google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : మీకు తెలుసా..? హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం - 23న ఉపాధి హామీ పథకంపై గ్రామసభలు - ఎమ్మెల్యే ఎం.యస్.రాజుకు రాఖీ కట్టిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి - జూనియర్ డాక్టర్ ని హత్య చేసిన వారిని శిక్షించాలి - వాహనాలు తనిఖీ చేపట్టిన ఎస్ఐ

20, ఆగస్టు 2024, మంగళవారం

మీకు తెలుసా..? హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం - 23న ఉపాధి హామీ పథకంపై గ్రామసభలు - ఎమ్మెల్యే ఎం.యస్.రాజుకు రాఖీ కట్టిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి - జూనియర్ డాక్టర్ ని హత్య చేసిన వారిని శిక్షించాలి - వాహనాలు తనిఖీ చేపట్టిన ఎస్ఐ

వైద్యురాలిని హత్య చేసిన దుండగులను శిక్షించాలి


శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు18(విజయస్వప్నం.నేట్)

కోల్ కొత్త వైద్య విద్యార్థిపై అత్యాచారం,హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిఐటియు కన్వీనర్ కుళ్లాయప్ప,కోకన్వీనర్ శ్రీరాములు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.విధులు నిర్వహిస్తున్న వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేయడం సభ్య సమాజం తలదించుకునేలా వుందన్నారు.బాధితుల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నిరసనలు కొనసాగిస్తారన్నారు.ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ లక్ష్మీపతి,సర్పంచ్ గోవిందు, శ్రీనివాసులు, లక్ష్మీనాయక్, మనీ, కమలమ్మ, హైదర్ వలీ, ఆనంద్, రమణ తదితరులు పాల్గొన్నారు

$$$_________@@@__________$$$

ఆరోగ్య కార్యకర్తలను మాతృ శాఖ ఉంచాలి:ఏఐటీయూసీలతో కలెక్టర్ కు వినతి 

శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి (ఓడిచెరువు) ఆగష్టు19(విజయస్వప్నం.నెట్)

గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలను యథాతథంగా మాతృ శాఖలోనే విధులు నిర్వహణ ఉండేలా ప్రభుత్వం చూడాలని సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతన్ కు వినతి పత్రం అందజేశారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ అధిక యాపులు దానికితోడు గ్రామ వార్డు సచివాలయనికి సంబంధించిన అన్ని పనులను చేయించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కావున మాతృశాఖ ఆరోగ్య శాఖ పరిధిలోనే ఉండేవిదంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిని కోరుతూ సమస్యలు పరిష్కార వేదికలో జిల్లా అధికారులకు వినతిపత్రం అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ,వార్డు సచివాలయాల ఏఎన్ఎం అసోసియేషన్ జిల్లా కార్యదర్శి (ఏఐటీయూసీ )అనుబందం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు జిల్లాలో వివిధ సచివాలయాల ఏఎన్ఎంలు(ఆరోగ్య కార్యకర్తలు)పాల్గొన్నారు.

$$$_________@@@__________$$$

అక్కదేవతల ఆలయంలో ప్రత్యేక పూజలు.


(అమడగూరు)ఓడిచెరువు,జనసేన వార్త,ఆగష్టు19

శెట్టి చిన్నంపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్ప,అనిత దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహించారు.మండలంలోని అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి సమీపంలో సోమావతి నది ఒడ్డున వెలసిన  శ్రీఅక్కదేవతల ఆలయంలో శ్రావణ సోమవారం పురష్కరించుకుని గోరంట్ల మండలం శెట్టి చిన్నంపల్లికి చెందిన ఈశ్వరప్ప,అనిత దంపతుల ఆధ్వర్యంలో అక్కదేవతలకు  ప్రత్యేకపూజలు నిర్వహించి అనంతరం దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు పూజారి వెంకటేష్ తెలిపారు.

$$$_________@@@__________$$$

వాహనాలు తనిఖీ చేపట్టిన ఎస్ఐ


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,ఆగష్టు19(విజయస్వప్నం.నెట్)

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయం సమీపంలో బిళ్ళూరు మలుపు వద్ద ముమ్మరంగా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని,హెల్మెట్,సీట్ బెల్ట్ ధరించాలని,ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించాలని, పరిమితికి మించి ప్రయాణికులను తరలించరాదని, లైసెన్లు తదితర రికార్డులు అందుబాటులో వుండాలని ఎస్ఐ సూచించారు. కర్ణాటక నుండి మద్యం, మత్తు పదార్థాలు అక్రమంగా తరలిస్తే ఎంతటి వారినైనాన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మండలంలోని చెక్ పోస్టుల వద్ద ద్విచక్ర వాహనాలతో పాటు భారీ వాహనాలు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. సరిహద్దుల్లో పోలీస్  సిబ్బందితో గట్టి నిఘా వుంచి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేపట్టిన్నట్లు ఎస్ఐ  తెలిపారు.

$$$_________@@@__________$$$

జూనియర్ డాక్టర్ ని హత్య చేసిన వారిని శిక్షించాలి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు19(విజయస్వప్నం.నెట్)

కలకత్తా లో  హాస్పిటల్లో లేడి డాక్టర్ పై జరిగిన అత్యాచారం,హత్య కు సంబంధించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా హాస్పిటల్స్‌సేఫ్ జోన్ గా ప్రకటించాలని ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకట చలమయ్య,నాగరాజు, నర్సింహులు,ఎమ్మార్పీఎస్ లక్ష్మిపతి,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

$$$_________@@@__________$$$

ఎమ్మెల్యే ఎం.యస్.రాజుకు రాఖీ కట్టిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి19(విజయస్వప్నం.నెట్)

రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అనంతపురంలోని స్వగృహంలో సోమవారం మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుకి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.భారతీయ సంస్కృతి,సంప్రదాయాల్లో అనుబంధాలకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చారని,అన్నా చెల్లెలు,అక్కా తమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పౌర్ణమి నిదర్శనంగా నిలుస్తున్నదని సింధూర రెడ్డి అన్నారు.రక్షాబంధన్ సందర్భంగా పల్లె సింధూర రెడ్డి తనకు రాఖీ కట్టడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెస్ రాజు అన్నారు.

$$$_________@@@__________$$$

23న ఉపాధి హామీ పథకంపై గ్రామసభలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు19(విజయస్వప్నం.నెట్)

మండల వ్యాప్తంగా 14 పంచాయతీ గ్రామాల్లో ఈనెల 23న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులు గుర్తింపు,విధి విధానాలపై గ్రామసభలు నిర్వహించనున్నట్లు సోమవారం ఎంపిడిఓ వరలక్ష్మి ఓప్రకటనలో పేర్కొంటూ....గ్రామ పంచాయితీల వారిగా షెడ్యూల్ విడుదల చేశారు. అల్లాపల్లి, చింతమానుపల్లి, డబురువారిపల్లి, కొండకమర్ల, శేషయ్యగారిపల్లి తాండ, సున్నంపల్లి, తంగేడుకుంట గ్రామాల్లో అధికారులు, సిబ్బంది ఒక జట్టుగా అలాగే ఇనగలూరు, మిట్టపల్లి, మామ్మిళ్ళకుంట్లపల్లి, ఓడిచెరువు, తుమ్మలకుంట్లపల్లి, తిప్పేపల్లి, వెంకటాపురం పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి సంబంధిత అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించే ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు.కూలీలు,మేట్లు, శ్రమశక్తి సంఘాల సభ్యులు, గ్రామ సంఘాల సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొని ఉపాధి హామీ పథకం ద్వారా పనులను గుర్తిస్తారని తెలిపారు.

$$$_________@@@__________$$$

మీకు తెలుసా..?  హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం 


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి,ఆగష్టు19(విజయస్వప్నం.నెట్)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు కదిరి ప్రభత్వ జూనియర్ కళాశాలలో సోమవారం మీకు తెలుసా.... హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని జన జాగృతి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు,హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి,హెచ్.ఐ.వి/ఎయిడ్స్,క్షయ వ్యాధి సంబందం గూర్చి,సుఖ వ్యాధులు,చికిత్స గూర్చి,కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017, ఏఆర్టీ మందులు,ఏపిఎస్ఏసీఎస్ యాప్,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో  కదిరి ఐసీటీసీ వేంకటేశ్వర చౌదరి,డిఎస్ఆర్సీ  అరుణ,ఏఆర్టీ స్టాఫ్,వైఆర్జీ కేర్ స్టాఫ్,జూనియర్ కళాశాల అధ్యాపకులు,జన జాగృతి పి.యూ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాసులు, సిబ్బంది, ఏఎన్ఎంఅనసూయ, ఓఆర్ డబ్ల్యూ ప్యారి, నీరజ, శ్రీవాణి, రమాదేవి, నిర్మల, శిల్ప తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి