తల్లిపాలతోనే.... బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు/ అమడగూరు, ఆగష్టు07(విజయస్వప్నం.నెట్)
తల్లిపాలతోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఓడిచెరువు,అమడగూరు సూపర్వైజర్లు తల్లిపాలు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించారు.అమడగూరు మండల పరిధిలోని కొట్టువారిపల్లిలో బుధవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ గంగాదేవి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు,గర్భిణీలు బాలింతలతో కలిసి తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ గంగాదేవి మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు అమృతంతో సమానమని,పిల్లలు శారీరక,మానసిక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని, తల్లిపాలు తాగే చిన్నారుల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందన్నారు.బిడ్డకు తొలి మూడు రోజులపాటు తల్లి నుంచి వచ్చే ముర్రిపాలు తాగించాలని ఈ పాలలో ఇమ్యునో గ్లోబిన్స్ అధికంగా ఉంటాయని పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లులు ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పౌష్టికాహారం తీసుకోవాలని,తల్లి తన పిల్లలను అంగన్వాడి కేంద్రానికి పంపాలని,ఆటపాటలతో విద్య నేర్పిస్తారని ఆమె తెలిపారు.ఈకార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఓడిచెరువులో తల్లిపాల వారోత్సవాలు.
ఓడిచెరువు మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయ్ కుమారి ఆధ్వర్యంలో మండలంలోని గౌనిపల్లి అంగన్వాడి కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వార్షికోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం తల్లిపాలు విశిష్టతపై అవగాహన కల్పిస్తూ....ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరం ఆంధ్రాలను పూరించి తల్లిపాలు సంస్కృతి చేద్దాం అనే ధ్యేయంతో తల్లిపాలు వార్షికోత్సవం జరుపుకుంటున్నారని తెలిపారు.పిల్లలకు పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగించాలి,మొదట ఆరు నెలల తల్లిపాలు మాత్రమే త్రాగించడం ఆరు నెలలు పూర్తి అయిన తర్వాత అదరపు పౌష్టికాహారంతో పాటు రెండు సంవత్సరాలు తల్లిపాలు కొనసాగించాలని,ఇలా జరగని కారణంగా ప్రతి యేటా లక్షల మంది పిల్లలకు విరోచనాలు,నిమోనియాతో ప్రాణాలు కోల్పోతున్నట్లు అన్ని సర్వేలు తెలుపుతున్నాయని,పిల్లలు అనారోగ్యం భారిన పడకుండా,వయసుకు తగిన బరువు,ఎత్తుతో ఆరోగ్యంగా ఉండాలంటే పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు తాగించడం,మొదట ఆరు నెలల బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం చేయాలని,దీనివల్ల పిల్లలలో రోగనిరోధక శక్తి పెరిగి అలర్జీలు,ఇన్ఫెక్షన్ భారిన పడకుండా ఉంటారని,తల్లిపాలల్లో విటమిన్లు,ఖనిజాలు,ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్,క్రూవులు పుష్కలంగా ఉంటాయని అంతేకాకుండా తల్లిపాలు త్వరగా జీర్ణమై పిల్లలకు జీర్ణ సమస్యలు రాకుండా నిరోధిస్తాయని.పోతపాలు పిల్లలకు ప్రాణాంతకమని,ప్రతి తల్లి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని దీని వలన తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు.బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి కొన్ని క్యాన్సర్లు రాకుండా ఉంటాయని,తల్లికి బిడ్డకు చక్కని అనుబంధం ఏర్పడుతుందని తదితర అంశాలపై గర్భిణీలకు, బాలింతలకు, పిల్లల తల్లులకు అవగాహన కల్పించారు.అంతక ముందు తల్లిపాలు వారోత్సవ ర్యాంక్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ బోధకులు షేమీమ్,ఎంఎల్ హెచ్ పి వసుంధర,ఆరోగ్య,ఆశ కార్యకర్తలతో పాటు గ్రామ గర్భవతులు,బాలింతలు, పిల్లల తల్లులు గ్రామస్తులు పాల్గొన్నారు.
$$$_________@@@_________$$$
షాదీమహల్ మరమ్మతులకు ప్రతిపాదన
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు08(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో షాదీమహల్ మరమ్మత్తుల కోసం బుధవారం పంచాయతీ రాజ్ జేసీ జానకి రామయ్యతో తేదేపా మండల కన్వీనర్ జయచంద్ర,జౌళి బాబా,కంచి సురేష్, తుమ్మల మహబూబ్ బాషా,షాను,సౌదీ నాగరాజు,రమణ తదితరులు నాయకులు కలిసి షాదీమహల్ ను సందర్శించి పరిశీలించి,గత ఐదేళ్లుగా షాదీమహల్ ను పట్టించుకోలేదన్నారు, షాదీమహల్ పైన రేకులు పూర్తిగా మార్చాలని ఏఈ తెలిపారు.షాదీమహల్ డైనింగ్ సదుపాయాలు తదితర మరమ్మత్తుల పనుల కోసం ఎస్టీమేషన్ వేసి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి దృష్టికి ప్రతిపాదన తీసుకెళ్తామని తెదేపా నాయకులు తెలిపారు.
$$$_________@@@_________$$$
తహశీల్దార్ కు తెదేపా నాయకులు సన్మానం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు08(విజయస్వప్నం.నెట్)
గత రెండు రోజుల క్రితం నూతనంగా భాధ్యతలు చేపట్టిన తహశీల్దార్ అనంతాచారికి తెదేపా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.మండల రెవెన్యూ కార్యాలయంలో బుధవారం నూతన తహశీల్దార్ గా భాధ్యతలు చేపట్టిన అనంతాచారిని తెదేపా మండల కన్వీనర్ జయచంద్ర, ప్రధాన కార్యదర్శి పీట్లా సుధాకర్,రాష్ట్ర బిసీ సెల్ కార్యదర్శి అంజనప్ప, మైనారిటీ నాయకులు షబ్బీర్,షాను, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ ఆరీఫ్ ఖాన్,రంగారెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువా కప్పి సన్మానించారు.మండలంలోని గ్రామాల్లో భూమి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు తీసుకురావాలని వారు కోరారు.
$$$_________@@@_________$$$
పదెకరాల పండ్లతోటల సాగుకు అధిష్టాన దృష్టికి: బిజేపీ నాయకులు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు08(విజయస్వప్నం.నెట్)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకంపై ఏపీఓ సుధాకర్ తో కలిసి బుధవారం బిజేపీ నాయకులు అడిగి తెలుసుకున్నారు.మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో పండ్ల తోటల పెంపకం పధకం రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ పథకాన్ని 5 ఎకరాలే కాకుండా 10 ఎకరాల వరకు సాగు చేసుకోవడానికి పొడిగించాలని,రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారని బిజేపీ మండల అధ్యక్షులు రంగారెడ్డి, కార్యవర్గ సభ్యులు డాక్టర్ హరికృష్ణ, ఎస్సీ సెల్ యువమోర్చా జిల్లా కార్యదర్శి మారప్ప, యువమోర్చా జిల్లా కార్యదర్శి నరేష్ తదితర కార్యకర్తలు తెలిపారు.
$$$_________@@@_________$$$
విస్తృతంగా ఉపాధి పనులు కల్పించండి: ఎపిడీ
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు07(విజయస్వప్నం.నెట్)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 2024-25 సంవత్సరంలో మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పనిదినాలు కల్పించాలని ఏపిడి శ్రీనివాస రెడ్డి తెలిపారు.బుధవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఆయన పనుల ప్రగతిని,లక్ష్యాన్ని సమీక్షించారు.ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి పనులు కల్పించాలని,దీంతో గ్రామాల శాశ్వత సుస్తిరాభివృద్ధి ఉపయోగించుకొని ప్రభుత్వ ఆశయాల సాధించాలని సూచించారు.అదేవిదంగా పనులలో నాణ్యత ప్రమాణాలను పెంపొంచిండానికి తీసుకోవలసిన చర్యలు గురించి క్వాలిటీ కంట్రోల్ అధికారులు ప్రభాకరరెడ్డి,కృష్ణమోహన పలు అంశాలను సిబ్బందికి తెలిపారు.కార్యక్రమంలో ఎపీఓ సుధాకర్,ఏపీడీ సహాయకులు ప్రతాపరెడ్డి,టీఏలు ఆంజనేయులు, చంద్రారెడ్డి, హనుమంతురెడ్డి, నాగముని, సిఓ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
$$$_________@@@_________$$$
మాతృశ్రీ వృద్ధాశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు
మండల పరిధిలోని గాజులపల్లి గ్రామ కూడలి వద్ద బుధవారం శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఓడిచెరువు మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులు గోపీనాథ్,శారదా దంపతుల కుమారుడు సాయి యశ్వంత్ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఆశ్రమ నిర్వాహకరాలు అరుణజ్యోతి మాట్లాడుతూ సాయి యశ్వంత్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశ్రమం తరపున శుభాకాంక్షలు తెలిపారు.ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన గోపీనాథ్,శారద దంపతుల ముద్దుల కుమారుడు సాయి యశ్వంత్ కు ఆమె హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.దాతలు ఒక్క పూట వృద్ధులకు భోజనం ఆశ్రమంలో ఏర్పాటు చేయాలనుకుంటే ఈనంబరుకు 9381750414 ఫోన్ చేసి సంప్రదించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,ఆశ్రమ వృద్ధులు తదితరులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి