google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : ఢాబా హోటల్ యజమాని ఆత్మహత్య - మాతృశ్రీ వృద్ధాశ్రమంలో అన్నదానం - రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులు గౌస్ లాజమ్ - మండలంలో భారీ కొండచిలువ కలకలం - మండల కేంద్రంలో హమాలీ ఆత్మహత్య

15, సెప్టెంబర్ 2024, ఆదివారం

ఢాబా హోటల్ యజమాని ఆత్మహత్య - మాతృశ్రీ వృద్ధాశ్రమంలో అన్నదానం - రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులు గౌస్ లాజమ్ - మండలంలో భారీ కొండచిలువ కలకలం - మండల కేంద్రంలో హమాలీ ఆత్మహత్య

శ్రీ ఖాద్రీస్వామి వారికి రూ.72,48,024 హుండీ ఆదాయం



శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) కదిరి, సెప్టెంబర్12(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానములో స్వామివారికి సంబందించిన హుండిల లెక్కింపు గురువారం  పూర్తి అయినందున నగదుగా రు.72,48,024/-లు మొత్తము 43 రోజులు హుండీ ఆదాయం వచ్చిందని,బంగారు 24 గ్రాములు,వెండి 807 గ్రాములు మరియు విదేశి కరెన్సీ యుఎస్ఏ డాలర్లు (అమెరికా) 26 డాలర్లు వచ్చినట్లు పేర్కొంటూ....హుండీల లెక్కింపు కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి అధ్వర్యములో  చేపట్టారని, హుండీ లెక్కింపు పర్యవేక్షణాధికారిగా సీనియర్ సహాయకులు,జిల్లా దేవాదాయశాఖ కార్యాలయం, శ్రీసత్యసాయి జిల్లా వారు డి.రమేష్ బాబు హాజరైయ్యారని,హుండి లెక్కింపు కార్యక్రమములో  దేవస్థానము సిబ్బంది,ఆంధ్రప్రగతి గ్రామీణ  బ్యాంకు,కదిరి మేనేజర్ చలపతి రావు,బ్యాంకు సిబ్బందితో పాటు వివిధ సేవా సంస్థ సభ్యులు  పాల్గొన్నాట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

$$$__________@@@__________$$$

సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరికి ఘన నివాళి


శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్12(విజయస్వప్నం.నెట్)

సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు,పోలిటి బ్యూరో సభ్యులు,మాజీ రాజ్యసభ సభ్యులు,జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి  మృతి పట్ల గురువారం మండల సిపిఎం పార్టీ నాయకులు సంతానం వ్యక్తం చేస్తూ.... కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా సిపిఎం నాయకులు రమణ,కుళ్ళాయప్ప,శ్రీరాములు తదితరులు మాట్లాడుతూ.... శ్రామిక,కర్షక వర్గాల హక్కుల కోసం సీతారాం ఏచూరి నిరంతరం శ్రమించారని,రాజ్యసభలో ప్రజా సమస్యలపై గళం వినిపించిన కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత ఏచూరి సీతారాం గుర్తింపు పొందారని వారు కొనియాడారు.నివాళులు అర్పించిన వారిలో రామచంద్ర, వీరేంద్ర,నర్సింహులు,శాంతమ్మ, ఎల్లమ్మ,అజయ్,రేణుక తదితరులు ఉన్నారు.సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు,మండల కార్యదర్శి చలపతినాయుడు గురువారం సిపిఎం నేత సీతారాం ఏచూరి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఘనంగా నివాళులు అర్పించారు.

$$$__________@@@__________$$$

సున్నా శాతం రక్తహీనత మన లక్ష్యం



శ్రీ సత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్12(విజయస్వప్నం.నెట్)

ఆరోగ్య పురోగతికి రక్తహీనత ప్రధాన సూచకని అన్ని వర్గాలలో సున్నా శాతం రక్తహీనత లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకొని విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి కమల్ రోహిత్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్వహించిన నులిపురుగుల నివారణ కార్యక్రమంలో సిబ్బందికి మందులు పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో వైద్యాధికారి కమల్ రోహిత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం ఈనెల 17న  నిర్వహిస్తున్నట్లు అర్హులైన 1నుండి 19 సంవత్సరాల పాఠశాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేయనున్నట్లు పేర్కొంటూ...మొత్తం 10,285 మంది విద్యార్థులు లబ్ధిదారులుగా ఎంపిక చేశారని తెలిపారు.పిల్లలలో పెరుగుదల,బుద్ధి మాంద్యం,చురుకుదనం లేకపోవడం,జ్ఞాన పరిమితి,కడుపునొప్పి,భోజనం చేసిన వెంటనే మలవిసర్జనకు వెళ్లడం,చర్మ సంబంధ రోగాలు,బరువు తగ్గడం మొదలగు ఆరోగ్య సమస్యలు రక్తహీనత వలన ఏర్పడతాయని పాఠశాల విద్యార్థి దశ నుండే నివారణ  జాగ్రత్తలు,చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన మండల విద్యాధికారి రమణ మాట్లాడుతూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా చేతుల  శుభ్రత సూత్రాలను అనగా హ్యాండ్ వాష్ ప్రక్రియను భోజనానికి ముందు మల విసర్జన తర్వాత తూచ తప్పకుండా పాటించినప్పుడు విద్యార్థి దశ నుండి రక్తహీనతను నివారించవచ్చని తెలిపారు.ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ కార్యక్రమ విజయవంతానికి తమ వంతు కృషి,సహకారం అందిస్తామని తెలిపారు.అనంతరం సిబ్బందికి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి శాఖ సూపరింటెండెంట్ రెడ్డప్ప మందుల కిట్లు అందజేశారు.ఈకార్యక్రమంలో ప్రభుత్వ,ప్రైవేటు ఉపాధ్యాయ,ప్రధానోపాధ్యాయులు గంగాద్రి,నారాయణస్వామి,జనార్దన్ రెడ్డి,రమేష్ నాయక్, నిర్మలమ్మ,గోపీనాథ్,ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

వరద బాధితుల కోసం విరాళాలు సేకరించిన తెదేపా కూటమి

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్12(విజయస్వప్నం.నెట్)

అధిక వర్షాల కారణంగాతో బుడమేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో విజయవాడలో చాలా ప్రాంతాలు నీట మునిగిన విషయం అందిరికి విదితమే.ఈవరదల కారణంగా కొని వేల మంది నిరాశ్రయులయ్యారని,వారి జీవినస్థితగతులను మెరుగుపరచడానికి పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సిందూర రెడ్డి,మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు కొండకమర్లలో తమ వంతు సాయంగా వరద బాధితుల కోసం విరాళాలు సేకరణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారని తెదేపా శ్రేణులు తెలిపారు.ఈ కార్యక్రమం గురించి తెలుగుదేశం సీనియర్ నాయకులు పొగాకు జాకీర్ మాట్లాడుతూ ఈకార్యక్రమాన్ని  ఇంకో రెండు రోజులు చేసి  విరాళంగా సేకరించిన నగదు మొత్తాన్ని విజయవాడ వరదబాదితులకు పంపుతామని వారు తెలిపారు. వరదబాదితుల సహాయం కొరకు  కొండకమర్లకు చెందిన పురోహితులు పాణి స్వామి  మొదట విరాళంగా 5,116 రూపాయలు అందించారని తెలిపారు.ఈకార్యక్రమంలో  తెలుగుదేశంపార్టీ నాయకులు జయచంద్రారెడ్డి,బాలక్రిష్ణరెడ్డి,సంగాల శ్రీనివాసులు,శంకరప్ప,రవి,అంజినప్ప ,వి.శ్రీనువాసులు,సుధాకర్ నాయుడు,వినోద్ నాయుడు,ఈశ్వర్,చంద్రాయుడు,గంగాద్రి,చంద్రా, జనసేన పార్టీ నాయకులు సతీష్ కొండబోయన, బిజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

పుట్టపర్తి డివిజన్ అపుస్మా ప్రెసిడెంట్ గా కనేకంటి క్రిష్ణ మోహన్ రెడ్డి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు సెప్టెంబర్12(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి డివిజన్ అపుస్మా ప్రెసిడెంట్ గా మండల కేంద్రానికి చెందిన శ్రీ జ్ఞాన సాయి విద్యానికేతన్ హై స్కూల్ కరస్పాండెంట్ కనేకంటి క్రిష్ణ మోహన్ రెడ్డిని నూతనగా నియమించినట్లు పేర్కొంటూ....సెక్రెటరీగా ప్రతిభ స్కూల్ కరెస్పాండంట్ శివ ప్రసాద్ రెడ్డిని,ట్రెజరర్ గా అక్షర స్కూల్ కరెస్పాండంట్ సుదీర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ ప్రెసిడెంట్ కె ప్రభాకర్  అపుస్మా సంఘ నాయకులు తదితరులు పాల్గోన్నరన్నారు.

$$$__________@@@__________$$$

మల్లెల రమేష్ మిత్ర బృందం సేవాగుణం

విద్యార్థులకు రాత పుస్తకాలు పంపిణీ

ఉత్తమ ఉపాధ్యాయిని రాధకు ఘన సన్మానం

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు సెప్టెంబర్12(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని అల్లాపల్లి పంచాయతీ గౌనిపల్లి గ్రామానికి చెందిన మల్లెల రమేష్ మిత్ర బృందం గురువారం గోరంట్ల మండలంలోని కోరేవాండ్లపల్లి ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాలు పంపిణీ చేశారు.ముందుగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న తాడిమర్రి రాధ ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న సందర్భంగా మల్లెల రమేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.అనంతరం ఉపాధ్యాయులు కే.నాగరాజు నేతృత్వంలో మల్లెల రమేష్ మిత్ర బృందంతో కలిసి విద్యార్థులకు రాత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... ఉత్తమ అవార్డు గ్రహీత రాధ వినూత్న రీతిలో విద్యార్థులకు బోధనలు అందించడంపై పలువురు ప్రశంసిస్తూ.... ఉత్తమ ఉపాధ్యాయురాలు రాధ నాణ్యమైన విద్య బోధనలు ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. మల్లెల రమేష్ మిత్ర బృందం సేవాగుణం అభినందనీయమని పలువురు కొనియాడారు.

$$$__________@@@__________$$$

ఘనంగా పోషకాహార మాసోత్సవాలు 

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్13(విజయస్వప్నం.నెట్)

పౌష్టికాహార ప్రాధాన్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన పోషణ మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాలింతలకు, గర్భిణీలకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఐసిడిఎస్ సిడిపిఓ వరలక్ష్మి, సూపర్వైజర్ విజయకుమారి  పేర్కొన్నారు.మండల పరిధిలోని బుచ్చిరాజుపల్లి గ్రామ అంగన్వాడి కేంద్రంలో  పౌష్టిక ఆహార మహోత్సవాలలో ఎగ్జిబిషన్ ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో పౌష్టికాహారం ఎంతో కీలకమన్నారు. గర్భిణీలు,బాలింతలు క్రమం తప్పకుండా చౌకగా దొరికే ఆకుకూరలు,మొలకత్తిన గింజలు తీసుకోవాలని, అంగన్వాడి కేంద్రంలో అందించే గుడ్లు,పాలు,ఎన్టీఆర్ కిట్టు, తదితర పౌష్టికాహారం తీసుకోవాలని,ప్రతి రోజూ పిల్లలకు తప్పనిసరిగా పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి భోధకులు వరలక్ష్మి, లక్ష్మీనారాయణమ్మ ,రత్నమ్మ,భారతి,అరుణ,నాగరాణి,గంగులమ్మ,గంగాదేవి,నాగలక్ష్మి,ఆశా కార్యకర్తలు మునిరత్నమ్మ,కుళ్లాయమ్మ అలివేలమ్మ,గర్భవతులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులతో పాటు గ్రామ ప్రజలు తదితరులు  పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

కదిరి ఆర్టీఓగా జే.శ్రీనివాసులు

శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు)కదిరి, సెప్టెంబర్13(విజయస్వప్నం.నెట్)

కదిరి డివిజన్ నూతన ఆర్టీఓగా జె.శ్రీనివాసులు శుక్రవారం భాధ్యతలు చేపట్టారు. నూతనంగా భాధ్యతలు చేపట్టిన ఆర్టీవో శ్రీనివాసులుకు ఎంపీఐ హరిప్రసాద్,సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.అనంతపురం డీపిసీ కార్యాలయంలో ఏఓగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు పదోన్నతిపై కదిరి ఆర్టీఓగా భాధ్యతలు స్వీకరించారు.

$$$__________@@@__________$$$

అమృత మండల మహిళా సమైక్య అకౌంటెంట్ గా గాయత్రి

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,సెప్టెంబర్13(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో అమృత మండల సమాఖ్య వెలుగు అకౌంటెంట్ గా పూలుకుంటపల్లి గ్రామానికి చెందిన చవలా గాయత్రి  శుక్రవారం భాధ్యతలు చేపట్టినట్లు వెలుగు ఏపిఎం గోపాల్ తెలిపారు.అనంతరం వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో గాయత్రి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అయిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మండల తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారాలతో  ఈఅవకాశం కల్పించారని, ఈసందర్భంగా ఆమె ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మండలంలోని ప్రతి మహిళకు అందుబాటులో ఉంటూ మండల వెలుగు సిబ్బందికి మంచి పేరు తీసుకువస్తానని తన మామ నంజప్ప తెలుగుదేశం పార్టీకిచేసిన  సేవలు గుర్తించుకొని మా కుటుంబానికి ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మా కుటుంబ సభ్యులు రుణపడి ఉంటామని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెదేపా కన్వీనర్ గోపాల్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి టైలర్ రమణ,సీనియర్ నాయకులు కడపల కృష్ణారెడ్డి,సీసీ లు శంకర్ నాయక్,రత్నమయ్య,హరిప్రసాద్, రవీంద్ర,మండల సమైక్య అధ్యక్షురాలు అనూష,వలిపి కిష్టప్ప, డీలర్లు తుమ్మలరెడ్డి,శంకర్ నాయుడు,అంజి,తిరుపాల్,మూర్తి, ఫీల్డ్ అసిస్టెంట్లు శంకర్ నాయక్,రంగప్ప,బాబాజీ,మనోహర, సుభహాన్,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

మండల కేంద్రంలో హమాలీ ఆత్మహత్య


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు సెప్టెంబర్13(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల కేంద్రంలో స్థానిక చెరువుమరవు సమీపంలో నివాసం ఉంటున్న హమాలీ శ్రీనివాసులు(46) శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శివమ్మ కుట్టు మిషన్ పని చేస్తున్నారని,వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, రెండు రోజుల క్రితం బార్య శివమ్మ బెంగుళూరులో పెద్ద కుమార్తె వద్దకు వెళ్ళినట్లు తెలిపారు. శుక్రవారం చిన్న కుమార్తె పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా తండ్రి శ్రీనివాసులు ఇంటి పైకప్పు దూలానికి చీరతో ఉరి వేసుకుని వేలాడుతున్న సంఘటన గమనించి చుట్టు పక్కల వారికి తెలిపగా, వారు గమనించగా అప్పటికే శ్రీనివాసులు మృతి చెందినట్లు గుర్తించారు.అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

$$$__________@@@__________$$$

మండలంలో భారీ కొండచిలువ కలకలం


శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్13(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండలంలోని బలిజపల్లి సమీప పొలాల్లో శుక్రవారం ఉదయం భారీ కొండచిలువ సంచరిస్తూ కలకలం రేపింది.గ్రామానికి చెందిన హరీష్ అనే రైతు కూలీలతో కలిసి తన పొలంలో పనుల నిమిత్తం వెళ్ళగా భారీ కొండచిలువ కనిపించడంతో ఒకసారిగా భయంతో ఉలిక్కిపడి పరుగులు తీశారు.విషయాన్ని వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలపడంతో హుటాహుటిన అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకొని బంధించడంతో రైతులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

$$$__________@@@__________$$$

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులు గౌస్ లాజమ్

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు సెప్టెంబర్14(విజయస్వప్నం.నెట్)

మండలంలోని కమ్మవారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న కట్టుబడి గౌస్ లాజమ్  2024 ఆచార్య దేవోభవ జాతీయ పురస్కారం 2024కు ఎంపికైనట్లు తెలిపారు.ఆయన మాట్లాడుతూ మన స్వతంత్ర భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జయంతి సందర్భంగా యువతేజం కలాం విజన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాబోధనా,సాహిత్య,సాంస్కృతిక,సమాజ సేవ రంగాలలో విశేషమైన కృషి చేసిన వారికి జాతీయస్థాయి అవార్డులను ప్రధానం చేస్తున్నారని తెలిపారు.ఈ అవార్డుకు తనకు విద్యాబోధన సామాజిక సేవరంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ఎంపిక చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు.ఈ అవార్డు ప్రధానోత్సవానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ముని మనవడు సుబ్రహ్మణ్య శర్మ ప్రత్యేక అతిథిగా విచ్చేశారని,ఈఅవార్డును అయన చేతులు మీదుగా ఈనెల 14వతేదీన శనివారం తిరుపతిలో అందుకోనున్నారని పేర్కొన్నారు.మండల విద్యాశాఖ అధికారులు సురేష్ బాబు,రమణ పలుపురు ఉపాధ్యాయులు,విద్యార్థులు అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు గౌస్ లాజమ్ కు అభినందనలు తెలిపారు.

$$$__________@@@__________$$$

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్14(విజయస్వప్నం.నెట్)

మండలంలోని వేమారెడ్డిపల్లి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎం.నరసింహులు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని జరికుంటపల్లి గ్రామానికి చెందిన నరసింహులు ద్విచక్రవాహనంలో మహ్మదాబాద్ క్రాస్ నుండి స్వగ్రామానికి వెళుతుండగా కదిరి వైపు నుండి బెంగళూరు వైపు వెళ్తున్న వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో నరషింహులు తీవ్రంగా గాయపదంతో స్థానికులు పోలీసులు సహకారంతో ప్రైవేట్ వాహనంలో కదిరి వైద్యశాలకు తరలించారు.

$$$__________@@@__________$$$

మాతృశ్రీ వృద్ధాశ్రమంలో అన్నదానం


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,సెప్టెంబర్14(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని గాజులపల్లి కూడలి వద్ద మాతృశ్రీ వృద్ధాశ్రమంలో శనివారం హిందూపురం పట్టణానికి చెందిన కేఆర్ వెంకటేశ్వర్లు,సతీమణి గిరిజ దంపతుల ముద్దుల కుమారుడు అరుణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వేడుకలు  జరుపుకున్నారు.ముందుగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి సహ పంక్తి భోజనాలు చేశారు.గతంలో ఈ కుటుంబ సభ్యులు ఆశ్రమానికి 10 మంచాలు,ఒక వీల్ చైర్, 20 ప్లేట్లు,గ్లాసులు అందజేశారని ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి గుర్తు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అరుణ్ బాబుకి ఆశ్రమం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.దాతలకు వృద్ధాశ్రమం తరఫున దుశ్యాలువతో సన్మానం చేసి ఆశ్రమం తరఫున జ్ఞాపికను అందజేశారు.ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఢాబా హోటల్ యజమాని ఆత్మహత్య

ఢాబా హోటల్ యజమాని రమేష్ ఫైల్ ఫోటో

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్14(విజయస్వప్నం.నెట్)

మండలంలోని జెర్రికుంటపల్లి సమీపంలో శ్రీఖాద్రీ ఢాబా హోటల్ యజమాని మిరియాల రమేష్ (52) ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసారని,అనంతరం మిద్దెపై గదిలోకి వెళ్ళి చాలాసేపు వరకు కిందకు రాలేదని, బార్య కమలమ్మ పైకి వెళ్ళి చూడగా ఫ్యాన్ కు ఉరేసుకున్న భర్త రమేష్ ను చూసి గట్టిగా కేకలు వేయగా బంధువులు వెళ్లి గమనించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించారని తెలిపారు.అయితే రమేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని 

$$$__________@@@__________$$$

వైయస్ జగన్ ను కలిసిన  యువజన విభాగం జిల్లా కార్యదర్శి

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)సెప్టెంబర్14(విజయస్వప్నం.నెట్)

నల్లమాడ మండల పరిధిలోని దోన్నికోట గ్రామానికి చెందిన అనంతపురం ఉమ్మడి జిల్లా వైకాపా యువజన విభాగం కార్యదర్శి రాజశేఖర్ నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి పార్టీ కార్యాలయంలో గౌరవ పూర్వకంగా కలిసి మాట్లాడారని శుక్రవారం తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడ్డారని, వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి వైకాపా బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి