google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : గణపతి పప్పా మోరియా ఘనంగా గ్రామాల్లో గణేష్ నిమజ్జనం - జగన్ నిర్వాకం వల్లనే విజయవాడ నీట మునక :ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి - ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ రాష్ట్ర ఛైర్మన్ గా డాక్టర్ అక్కమ్మగారి సూర్యనారాయణ - ఏ తల్లీ జన్మనిస్తూ మరణించకూడదు-ఏ బిడ్డా జన్మిస్తూ మరణించకూడదు

12, సెప్టెంబర్ 2024, గురువారం

గణపతి పప్పా మోరియా ఘనంగా గ్రామాల్లో గణేష్ నిమజ్జనం - జగన్ నిర్వాకం వల్లనే విజయవాడ నీట మునక :ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి - ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ రాష్ట్ర ఛైర్మన్ గా డాక్టర్ అక్కమ్మగారి సూర్యనారాయణ - ఏ తల్లీ జన్మనిస్తూ మరణించకూడదు-ఏ బిడ్డా జన్మిస్తూ మరణించకూడదు

శ్రీఖాద్రీ సన్నిధిలో వరలక్ష్మి వ్రతం


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి ఆగష్టు30(విజయస్వప్నం.నెట్)

శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తిశ్రద్ధలతో సాముహిక వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు.ఆలయంలోని కళ్యాణమండపం వేదికపై అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ ప్రధాన అర్చకులు పార్ధసారధి ఆచార్యులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.ఆలయ ఈవో శ్రీనివాసులురెడ్డి,ఆలయ సిబ్బంది, పెద్దసంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

పల్లె ఉమా గొప్ప దార్శనీకురాలు మాతృమూర్తి పల్లె ఉమాకు ఘన నివాళులు అర్పించిన పల్లె కుటుంబ సభ్యులు.

రక్తదానం, అన్నదానం,వస్త్రదానం చేసిన పల్లె కుటుంబ సభ్యులు

పల్లె ఉమా వర్ధంతికి భారీగా విచ్చేసిన అభిమానులు.         

పల్లె కుటుంబానికి ఆమె ఆశీస్సులే శ్రీరామ రక్ష


శ్రీసత్యసాయిజిల్లా (అనంతపురం)పుట్టపర్తి, ఆగష్టు30(విజయస్వప్నం.నెట్)

ఒక సామాన్య గృహిణిగా జీవితం ప్రారంభించిన పల్లె ఉమా బాలాజీ విద్యా సంస్థల అధినేతగా,రాజకీయరంగంగా, సంఘసేవకురాలుగా,భర్త మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డికి చేదోడు వాదోడుగా పల్లె ఉమా ఆదర్శ గృహిణిగా నిలిచారు.స్ఫూర్తి దాత పల్లె ఉమా అని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కొనియాడారు.శుక్రవారం అనంతపురం సమీపంలోని ప్రసన్నపల్లి పంచాయతీ పరిధిలో పల్లె వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన పల్లె ఉమా ఘాటు వద్ద మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితోపాటు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,పివికే కళాశాల చైర్మన్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి,మనుమరాలు వన్స్, మనుమడు వియాన్ తో పాటు పల్లె వియ్యంకుడు కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు,పల్లె రఘునాథరెడ్డి సోదర కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు తదితరులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ....పల్లె ఉమా ఆదర్శ గృహిణిగా,గొప్ప దార్శనీకురాలుగా ఎంతో మంది విద్యార్థులకు విద్య అవకాశం,ఎంతో మందికి ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకున్నారన్నారు.ఆమె విద్యారంగమే కాకుండా రాజకీయ రంగంలో కూడా అనేక ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు,ఎంపీపీలు,జడ్పిటిసి,ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థుల విజయానికి ఎంతో కృషి  చేశారు.సమైక్యాంధ్ర ఉద్యమంలో భర్త పల్లె రఘునాథ్ రెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో అతని భార్య పల్లె ఉమా ఆ దీక్షను కొనసాగించి అందరికీ సూర్తిగా నిలిచారు.ఎంతో మంది పేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు వస్త్ర దానం,అన్నదానం చేసి సేవకురాలిగా నిలిచారు.అదే బాటలో పల్లె కుటుంబ సభ్యులు పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముందుకు నడుస్తున్నారు.పల్లె ఉమా అశయ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఏటా పల్లె ఉమా ట్రస్టు సహకారంతో పేదలకు సేవ కార్యక్రమాలు చేపడతామన్నారు.వీరి ఆశయాలకు చేదోడు వాదోడుగా తాము వెన్నంటి   ఉంటామని వియ్యంకుడు కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డి దంపతులు సౌభాగ్యరాణి లు, పల్లె సోదరులు పల్లె రామకృష్ణారెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు,ఇతర కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాదిమంది పల్లె అభిమానులు తెదేపా,జనసేన బిజెపి నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఈ వర్థంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో సుమారు 40 మంది రక్తదానం చేశారు.అక్కడికి విచ్చేసిన ప్రజలకు అన్నదానం నిర్వహించారు.సుమారు 500 మందికి పైగా పేదలకు ఉచితంగా నూతన వస్త్రాలు ,సరుకులు పంపిణీ చేశారు.

$$$__________@@@__________$$$

రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీలు, వినియోగదారుల రక్షణ కమిటీలు ఏర్పాటు చేయండి

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి,ఆగష్టు30(విజయస్వప్నం.నెట్)

దేవాలయ కమిటీలలో వినియోగదారుల సంఘాల సభ్యులకు అవకాశం కల్పించాలని పౌరసరఫరా శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ కోరినట్లు విజయస్వప్నం.నెట్ విలేకరికి తెలిపారు.

పుట్టపర్తి (ఆగస్టు 28) రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీలు మరియు వినియోగదారుల రక్షణ కమిటీలు ఏర్పాటు చేయండని రాష్ట్ర పౌరసత్వ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని  కోరినట్లు తెలిపారు.గత బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రిని కలసి మెమొండము ఇచ్చి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో వినియోగదారుల రక్షణ కమిటీలు గాని విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయలేదని అందువల్ల సరైన సేవలు వినియోగదారులకు అందలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అంతేకాక రాష్ట్రస్థాయి దేవాలయ కమిటీలలో వినియోగదారుల సంఘాల నాయకులకు సభ్యులుగా సంకల్పించాలని తద్వారా భక్తులకు మరియు వినియోగదారులకు సరైన సేవలు అందించేందుకు వీలవుతుందని మంత్రిని కోరారని,అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

$$$__________@@@__________$$$

పౌర హక్కులపైన అవగాహన కల్గివుండాలి

జిల్లా ఎస్పి రత్న 


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు  ఆగష్టు31(విజయస్వప్నం.నెట్)

మండలంలోని తుమ్మల పంచాయతీ మలకవారిపల్లి ఎగువతండాలో శనివారం  సివిల్ రైట్స్ డే  సందర్భంగా రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా పౌరహక్కులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయగా, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ముఖ్య అతిథిగా హాజరై అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజనులపైన ఇతర కులాల వారు ఎవరైనా వారిని కించపరిచి మాట్లాడిన వారికి భంగం కలిగించిన విధంగా చర్యలు చేపడితే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రజల ప్రాథమిక అవగాహన సదస్సు కల్పిస్తూ గిరిజనులువారు అభివృద్ధి ఎలా చెందాలని కొన్ని సందర్భాలలో వారికి న్యాయం జరగని సమయంలో ఆయా శాఖల అధికారుల వద్ద ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఎస్పీ అవగాహన కల్పించారు. ముఖ్యంగా సమాజంలో పౌరహక్కులపై అవగాహన కల్గివుండాలని ఆమె సూచించారు.ఈకార్యక్రమంలో నల్లమాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి, తహశీల్దార్ రామనాథరెడ్డి,ఎంపీడీవో మునియప్ప,సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి,రాష్ట్ర ఎస్టీ అధికార ప్రతినిధి కాలే నాయక్, ఎస్ఐ వెంకటనారాయణ,పోలీస్ సిబ్బంది మలకవారిపల్లి తండావాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

       పోలీసుస్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ అమడగూరు మండల పోలీసుస్టేషన్ ను జిల్లా ఎస్పీ రత్న శనివారం తనిఖీ చేసారు.రికార్డులు, స్టేషన్లో గదులు పరిశీలించి,పరిసరాల్లో మొక్కులు నాటి,పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.విధుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవాలు అందించాలని సలహాలు సూచనలిచ్చారు. చెక్ పోస్ట్ సరిహద్దుల్లో నిరంతరం నిఘా వుంచి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.

$$$__________@@@__________$$$

ఎస్పీ రత్నను కలిసిన

మహిళా పోలీస్ సంఘం ప్రతినిధి భవాని

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు ఆగస్టు31(విజయస్వప్నం.నెట్) 

శ్రీసత్యసాయిజిల్లా ఎస్పీ రత్నను మహిళా పోలీసుల సంఘం రాయలసీమ జిల్లాల అధ్యక్షురాలు అమడగూరు మండలానికి చెందిన భవాని మర్యాదపూర్వకంగా కలిశారు.అమడగూరు మండల పర్యటనకు శనివారం విచ్చేసిన ఎస్పీని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆమె మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారని,వినాయక చవితి సందర్బంగా గణేశ మండపాల ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారని,కర్ణాటక సరిహద్దు మండలం కావడంతో గంజాయి,నాటుసారా,చీప్ లిక్కర్ అక్రమ రవాణా జరగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారని తెలిపారు.

$$$__________@@@__________$$$

వైభవంగా శ్రీకృష్ణుడి ఉత్సవ ఊరేగింపు


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగస్టు31(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో శనివారం ఉంట్లవారిపల్లి గ్రామానికి చెందిన ప్రబోధ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని ప్రతిమకు వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక వాహనంలో పురవీధుల్లో  శ్రీకృష్ణుడి నామస్మరణతో ఉత్సవ ఊరేగింపు భక్తిశ్రద్ధలతో నిర్వహించి, అన్నదానం కార్యక్రమం,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, శ్రీకృష్ణుని గీతామృతం బోధనలు పఠించారు.

$$$__________@@@__________$$$

కనుమ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగస్టు31(విజయస్వప్నం.నెట్)

మండలంలోని నందివారిపల్లి సమీపంలో వెలసిన కనుమ ఆంజనేయస్వామి ఆలయంలో ఆఖరి శ్రావణ శనివారం సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామి విగ్రహానికి వివిధ పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి నీరాజనాలు అందించి, వందలాది భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నప్రసాదాలు అందించారు. చెక్కభజన, కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు, సభ్యులు తెలిపారు.

$$$__________@@@__________$$$

నల్లమాడ సిఐగా వై నరేంద్ర రెడ్డి

ఎమ్మెల్యే, 

మాజీమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన సిఐ

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి,ఆగష్టు31(విజయస్వప్నం.నెట్)

నల్లమాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వై.నరేంద్ర రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ  పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చం అందించారు.గతంలో ఇక్కడ సిఐగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర యాదవ్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో వై.నరేంద్ర రెడ్డిని నల్లమాడ సిఐగా డీఐజీ నియమించారు.

$$$__________@@@__________$$$

ప్రతి నెల ఒకటో తేదీన ఠంచన్ గా పింఛన్ల పంపిణీ.      

 ప్రతి అవ్వ తాత మొహాల్లో అనందం కనబడుతోంది 

పుట్టపర్తి నియోజకవర్గంలో  ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పింఛన్ల పంపిణీ



శ్రీసత్యసాయిజిల్లా, నల్లమాడ /ఓడి చెరువు/ఆమడగూరు(పుట్టపర్తి) ఆగష్టు 31(విజయస్వప్నం.నెట్)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు ప్రతి నెల 1న  పంపిణీ చేసే సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలా సాగింది. నల్లమాడ మండలం ఎర్రవంకపల్లి పంచాయతీలో చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై వృద్దులకు,వితంతు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు.ఎమ్మెల్యే తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ....ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొందన్నారు. ప్రతి నెల 1న ప్రభుత్వం సామాజిక పింఛన్లు ఠంచన్ గా పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి దార్శనికుడు పాలకుడైతే పరిపాలన ఇలాగే ఉంటుందని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకటవ తారీఖు రాక ముందే పింఛన్ పంపిణీ చేయడంతో అవ్వ,తాతల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోందన్నారు.అంతేకాకుండా ప్రతి గ్రామంలో సిసి రోడ్లు దశలవారీగా నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.అన్ని పంచాయతీల్లో ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించి ఆదుకుంటామన్నారు అంతే కాకుండా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను దశల వారీగా అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి  మాట్లాడుతూ.... చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాట ఇస్తే నిలుపుకునే ప్రభుత్వమని జగన్ లా మడమ తిప్పే ప్రభుత్వం కాదన్నారు.తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే  పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని తొలిగా చేపట్టిందన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత టిడిపి కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. యర్రవంకపల్లి లో దుండగులు పగులగొట్టిన హెల్త్ కేంద్రాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు పరిశీలించారు.అక్కడి నుంచి నల్లమాడ మండలంలోని వెళ్ళమద్ది ఎస్టీ కాలనీ,రెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో,నల్లసింగయ్య గారి పల్లి బీసీ కాలనీ, మూలప్ప గారి పల్లి, దోన్ని కోట పులగంపల్లి గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు.  తర్వాత ఓడి చెరువు మండలం గాజుకుంటపల్లి వెంకటాపురం,నల్లగుట్లపల్లి గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేశారు.అలాగే అమడగూరు మండలం మలకవారిపల్లి తండా,తుమ్మల,కొట్టువారిపల్లి గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే  పల్లె సింధూర రెడ్డి తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ,ఆయా మండలాల టీడీపీ కన్వీనర్లు ,స్థానిక టిడిపి, జనసేన,బిజెపి,ప్రజా ప్రతినిధులు,ఎంపిడిఓ లు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

నేడు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు శెలవు

-జిల్లా కలెక్టర్ 

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి,సెప్టెంబర్01(విజయస్వప్నం.నెట్)

సెప్టెంబర్ 2వ తేది సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని,జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలకు,ప్రభుత్వ శెలవు దినముగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలల్లో కూడా నిర్వహించకూడదని విధిగా సెలవును అమలు చేయాలని ఆయన కోరారు.

$$$__________@@@__________$$$

వినాయక మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి 

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు, సెప్టెంబర్01(విజయస్వప్నం.నెట్)

మండల వ్యాప్తంగా వినాయకచవితి పండుగ సందర్భంగా వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ వెంకటనారాయణ తెలిపారు.శనివారం విలేకరుల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ.... ఉత్సవ కమిటీ నిర్వాహకులు వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మండపాలు ఏర్పాటు కోసం సెల్ ఫోన్ ద్వారా లేదా కంప్యూటర్లు,ల్యాప్ ట్యాప్ ద్వారా పోలీస్ వారికి అనుమతి కోరుతూ వినతిపత్రం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని అనంతరం పోలీస్ శాఖ అందించే సూచనలు, నిభందనల మేరకు నిమజ్జనం కోసం కేటాయించిన సమయం, రూట్ మ్యాప్ ప్రకారం ఉత్సవ కమిటీ నిర్వాహకులు వినాయకుడి విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు.

$$$__________@@@__________$$$

ఓపిఎస్ మాత్రమే... సిపిఎస్, యూపీఎస్ వద్దు

- డిటిఎఫ్


శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు(కదిరి)

సెప్టెంబర్ 1వ తేదీ ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాల్లో చీకటి రోజు అని ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) నే అమలు చేయాలని,ఇతర ఏ స్కీములూ వద్దని డిటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గౌస్ లాజమ్ డిమాండ్ చేశారు.మండల కేంద్రంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యూని ఫైడ్ పెన్షన్ స్కీం (యుపీఎస్)ను దేశవ్యాప్తంగా అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. యూపీఎస్ అమలు వల్ల ప్రభుత్వ ఉద్యోగ,ఉపా ధ్యాయులకు అదనంగా ఎలాంటి ప్రయోజనమూ లేదని విమర్శించారు.సీపీఎస్, జీపీఎస్ లను ప్రభుత్వం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి నర్సింహులు.యన్.సి, సోమశేఖర్ నాయక్,వెంకటచలమయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 కదిరిలో ఏపీటిఎఫ్ 1938 ఆధ్వర్యంలో....    

సెప్టెంబర్1వ తేదీని దుర్మార్గమైన సిపిఎస్ అమలు విద్రోహ దినంగా పాటించిందని, ఓపీఎస్ ను పునరుద్ధరించాలని ఆదివారం కదిరి పట్టణంలో ఏపీటిఎఫ్ 1938, ఏపీటిఎఫ్ నాయకులు వేర్వేరుగా ఆర్ అండ్ బి బంగ్లా నుండి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు హరిప్రసాద్ రెడ్డి,సురేంద్ర, చింతా శ్రీనివాసులు, నర్సిరెడ్డి, సోమశేఖర్, వెంకటేష్ బాబు, రాంమోహన్, రమణారెడ్డి, ఆదిబయన్న మాట్లాడుతూ సిపిఎస్ విద్రోహానికి 20 ఏళ్లు పూర్తయిందని ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారడానికి పెన్షన్ బిక్ష కాదు--ఉద్యోగుల హక్కు అని వారు నినదించారు.ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లు చేశారు. 

సీపిఎస్, జీపీఎస్, యూపీఎస్ ఏమిటి ఈ మాయా పెన్షన్ స్కీములు పథకం ఏదైనా ఉద్యోగ ఉపాధ్యాయుల సామాజిక భద్రత దూరం చేసేవే వాటిని అంగీకరించమని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తప్ప మరో ప్రత్యామ్నాయం ఒప్పుకోమని, ఓపీఎస్ అమలు అయ్యేదాకా సెప్టెంబర్ 1 వతేదీని ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాల్లో చీకటి రోజుగా విద్రోహ దినంగానే పాటిస్తామన్నారు.

$$$__________@@@__________$$$

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్02(విజయస్వప్నం.నెట్)

మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ చిన్న కుళ్లాయప్ప నాయక్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.మండల పరిధిలోని దిగువపల్లి,కుసుమవారిపల్లి గ్రామాలలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే,వైద్య శిబిరాలను సందర్శించి కార్యక్రమ నిర్వహణను సమీక్షించారు.కాలానుగుణంగా వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధులు మలేరియా,డెంగ్యూ,చికెన్ గున్యా,మెదడువాపు, బోదకాలు,డయేరియా వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని,వ్యాధులు వ్యాప్తి చెందక మునిపే ఆరోగ్య అంశాల పట్ల అవగాహన కలిగి వుండి నివారణ చర్యలకు ఉపక్రమించాలని సూచించారు.ఇటీవల వాతావరణంలోని మార్పుల వల్ల విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన డయేరియా,డెంగ్యూ వ్యాధులు అధిక సంఖ్యలో ప్రబలే అవకాశం ఉన్నదని ప్రజలు ముందు జాగ్రత్తలతో,సిబ్బంది అప్రమత్తతతో  ఉండాలని సూచించారు మ.వైద్య శిబిరానికి హాజరైన ప్రజలకు, సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించారు. హాజరైన 64 మంది రోగులకు అవసర చికిత్సలు,ఉచిత మందుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు భాను ప్రకాష్,కమల్ రోహిత్, జిల్లా కేంద్ర వైద్య ప్రతినిధులు ఉప మలేరియా అధికారి లక్ష్మీ నాయక్,వెంకటేశ్వర్లు,సబ్ యూనిట్ అధికారి దేవ్లా నాయక్,శశిధర్,పంచాయతీ రాజ్ సిబ్బంధి,ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య ,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఘనంగా వైఎస్ఆర్ వర్థంతి వేడుకలు

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్02(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో మండల వైకాపా శ్రేణులు సోమవారం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి,పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసారని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అని,ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని పేర్కొన్నారు.కొండకమర్లలో సొసైటీ అధ్యక్షులు ఎద్దుల రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొని వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ పర్వీన్ భాను, జెడ్పీ సభ్యులు కుర్లి దామోదర రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాసులురెడ్డి,పట్టణ కన్వీనర్ కోళ్ళ కృష్ణారెడ్డి,సర్పంచులు ముద్దల గోవిందు,రామచంద్ర,చిట్వేల్ బాబా,బోయపాటి జగన్మోహన్ చౌదరి,తొట్లి రంగారెడ్డి,షామీర్ బాషా,ఓడిచెరువు గ్రామ కమిటీ అధ్యక్షుడు మండోజీ ఆసీఫ్,ఎంపీటీసీలు,వైకాపా నాయకులు కార్యకర్తలు మధు, సూర్యనారాయణరెడ్డి,లక్ష్మీ రెడ్డి,నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఎంబి క్రాస్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు



శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్02(విజయస్వప్నం.నెట్)

మండలంలోని ఎంబి క్రాస్ గ్రామ జనసేన,తెదేపా,బిజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చిత్రం ఏర్పాటు చేసి భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు,తెదేపా,జనసేన బిజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

 అమడగూరులో జనసేనికుల ఆధ్వర్యంలో....

శ్రీసత్యసాయిజిల్లా, ఆమడగూరు మండల కేంద్రంలో 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కూటమి నాయకుల సమ్మేళనంతో జన సైనికులు స్ధానిక బస్టాండ్ ప్రాంతం  సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జనసేన మండల కన్వీనర్ నరేష్,బిజెపి కార్యదర్శి మేకల శ్రీనివాసులు,పసుపులేటి రమేష్ బాబు, హాజరయ్యారు.ముందుగా జనసేన కన్వీనర్ నరేష్ ఆధ్వర్యంలో  మండల కన్వీనర్ సమక్షంలో జన సైనికులు కేక్  కట్ చేసి అభిమానులకు, ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.అనంతరం  మొక్కలను నాటి,ఈ సందర్భంగా జనసైనికులు  ఆధ్వర్యంలో కేకు ను కట్ చేసారు.అనంతరం విలేకరులతో బిజెపి నాయకులు మేకల శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లీడర్ గా అభివర్ణించాడు. నాయకుడు అంటే పదిమందికి స్ఫూర్తి కలిగించేలా పనిచేసేవాడే,అందరికీ ఆదర్శంగా ఉండేవాడే   అటువంటి లక్షణాలు పవన్ వద్ద ఎన్నో ఉన్నాయని కొనియాడారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్రం పచ్చగా ఉండాలని ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారని వివరించారు.జనసేన కన్వీనర్ నరేష్ మాట్లాడుతూ పేదవారికి న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిలాజర్ల ఉండడంవల్ల మంచి జరుగుతుందిజరిగిందన్నారు. ఈ కార్యక్రమంల పుట్టపర్తినియోజకవర్గ  జనసేన నాయకులుమ మండల జనసేన ఉపాధ్యక్షులు అంజి,ప్రధాన కార్యదర్శులు శేఖర్,టిడిపి నాయకులు గోపాల్,బిజెపి నాయకులు రాము సురేష టిడిపి నాయకులు జనసేన నాయకులు బిజెపి నాయకులు పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు ఆమడగూరు యూత్ ఐ.శ్రీనాథ,మున్నా, అల్తాఫ్, నందకిశోర్, నిరంజన్,తలమర్లపల్లి మధు,ప్రజలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

విద్యార్ధి దశలోనే క్రమశిక్షణ అలవర్చుకోవాలి

- మోడల్ స్కూల్ లో ఎస్ఐ వెంకటనారాయణ

శ్రీసత్యసాయిజిల్లా, అమడగూరు(ఓడిచెరువు)సెప్టెంబర్ 03(విజయస్వప్నం.నెట్)

మండలం పరిధిలోని గాజులపల్లి సమీపంలో మోడల్ స్కూల్, మహమ్మదాబాద్ ప్రాధమిక పాఠశాలలో మంగళవారం  ఎస్ఐ వెంకటనారాయణ విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే  క్రమ శిక్షణతో కలిసి మెలసి ఉండాలని చెడుదారులకు తావు ఇవ్వకుండా మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, అసభ్య మాటలు మాట్లాడకుండా సమాజం పట్ల గౌరవం పెంచుకోవాలని" నేటి బాలలే రేపటి పౌరులు ఎదగాలని, పరిచయం లేని వారితో అప్రమత్తంగా ఉండాలని,ఆడపిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల గురుంచి వివరించరు.రాత్రి సమయంలో హాస్టల్ లో ఉన్న విద్యార్థులు అప్రమత్తంగా నడుచుకోవాలి, ఏ రకమైన ఇబ్బందులు తలెత్తిన వెంటనే తన దృష్టికి తీసుకోని రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  పోలీస్ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

పోషణ్ మా బృహత్తర కార్యక్రమం



శ్రీ సత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్03(విజయస్వప్నం.నెట్)

శిశువుల పెరుగుదలకు, భవిష్యత్తు వ్యక్తిత్వ వికాసమునకు ఎంతో దోహదం చేసే ముఖ్యకారకమైన పోషణ అంశం ప్రాధాన్యంగా రూపొందించబడిన పోషణ్ మా కార్యక్రమం తల్లులందరికీ గొప్ప వరం వంటిదని,ప్రతి తల్లి అవగాహన కల్గివుండాలని, అలాగే అర్థం చేసుకొని శిశువులకు,పెరిగే పిల్లల మైలురాళ్లను ప్రగతితో మెరుగుపరచు కోవాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేంద్ర నాయక్ పేర్కొన్నారు.మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషణ్ మా కార్యక్రమం రక్తహీనత,పర్యవేక్షక పెరుగుదల,పరిపూరక పోషణ,పోషణ మరియు విద్య,పారదర్శక ప్రభావశీల సేవల్లో సాంకేతిక ప్రాముఖ్యం తదితర అన్ని అంశాలు పోషణ్ మా నందు సమ్మిళితంతో ఈ 6 అంశాల లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించరని,లక్ష్య సాధనలో తల్లులు అందరూ భాగస్వాములై విజయవంతం కావటానికి దోహదం చేయాలని పిలుపునిచ్చారు.జిల్లా సమాచార అధికారి బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ పోషక విలువలతో కూడిన ఆహారం శిశువుల ఎదుగుదలకు ఉత్ప్రే రకము వంటిదని వయస్సు మరియు పోషణ పరస్పర అవినాభావ అవసరాల సంబంధం వంటిదని,ఈ రెండింటిని సమతూకం చేసినప్పుడే శిశువుల పెరుగుదల ఆరోహణ క్రమంలో ప్రగతి సూచిని అందుకోగలదని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు  భాను ప్రకాష్,కమల్ రోహిత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కుమారస్వామి రెడ్డి,ఆరోగ్య వైద్య సిబ్బంది సుభాషిని,విజయ కుమారి,దిల్షాద్,ఆరోగ్య,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు  


శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,సెప్టెంబర్03(విజయస్వప్నం.నెట్)

వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను  ప్రధాన శాస్త్రవేత్త (వేరుశనగ) డాక్టర్ ఓ.వెంకటేశ్వర్లు, డాక్టర్ భాస్కర్ రెడ్డి (ప్రధాన శాస్త్రవేత్త) కే.రామసుబ్బయ్య కోఆర్డినేటర్ ఏరువాక కేంద్రం పుట్టపర్తి, సత్యనారాయణ సహాయ వ్యవసాయ సంచాలకులు, ఓడిచెరువు మండల వ్యవసాయ అధికారి ఇలియాజ్ బృందం మంగళవారం మామిళ్లకుంట హపల్లి గ్రామంలో వేరుశనగ,కంది,మొక్కజొన్న పంటలను పరిశీలించారు.వేరుశనగ పంట ప్రస్తుతము కాయ అభివృద్ధి దశలో ఉందని,వేరుశనగకు మచ్చ తెగులు ఆశించినట్లు పేర్కొంటూ....దీని నివారణకు ఎక్సకొనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని,కంది పంట ప్రస్తుతం 60 రోజుల పంట దశలో ఉందని,60 రోజులకు ప్రొఫినోపాస్ రెండు మిల్లీలీటర్లు లేదా ఓ మైట్ ఒక మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలని,మొక్కజొన్న పంట విత్తనము కంకి ఏర్పడే దశ నుంచి విత్తనం అభివృద్ధి  వరకు ఉన్నదని 60 రోజులకు యూరియా 50 కిలోలు మరియు 25 కిలోల  పొటాష్ ఎరువులను వాడాలని తదితర అంశాలపై సలహాలు సూచనలిచ్చారు.

$$$__________@@@__________$$$

ఉగ్గిరెడ్డిపల్లిలో పౌష్టికాహార మహోత్సవాలు

అమడగూరు/ఓడిచెరువు జనసేన వార్త సెప్టెంబర్ 04

పౌష్టికాహార ప్రాధాన్యతపై అవగాహన కలిగి ఉండాలని సూపర్వైజర్ విజయ కుమారి బుధవారం ఓడిచెరువు మండలంలోని ఉగ్గిరెడ్డిపల్లి గ్రామంలో పౌష్టిక ఆహార మహోత్సవ కార్యక్రమంలో పేర్కొన్నారు.అంగన్వాడీ కార్యకర్తలు,గర్భిణులు, బాలింతలతో ఆమె సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో పౌష్టిక ఆహారం ఎంతో కీలకమన్నారు. గర్భిణీలు,బాలింతలు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని పిల్లలకు తప్పనిసరిగా పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలన్నారు.అంగన్వాడి కార్యకర్తలు లక్ష్మీ,ప్రమీల, శేమిమ్, పార్వతమ్మ, కె.శ్యామలమ్మ,వెంకట నరసమ్మ, పి.సుకన్య, సునంద, ఎం.శ్యామలమ్మ,సుకన్య , ఇంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

నిరుపేదలకు సక్రమంగా నిత్యావసర సరుకులు  అందించాలి

- ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, 

మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి


శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్04(విజయస్వప్నం.నెట్)

నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే నిత్యవసర సరుకులు సక్రమంగా అందించాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి డీలర్లకు సూచించారు.మండలంలోని డబురువారిపల్లిలో బుధవారం డీలర్ ఎద్దుల సునీతా ప్రభుత్వ చౌక ధాన్యపు డిపో కేంద్రాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర మాట్లాడుతూ,ప్రభుత్వం అధికారంలోకి రాగానే  పేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందజేస్తోందని పేర్కొన్నారు.బియ్యం,చెక్కెర,జొన్నలు,గోదుమ పిండి తదితర సరుకులు  అన్ని చౌక ధాన్యపు కేంద్రాల ద్వారా పేదలకు అందిస్తుందన్నారు.పేదలకు పంపిణీ చేసే నిత్యవసర సరుకులు పక్కదారి పడితే అలాంటి డీలర్ షిప్ రద్దు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశ్యంతో పేదలకు చౌక ధాన్యపు కేంద్రాల ద్వారా నిత్యావసర సరుకులు అందించి పేదల ఆకలి తీరుస్తుందన్నారు.అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఉచితంగా బియ్యం,చక్కెర పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి తహశీల్దార్ రంగనాయకులు, తెదేపా మండల కన్వీనర్ జయచంద్ర,మాజీ జడ్పిటిసి పిట్టా ఓబుళరెడ్డి,తెదేపా సీనియర్ నాయకులు తుమ్మల మహబూబ్బాషా,అంజనప్ప,శివారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి,జౌళి బాబాఅబ్లూ,మహేశ్వర్ రెడ్డి,పీట్ల సుధాకర్,చక్రధర్ నాయుడు,శ్రీనివాసులు,డాక్టర్ జాకీర్,రామాంజనేయులు, గంగాధర్,శివారెడ్డి,తెదేపా,జనసేన,బిజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

విరాళాలు సేకరించిన సచివాలయ ఉద్యోగులు

శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు, సెప్టెంబర్04(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో ఓడిచెరువు సచివాలయం గ్రామ కార్యదర్శి రామలింగారెడ్డి ఆధ్వర్యంలో సహచర ఉద్యోగులతో కలిసి బుధవారం విజయవాడ వరద బాధితుల కోసం విరాళాలు సేకరించారు.విజయవాడ నగరంలో ఎప్పుడులేని విధంగా  భారీ వర్షాలు కురిసి వరదలు ఉధృతం కావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని,విపత్తు వల్ల నష్టం వాటిల్లిందని చాలా .భాధకరమని,తమ వంతుగా 27 వేల రూపాయలు నగదు సేకరించి,వరద బాధితులకు పంపుతున్నారని తెలిపారు.ఈకార్యక్రమంలో చౌడప్ప,దివాకర్,రాజారెడ్డి,తేజశ్వరీ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

నూతన హమాలీ మండల కమిటీ ఎంపిక

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్04(విజయస్వప్నం.నెట్)

నూతన మండల హమాలీ కమిటీ బుధవారం ఎంపిక చేసినట్లు మండల సీఐటీయూ నాయకులు పోరాటాల శ్రీరాములు,కుళ్ళాయప్ప తెలిపారు. హమాలీ నూతన మండల అధ్యక్షులుగా శివశంకర్,కార్యదర్శి శ్రీనివాసులు,సహాయ కార్యదర్శి గంగాధ్రీ,కోశాధికారి శ్రీనాథ్, కార్యవర్గ సభ్యులుగా రమణప్ప,బాల చిన్నప్ప, శ్రీనివాసులు,ఆదినారాయణ తదితరులను ఎన్నుకున్నారని తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

$$$__________@@@__________$$$

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్04(విజయస్వప్నం.నెట్)

విశాఖపట్నం ఋషికొండ బీచ్ ఏఐటీయూసీ ఫోటో గ్రాఫర్ యూనియన్ సభ్యులతో కలిసి బుధవారం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి,శ్రీసత్యసాయి జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు సమస్యలపై సమీక్షించి,పరిష్కరించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం ఇచ్చారు‌

$$$__________@@@__________$$$

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడుగూరు సెప్టెంబర్ 05(విజయస్వప్నం.నెట్)

మండల  విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ  136వ జయంతిని పురస్కరించుకొని 63వ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారులు ఎస్.జలాన్ భాష,ఎం సంపూర్ణ హాజరై వారు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం,అదే విధంగా ప్రతి పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనలతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని, ప్రస్తుతం సమాజంలో ఇంజనీర్లు,డాక్టర్లు,సైన్సిస్టులు, సైనికులు,రాజకీయ మేధావులు తీర్చిదిద్దడం ఉపాధ్యాయులే కాబట్టి సమాజంలో ఉపాధ్యాయులకు ఉన్నంత విలువ ఏ ఒక్కరికి లేదని,ఈవిధంగా ఉపాధ్యాయులు పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు.ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎంఈఓల చేతుల మీదుగా ఉపాధ్యాయులకు సన్మానం చేసి అవార్డులను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ బాబు,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ముమ్మరంగా వాహనాల తనిఖీ


శ్రీసత్యసాయిజిల్లా,(ఓడిచెరువు)అమడగూరు,సెప్టెంబర్ 05(విజయస్వప్నం.నెట్)

మండలంలోని కొట్టువారిపల్లి సమీపంలో గురువారం ఎస్ఐ వెంకట నారాయణ ఆధ్వర్యంలో  వాహనాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. హెల్మెట్, సీట్ తప్పక ధరించాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఆటో వాహనాల్లో తరలించరాదని, అతివేగం ప్రమాదకరమని, మద్యం సేవించి వాహనాలలో నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు  చేస్తామని హెచ్చరించారు మ. కొట్టువారిపల్లిలో అధికంగా ప్రయాణికులను తరలిస్తున్న ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

రెయిన్బో పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు


 శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు , సెప్టెంబర్05(విజయస్వప్నం.నెట్)

ఓడి హచెరువు మండల పరిధిలో వేమారెడ్డిపల్లి వద్ద రెయిన్బో పాఠశాలలో సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి జయ చంద్రారెడ్డి  విచ్చేసి ప్రధానోపాధ్యాయుడు  జయసింహారెడ్డి సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ  నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఆ వృత్తికి ఆయన ఏ విధంగా మంచి కీర్తి ప్రతిష్టలను సాధించిన ఘనత, ఆయన మన దేశానికి రాష్ట్రపతిగా,ఉపరాష్ట్రపతిగా, రాయబారిగా ఆయన అందించినటువంటి సేవలను స్మరిస్తూ నేటితరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణని ఆదర్శంగా తీసుకుని ఓ  మంచి విద్యా బోధన విద్యార్థులకు అందించాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు  ఎం. జయ సింహారెడ్డి మాట్లాడుతూ గురు శిష్యుల మధ్య అనుబంధం ఏ విధంగా ఉండాలో గురుపూజోత్సవం సందర్భంగా గురువు యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు గురువు యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శిస్తూ మైమరిపించే అద్భుతమైన స్కిట్లను, నృత్యాలు చేసి అలరించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థినీ విద్యార్థులు ఒకింత నూతనోత్సాహంతో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు ఆటల పోటీలను నిర్వహించి గెలిచిన ఉపాధ్యాయులకు బహుమతులను అందజేశారు.

$$$__________@@@__________$$$

ఓడిచెరువు పాఠశాలలో కొత్త వరవడికి శ్రీకారం

శ్రీ సత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్ 05(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం గురుపూజోత్సవ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు సమావేశాన్ని ఏర్పాటు చేసి పాఠశాలలోని గురువులందరికి వారి ఆటపాటలతో అలరించి ఘనంగా సన్మానించారు.నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్ది సమాజంలో గౌరవంతో గుర్తింపు తీసుకొని రావడానికి ఉపాధ్యాయ గురువులే ముఖ్యులుగా విద్యార్థులు అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో  విద్యార్థిని విద్యార్థులు, ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర

దేశంలోనే గౌరవ ప్రధానమైన స్థానంగురువులదే ఉపాధ్యాయ దినోత్సవంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి


శ్రీ సత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి, సెప్టెంబర్05(విజయస్వప్నం.నెట్)

విద్యార్థులకు మంచి విద్యను అందించి వారికి సరైన దిశా నిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో  ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. నేటి సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థానం గురువుకే దక్కుతుందని అన్నారు . గురువారం గౌరవ భారత ద్వితీయ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్  జయంతి సందర్భంగా పుట్టపర్తి మండలంలోని జగరాజుపల్లి వద్ద మంగళకర ట్రస్టులో   నిర్వహించిన గురుపూజోత్సవ  కార్యక్రమంలో భాగంగా మొదటగా జ్యోతి ప్రజ్వలనతో, డా.సర్వేపల్లి రాధాక్రిష్ణ  చిత్ర పటానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,జిల్లా కలెక్టర్ చేతన్,డీఈఓ తోపాటు ఆర్డిఓ భాగ్యరేఖ,ఉపాధ్యాయులు నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, బావి పౌరులకు విద్యా ,విజ్ఞానాన్ని అందించే సరైన దిశా నిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని,జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు గురువు అని ఆమె కొనియాడారు.అందుకే మన సమాజంలో తల్లిదండ్రులు తర్వాత స్థానం గురువుదే అన్నారు.శిశువును లోకానికి పరిచయం చేసిన వ్యక్తి అమ్మ మొదటి గురువైతే.. గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు అన్నారు.ఆ తర్వాత ఈ సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు అన్నారు.అందుకే పెద్దలు  'మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ” అన్నారు. ఈ సందర్భంగా ఉపాద్యాయ వృత్తికి ఎనలేని సేవలు అందించి,భారత ద్వితీయ రాష్ట్రపతిగా ఎనలేని సేవలు అందించిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ, వారి బాటలోనే ప్రతి ఒక్క ఉపాద్యాయుడు నడవాలని ఆశాభావం వ్యక్తం చేసారు. అలాగే మా మామ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎందరో విద్యార్థులకు పాఠాలు బోధించి ఒక ఆదర్శ గురువుగా పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. మా మామయ్య పల్లె రఘునాథ్ రెడ్డి వద్ద తాను కానీ తన భర్త అయన వద్ద చదువుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.ఎంతో మంది ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు పల్లె రఘునాథ్ రెడ్డి వద్ద విద్యనభ్యసించి ఉంటారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. చదువుకున్న విద్యార్థి భవిష్యత్తులో ఏ ఉన్నత స్థానంలో ఉన్నప్పటికి అతను లేచి నిలబడి నమస్కారం పెట్టేది ఒక గురువుకు మాత్రమే అన్నారు.అనంతరం విద్యా రంగంలో జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారములను మెమొంటోలను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,జిల్లా కలెక్టర్ చేతన్ చేతుల మీదుగా అందజేసి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు,  జిల్లా విద్యాశాఖ అధికారి,వారి సిబ్బంది, ప్రదానోపాద్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మరియు, పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

గ్రామాల్లో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలి

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్ 05(విజయస్వప్నం.నెట్)

గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని గురువారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ఎంపీపీ పర్వీన్ భాను,ఎంపీడీవో వరలక్ష్మిలు పేర్కొన్నారు.విద్య,వైద్యం, వ్యవసాయం,విద్యుత్,ఉపాధి హామీ పథకం,గృహా నిర్మాణం, శిశు సంక్షేమ తదితర శాఖల అధికారులు పాల్గొని సర్పంచులు,ఎంపీటీసీల సమక్షంలో సమీక్షించారు.

$$$__________@@@__________$$$

అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

- తహసిల్దార్ కు సిపిఐ వినతి

 శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్ 06(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని ఇనగలూరు గ్రామ పంచాయతీలో రెండేళ్ళుగా గుడిసెలు వేసుకొని నివాసాలు చేస్తున్న  నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని శుక్రవారం తహశీల్దార్  రంగనాయకులకు సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు.రెండు సంవత్సరాల నుంచి ఇల్లు స్థలాలు ఇల్లులేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని  జీవిస్తున్నారని వారికి కనీసం నీళ్లు,కరెంటు తదితర సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని,ఇప్పటికైనా స్పందించి పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి మౌళిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు,మండల కార్యదర్శి చలపతినాయుడు,సిపిఐ నాయకులు రత్న బాయ్ విజ్ఞప్తి చేశారు.సిపిఐ కార్యవర్గ సభ్యులు సుధాకర్,రమణ, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

విజయస్వప్నం.నెట్ వీక్షకులకు వినాయకచవితి శుభాకాంక్షలు

శ్రీసతయసాయిజిల్లా, సెప్టెంబర్07(శనివారం)

ప్రధమ పూజితుడికి ప్రణామం,ఆది పూజ్యుడి పాద పద్మాలకు నమస్కారం,

పార్వతీ నందనుడికి ప్రియ వందనం

ముల్లోకాలను ఏలే మూషిక వాహనుడికి మనసే మందిరం

విఘ్నాలను తొలగించే వినాయకుడికి

అఖండ భక్తకోటి అందించే అపూర్వ నీరాజనం

ఓం విఘ్నేశ్వరాయ నమః  మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ గణనాథుడు సకల శుభాలను

కలుగజేయాలని మీరు చేసే ప్రతి కార్యం

వినాయకుని ఆశీస్సులతో

విజయవంతం కావాలని.... మీ జీవితాల్లో విఘ్నాలు తొలగించి

సుఖ సంతోషాలు ప్రసాదించాలని....

ఆ గణనాథుడిని ప్రార్థిస్తూ.... మీ ప్రతి పనిలో విజయం సాధించాలని

జీవితంలో దుఃఖం ఉండకూడదని కోరుకుంటూ....

వినాయకచవితి పండుగ సందర్భంగా 

ఆయన చేతిలో ఉండే లడ్డు

ఎంత తీయగా ఉంటుందో

అంతే తీయగా మీ జీవితం కూడా

ఉండాలని ఆ బొజ్జ గణపతి మీ ప్రార్థనలన్నింటినీ విని

మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ.... 

విజయస్వప్పం.నెట్ వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు🙏

$$$__________@@@__________$$$

ఓడిచెరువు మండల కేంద్రంలో కొలువు తీరిన వినాయక ప్రతిమలు







శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్09(విజయస్వప్నం.నెట్)

వినాయకచవితి పండుగ సందర్భంగా మండల కేంద్రంలో శివాలయం,రామాలయం చావిడి,ఎస్సీ,బీసీ కాలనీల్లో,నాయిబ్రహ్మణ కాలనీ,చెరువు గట్టు తదితర ప్రాంతాల్లో వివిధ రూపాల్లో భారీ వినాయకస్వామి విగ్రహాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు శనివారం ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి కొలువు తీర్చీ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి,అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వినాయకచవితి పండుగ సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అన్నదానం చేశారు.

$$$__________@@@__________$$$

గణపతి పప్పా మోరియా  ఘనంగా గ్రామాల్లో గణేష్ నిమజ్జనం








శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు, సెప్టెంబర్09(విజయస్వప్నం.నెట్)

మండలంలోని గ్రామాల్లో వినాయకచవితి పండుగ సందర్భంగా కొలువు తీరిన గణేష్ విగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో ఊరేగిస్తూ.... యువకులు, గ్రామస్తులు నృత్యాలు చేస్తూ.... గణపతి పప్పా మోరియా అంటూ భక్తిశ్రద్ధలతో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించి సమీపంలో చెరువుల్లో నిమజ్జనం చేశారు. తుమ్మలకుంట్లపల్లి,గొల్లపల్లి,గాజుకుంటపల్లి, కొండకమర్ల,తిప్పేపల్లి, మద్దకవారిపల్లిలో 50 వేలు లడ్డు వేలం పాటలో బాలు దక్కించుకున్నారు.నల్లగుట్టపల్లి,ఇనగలూరు తదితర గ్రామాల్లో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు.

$$$__________@@@__________$$$

ఏ తల్లీ జన్మనిస్తూ మరణించకూడదు - ఏ బిడ్డా జన్మిస్తూ మరణించకూడదు



శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్09(విజయస్వప్నం.నెట్)

గర్భం ధరించిన ఏ స్త్రీ అయినా హైరిస్ కారకాల తాలూకు చాయలకు ఎట్టి పరిస్థితులలో దగ్గర కాకూడదని అప్పుడే సురక్షిత ప్రసవం,ఆరోగ్యకర సంతానం పొందే అవకాశం ఉంటుందని వైద్యాధికారి కమల్ రోహిత్ పేర్కొన్నారు.సోమవారం మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో వైద్యాధికారి కమల్ రోహిత్ పాల్గొని మాట్లాడుతూ....గర్భం ధరించిన ఏ వ్యక్తి అయినా ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం హైరిస్ అంశాలను అధిగ మించడమేనని భౌతికంగా కనిపించే వయసు, ఎత్తు,బరువు,కుటుంబ ఆరోగ్య పూర్వ చరిత్ర,అలాగే సాంకేతిక పరిశోధక అంశాలైన బిపి,షుగరు,రక్తహీనత,హెచ్ఐవి,హెపటైటిస్ బి,థైరాయిడ్ తదితర వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైన పోషకాహార పదార్థాలు ప్రోటీన్లు,విటమిన్లు,ఖనిజాలు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.ముందస్తు హైరిస్ నివారణ చర్యలుగా సకాల వైద్య పరీక్షలు,ఆరోగ్య సలహాలు,ప్రసవ ప్రణాళిక ఆరోగ్యవంతమైన బిడ్డల జన్మకు దోహద కారకాలని,నిర్మూలన కన్నా నివారణ ఆరోగ్య ముఖ్య సూత్రమని ఈ సూత్రాన్ని తూచ  తప్పకుండా పాటించినప్పుడే ఏ తల్లీ జన్మనిస్తూ మరణించదని - ఏ బిడ్డా జన్మిస్తూ మరణించదని తెలిపారు.కార్యక్రమానికి హాజరైన 29 మందిలో 15   మంది హై రిస్క్ వారిగా గుర్తిస్తూ ప్రత్యేక చికిత్స,ఇతరులకు సాధారణ పరీక్షలు-చికిత్స తో పాటు 7 మందికి ఉచిత స్కానింగ్ సిఫారసు,మందుల పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన గర్భవతులకు,వారి సహాయకులకు రోటరీ క్లబ్ ప్రతినిధులు భోజన సౌకర్యం కల్పించారు.వారి సేవా నిరతిని పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సుభాషిని,దిల్షాద్,విజయ కుమారి,ఎం ఎల్ హెచ్ పి సిబ్బంది,ఆరోగ్య,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

వినాయకుడికి లడ్డు సమర్పించిన ముస్లిం సోదరుడు

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్09(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో శివాలయం వద్ద కొలువుదీరిన వినాయకునికి మండల కేంద్రానికి చెందిన ముస్లిం సోదరుడు టైలర్ నిజాం  సోమవారం లడ్డు సమర్పించారు.గత 15 ఏళ్లగా మైనార్టీ నాయకుడు అన్ని కులాలకు అతీతంగా వినాయకుడికి లడ్డూ సమర్పించి భక్తిని చాటుకుంటున్నాడు.15 కిలోల లడ్డూను పురోహితులు మురళిస్వామికి  అందించగా  వినాయకుని వద్ద లడ్డు సమర్పించి పూజలు నిర్వహించారు. మైనారిటీ నాయకులు టైలర్ నిజాంను పురోహిత మురళితోపాటు వినాయక ఉచ్చ కమిటీ సభ్యులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో టైలర్ రాము, లక్ష్మీపతి దంపతులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ రాష్ట్ర ఛైర్మన్ గా డాక్టర్ అక్కమ్మగారి సూర్యనారాయణ


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) సెప్టెంబర్09(విజయస్వప్నం.నెట్)

జాతీయ ఇండియా ఫిలిం మేకర్ అసోసియేషన్  చైర్మన్ గా 16 వార్డ్ బేరి పల్లికాలనీకి చెందిన డాక్టర్ అక్కమ్మగారి సూర్యనారాయణని చైర్మన్ గా సోమవారం ఎంపిక చేసినట్లు తెలిపారు.కదిరికి చెందిన ఎస్‌. బాదుల్లా ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు దిలీప్ కుమార్రామచంద్ర రెడ్డి అదేవిధంగా ఒడిస్సా రాష్ట్రానికి ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా కే.కే సుమన్ ని తమ అధికారికంగా వెబ్సైట్ ద్వారా ప్రకటించారు.జాతీయ చైర్మన్ గా ప్రకటించిన సందర్భంగా సూర్యనారాయణ  హర్షంవ్యక్తం చేశారు అలాగే సినీ పరిశ్రమకు తన సేవలు అందిస్తానని,కళాకారులకు తన వంతు సహకారం చేస్తానని విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా అక్టోబర్ 17న భువనేశ్వర్ లో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఒడిస్సాలో నిర్వహించే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రనిర్మాతలు రూపొందించిన చిన్న, ప్రామాణికమైన చిత్రాలను ప్రదర్శిస్తారని,జయదేవ్ భవన్‌లో జరిగే ఈ ఫెస్టివల్‌లో దాదాపు 100 చిత్రాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.ఈ ఫిలిం ఫెస్టివల్ కి ఫ్యూచర్ ఫిలిమ్స్,షార్ట్ ఫిలిమ్స్ ,డాక్యుమెంటరీ,వెబ్ సిరీస్ చిత్రనిర్మాతలు కూడా ఫెస్టివల్‌లో పాల్గొంటారని,అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొనవచ్చని,సినిమా చివరి తేదీ అక్టోబర్10న సమర్పణ ముగింపని,ఈ విలేకరుల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు దిలీప్ కుమార్, హెచ్ ఆర్ రెడ్డి,చైర్మన్‌ ఎ.సూర్యనారాయణ,ప్రధాన కార్యదర్శి రామచంద్ర రెడ్డి,సినీ దర్శకుడు పవన్ కుమార్‌,ఎస్‌. బాదుల్లా ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు కెకె సుమన్ పాల్గొన్నారని తెలిపారు.

$$$__________@@@__________$$$

జగన్ నిర్వాకం వల్లనే విజయవాడ నీట మునక

- ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్10 (విజయస్వప్నం.నెట్)

వైసిపి అధినేత జగన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో చేసిన నిర్వాకం వల్లనే విజయవాడ నీట మునిగిందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి విమర్శించారు. ఓడిచెరువు మండలంలోని ఉంట్లవారిపల్లిలో  తెదేపా ఉప సర్పంచ్ జిర్ల జర్ల వెంకటస్వామి రెడ్డి మనుమరాలు జన్మదిన వేడుకలకు మంగళవారం హాజరైన సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తో కలసి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయస్సులో కూడా వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారని,ఒక ముఖ్యమంత్రి జేసిబి మీద కూర్చుని వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను కష్టాలు అడిగి తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.బుడమేరు ప్రవాహం వల్ల విజయవాడ నగరంలోని కొన్ని ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని,వీరిని అదుకొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రాత్రి పగలు అక్కడే ఉండి బాధితులను అదుకుందని గుర్తు చేశారు. పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వరద బాధితులను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం మనిషిగా మన వంతు కర్తవ్యం అన్నారు.ప్రతి ఒక్కరూ వరద బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు తమ వంతు సహాయంగా నియోజకవర్గం నుంచి 1000 క్వింటాళ్ల బియ్యం సరుకులు దుస్తులు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి కి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు పిట్టా ఓబుళరెడ్డి,జయచంద్ర,అంజినప్పపీట్లా సుధాకర్,నిజాం,మల్లాపల్లి ఓబుళ రెడ్డి,మీసేవసుధాకర్ , ఉంట్లమహేశ్వర్ రెడ్డి,కుర్లి శివారెడ్డి,జౌళి బాబా,లక్ష్మీనారాయణరెడ్డి,బోరు రమణ,వెంకటరామిరెడ్డి , కుర్లీ గంగిరెడ్డి,వినయ్ కుమార్ రెడ్డి,శ్రీనివాసరెడ్డి,తెదేపా,జన సేన,బిజెపి నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

వైభవంగా వినాయక విగ్రహాల ఉత్సవ ఊరేగింపు






శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్10(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో కొలువు తీరిన వినాయక విగ్రహాలను ఉత్సవ ఊరేగింపు భక్తిశ్రద్ధలతో నిర్వహించి నిమజ్జనం చేపట్టారు.మండల కేంద్రంలో గత మూడు రోజులుగా కాలనీల్లో వినాయక ప్రతిమలను మండపాలలో కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మంగళవారం ప్రత్యేక వాహనాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు  పురవీధుల్లో  ఊరేగించారు. భక్తులు కాయ కర్పూరం సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.యువత, చిన్నారులు,గ్రామ ప్రజలు పాల్గొని డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ కోలాహలంగా గణపతి బప్పా మోరియా అంటూ వినాయకుడి నామస్మరణతో రంగులు చల్లుకుంటూ ఉత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. శివాలయం వినాయక విగ్రహాం వద్ద లడ్డును అంజి 20,116 వేలం పాటలో దక్కించుకోగా, రామాలయం సమీపంలో పీర్ల చావిడి వద్ద ఆర్జీబీ వినాయక కమిటీ లడ్డును వెంకటేశ్వర్లు,సుబాహాన్లు 26,516 రూపాయలకు దక్కించుకున్నట్లు తెలిపారు.తుమ్మలకుంట్లపల్లిలో మునీనాయుడు 22,500, మద్దకవారిపల్లిలో జగన్నాథ్, బాలు 50 వేలు, గౌరాపురంలో  హరిష్ 36 వేలు,గౌనిపల్లిలో మావిటి కిరణ్ 20వేలు, చౌడంపల్లిలో అజయ్ కుమార్ 29 వేలు,ఆకతోటపల్లిలో కోగర రవి 6,900 వేలం పాటలో లడ్డు ను దక్కించుకున్నారు.

$$$__________@@@__________$$$

ఆమడగూరు సర్పంచ్ షబ్బీర్ తెదేపాలోకి చేరిక


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,సెప్టెంబర్10(విజయస్వప్నం.నెట్)

అమడగూరు గ్రామ పంచాయతీ వైకాపా సర్పంచ్ షబ్బీర్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.మంగళవారం అమడుగూరు మండలం లోకోజుపల్లి పంచాయతీలో పర్యటించిన మాజీ మంత్రి  పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో తెదేపా కండువా కప్పుకొని పార్టీలోకి చేరారు. టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందనీ భావించి తెదేపా తీర్థం పుచ్చుకున్నారని వైకాపా సర్పంచ్ షబ్బీర్ తెలిపారు. వైకాపా ఇక గల్లంత కావడం ఖాయమని ఆయన అన్నారు. వైకాపా అధినేత జగన్ తీరు నచ్చని చాలామంది ఆ పార్టీని వీడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోమాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణ మూర్తి,సీనియర్ నాయకులు కృష్ణ రెడ్డి, శ్యాంబాబు నాయుడు,రాజా రెడ్డి,కుమార్ రెడ్డి, నంజప్ప, ప్రధానకార్యదర్శి రమణ, మండల తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ప్రభుత్వ కార్యాలయ ఆవరణంలో పచ్చదనంతో ఉండాలి

ఇంటింటా చెత్త సేకరణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి

ఓడిచెరువు ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో ఓపి శాతం పెరగాలి

- జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్








శ్రీసత్యసాయిజిల్లా గోరంట్ల/అమడుగురు/ఓడి చెరువు, సెప్టెంబర్ 11(విజయస్వప్నం.నెట్)

అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని గోరంట్ల, ఆమడగురు,ఓడి చెరువు మండలాల్లో పర్యటించి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు,ఈ కార్యక్రమంలో డిఎల్డి ఓ శివకుమారి,సంబంధిత ఎంపీడీవోలు,ఎమ్మార్వోలు,పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు, గోరంట్ల మండల ప్రధాన కేంద్రంలో రాగిగుంట చెరువు సమీపమున చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు,తడి చెత్త పొడి చెత్త ఎలా సేకరిస్తున్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు,గోరంట్ల గ్రేడ్ వన్ పంచాయతీగా ఉన్నందున గ్రామ సచివాలయం సిబ్బంది పంచాయతీరాజ్ సిబ్బంది అందరు కలసికట్టుగా చెత్త రహిత గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు,పంచాయతీలకు ఆదాయం వచ్చే వనరుగా ఈ సంపద కేంద్రాన్ని తయారు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.జీవితంలో స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్వచ్ఛత ప్రతి ఒక్కరు బాధ్యతని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.అనంతరం హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ ద్వారా పంపింగ్ యంత్రాన్ని పరిశీలించారు.గోరంట్ల పట్టణంలో ఓవర్ హెడ్ ట్యాంకును పరిశీలించారు.అనంతరం ఆమడగూరు మండలంలో చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాడి పారేసిన ప్లాస్టిక్ నుంచి విముక్తిని కలగ చేద్దామని,వాడి పారేసిన ప్లాస్టిక్ అది మట్టిలో కుప్పలలో నిల్వ వుండిపోయి వర్షపు నీటిలో కొట్టుకుపోయి నదులలో కలుస్తుందని,కొన్నిసార్లు బిందువులు కడుపులోకి వెళుతుందని,ఒకసారి వాడి పారేసి ప్లాస్టిక్ వల్ల కలుషితం అవుతున్నాయని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ప్లాస్టిక్ వ్యర్ధాలు అన్నింటిని ఈ సంపద కేంద్రాలలో నిల్వ ఉంచి వాటిని విక్రయించాలని తెలిపారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించారు,సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరు విస్తృతంగా ప్రజలకు సేవలు అందించాలని పేర్కొన్నారు,ప్రభుత్వం అందించిన యూనిఫారం కచ్చితంగా ధరించాలని సిబ్బందిని ఆదేశించారు.అనంతరం వ్యవసాయ గోదామును పరిశీలించారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.రెండు నెలల కాలంలో అమడగూరు మండలానికి వస్తానని అప్పుడు ఇక్కడున్న కార్యాలయాలన్ని పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు,వెలుగు కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరంమహమ్మదాబాద్ చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కను నాటారు.            ఓడిచెరువులో కలెక్టర్ ఓడిచెరువు మండలంలోని ఆకుతోటపల్లి గ్రామ సమీపంలో బుధవారం కలెక్టర్ టిఎస్ చేతన్ పర్యటించి చెత్త సంపద తయారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.తడి చెత్త,పొడి చెత్త,ఎలా సేకరిస్తున్నారని సిబ్బందితో వివరాలను ఆరా తీశారు.అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.ఓపి శాతం పెరగాలని సిబ్బందిని సూచించారు. ఇక్కడున్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.త్వరలో ప్రాథమిక ఆరోగ్య వైద్యశాల నూతన భవనాన్ని ప్రారంభించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఈకార్యక్రమంలో ఎం.బాబురావు ఈవో, ఎంపీడీవో గుప్తా,పి సురేష్, గంగిరెడ్డి, ఎంపీడీవో మునిప్ప,చంద్ర, ఏపీఎం గోపాల్,ఏపీవో అమరావతి, పంచాయతీరాజ్ శాఖ అధికారి గుప్తా, ఆర్డబ్ల్యూఎస్ అధికారి అనిల్,  వ్యవసాయ అధికారి వెంకటరమణ, అమర్నాథ్ రెడ్డి వైద్యాధికారి కమల్ రోహిత్, శానిటేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్11(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల వ్యవసాయాధికారి ఇలియాజ్ ఆధ్వర్యంలో సిబ్బందికి బుధవారం సమావేశం ఏర్పాటు చేసి ఈ పంట నమోదు తదితర అంశాలపై సమీక్షించారు.ఈకార్యక్రమంలో సిర్ కల్చర్ అధికారులు హాజరై అవగాహన కల్పించారు.

$$$__________@@@__________$$$

చౌడేపల్లిలో రోడ్డు కూలీలకు అన్నదానం



శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్11(విజయస్వప్నం.నెట్)

మండలంలోని సున్నంపల్లి పంచాయతీ గ్రామ సర్పంచ్ ధారా లక్ష్మీదేవి కుమారుడు  నాగేంద్ర ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు పనులు చేసుకునే 70మంది కూలీలకు చౌడేపల్లి సమీపంలో గీతామందిరం వద్ద అన్నదానం ఏర్పాటు చేసి సహ పంక్తి భోజనాల కార్యక్రమం నిర్వహించారు. మీ శ్రేయోభిలాషి సేవా సమితి నిర్వాహకులు ధారా నాగేంద్ర రోడ్డు పనులు చేసుకునే ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడంపై పలువురు అభినందించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి