google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : ఉత్తమ లైన్ మెన్ అవార్డు అందుకున్న మోపూరి శ్రీనివాసులు - మండలంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - ఎస్ఐగా వెంకటనారాయణ బాధ్యతలు స్వీకరణ - ఆర్టీసీ బస్సును ఢీకొని యువకుడు మృతి - నేడు వైద్య సేవలు నిలిపివేత అత్యవసర సేవలకు మినహాయింపు - ప్రతి రైతు పెరటి తోటల పెంపకం చేపట్టాలి

17, ఆగస్టు 2024, శనివారం

ఉత్తమ లైన్ మెన్ అవార్డు అందుకున్న మోపూరి శ్రీనివాసులు - మండలంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - ఎస్ఐగా వెంకటనారాయణ బాధ్యతలు స్వీకరణ - ఆర్టీసీ బస్సును ఢీకొని యువకుడు మృతి - నేడు వైద్య సేవలు నిలిపివేత అత్యవసర సేవలకు మినహాయింపు - ప్రతి రైతు పెరటి తోటల పెంపకం చేపట్టాలి

ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వాడవాడలా వందేమాతరం









శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఆగష్టు15(విజయస్వప్నం.నెట్)

మండల వ్యాప్తంగా గురువారం ప్రభుత్వ,ప్రభుత్వేతర కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ జాకిర్ హుస్సేన్,మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీపీ షామీర్ పర్వీన్ భాను, పోలీసుస్టేషన్లో ఏఎస్ఐ రమణారెడ్డి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి భానుప్రకాష్,పల్లవి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపియం రమణప్ప, పశుసంవర్ధక కార్యాలయంలో వైద్యాధికారి ప్రవీణ్ కుమార్,ఎమ్మార్పీ భవనంలో ఎఃఈఓ1 సురేష్ బాబు,గ్రంధాలయం,బ్యాంక్, కార్యాలయాల్లో అధికారులు,గ్రామ పంచాయతీ సచివాలయాల్లో సర్పంచులు, గ్రామ కార్యదర్శులు జాతీయ జెండా ఎగురవేసి 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.మండల కేంద్రంలో తెదేపా  కార్యాలయంలో గురువారం మండల కన్వీనర్ జయచంద్ర,మాజీ జెడ్పీ సభ్యులు పిట్టా ఓబుళరెడ్డి ఆధ్వర్యంలో  తెదేపా నాయకులు కార్యకర్తల సమక్షంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు.మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడలి వద్ద గురువారం మండల సిఐటీయు నాయకులు కుళ్ళాయప్ప పోరాటాల శ్రీరాములు, హమాలీ యూనియన్ నాయకులు శ్రీనివాసులు, నాగరాజు, కాంతమ్మ, రామారావు, ఎమ్మార్పీఎస్ నాయకులు బావన్న,ఆనంద్,స్కూల్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.             ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో...! మండపం కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ2 రమణ, బాలుర వసతి గృహంలో వార్డెన్ రవీంద్రనాథ్ రెడ్డి, కస్తూరిబా బాలికల పాఠశాల ఎస్ఓ గీతబాయి ఉపాధ్యాయ బృందంతో కలిసి విద్యార్థుల సమక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతం ఆలపిస్తూ... వందనాలు సమర్పించి మిఠాయిలు పంచిపెట్టి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శ్రీవిజ్ఞాన్ పాఠశాలలో కరస్పాండెంట్ మస్తాన్,వశిష్ట స్కూల్ లో పిట్టా శివశంకర్ రెడ్డి,రైయిన్భో పాఠశాలలో జయసింహారెడ్డి,జ్ఞానసాయి విద్యానికేతన్ లో కే.మోహన్ రెడ్డి ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.ముఖ్య అతిధులుగా విచ్చేసిన వక్తలు మాట్లాడుతూ....ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే.... నేటి స్వాతంత్ర్య భారతావని అని,అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ....సమ సమాజ స్థాపనకు యువత బాటలు వేయాలని కోరారు. స్వాతంత్ర్య సమర యోధుల వేషధారణలో విద్యార్థులు జాతీయ జెండాలు చేతబూని వందేమాతరం గీతాలు ఆలపిస్తూ ప్రధాన రహదారిపై వాడవాడలా ర్యాలీ నిర్వహించారు.విద్యార్థుల నృత్యాలు,నాటికల ప్రదర్శనలు,సాంస్కృతిక కార్యక్రమాలు మండలవాసులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు బహుమతులు ప్రదానం  ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలో స్వాతంత్రం దినోత్సవ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం బహుమతులు ప్రదానం చేశారు.       పదిలో ప్రతిభ విద్యార్థులకు నగదు బహుమతులు

ఓడిచెరువు మండలంలోని తుమ్మలకుంట్లపల్లి గ్రామంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.ఈసందర్భంగా 2023...2024 విద్యా సంవత్సరంలో పదవతరగతి లో ప్రధమ,ద్వితీయ,తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన సునీల్, పావని, సుప్రియ ముగ్గురు విద్యార్థులకు అదే పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్.బాబా ఫకృధ్ధీన్ నగదు బహుమతులు అందజేశారు.ప్రధమ బహుమతి 5వేలు,ద్వితీయ, తృతీయ బహుమతులు 3వేలు,2 వేలు రూపాయలు చొప్పున విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం సమక్షంలో ఆర్థికసాయం అందజేశారు.ప్రార్థించే పెడవులకన్న సహాయం చేసే చేతులు మిన్న అని వ్యాయామ ఉపాధ్యాయుడు బాబా ఫకృధ్ధీన్ నిరూపించారని, గత పదేళ్లుగా పాఠశాలలో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బాబా ఫకృధ్ధీన్ ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుతున్నారని కొనియాడారు. ఈసందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు వ్యాయామ ఉపాధ్యాయుడు బాబా ఫకృధ్ధీన్ ను అభినందించారు. మండలంలోని ఆకుతోటపల్లి గ్రామ మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడు సుధాకర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.తెదేపా నాయకులు డీలర్ కుమార్ రాయల్, జనసేన పార్టీ నాయకులు సిసి కెమెరా శంకర్ ఆధ్వర్యంలో బాల బాలికలకు పుస్తకాలు అందజేశారు.కొండకమర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈసందర్…

$$$__________@@@__________$$$

ఉత్తమ లైన్ మెన్ అవార్డు అందుకున్న మోపూరి శ్రీనివాసులు


శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు15(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు ఎస్సీకాలనీకి చెందిన లైన్ మెన్ మోపూరి శ్రీనివాసులు 2024 ఏడాదికి  ఉత్తమ లైన్ మేన్ అవార్డు అందుకున్నారు.ఉత్తమ లైన్ మేన్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని,ఈ అవార్డుకు ఎంపిక చేసిన  అధికారులకు మోపూరి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు.78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలోని ఏపిఎస్పిడిసిఎల్ కార్యాలయంలో ఎస్ఈ సంపత్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ లైన్ మెన్ అవార్డుతో పాటు ప్రశంశా పత్రాన్ని అందుకున్నట్లు మండల విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పేర్కొంటూ....మోపూరి శ్రీనివాసులు ఉత్తమ లైన్ మేన్ అవార్డు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

$$$__________@@@__________$$$

మండలంలో ఘనంగా స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలు

పుర వీధుల్లో జాతీయ జెండాలతో  విద్యార్థులు ర్యాలీ



శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,ఆగస్టు15(విజయస్వప్నం.నెట్)

మండల వ్యాప్తంగా పంచాయతీ గ్రామాలలోని ప్రైవేటు,ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆయా సచివాలయాల్లోపంచాయతీ కార్యదర్శులు,ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వాతంత్రం దినోత్సవ వేడుకలను ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ,విద్యార్థులు సమన్వయంతో ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, వారి పోరాట పటిమలను విద్యార్థులకు క్షుణ్ణంగా తెలియజేశారు.మండల పరిధిలోని గురుకుల పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు.మండల రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ రామనాధరెడ్డి,మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో మునెప్ప,ఎంపీపీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి వందనాలు సమర్పించారు.మండల కేంద్రంలోని ప్రగతి  ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో బస్టాండ్ కూడలి నుండి పురావీధులు గుండా విద్యార్థులతో ర్యాలీ,మానవహారం నిర్వహించి స్వాతంత్రం దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మక్బూల్ బాషా నేతృత్వంలో ఘనంగా జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు.మండలంలోని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలో,సచివాలయ  కేంద్రాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల వైభవంగా నిర్వహించారు.ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర ఉద్యమంలో పోరాటాలు చేసి ప్రాణాలు త్యాగం చేసినటువంటి  గొప్ప మహానుబావులు భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్,అల్లూరి సీతారామరాజు,సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర సమరయోధులను స్మరించుకుని,నివాళులు అర్పిస్తూ ఘనంగా స్వాతంత్ర వేడుకలను నిర్వహించారు.ప్రతి ఒక్క విద్యార్థి తల్లితండ్రులను గౌరవించుకుంటూ,మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలని ఉసందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అమృత  మండల మహిళా సమాఖ్య జెండర్ ఏటీఎం గోపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులు స్కూల్ కమిటీ చైర్మన్లు ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలల, విద్యార్థులు, ఉపాధ్యాయులు, రెవిన్యూ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు. మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి మూనా, అపర్ణ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా పీహెచ్ఎన్ సూర్యకుమారి,హెల్త్ అసిస్టెంట్ గోపాల్ నాయక్,జేకే పల్లి ఆశ కార్యకర్త టి.రమణమ్మల సేవలను గుర్తించి డాక్టర్ మూనా,డాక్టర్ అపర్ణలు ప్రశంసించారు అనంతం అవార్డు బహుమతులు ప్రదానం చేశారు.

$$$__________@@@__________$$$

ఎస్ఐగా వెంకటనారాయణ బాధ్యతలు స్వీకరణ

 శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,ఆగష్టు15(విజయస్వప్నం.నెట్)

మండల పోలీసుస్టేషన్ ఎస్ఐగా వెంకటనారాయణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా మండలంలో విధులు నిర్వహిస్తున్న వెంకటనారాయణ ఈసీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా నగరికి బదిలీపై వెళ్లారు.అప్పటినుండి మక్బూల్ బాషా మండలంలో ఎస్ఐగా నిర్వహిస్తూ.... తాజాగా ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఎస్ఐ వెంకటనారాయణ యధాతధంగా మండల పోలీసుస్టేషన్ లో భాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు ఆగస్టు15(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో అమడగూరు యూత్ అసోసియేషన్ (184/2022 గుర్తింపు పొందిన)ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలు,జూనియర్ కళాశాలలో 2023-24 గాను అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆయా పాఠశాలల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని,విద్యార్థులకు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమతి రూ 3000 వేలు చొప్పున కె.సుమన్ బాబు,సి.మల్లికార్జున,మధుసూదన రెడ్డి,మంజునాథ బాబు,నటేష్ విద్యార్థులకు డాక్టర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు.

చందు 590/600(అమడగూరు జిల్లా పరిషత్ పాఠశాల)ప్రశాంత్ 582/600( మహమ్మదాబాద్ జిల్లా పరిషత్ పాఠశాల)మమత 497/600(పూలకుంట్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాల)ఎ. మఇందు 558/600(కస్తూరిబా బాలికల పాఠశాల)ఓబులేని గానవి 556/600(ఏపీ మోడల్ స్కూల్ అమడగూరు)పఠాన్ తబస్సుమ్ 536/600(తుమ్మల జిల్లా పరిషత్ పాఠశాల)హర్షవర్ధన్ 479/600(జేకే పల్లి జిల్లా పరిషత్ పాఠశాల)బరవ సంధ్య 471/600(చిన్నగానిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల)బురుజు ఐశ్వర్య 942/1000(అమడగూరు  ప్రభుత్వ జూనియర్ కళాశాల) విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు టైలర్ రామాంజి,అధ్యక్షులు నాగార్జున,ఉపాధ్యక్షులు సద్దాం, కార్యదర్శి అశోక్,సహాయ కార్యదర్శి సులేమాన్, కోశాధికారి శివశంకర,ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శివశంకర,బషీర్ ,రేవన్ పిల్లంజి,సింహ,పల్సర్ పవన్,సూరన్న,కాలేష్ చంద్రహాసన్,వినయ్,జీవన్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

తెదేపా కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర

కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,టీడీపీ ప్రజా ప్రతినిధులు,నాయకులు

శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తిఆగష్టు15(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి మున్సిపాలిటీ సమీపంలో గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిలు జాతీయ జెండా ఎగురవేసి,జాతీయ గీతం ఆలపించి జెండా వందనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ....78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం ఘనంగా జరుపుకుంటున్నామన్నరు.దేశ స్వాంత్య్రానికి  కృషిచేసిన సమరయోధుల పోరాటం,అమరవీరుల త్యాగఫలం,బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయాన్ని సాధించి మనకు స్వాతంత్రం సాధించారని గుర్తు చేశారు.స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేడు దేశ వ్యాప్తంగా మనం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని,అందుకు కృషి చేసిన వారందరికీ శిరస్సు వంచి వందనాలు సమర్పిస్తునట్లు తెలిపారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ....ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త నూతన ఆర్థిక శకం మొదలైందన్నారు. సిఎం చంద్రబాబు నాయకత్వంలో సుపరిపాలనే లక్ష్యంగా అవినీతి రహిత సమాజ స్థాపన లక్ష్యంగా పారదర్శక పాలన సాగుతోందని,టీడీపీ కూటమి ప్రభుత్వం సర్వతో ముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెదేపా,జనసేన,బిజెపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఆర్టీసీ బస్సును ఢీకొని యువకుడు మృతి

 శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,ఆగస్టు15(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని బిళ్ళూరు ప్రధాన రహదారి సమీపంలో నారాయణస్వామి మఠం మలుపు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కదిరికి చెందిన యువకుడు అల్లా బకాష్ మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు అల్లా బకాష్ ఇటీవలే డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం బెంగళూరుకి వెళ్ళాడని అయితే గురువారం స్వగ్రామం కదిరికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా మార్గమధ్యంలో నారాయణస్వామి మఠం మలుపు వద్ద కదిరి నుండి బాగేపల్లి కి వెళ్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొన్నాడని, ఈ ప్రమాదంలో అల్లా బకాష్ తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

$$$__________@@@__________$$$

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి పూజలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు16(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాల్లో పూజలు నిర్వహించారు.మహిళలు స్వగృహాల్లో వివిధ రూపాల్లో వరలక్ష్మి అమ్మవారి ప్రతిమలను మందిరాలలో పట్టు వస్త్రాలతో అలంకరించి,పసుపు,కుంకుమ, ధూపదీప నైవేద్యాలు,పిండి పదార్ధాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.పూజల్లో పాల్గొన్న మహిళలకు పసుపు,కుంకుమ,నూతన వస్త్రం,గాజులు,కంకణాలు అందించి వరలక్ష్మి వ్రతం ఆచరించి,పంచామృతం,తీర్థ అన్నప్రసాదాలు అందించారు.

$$$__________@@@__________$$$

గురుకులంలో అటల్ బిహారీ వాజపేయికీ నివాళి

శ్రీసత్యసాయిజిల్లా,కదిరి, ఆగస్టు16(విజయస్వప్నం.నెట్ )

భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా సేవా భారతి ఆధ్వర్యంలో స్థానిక మాధవ గురుకులంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి కిసాన్ మోర్చా ఆర్గానిక్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.... భారత రాజకీయాల్లో అటల్ బిహారీ వాజపేయి యువ రాజకీయ నాయకులకు ఆయన జీవితం ఎంతో ఆదర్శప్రాయమైందని కొనియాడారు.సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి అసాధారణమైన ప్రతిభ కనబరిచి భారత ప్రధాని స్థాయికి ఎదిగిన ఆయన జీవితం విద్యార్థులందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.తన జీవితాన్ని ఈసమాజ సేవ కోసం అంకితం చేసిన  మహావ్యక్తి అటల్ బిహారి వాజపేయి అని ఆయన అన్నారు.దేశం కోసం,ధర్మం కోసం,సమాజ హితం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు అటల్ బిహారి వాజపేయి అని,భారత రాజకీయాల్లో అజాతశత్రువుగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు గౌరవించే గొప్ప వ్యక్తిత్వం అటల్ బిహారీ వాజపేయి సొంతమని,భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్ర దేశంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన వారిలో వాజపేయి ఒకరని ఆయన తెలిపారు.ఇతర కార్యకర్తలకు ఆయన జీవితం ఎంతో ఆదర్శప్రాయమని ఆయనను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.ఈసందర్భంగా ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శరత్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈకార్యక్రమంలో సేవా భారతి అధ్యక్షులు మట్ట చెన్నారాయశెట్టి,బిజెపి ఎస్టీ మోర్చా జోనల్ ఇంచార్జ్ హరినాయక్,రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ గోపాలకృష్ణ,రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

జీవో 171 వెంటనే రద్దు చేయాలి

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు16(విజయస్వప్నం.నెట్)

విద్యా వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారిన జీవో నెంబర్ 171,128లను వెంటనే రద్దు చేయాలని,పాఠశాలల్లోని ఉపాధ్యాయుల కొరతను తీర్చుటకు సర్దుబాటు ప్రక్రియ కాకుండా అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని,పాఠశాలలో కేవలం ఇంగ్లీష్ మీడియంతో పాటు సమాంతరంగా తెలుగు మీడియం కొనసాగించాలని,నూతనంగా సి బి ఎస్ సి సిలబస్ లోకి మార్చినటువంటి పాఠశాలను తిరిగి స్టేట్ సిలబస్ లోకి మార్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ శుక్రవారం ప్రభుత్వానికి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారని తెలిపారు.

$$$__________@@@__________$$$

నేడు వైద్య సేవలు నిలిపివేత

అత్యవసర సేవలకు మినహాయింపు:ఐఎంఏ

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి,ఆగష్టు16(విజయస్వప్నం.నెట్)

పశ్చిమ బెంగాల్ లోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా ఒక రోజు వైద్య సేవలను నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శుక్రవారం పిలుపునిచ్చింది.ఈ మేరకు నేడు 17వతేది(శనివారం)ఉదయం 6 గంటల నుండి 18వతేదీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు కదిరి ప్రాంతంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రిలలో వైద్య సేవలు నిలిపివేయాలని కదిరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ నిర్ణయించిందని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మదన్ మోహన్ ప్రకటనలో తెలిపారు.అత్యవసర సేవలకు మినహాయించినట్లు పేర్కొంటూ.... ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.సమాజం తలదించుకునే ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని,భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి ఘటనలు చేయాలని ఆలోచన కూడా రావాలంటే భయపడే విధంగా చట్టాలు రూపొందించాలని కదిరి ఐఎంఏ సెక్రటరీ  డాక్టర్ హుస్సేన్,ట్రెజరర్ డాక్టర్ విద్యాసాగర్ ఈసందర్భంగా  పేర్కొన్నారు.

$$$__________@@@__________$$$

ప్రతి రైతు పెరటి తోటల పెంపకం చేపట్టాలి


ఓడిచెరువు ఆగష్టు16(విజయస్వప్నం.నెట్)

ఐవిడి ఇంటిగ్రేటెడ్ విలేజ్ డెవలప్మెంట్,ఏకల్ గ్రామోత్తర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రములో రామాలయం వద్ద రైతులకు పెరటి తోటల మొక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఐవీడి జిల్లా ఇంఛార్జ్ ఆర్ట్ శేషాద్రి,ఐవీడి మండల ఇంఛార్జ్ పిట్టా ప్రభాకర్ రెడ్డి,కోఆర్డినేటర్ శ్రీరాములు,ఏక్తల్ ఇంచార్జ్ రాధాకృష్ణలు మాట్లాడుతూ.... ఇంటి పెరటిలో తోటల పెంపకంతో ఆరోగ్యంగా ఉండాలని,సహజంగా లభించే పండ్లు మన చెంతనే వుండాలని,మన ఇంటి చుట్టుపక్కల పెరటి తోటల్లో  కూరగాయలు పండించి వంటల్లో వాడటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామన్నారు.గృహా ఆవరణలో పెరటి మొక్కలు, తోటల పెంపకానికి సీజన్లో దొరికే మామిడి,సపోటా,జామ,నిమ్మ, ఉసిరి మొక్కలు పంపిణీ చేసి, కూరగాయలు,పండ్ల తోటల పెంపకం వల్ల కలిగే ఉపయోగాలు తెలియజేస్తూ.... పండ్లను తినండి వ్యాధులను తరిమి కొట్టండి అనే నినాదంతో సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొంటూ....రైతులకు ఉచితంగా 1200 మొక్కలను వారి పేరు ఫోన్ నెంబర్లను నమోదు చేసుకొని ఉచితంగా అందచేశారన్నారు.గతంలో ఏక్తల్ సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కుర్రాడి భవనంలో యువతకు ఉచితంగా టైలరింగ్, కంప్యూటర్ శిక్షణ తరగతులు తదితర సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వారు ఈసందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో బిజేపీ జిల్లా యువ మోర్చా కార్యదర్శి నరేష్ బాబు, ఇనిస్టిట్యూట్ ట్రైనర్ కే.శ్రఈనాధ్, ఇంఛార్జ్ గంగిశెట్టి, అభియాన్ ప్రముఖ్ ప్రసాద్ పాల్గొని రైతులకు ఉచితంగా నాలుగు రకాల మొక్కలు పంపిణి చేశారు.

$$$__________@@@__________$$$

దేశాభివృద్ధి....గ్రామాల అభివృద్ధితోనే సాధ్యం


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు17(విజయస్వప్నం.నెట్)

గ్రామాల అభివృద్ధితోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారం శ్రీరామ్ భరత్ కుమార్  పేర్కొన్నారు.  మండలంలోని సున్నంపల్లి పంచాయతీ గ్రామంలో శనివారం గ్రామ వికాసంపై ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య  క్షేత్ర శ్రీరామ్ భరత్ కుమార్ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసే రైతులు రోజురోజుకు తగ్గిపోతున్నారన్నారు.ప్రస్తుతం రైతులు తమ  పిల్లలకు  ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే ఆలోచనతో ఉన్నారన్నారు.గ్రామాలలో రైతులు పండించే పంటలు అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడడం వలన భూమి సాంద్రత క్షీణించి,పంట దిగుబడులు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పూర్వం రైతులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని సేంద్రియ ఎరువుల ద్వారా ఆహారధాన్యాలు పండించే వారని దానివల్ల పెట్టుబడి తక్కువగా ఉండి అధిక రాబడితో  రైతులకు వ్యవసాయంలో నష్టం వచ్చేది కాదని ఆయన పేర్కొన్నారు.గ్రామాల్లో గోవులు పూర్తిగా కనుమరుగు అవుతున్నాయన్నారు.ప్రతి ఒక్కరూ గోసంరక్షణ కోసం అవగాహన కల్పించాలని ఆయన కోరారు.అనంతరం గోవులను పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈకార్యక్రమంలో గ్రామ వికాసం రాష్ట్ర సంయోజకలు తిరుపతయ్య,విభాగ సంయోజక సున్నపల్లి చంద్ర,కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింత కుమార్ రెడ్డి,జిల్లా సంయోజ దేవరాజు,కండ సమయోజక్ సుబ్బరాజు,జిల్లా సంస్కార ప్రముక్ రంగప్ప,ప్రసాద్,రామమోహన్ రెడ్డి,సురేష్,హరి,ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారఖ్  లక్ష్మణ్ జీ,ప్రతాప్,హర్ష, వీరు ప్రసాద్ తదితరుల పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

భక్తులతో కిటకిటలాడిన పాలపాటి ఆంజన్న సన్నిధి

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)నల్లచెరువు, ఆగష్టు17(విజయస్వప్నం.నెట్)

నల్లచెరువు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పాలపాటి దిన్నె ఆంజనేయస్వామి సన్నిధిలో రెండో శ్రావణ మాస శనివారం భక్తులతో కిటకిటలాడింది.మండల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు,అన్నప్రసాదాలు స్వీకరించి, స్వామివారి ఉత్సవ ఊరేగింపులో పాల్గోన్నారు.భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

$$$__________@@@__________$$$

ఘనంగా పల్లె ఉమా 62వ జయంతి వేడుకలు





శ్రీసత్యసాయిజిల్లా, అమడగూరు/ఓడిచెరువు/నల్లమాడ ఆగష్టు17(విజయస్వప్నం.నెట్)

 నియోజకవర్గలోని అమడగూరు,ఓడిచెరువు,నల్లమాడ మండలాల్లో తెదేపా నాయకులు ఆధ్వర్యంలో శనివారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి కీ"శే" పల్లె ఉమా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమడగూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కీర్తిశేషులు పల్లె ఉమా జయంతి వేడుకలను తెదేపా నాయకులు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి  ఘనంగా నిర్వహించారు.అనంతరం గాజులపల్లి సమీపంలో శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు,మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు పాలు,బ్రెడ్లు,పండ్లు అందజేశారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి కాలేనాయక్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ కృష్ణమూర్తి,సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి,రాజారెడ్డి, రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి టైలర్ రమణ, సుధాకర్ రెడ్డి, వడ్డెర సంఘం అధ్యక్షుడు కిష్టప్ప, రామచంద్ర, నంజిప్ప, బోడెప్ప, ఫోటో స్టూడియో మూర్తి,టైలర్ రామాంజులు,రంగా,ఈశ్వర్ రెడ్డి,తిరుపాల్,చలమయ్య,కళ్యాణ్ రెడ్డి,దొడ్డం అశోక్,డీలర్లు గాయత్రి,గంగరాజు, మోహన్,భాస్కర్ రెడ్డి,లక్ష్మీ నర్సిరెడ్డి,అబ్దుల్ రవూఫ్,రెడ్డప్ప,కె.వి.రమణ,ఆ దెప్ప,రామకృష్ణ మూర్తి,వార్డు సభ్యులు  పాల్గొన్నారు.

ఓడిచెరువులో... 

ఓడిచెరువు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పల్లె ఉమ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.తెదెపా మండల కన్వీనర్ జయచంద్ర ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. సర్పంచ్ రేణుకాబాయి, డాక్టర్ జాకీర్ హుస్సేన్, తెదేపా ‌సీనియర్ నాయకులు,కార్యకర్తలు నాగిరెడ్డిగారి రాజారెడ్డి, టైలర్ నిజాం,ప్రధాన కార్యదర్శి పీట్లా సుధాకర్, పాఠశాల కమిటీ ఛైర్మన్ శ్రీనివాసులు,సౌదీ నాగరాజు,చాంద్ బాష, షబ్బీర్, డీలర్ నాగేంద్ర, మునినాయుడు, షాను, కుమార్ రాయల్,ఆరీఫ్, శివారెడ్డి, కిష్టప్ప, గంగాద్రీ,బడిశం సురేష్,ఆంజన్ రెడ్డి, రాజగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, జరిపిటి అంజనప్ప, మీసేవ సుధాకర్, రమణారెడ్డి, బోనాల రామాంజనేయులు, సాంబ శివారెడ్డి, మల్లికార్జున, మస్తానమ్మ, నాగవేణి, అఖిల, సుభాషిణి, సూరి తదితరులు పాల్గొన్నారు.          నల్లమాడలో....! మండల కేంద్రంలో తెదేపా శ్రేణులు సత్తెమ్మ ఆలయం వద్ద శనివారం పల్లె ఉమ జయంతి సందర్భంగా 500 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమంలో తెదేపా నాయకులు బుట్టి నాగభూషణం నాయుడు,చిట్టిబాల రాజారెడ్డి, రవికుమార్,డీలర్ శివప్రసాద్ రెడ్డి,మైల రామచంద్ర, మహేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.


ప్రజలను రక్షించే వైద్యులను రక్షించండి

24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేత: ఐఎంఏ కోల్ కత్తాలో వైద్యురాలిపై  అత్యాచారం, హత్య కేసులో న్యాయం కోసం డిమాండ్ వైద్య సిబ్బందికి కేంద్ర రక్షణ చట్టం చేయాలి

ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠిన తరం చేయాలి


శ్రీసత్యసాయిజిల్లా,కదిరి(ఓడిచెరువు)ఆగష్టు17(విజయస్వప్నం.నెట్)

కోల్ కతాలో ఆర్.జీ.కర్ ప్రభుత్వ వైద్య కళాశాల  ఆగస్టు 9వ తేదీ రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి  పాశవికంగా హత్య చేసిన కేసులో సత్వర న్యాయం డిమాండ్ చేస్తూ....దానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న ఆర్ జి కర్ వైద్య కళాశాల ఆసుపత్రి విద్యార్థులు,వైద్యులపై ఆగస్టు 14వ తేదీ రాత్రి రౌడీముకల దాడులను నిరసిస్తూ....జాతీయ ఐఎంఏ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖల సందర్భంగా  17వ తేదీ నుండి 24 గంటలపాటు వైద్య సేవలు నిలిపివేయాలని పిలుపునివ్వడం,అందులో భాగంగా కదిరి శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కదిరి పట్టణంలో అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో అత్యవసర సేవలు మినహాయించి,ఓపిడి సేవలు,అత్యవసరం కాని శస్త్ర చికిత్సలు పూర్తిస్థాయిలో నిలిపివేసి వైద్య బృందం,పారా మెడికల్ సిబ్బంది, ఆరోగ్య,ఆశ సిబ్బందితో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు..ఈసందర్భంగా ఐఎంఏ శాఖ వైద్యులు  మాట్లాడుతూ...ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి,సిబిఐ ఆధ్వర్యంలో త్వరితగతిన నేర పరిశోధన పూర్తి చేసి,నేరానికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని,ఆసుపత్రులలో డ్యూటీలో ఉన్న వైద్యులకు,వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని,ప్రత్యేక రక్షణ చట్టాలు కేంద్ర స్థాయిలో తీసుకురావాలని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠిన తరం చేయాలని కదిరి ఐఎంఏ శాఖ అధ్యక్షుడు డాక్టర్ మదన్ కుమార్,కార్యదర్శి హుస్సేన్, కోశాధికారి డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ శంకరయ్య తదితరులు డిమాండ్ చేశారు.ఈ నిరసన తర్వాత ప్రభుత్వాలు తీసుకునే చర్యలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని,తమ డిమాండ్లు సాధించే వరకు ఈఉద్యమాన్ని ఆపేది లేదని,అవసరమైతే మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.వృత్తి నిర్వహణలో రక్షణ కల్పించమని అడుగుతున్న తమ న్యాయమైన డిమాండ్ల కొరకు ముఖ్యంగా ప్రైవేటు వైద్యులు, వారి ఆసుపత్రి సిబ్బంది, ప్రభుత్వ వైద్య సిబ్బంది,అంగన్వాడి,ఆరోగ్య, మఆశ కార్యకర్తలు, పారామెడికల్ స్టాఫ్, మెడికల్ దుకాణాల యజమానులు, ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావి సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొన్నారని వారి ఈసందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కదిరి శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు.

$$$__________@@@__________$$$

నగిరి పట్టణ సీఐగాఎం.మహేశ్వర్ బాధ్యతల స్వీకరణ

శ్రీసత్యసాయిజిల్లా,ఆగష్టు17 (విజయస్వప్నం.నెట్)

చిత్తూరు జిల్లా,నగరి పట్టణ సిఐగా ఇదివరకు పనిచేస్తున్న సురేష్ బదిలీపై శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో ఎం.మహేశ్వర్ సిఐ గా నగిరి పోలీస్ స్టేషన్ లో శనివారం బాధ్యతలు స్వీకరించారు.ఈయన కళ్యాణ్ డ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సిఐగా విధులు నిర్వర్తిస్తూ.... ఇప్పుడు నగరి పోలీస్ స్టేషన్ కు బదిలీ అయి బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతలు స్వీకరించిన సీఐ మహేశ్వర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ,లా అండ్ ఆర్డర్ విషయంలో తన విధిని సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి