య మండల కేంద్రంలో సందర్శించి వాహనాలు పరిశీలించారు.ఈ సందర్భంగా లబ్ధిదారుడు హనుమంతుని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.లబ్ధిదారులు మాట్లాడుతూ వాహనాలు మంజూరు చేసిన నాలుగు సంవత్సరాలు పూర్తయిన ఎటువంటి ఉపాధి కల్పించలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధి కల్పించాలని కోరారు.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారయ్య మాట్లాడుతూ మేనేజింగ్ డైరెక్టర్ కి ప్రతిపాదనలు పంపి ఉపాధి కల్పిస్తామని లబ్ధిదారునికి భరోసా కల్పించారు.
$$$__________@@@__________$$$
నూతనంగా ఆర్ఐ మున్వర్ బాష భాధ్యతలు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్26(విజయస్వప్నం.నెట్)
నూతనంగా నియామకంపై విచ్చేసిన ఆర్ఐ మున్వర్ బాష గురువారం భాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు.బదిలీల ప్రక్రియలో భాగంగా గాండ్లపెంట మండల ఆర్ఐగా విధులు నిర్వహిస్తు మండలానికి బదిలీపై విచ్చేసి భాధ్యతలు స్వీకరించారని తెలిపారు. నూతనంగా భాధ్యతలు చేపట్టిన ఆర్ఐ మున్వర్ బాషను రెవెన్యూ కార్యాలయం సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి పరిచయాలు చేసుకున్నారు.గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తానని విలేకరుల సమావేశంలో నూతనంగా భాధ్యతలు చేపట్టిన ఆర్ఐ మున్వర్ బాష పేర్కొన్నారు.గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఆర్ఐ నాగేంద్ర కదిరి సివిల్ సప్లై ఆర్ఐగా బదిలీపై వెళ్ళారు.
$$$__________@@@__________$$$
నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎంపిక
శ్రీసత్యసాయిజాల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్26(విజయస్వప్నం.నెట్)
మండల నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బుద్ధుల గోపీనాథ్ రెడ్డి,గౌరవ అధ్యక్షులుగా మోమిన్ ఫయాజ్,ప్రధాన కార్యదర్శిగా కొంచెపు శ్రీనివాసులులతో పాటు కార్యవర్గ సభ్యులుగా గుండ్లూరు బాబా,కత్తి ఆనంద్,కంచి రమణ,శ్రీకుర్తి నర్సింహులు (అయ్యప్ప),గౌరవ సలహాదారులు లక్ష్మన్న ను ఎన్నుకున్నారు.ముందుగా ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు చేసి ఏపీజే డబ్ల్యు జిల్లా కార్యవర్గ సభ్యులు ఖాజీ సాదిక్,వసంతం భుజంగరావు ఆధ్వర్యంలో నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు రంగప్ప,షాజహాన్,చంద్రశేఖర్ రెడ్డి,లక్ష్మన్న,టిన్ను మల్లికార్జునరెడ్డి,మండోజి ఆరీఫ్ ఖాన్,పచ్చార్ల ఆంజనేయులు నాయుడు, రంగారెడ్డి,మౌలాలి,మహబూబ్ బాషా,శంకర,జయ,అంజి, తదితర పత్రిక విలేకర్లు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
28వతేది గృహా నిర్మాణాలపై అవగాహన కల్పించాలి
హౌసింగ్ డీఈ
శ్రీసత్యసాయిజాల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్ 26(విజయస్వప్నం.నెట్)
మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జిల్లా హౌసింగ్ డీఈ వెంకటరమణారెడ్డి గురువారం సచివాలయ అసిస్టెంట్ ఇంజనీరులకు సమావేశం ఏర్పాటు చేసి మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈనెల 28వతేది మన ఇల్లు-మన గౌరవం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమంలో భాగంగా మంజూరైన కాలనీల లబ్దిదారులకు సమావేశం ఏర్పాటు చేసి గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అవగాహన కల్పించాలని సూచించారు.క్షేత్ర స్థాయిలో వివిధ దశల్లో గృహా నిర్మాణాల పనులు నిలిపేసిన లబ్దిదారుల పెండింగ్ బిల్లులు మంజూరు తదితర అంశాలపై హౌసింగ్ డీఈ సమీక్షించినట్లు ఏఈ నాగభూషణం
$$$__________@@@__________$$$
తెలుగుయువత అధ్యక్షుడి తల్లిని పరామర్శించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
శ్రీసత్యసాయిజాల్లా,ఓడిచెరువు,సెప్టెంబర్27(విజయస్వప్నంనెట్)
మండల పరిధిలోని మల్లాపల్లి గ్రామానికి చెందిన పుట్టపర్తి నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఓబుళరెడ్డి మాతృమూర్తి పద్మావతి అనారోగ్యంతో బాధపడుతూ అనంతపురం దివ్యశ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించినట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.ధైర్యంగా ఉండాలని,త్వరగా కోలుకోవాలని మాజీమంత్రి పల్లె ఆమెకు ధైర్యం చెప్పారు.ఆమెకు అందిస్తున్న చికిత్సను,ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు రామమోహన్ ను మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అడిగి తెలుసుకున్నారని,అక్కడే ఉన్న నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఓబుల్ రెడ్డికి ధైర్యం చెప్పి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారని తెలిపారు.
$$$__________@@@__________$$$
నేడు లబ్దిదారులతో మన ఇల్లు-మన గౌరవం
అమడగూరు,జనసేన న్యూస్, సెప్టెంబర్27
మండలంలోని అమడగూరు,కొలిమిరాళ్లపల్లి లేఅవుట్ గృహాలు మంజూరైన లబ్దిదారులకు,వివిధ దశల్లో పూర్తి చేయని వారు,సొంత స్థలం ఉండి ప్రభుత్వ ఇల్లు కేటాయించిన లబ్ధిదారులతో నేడు శనివారం అమడగూరు లే అవుట్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఇల్లు మన గౌరవం సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించే కార్యక్రమంలో లబ్దిదారులు పాల్గొని ఏమైనా సందేహాలు ఉంటే తెలియజేయాలని,ఈకార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి,మండల రెవెన్యూ అధికారి,మండల స్థాయి అధికారులు,హౌసింగ్ సిబ్బంది సచివాలయ సిబ్బంది,ప్రజా ప్రతినిధులు హాజరై సమస్యలు పరిష్కరిస్తారని,గతంలో మంజూరై పూర్తి కాని ఇళ్లకు బిల్లులు మంజూరు కాలేదన్న అపోహతో చాలామంది లబ్ధిదారులు ఇప్పటివరకు నిర్మాణాలు పూర్తి చేయలేదని,కావున అటువంటి లబ్ధిదారులు అందరూ తప్పకుండా సమావేశమునకు హాజరై హౌసింగ్ సిబ్బంది వారి ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలని హౌసింగ్ ఏఈ సుదర్శన్ యాదవ్ ఈసందర్భంగా తెలిపారు.
$$$__________@@@__________$$$
బీసీ హాస్టల్ వార్డెన్ ను వెంటనే సస్పెండ్ చేయాలి
శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు, సెప్టెంబర్27(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలోని అల్లాపల్లి పంచాయతీ గౌనిపల్లి గ్రామ సమీపంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహంలో(బిసీ హాస్టల్)సదుపాయాలు బాగోలేవని శుక్రవారం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ వార్డెన్ వైఖరిపై నిరసన తెలిపారు.విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్ వార్డెన్ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం, కోడిగుడ్లు అందించలేదని,నీళ్ల మజ్జిగ, చిన్న చిక్కిళ్ళు,త్రాగడానికి మంచి నీరు లేవని,డ్రైనేజ్ నిండిపోయి దుర్గంధంతో జ్వరాలతో బాధపడుతున్నారని,ఇదివరకే పై అధికారులకు సమస్యలు వివరించారని,అయినా కూడా ప్రయోజనం లేదని,వార్డన్ సక్రమంగా విధులు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని,ఇప్పటికైనా వసతి గృహంలో నిర్లక్ష్యం వహిస్తున్న వార్డెన్ పై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని,సమస్యలు తీర్చలేని పక్షంలో రోడ్డుపై ధర్నా చేస్తామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
$$$__________@@@__________$$$
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని సిపిఎం వినతి
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్27(విజయస్వప్నం.నెట్)
గత 15 ఏళ్ళుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం డిప్యూటీ తహశీల్దార్ జాకిర్ హుస్సేన్ కు సిపిఎం నాయకులు రమణ,శ్రీరాములు కుళ్ళాయప్ప రైతులతో కలిసి వినతిపత్రం అందించినట్లు తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విపత్తు సంభవించడం, సకాలంలో వర్షాలు కురవపోవడంతో వరుసగా 15 ఏళ్ళుగా రైతులు పంటలు పడకపోవడంతో తీవ్రంగా పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.రైతులకు పెట్టుబడి కింద 20 వేలు సాయం ఇవ్వాలని, వ్యవసాయ మోటార్లకి మీటర్ల జివో 22 రద్దు చేయాలని, ఖరీఫ్ సీజన్లో తుఫాన్లతో నష్టపోయిన పంటల బీమా పరిహారం అందించాలని, సమగ్ర ఉచిత పంటల బీమా ఆమలు చేయాలని, సాగునీటి ప్రాజెక్టుల నిధులు కేటాయించి పూర్తి చేయాలని,వాస్తవ సాగు రైతులకు గుర్తింపు కార్డులు అందించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహశీల్దార్ కి వినతిపత్రాన్ని అందజేశారన్నారు.
$$$__________@@@__________$$$
నేడు పల్లవి మండల మహిళా సమాఖ్య 21వ వార్షికోత్సవం
మండల కేంద్రంలోని డిఆర్ డిఏ వెలుగు - పల్లవి మండల సమాఖ్య 21వ వార్షిక సర్వసభ్య సమావేశం నేడు శనివారం ఉదయము 10 గంటలకు స్థానిక పల్లవి మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించుటకు పల్లవి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అధ్యక్షతన,ఏపీఎం రమణప్ప ఆధ్వర్యంలో నిర్వహిస్తారని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు కావాలని శుక్రవారం ఓప్రకటనలో పిలుపునిచ్చారు.
$$$__________@@@__________$$$
ఘనంగా పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించాలి
శ్రీసత్యసాయిజాల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్27(విజయస్వప్నం.నెట్)
మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడి కేంద్రాల్లో ఘనంగా పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయకుమారి పేర్కొన్నారు.శుక్రవారం అంగన్వాడీ భోధకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడుతూ.... సెప్టెంబర్ ఒకటవతేది నుండి నెలాఖరు వరకు పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలో బాలింతలకు,గర్భిణీలకు సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. బాలింతలు,గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యం కోసం తీసుకోవలసిన ఆహారపు జాగ్రత్తలు,వ్యక్తిగత శుభ్రత, అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న చిరుధాన్యాలు పప్పు దినుసులు గురించి అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోనేందుకు గ్రామాల్లో ఘనంగా పౌష్టికాహార మాసోత్సవాల ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఈకార్యక్రమంలో అంగన్వాడీ బోధకులు కళావతి, ఆశిర్వాదమ్మ, రహమతున్నీషా, అఖిల, విజయమ్మ, అలివేరలమ్మ, జయమ్మ, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
సీనియర్ జర్నలిస్ట్ తోళ్ళ నరసింహులు మృతి
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్27(విజయస్వప్నం.నెట్)
సీనియర్ జర్నలిస్ట్ తోళ్ళ నరసింహులు(55) ఆనారోగ్యంతో గత మూడు నెలలుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.ఓడిచెరువు మండల కేంద్రంలో వుంటూ 15 ఏళ్ళు వార్తా పత్రికలో విలేకరిగా,స్వంత పత్రిక గ్రామసేవ ఎడిటర్ గా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళేవారని, రాజకీయ రంగంలో సేవలు అందించారని,స్వచ్ఛంద సంస్థలు,ప్రజా సంఘాల కార్యక్రమాల్లో పాల్గొని మన్ననలు పొందారన్నారు.అందరితో సన్నిహితంగా వుంటూ మంచి పేరు తెచ్చుకున్న తోళ్ళ నరసింహులు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని పలువురు ప్రజాప్రతినిధులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.తోళ్ళ నరసింహులు మృతి పట్ల మండల పాత్రికేయులు సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు.నరసింహులు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పాత్రికేయులు కోరారు.అమడగూరు మండలంలోని స్వగ్రామం మహ్మదాబాద్ లో శనివారం ఉదయం తోళ్ళ నరసింహులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి