ప్రశాంతంగా పాఠశాల కమిటీ ఎన్నికలు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఆగష్టు08(విజయస్వప్నం
నెట్)మండల పరిధిలోని 78 ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం ప్రశాంతంగా స్కూల్ కమిటీ ఎన్నికలు నిర్వహించారని 1ఎంఈఓలు సురేష్ బాబు,2ఎంఈఓ రమణ తెలిపారు.6 జిల్లా ఉన్నత పాఠశాలలు,కస్తూరిబా బాలికల పాఠశాలతో పాటు 71 ప్రాధమిక,ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ చైర్మన్లు,వైస్ చైర్మన్లు ఎన్నుకున్నారని తెలిపారు.
జిల్లా పరిషత్ పాఠశాలల ఛైర్మన్లు వీరే....!!
కస్తూరిబా బాలికల పాఠశాల కమిటీ ఛైర్మన్ పి.బాగ్యమ్మ(వైస్ చైర్మన్ ఎం.రంగమ్మ)
కొండకమర్ల జిల్లా పరిషత్ పాఠశాల కమిటీ ఛైర్మన్ పి.రవీంద్ర(వైస్ చైర్మన్ షబానా)
మిట్టపల్లి పాఠశాల ఛైర్మన్ వి.ప్రసాద్(వైస్,, పి.నాగులమ్మ)
ఓడిచెరువు ఛైర్మన్ ముద్దలపల్లి శ్రీనివాసులు (వైస్,,వి.వెంకటరమణమ్మ)
గౌనిపల్లి ఛైర్మన్ ఎం.రాజేష్(వై,,సునితమ్మ)
తంగేడుకుంట ఛైర్మన్ కే.రమణయ్య(వై,,టి.నందిని)
తుమ్మలకుంట్లపల్లి ఛైర్మన్ ఎస్.అంజనప్ప నాయుడు(వై,,టి.శ్రీనివాసులు)
6 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల కమిటీ చైర్మన్లుగా ఎన్నుకున్నారు.
వీరే....ప్రాధమిక పాఠశాలల కమిటీ చైర్మన్లు....!
కొండకమర్ల ప్రాధమిక పాఠశాల కమిటీ ఛైర్మన్ జి.బాస్కర(వైస్ చైర్మన్ బి.అశ్వని)
కొండకమర్ల(హరిజనవాడ) ప్రాధమిక పాఠశాల కమిటీ ఛైర్మన్ పి.మురళి(వై,,పి.కవిత)
కొండకమర్ల ఉర్దూ పాఠశాల కమిటీ ఛైర్మన్ నూర్ మహ్మద్(వై,,షమీమ్)
గంగిరెడ్డిపల్లి ఛైర్మన్ ఎం.రాజిబాయ్(వై,, కే.శ్రీనివాసులు)
నాయనకోట తాండా ఛై,, జి.జ్యోతిభాయి(వై,,బాబుజీనాయక్)
ఎస్జీటీ తాండా ఛై ,,కే.బాలాజీనాయక్(వై,,కే.నాగమణిభాయి)
శేషయ్యగారిపల్లి ఛై,,పి.లక్ష్మన్న(వై,,ఎం.దుర్గాభాయి)
బొడిగుడ్లపల్లి ఛై,,పి.హరినాథ్(వై,,పి.ఎం.గంగ)
ఎద్దులవారిపల్లి ఛై,,బి.ధశరథనాయక్(వై,,ఎస్.కవిత)
జీబిపల్లి తాండా ఛై,,ఎం.రవీంద్రనాయక్(వై,,ఆర్.కుమారిభాయి)
సిఎం పల్లి ఛై,,ఎన్.మధుసుధన్(వై,,కే.నారాయణ)
నాయనకోట ఛై,,బి.హరికృష్ణ(వై,,జీ.సౌజన్య)
కాటమరెడ్డిపల్లి ఛై,,జి.గోవిందు(వై,,వి.లలిత)
నావాబుకోట ఛై,,కే.ఈశ్వరయ్య(వై,,జి.మమత)
చింతమానుపల్లి ఛై,,ఇ.శ్రీనివాస్(ఎం.శైలజ)
జంబులవాండ్లపల్లి ఛై,,డి.వెంకటేశ్వర్లు(బి.జయలలిత)
దిగువపల్లి ఛై,,కే.గౌతమి(వై,, ఆర్.మాధవి)
మల్లేలవారిపల్లి ఛై,,ఎంఎస్.శివారెడ్డి(వై,,వి.రాజానాయుడు)
బత్తినపల్లి ఛై,,ఎం.శ్రీనివాసులు(బి.వరలక్ష్మీ)
డబురువారిపల్లి ఛై,,పి.చంద్ర(వై,,ఎన్.సునిత)
అచ్ఛామియాపల్లి ఛై,,ఎస్.యుహానిషా(వై,,ఎస్.ఇమాంసాబ్)
కమ్మవారిపల్లి ఛై,,యు.ప్రసాద్(ఎం.మధు)
కుసుమవారిపల్లి ఛై,,కే.లక్ష్మీ(డి.వీరమ్మ)
దాదిరెడ్డిపల్లి ఛై,,ఆర్.శశికళ(జి.అరుణమ్మ)
కోనేపల్లివారిపల్లి ఛై,,కే.మమత(వై,,పి.గంగాదేవి)
యరబల్లి ఛై,,టి.శ్రావణి(వై,,జె.భారతి)
అల్లాపల్లి ఛై,,ఎం.లక్ష్మీ(వై,,పి.శ్రీదేవి)
గౌనిపల్లి ఛై,,పి.జయరామ్(వై,,జి.సరస్వతి)
కొక్కంటివారిపల్లి ఛై,,పి.ఉషా(వై,,ఎం.హైదర్ వలి)
ఉగ్గిరెడ్డిపల్లి ఛై,,జి.సురేంద్ర(వై,,ఎం.గౌతమి)
చౌడంపల్లి ఛై,,ఎ.మణేమ్మ(వై,,ఎస్.శ్యామలమ్మ)
బాలప్పగారిపల్లి ఛై,,ఎం.మంజుల(వై,,జే.శ్యామలమ్మ)
గౌరాపురం ఛై,,ఎం.జనార్థన(వై,,జి.సంజీవమ్మ)
జెర్రికుంటపల్లి ఛై,,బి.కవిత(వై,,సీకే.శశికళ)
తిప్పే పల్లి ఛై,,జి.కమలకర్(వై,,ఎ.లావణ్య)
ఇనగలూరు ఛై,,కే.ఆదినారాయణ(వై,,కే.జ్యోతి)
గొల్లపల్లి ఛై,,ఎం.మాలశ్రీ(వై,,ఎస్.హేమావతి)
వణుకువారిపల్లి ఛై,,యు.మహేష్ బాబు(వై,,డి.అనిత)
రామిరెడ్డి పల్లి ఛై,,పి.గంగులప్ప(వై,,గిరిజా)
మిట్టపల్లి ఛై,,ఎస్.రెష్మ(వై,,ఎన్.లక్ష్మినారాయణ)
గాజుకుంటపల్లి ఛై,,ఇ.రమణమ్మ(వై,,వెంకటశివ)
మల్లాపల్లి ఛై,,ఎం.శశికళ(వై,,వై.గౌతమి)
పెద్దసానేవారిపల్లి ఛై,,పి.అబ్థుల్ హుస్సేన్(వై,,వి.కమలమ్మ)
తుమ్మలకుంట్లపల్లి ఛై,,పి.అమాజాన్(వై,,జె.చిన్న వెంకటరమణ)
ఎగువ చెర్లోపల్లి ఛై,,డి.అనిత(వై,,పి.షమీమ్)
తుమ్మలకుంట్లపల్లి(ఎస్సీ కాలనీ)ఛై,,జే.మహేంద్రమణి(వై,,ఎం.మంజుల)
బసప్పగారిపల్లి ఛై,,సి.కుపేంద్ర(వై,,సీ.గౌతమి)
దొన్నికోటవారిపల్లి ఛై,,టి.బాస్కర్(వై,,జీ.లావణ్య)
వీరఓబునపల్లి ఛై,,సి.నాగరాజు(వై,,ఎం.గాయత్రిభాయి)
నారప్పగారిపల్లి ఛై,,ఎం.జయమ్మ(వై,,ఎం.రామాంజనేయులు)
నల్లగుట్టపల్లి ఛై,,ఇ.శాంతకుమారి(వై,,పి.గురుబ్రహ్మణ)
మారేవాండ్లపల్లి ఛై,,సి.అలివేలమ్మ(వై,,ఆర్.గంగాధ్రీ)
ఓడిచెరువు ఛై,,ఎస్.అనిత(వై,,వి.ప్రతాప్)
బాబాసాహెబ్ పల్లి ఛై,,జి.అరుణ(వై,,పి.నిర్మాల)
ఆకుతోటపల్లి ఛై,,కే.శ్రీనివాసులు(వై,,ఎం.అనిత)
ఓడిచెరువు ఎస్సీకాలనీ ఛై,,ఎం.రాణి(వై,,పి.మంజుల)
ఓడిచెరువు ఉర్దూ ఛై,,ఎం.రహీమ్(వై,,ఎం.షబాన)
సున్నంపల్లి ఛై,,బి.నటరాజ్(వి.భాగ్యమ్మ)
చౌడేపల్లి ఛై,,కే.రాఘవేంద్ర(వై,,యు.భాగ్యశ్రీ)
నందివారిపల్లి ఛై,,ఎం.హేమావతి(వై,,కె.మాధవి)
పెద్దగుట్టపల్లి ఛై,,జె.మల్లికార్జున(వై,,ఇ.శ్రీకళమ్మ)
ఎంబి క్రాస్ ఛై,,జి.సోమశేఖర్(వై,,ఎల్.రేణుక)
మలకవారిపల్లి ఛై,,డి.ఆంజనెయులు(వై,,వి.అంజనమ్మ)
బలిజపల్లి ఛై,,జి.నరేష్(వై,,కె.సరళమ్మ)
మద్దకవారిపల్లి ఛై,,ఎం.బాలకృష్ణ(వై,,జి.విజయకుమారి)
బుచ్చిరాజుపల్లి ఛై,,ఎం.శంకర్(వై,,కే.జ్యోతి)
నల్లచెర్వుపల్లి ఛై,,జి.లక్ష్మినారాయణ(వై,,పి.భారతి)
ఎం.ఎరబల్లి ఛై,,కే.గీత(వై,,అలివేలమ్మ)
గొల్లవారిపల్లి ఛై,,నందిని(వై,,పి.శ్రావణి)
తంగేడుకుంట ఛై,,టి.రమాదెవి(వై,,జి.గంగాధ్రి)
లింగాలపల్లి ప్రాథమిక పాఠశాల కమిటీ ఛైర్మన్ జి.చంద్రశేఖర్(వైస్ చైర్మన్ యు.రేణుక)
తదితరులు కమిటీ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు08(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలోని అల్లాపల్లి పంచాయతీ చౌడంపల్లి గ్రామానికి చెందిన టైలర్ కవిత స్వగృహంలో గురువారం బ్రహ్మకమలాలు విరబూసిన విషయం తెలుసుకున్న మహిళలు అక్కడికి చేరుకుని శ్రావణ మాసంలో రాత్రి వేళల్లో విరబూసిన బ్రహ్మకమలాలతో దేవతామూర్తుల ప్రతిమల వద్ద పసుపు,కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
$$$__________@@@__________$$$
విద్యార్థులు స్నేహభావంతో విద్యను అభ్యసించాలి: ప్రిన్సిపాల్ ప్రభాకర్
శ్రీసత్యసాయిజిల్లా,అమడగూరు(ఓడిచెరువు) ఆగష్టు08(విజయస్వప్నం.నెట్)
అమడగూరు మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో కొత్తగా చేరిన జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్ధులు పరిచయాలు చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ ప్రభాకర్ విద్యార్థులను ఉద్దేశీంచి మాట్లాడుతూ నేటి సమాజంలో విద్య అవశ్యకత,ఉపాధి,ఉద్యోగ లక్ష్యం తదితర అంశాలను వివరించారు.విద్యార్ధుల భవిష్యత్తుపై తల్లితండ్రులు పడే ఆవేదనను అర్ధం చేసుకొని పట్టుదల,అకుంఠిత దీక్షతో చదవాలని, ఏకాగ్రతతో చదివితే అనుకొన్న లక్ష్యాన్ని,గమ్యాన్ని చేరుకొంటారన్నారు.క్రమశిక్షణ,సభ్యత,సంస్కారం,వినయ విధేయతలు అలవరచు కొంటేనే,సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయని,వాటిని క్రమశిక్షణ అనే ఆయుధంతో విజయం సాధించాలని ఆద్యాపకులు విద్యార్థులకు తెలిపారు.సీనియర్స్, జూనియర్ విద్యార్థులకు స్నేహ పూర్వకంగా జ్ఞాపికలు అందించి ఆత్మీయంగా స్వాగతించారు.అనంతరం విద్యార్ధులు ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
సజావుగా ఎస్ఎంసి ఎలక్షన్స్
శ్రీసత్యసాయిజిల్లా,అమడగూరు,ఆగష్టు08(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నిర్వహించిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు సజావుగా జరిగాయని మండల విద్యాశాఖ అధికారి జిలాన్ భాష తెలిపారు.ఎస్ఎంసీలు కీలకపాత్ర పోషిస్తాయని, స్కూల్లోని తరగతుల నిర్వహణ,నిధుల వినియోగం,ప్రభుత్వ పథకాల అమలు తీరును ఈ కమిటీ పరివేక్షిస్తుందని ఈ కమిటీకి ఎన్నికైన సభ్యుల నుంచి ఎస్ఎంసి చైర్మన్,వైస్ చైర్మన్, ఎక్స్ఆపిసీయో సభ్యులు,కోఆప్షన్ సభ్యులను ఎన్నుకొని ఈ కమిటీ రెండు సంవత్సరాలు పాటు కొనసాగుతుందని తెలిపారు. మండల పరిధిలోని 49 స్కూల్స్లో ఎన్నికల నిర్వహణ జరిగిందని 37 ప్రైమరీ, 6 జెడ్పి హై స్కూల్స్,ఒకటి కేజీబీవీ, ఒకటి మోడల్ స్కూల్ కు నిర్వహణ జరిగిందని,స్కూల్ డ్రాప్స్ అవుట్స్ తగ్గించాలని, ఎన్నికైన కమిటీ సభ్యులు పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని అయన కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
హర్ ఘర్ తిరంగా అభియాన్ విజయవంతం చేయండి.
ఈనెల 11 నుండి 15 వరకు కార్యక్రమాలన్నింటినీ సక్సెస్ చేయాలి
ఇంటిపై జాతీయ జెండా ఎగురవేద్దాం.. దేశ ఐక్యతను చాటి చెబుదాం: బిజెపి కిసాన్ మొర్చ ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి (విజయస్వప్నం.నెట్)
భారత ప్రధాని మోదీ ఇటీవల జరిగిన మన్ కి బాత్ సందర్భంగా ప్రతి ఇంటిపై "హర్ ఘర్ తిరంగా" జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారని,అలాగే పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు తలపెట్టిన హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి కిసాన్ మొర్చ ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడారు.హర్ ఘర్ తిరంగా అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా ఈనెల 11 నుండి 14 వరకు తిరంగా యాత్ర చేపట్టాలన్నారు.13 నుండి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలన్నారు.ఆగస్టు 12 నుండి 14 వరకు మహనీయుల విగ్రహాలు,స్మారక చిహ్నాల చుట్టూ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు.ఆగస్టు 14న విభజన గాయాల స్మారక దినం జరపాలని,అందులో భాగంగా సమ్మేళనాలు సదస్సులు నిర్వహించి దేశ విభజన చీకటి అధ్యాయాన్ని స్మరించుకోవాలన్నారు.అలాగే ఆగస్టు 13 నుండి 15 వరకు అమరవీరుల స్మారక చిహ్నాలు విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘటించాలని ఆయన వివరించారు.ఆగస్టు 11 నుండి 15 వరకు జరిగే వివిధ కార్యక్రమాలలో పార్టీ శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యులైయే విధంగా చూడాలన్నారు.ముఖ్యంగా ప్రతి ఒక్కరు తమ ఇళ్ళ మీద జాతీయ జెండాను ఎగురవేసి , సెల్ఫీ తీసుకొని హర్ గర్ తిరంగా.కామ్ లో అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాన్ని చేపట్టాలని సూచించారు.దేశాన్ని ఒకటి చేసే ఈ అద్భుత కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై,దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులను,మేధావులను వ్యాపారస్తులను,రైతు సంఘాలను,కార్మిక సంఘాలను,రాజకీయ నాయకులను,మహిళ సంఘాలను,కుల సంఘాలను యువజన సంఘాలను,క్రీడా సంఘాలను,ఎన్జీవోలను,ఎక్స్ ఆర్మీ సభ్యులను,ప్రజలందరూ పెద్ద ఎత్తున భాగస్వామి కావాలని కోరారు.
$$$__________@@@__________$$$
హాస్య బ్రహ్మానందంంతో.... మాజీమంత్రి పల్లె
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి ఆగష్టు09(విజయస్వప్నం.నెట్)
హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతిలో శుక్రవారం ప్రముఖ రచయిత ఆచార్య ఏల్చూరి మురళీధరరావు రచించిన ప్రజ్ఞాయ చరిత్రలోని కొన్ని వ్యాస ఘట్టాలు, విశేషాంశాలు పుస్తక పరిచయ సభ కార్యక్రమంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందంం, విశిష్ట ప్రముఖులతో మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలిసి వారితో పాటు వేదికపై ప్రసంగించారు.ఈసందర్భంగా మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు09(విజయస్వప్నం.నెట్)
మండలంలోని తుమ్మలకుంట్లపల్లి,ఓడిచెరువు శివాలయాల సమీపంలో శుక్రవారం నాగపంచమి సందర్భంగా నాగదేవతల విగ్రహాలను పసుపు,కుంకుమ,వివిధ రకాల పుష్పాలతో అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామాల్లో మహిళలు నాగపంచమి వ్రతాలు ఆచరించారు.
$$$__________@@@__________$$$
చౌక ధాన్యపు దుకాణం ప్రారంభం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు09(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని ఆకుతోటపల్లి గ్రామ 34వ ఛౌక ధాన్యపు దుకాణం శుక్రవారం డీలర్ కుమార్ రాయల్, తెదేపా, జనసేన, బిజేపీ నాయకులు ప్రారంభించారు. ఈసందర్భంగా డీలర్ కుమార్ రాయల్ మాట్లాడుతూ.... గ్రామంలోని ప్రతి రేషన్ కార్డు దారులకు అందుబాటులో ఉంటూ సకాలంలో బియ్యం,కందిపప్పు,పంచదార తదితర ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో ధనుంజయ,బిసి కెమెరా శంకర్,శివలింగం, నారాయణస్వామి, ప్రభాకర్ రెడ్డి,నారాయణస్వామి,యుగంధర్,మాజీ డీలర్ వెంకట్రామిరెడ్డి,రమణయ్య, నర్సింహులు,చంద్రశేఖర్,బాలకృష్ణ,కిష్టప్ప,పెద్ద ఓబులేసు, లక్ష్మీరెడ్డి,శివయ్య,గణేష్,భాస్కర్ రెడ్డి,హరి,రంగరాం,శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
పారిశుద్ధ్యం మరియు ఘన వ్యర్థాల నిర్వహణ
12న గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ
మండల పరిధిలోని గ్రామ పంచాయతీ సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులకు ఈనెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు పారిశుధ్యం,ఘన వ్యర్థాల నిర్వహణ అలాగే గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మూడు రోజులు పాటు రిప్రెషనరీ శిక్షణ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అశోక్ కుమార్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ శిక్షణా కార్యక్రమానికి తప్పనిసరిగా సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయ సమావేశ భవనంలో నిర్వహించే శిక్షణ తరగతులకు హాజరు కావాలని ఆయన తెలిపారు.
ఓడిచెరువులో....
సర్పంచ్ గ్రామ కార్యదర్శులకు ఈనెల 12నుండి మూడు రోజుల పాటూ మేనేజ్ మెంట్,శానిటేషన్, నిధులు వినియోగంపైన మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో శిక్షణ తర…
$$$__________@@@__________$$$
నవ్యాంధ్ర నిర్మాతలు పుస్తకావిష్కరణ.
రచయిత తిప్పినేనిని అభినందించిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు10(విజయస్వప్నం.నెట్)
సీనియర్ జర్నలిస్ట్ తిప్పినేని రామదాసప్ప నాయుడు రచనలో వెలువడిన నవ్యాంధ్ర నిర్మాతలు పుస్తకం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు.ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.... సీనియర్ జర్నలిస్ట్ తిప్పినేని రామదాసప్ప నాయుడు రచించిన పుస్తకంలో తెలిపిన సమాచారం ఎంతో విలువైందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు సాధించగలదని, యువతకు బంగారు జీవితానికి బాటను ప్రణాళిక ప్రకారం నిరంతరం కృషి చేస్తున్నట్లు పుస్తకంలో వెల్లడించడం సంతోషించ దగ్గ విషయం అన్నారు.ఈపుస్తకంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీల ఫోన్ నెంబర్లు,కార్యాలయాల వివరాలు పొందుపరిచారన్నారు. ఈసందర్భంగా రచయిత తిప్పినేని రామదాసప్ప నాయుడును రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అభినందించారు.
$$$__________@@@__________$$$
ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ పూజలు
శ్రీసత్యసాయిజిల్లా,అమడగూరు/ఓడిచెరువు ఆగష్టు10(విజయస్వప్నం.నెట్)
మండలకేంద్రంలోని ఆమడగూరు పంచాయతీ గ్రామంలో వెలసిన శ్రీఅభయ ఆంజినేయస్వామి ఆలయంలో శ్రావణమాసం తొలి శనివారం సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారి మూలవిరాట్టు విగ్రహానికి జలం,క్షీరం,గంధం, సింధూరం తదితర సుగంధ ద్రవ్యాలతో పాటు పంచఫలాలతో పంచామృతాభిషేకం చేసి స్వామివారిని పట్టు వస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి,కర్పూర హారతుల నీరాజనాలతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు ప్రసాద్ స్వామి,మురళిస్వామి,రాజు స్వామి,లచ్చి ఇండ్లురి భక్తాదులు పాల్గొన్నారు.
ఓడిచెరువులో....
ఓడిచెరువు మండలంలోని గౌనిపల్లి రామాలయంలో,ఓడిచెరువు ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ మాస తొలి శనివారం సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.గ్రామీణ ప్రాంతాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
$$$__________@@@__________$$$
రాష్ట్ర తెదేపా అధ్యక్షున్ని కలిసిన మండల నాయకులు
సత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు10(విజయస్వప్నం.నెట్)
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును శనివారం మండల తెదేపా నాయకులు మంగళగిరిలో తెదేపా కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.మండల కన్వీనర్ జయచంద్ర, బిసీ సెల్ నాయకులు బోరు రమణ, మైనారిటీ నాయకులు జాకిర్ హుస్సేన్,గండికోట ఇర్షాద్,షన్వాజ్ తదితరులు నూతనంగా తెదేపా రాష్ట్ర అధ్యక్షులుగా భాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావును శాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సూచనల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును కోరినట్లు తెలిపారు.పార్టీ కోసం కష్టపడి సేవలందించిన ప్రతి కార్యకర్తను గుర్తించి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారని తెలిపారు.
$$$__________@@@__________$$$
పాలపాటిదిన్నే ఆంజనేయస్వామికి పూజలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)నల్లచెరువు, ఆగష్టు10(విజయస్వప్నం.నెట్)
నల్లచెరువు పాత స్టేషన్ సమీపంలో పాలపాటిదిన్నే ఆంజనేయస్వామివారి దేవస్థానంలో మొదటి శ్రావణ మాస శనివారం సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ స్వామివారిని దర్శించుకుని,ఆలయ కార్యనిర్వహణాధికారికి అన్నదాన కార్యక్రమానికి లక్ష రూపాయలు అందించారు. ఆలయ ఈఓ రుద్రరాజు,ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ను సత్కరించారు.ఇతర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. కదిరి డిపో నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి,భక్తులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించారు.ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
$$$__________@@@__________$$$
ఖాద్రీశుడి సన్నిధిలో.... భక్తుల మొక్కులు
శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఆగష్టు10(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో శనివారం భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.మొదటి శ్రావణ మాస శనివారం కావటంతో.... శని,ఆదివారం శెలవులు కావడంతో ఆలయానికి వేలాది గా భక్తులు తరలివచ్చారు.దీంతో ఆలయంలో స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడి వేచి చూడాల్సి వచ్చింది.కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు శుక్రవారం రాత్రికే ఆలయానికి చేరుకొన్నారు.ఆలయ ప్రధాన గోపురం ముందు ధ్వజ స్తంభం వద్ద దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆలయ కార్యనిర్వాకులు తీర్థ ప్రసాదాలు,అన్నప్రసాదాలు అందించారు.
$$$__________@@@__________$$$
ఖాద్రీశుని దర్శించుకున్న మాజీమంత్రి పల్లె
శ్రీసత్యసాయిజిల్లా కదిరి(ఓడిచెరువు)ఆగష్టు11(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని,ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ వడ్డెర ఫెడరేషన్ మాజీ స్టేట్ డైరెక్టర్ కీర్తిశేషులు ఈసీ వెంకటేష్ కుమార్తె ఇ.తేజస్విని వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీసత్యసాయి జిల్లా
ఓడిచెరువు మండలానికి ఆదివారం విచ్చేసిన పుట్టపర్తి సీనియర్ తెదేపా నాయకులు రామ్ లక్ష్మణ్ ను మండల తెదేపా, జనసేన, బిజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసినట్లు కుమార్ రాయల్, సిసి కెమెరా శంకర్, ధనుంజయ, సందీప్ తదితరులు తెలిపారు.
$$$__________@@@__________$$$
రేపు కోటగడ్డ ఆంజనేయస్వామి కలశ జల పూజలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు11(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో రామాలయంవీధీలో రేపు కోటగడ్డ ఆంజనేయస్వామి వారి విగ్రహానికి కలశ జల(కళాపకర్షణ) పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ....కోటగడ్డ ఆంజనేయస్వామి ఆలయం పునః నిర్మాణంలో భాగంగా గర్భాలయం నిర్మాణ పనులు చేపట్టేందుకు శ్రీ ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించి కలశ జలాలలో(ఆలయ నిర్మాణం పూర్తి అయ్యేవరకు) స్వామివారి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.12వతేది మంగళవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు ప్రధమ పూజితుడు వినాయకుడికి హోమం,అర్చనలు పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి మూల విరాట్ విగ్రహం వద్ద పురోహితులు కళాపకర్షణ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.
$$$__________@@@__________$$$
అర్హులైన పేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలి
-సిపిఎం నాయకులు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఆగష్టు12(విజయస్వప్నం.నెట్)
సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం పేదలకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని తదితర అంశాలపై తహశీల్దార్ కార్యాలయంలో అధికారులుకు వినతి పత్రం అందజేశారు.అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించి పట్టాలు పంపిణీ చేయాలని, ఓడిచెరువు బస్టాండ్ ప్రాంతంలో మరుగుదొడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, మండలంలోనే ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని,సొంత గృహాలు లేక మండల కేంద్రంలో బాడుగ ఇళ్లల్లో కాలం గడుపుతున్న లబ్దిదారులను గుర్తించి,అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇవ్వాలని తహసిల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారని తెలిపారు.ఈకార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు శ్రీరాములు,కుళ్లాయప్ప, సిఐటియు నాయకులు కేశవ,శ్రీనివాసులు,మిట్టపల్లి శ్రీరాములు,మహిళలు జయమ్మ,వరలక్ష్మి,అంజనమ్మ తులసమ్మ,గంగరత్న,శ్రీదేవి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు శిక్షణ తరగతులు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు/ అమడగూరు,ఆగష్టు12(విజయస్వప్నం.నెట్)
అమడగూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులకు,గ్రామ కార్యదర్శులకు 3 రోజుల శిక్షణా తరగతులు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ తరగతుల కార్యక్రమం ప్రారంభించార.గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రణాళిక లు,గ్రామ పంచాయతీ పరిపాలన,చెత్త నుండి సంపద తయారు కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై ఇంఛార్జ్ ఎంపీడీవో అశోక్ కుమార్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎంపీడీవో సర్పంచులు,పంచాయతీ గ్రామ కార్యదర్శులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఓడిచెరువులో....
మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సర్పంచులకు, గ్రామకార్యదర్శులకు సోమవారం పర్యావరణాధికారి పూల రెడ్డప్ప, ఎంపీపీ పర్వీన్ భాను అధ్యక్షతన మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించి,గ్రామ పంచాయతీ అభివృద్ధి,నిధులు వినియోగం,చెత్త సేకరణ,వర్మీకం తయారు,మౌళిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై సమీక్షించారు.
$$$__________@@@__________$$$
అసంబద్ధమైన ఉపాధ్యాయ సర్ధుబాటును వెంటనే ఆపాలి.
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఆగష్టు12(విజయస్వప్నం.నెట్)
ఉపాధ్యాయ పని సర్దుబాటు నిలిపివేయాలని ఫ్యాప్టో పక్షాన సోమవారం మండల విద్యాశాఖ అధికారి సురేష్ బాబుకి వినతిపత్రాన్ని అందజేసినట్లు ఫ్యాప్టో నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ 117 ప్రకారం చేస్తున్న అసంబద్ధమైన వర్క్ అడ్జస్ట్మెంట్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లు తెలిపారు.2020 లో విడుదలైన జీవో నెంబర్ 53 ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలని,పని సర్దుబాటు ప్రక్రియలో సీనియర్ బిల్లింగ్ అవకాశం కల్పించాలని,16 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో కో చైర్మన్ గౌస్ లాజమ్ (డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు), రాంకుమార్ (ఏపిటిఎఫ్) మనోహర్ (యూటిఎఫ్) శ్రీనివాసులు(వైఎస్ ఆర్.టిఎఫ్) సుధాకర్ నాయక్ (డిటిఎఫ్) చంద్రమౌళి, చంద్రమోహన్, యం.టి.స్ ఉపాధ్యాయులు కే.నాగరాజు, కృష్ణ ప్రసాద్, భాస్కర్, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
జింక పిల్లను మింగిన కొండచిలువ
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఆగష్టు12(విజయస్వప్నం.నెట్)
మండలంలోని సున్నంపల్లి పంచాయతీ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో సోమవారం అతి పెద్ద కొండచిలువ జింక పిల్లను మింగిన దృశ్యాన్ని గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు చూసి భయబ్రాంతులకు గురైనట్లు తెలిపారు.అయితే ఇటీవలే ఎలుగుబంట్లు సంచారించడంతో పాటు భారీ కొండచిలువలు పొలాల్లో కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారని,అటవీ అధికారులకు సమాచారం అందించగా,అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులు సంచరించడం సాధారణ విషయంగా అన్నట్లు తెలిపారు.అటవీ ప్రాంతాల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.
$$$__________@@@__________$$$
అక్కదేవతల ఆలయంలో ప్రత్యేక పూజలు
అన్నదాన సత్రానికి పదివేలు విరాళం.
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,ఆగష్టు13(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలోని అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపాన సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీఅక్కదేవతల ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.గోరంట్ల మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన నాగప్ప,ఉత్తమ్మ,శాంతమ్మ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ఆవరణలో అన్నదాన సత్రం నిర్మాణానికి పదివేల రూపాయలు విరాళం అందజేసినట్లు పూజారి వెంకటేష్,కమిటీ సభ్యులు,మల్లెల రమేష్ తెలిపారు. ఈసందర్భంగా విరాళం అందజేసిన దాతలకు పూజారి వెంకటేశు,ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.
$$$__________@@@__________$$$
2వరోజు సర్పంచులు, గ్రామ కార్యదర్శుల శిక్షణ తరగతులు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు13(విజయస్వప్నం.నెట్)
మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో 2వరోజు మంగళవారం సర్పంచులకు,గ్రామకార్యదర్శులకు శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఎంపిడిఓ వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిచే పధకాలను,కేటాయించిన నిధులను ప్రణాళిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించి అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలని సూచించారు.2024-25 సంవత్సరానికి ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, రోడ్డు మరమ్మతులు,వీధి దీపాలు,చెత్త సేకరణ వర్మీకం తయారు తదితర అంశాలపై సమీక్షించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే కార్యక్రమాల్లో భాగ్యం స్వాములు కావాలని తెలిపారు.
$$$__________@@@__________$$$
ఆజాదికా అమృత్ మహోత్సవాల ర్యాలీ
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు13(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిణి వరలక్ష్మి ఆధ్వర్యంలో అజాదిక అమృత్ మహోత్సవాలు సందర్భంగా మంగళవారం 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో కలిసి జాతియ జెండాలతో ర్యాలీ నిర్వహించి, ప్రధాన కూడళ్లలో మానవహారం నిర్వహించారు.గ్రామాల్లో ఆజాదిక అమృత్ మహోత్సవాలు నిర్వహించారు.అలాగే స్థానిక వెలుగు కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగుర వేశారు.ఈకార్యక్రమంలో పొదుపు మహిళా సంఘాల సభ్యులు, మండల,గ్రామ సంఘాల ప్రతినిధులు,ప్రజలతో కలిసి హర్ ఘర్ తిరంగా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక వెలుగు కార్యాలయం నుండి తహశిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీడీవో వరలక్ష్మి,ఏపిఎం రమణప్పలు మాట్లాడుతూ ప్రతీ ఇంటిపైన మువ్వన్నెల పతాకము మూడురోజులపాటు (ఆగష్టు 13,14, 15వ తేదీల్లో) ఎగురవేయాలని తెలిపారు. అలాగే మనకు స్వాతంత్రము తెచ్చిన దేశ నాయకులను
స్మరించుకుంటూ.... దేశ సమగ్రత, జాతీయ సమైక్యత కోసం అందరూ పాటుపడాలని,అందరూ సోదర భావంతో మెలగాలని తెలిపారు.స్వాతంత్ర ఉద్యమ నాయకులు మహాత్మగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ,సుభాష్ చంద్రబోస్, సర్ధార్ వల్లభాయ్ పటేల్,ఝాన్సీ లక్ష్మీబాయి తదితర దేశభక్తులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిసీలు,సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, మహిళా సంఘాల సభ్యులు, ఓడిచెరువు క్లస్టర్ విఏఓలు, మండల సమాఖ్య ఓబీ సభ్యులు, ఎంఎస్ఏ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
కేరళ వరద బాధితుల కోసం నిధి సేకరణ
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,ఆగష్టు13(విజయస్వప్నం.నెట్)
అమడగూరు మండల కేంద్రంలో మంగళవారం సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ,సీఐటీయూ మండల కన్వీనర్ కేశవ,కో కన్వీనర్ బాబయ్య,మాబుభాష, ఓడిచెరువు మండల కన్వీనర్ కుల్లాయప్ప,ప్రాజెక్టు కార్యదర్శి, రంగమ్మ,సెక్టార్ లీడర్లు సరళ, రమాదేవి,సరస్వతి,నిధి సేకరణలో పాల్గొని విరాళాలు సేకరించారు.పీర్ల చావడి నుండి తహశిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాల్లో,బస్టాండ్ కోడలిలో తిరుగుతూ కేరళ వరద బాధితుల కోసం నిధి సేకరించారు.విరాళలిచ్చి కేరళ వరద బాధితుల కోసం మేము అండగా ఉంటామని, 5,450రూపాయలు వచ్చిన విరాళాలు మొత్తాన్నికేరళ సహాయ నిధికి సిఐటియు, అంగనవాడి యూనియన్ ద్వారా పంపుతున్నారని తెలిపారు.ఈసహాయానికి సహకారం అందించిన ప్రజలకు,ఉద్యోగస్తులకు పాత్రికేయులకు,సీఐటీయూ, ఆటో,అంగన్వాడీ కార్మికులకు సీఐటీయూ యూనియన్ తరుపున ధన్యవాదాలు తెలిపారు.
$$$__________@@@__________$$$
ఆంజనేయస్వామి విగ్రహానికి కళాపకర్షణ పూజలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు13(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో మంగళవారం కోటగడ్డ ఆంజనేయస్వామివారి విగ్రహానికి కలశ జల (కళాపకర్షణ) పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ నిర్వహాకులు పిట్టా ప్రభాకర్ రెడ్డి,నాగేశయ్య కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ....కోటగడ్డ ఆంజనేయస్వామి ఆలయం పునః నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని,స్వామివారి గర్భగుడి నిర్మాణ పనులు చేపట్టేందుకు శ్రీఆంజనేయస్వామికి కలశ జలాలతో పూజలు నిర్వహించి అనంతరం (నూతన ఆలయ నిర్మాణ పనులు పూర్తి అయ్యేవరకు) స్వామివారి నిలువెత్తు మూల విరాట్ రాతి విగ్రహాన్ని నూతన పట్టు వస్త్రాలతో కప్పబడి ఉంటుందని తెలిపారు. మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వినాయకుడికి హోమం,అర్చనలు తొలి పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి మూల విరాట్ విగ్రహం వద్ద పురోహితులు ధూపదీపారాధన,సింధూరం,పుష్పాలతో అలంకరించి పంచలోహ కలశంలో గంగ జలాలతో కళాపకర్షణ పూజలు నిర్వహించి నూతన వస్త్రాలు సమర్పించారని తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.పూజా కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలకు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
$$$__________@@@__________$$$
ఫోటోగ్రాఫర్ మృతి పట్ట ఘన నివాళి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు13(విజయస్వప్నం.నెట్)
అనంతపురం జిల్లా టీవీ5 ఫోటోగ్రాఫర్ చంద్రశేఖర్ గుండెపోటుతో మృతితో మంగళవారం మండల పాత్రికేయులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. చంద్రశేఖర్ ఫోటోగ్రాఫర్ గా చేసిన సేవలు గురించి పలువురు వక్తలు కొనియాడారు.టీవి5 రిపోర్టర్ గోపీనాథ్ రెడ్డి, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ షాజహాన్, హెచ్ఎం టీవీ రిపోర్టర్ ఫిరోజ్, ప్రజాశక్తి రిపోర్టర్ ఫయాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా మండల పాత్రికేయులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
పంద్రాగస్టు వేడుకల మైదానాన్ని కలెక్టర్ సందర్శన
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఆగష్టు14(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంలో పుట్టపర్తి ఎస్పీ కార్యాలయం సమీపంలో 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పెరేడ్ మైదానాన్ని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ బుధవారం పరిశీలించారు. పోలీస్ కవాతు,భద్రత ఏర్పాట్లు,శకటాల ప్రదర్శన,స్టాల్స్ ఏర్పాట్లను పెరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ పరిశీలించి,అదనపు సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.జేసి అభిషేక్ కుమార్,జిల్లా ఎస్పీ వి.రత్న, అడిషనల్ ఎస్పీ విష్ణు,ఆర్డీవో భాగ్యరేఖ, తహశీల్దార్ అనుపమ వివిధ శాఖల అధికారులు సిబ్బంది కలెక్టర్ వెంట వున్నారు.
$$$__________@@@__________$$$
పంచాయతీల అభివృద్ధికి సర్పంచులే కీలకం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు14(విజయస్వప్నం.నెట్)
గ్రామ కార్యదర్శుల సహకారంతో పంచాయతీ గ్రామ సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కీలకమని ఎంపీడీవో వరలక్ష్మి పేర్కొన్నారు.పంచాయితీ గ్రామ కార్యదర్శులకు,సర్పంచులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు బుధవారం సమావేశంలో పాల్గోని మాట్లాడారు.గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, కేటాయించిన నిధులను వీధిలైట్లు,తాగునీరు సౌకర్యాలు,డ్రైనేజీలు, పారిశుద్ధ్య పనులను చేపట్టాలన్నారు.చెరువుల్లో చేపల పెంపకం,అటవీ ఫలాలు సంపద,తడి చెత్త,పొడి సేకరణ,చెత్త నుండి ఎరువు తయారు షెడ్లలో వర్మీకం పోస్ట్లు ఏర్పాట్లు తదితర వనరులను వినియోగించి,మౌళిక సదుపాయాలు కల్పించాలని,పంచాయతీ అభివృద్ధికి గ్రామ కార్యదర్శుల సహకారంతో పంచాయతీ సర్పంచులు కీలకమని పేర్కొన్నారు.పంచాయతీ గ్రామాల్లో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలు మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారం అందించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.ఈకార్యక్రమంలో పర్యవేక్షకులు పూల రెడ్డప్ప, గ్రామ పంచాయతీ సర్పంచులు,కార్యదర్శులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
సజావుగా సర్వసభ్య సమావేశం
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు,ఆగష్టు14(విజయస్వప్నం.నెట్)
మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం ఎంపీడీవో మునెప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖాధికారులు మాట్లాడుతూ ఇంటి స్థలాల బిల్లులు,రోడ్ల నిర్మాణ పనులు, మొక్కల పెంపకం గురించి, ఉపాధి హామీ పనులు,విద్యావిధానాలపై,చెట్ల పెంపకంపై,ప్రజల ఆరోగ్య విషయాలపై,చర్చించారు.ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మండల అభివృద్ధికి అందరూ తోడ్పడాలని ఈసందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రామనాథరెడ్డి,ఎంఈఓ జీలన్ బాషా,ఎంపీపీ ప్రసాద్ రెడ్డి,జెడ్పిటిసి కవిత శంకర్ రెడ్డి,ఎంపీటీసీలు,సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడికి గాయాలు
శ్రీసత్యసాయజిల్లా ఓడిచెరువు,ఆగష్టు14(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండల పరిధిలోని మహమ్మదాబాద్ క్రాస్ శివాలయం సమీపంలో బుధవారం సాయంత్రం కొండకమర్ల గ్రామానికి చెందిన పవన్ కుమార్ వెల్డింగ్ పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తు అదుపు తప్పి కింద పడడంతో గాయాలైన సంఘటన గమనించిన స్థానికులు 108 కి సమాచారం అందించారు. 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన యువకుడికి ప్రధమ చికిత్స అందిస్తూ కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ప్రీమియం చెల్లింపుపై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన పుట్టపర్తి నియోజకవర్గ పాత్రికేయులు
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి,ఆగష్టు13(విజయ స్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గంలోని 6 మండలాల పాత్రికేయులకు సంబంధించిన 2024 ఏడాదికి చెల్లించే పాత్రికేయుల హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ఒక్కొక్కరికి రూ"1250 చొప్పున మొత్తం 101 మంది పాత్రికేయులకు 1,26,250 రూపాయల నగదును మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి స్వయంగా చెల్లించారని తెలిపారు.పాత్రికేయులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి నియోజకవర్గ పాత్రికేయులు పుల్లయ్య, అయ్యన్నగారి శ్రీనివాసులు, బాబు, శంకర్, రంగారెడ్డి, సాయికుమార్, విజయ్ కుమార్, కేశప్ప, రామ మోహన్, కుల్లాయి స్వామి మ,రమణ, రామాంజీనేయులు, గోపాల్, బసప్ప, నాగరాజు, దేవేంద్ర, సుధాకర్, మహేష్, సురేష్, జయచంద్రలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే నియోజకవర్గంలోని నల్లమాడ, ఓడి చెరువు, బుక్కపట్నం, కొత్త చెరువు, ఆమడగూరు మండలాల పాత్రికేయులు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికిప్రత్యేక కృతజ్ఞతలు తెలిపీ ధన్యవాదములు తెలిపారు. నియోజకవర్గంలో అక్రిడిటేషన్ కార్డు ఉండి ఇంకా హెల్త్ ఇన్స్యూరెన్స్ కట్టలేని పాత్రికేయులు ఉంటే పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ప్రసాద్ నెట్ సెంటర్ లో ఉచితంగా ఆన్లైన్ చేసుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పీ ఆర్వో సంతోష్ రెడ్డి తెలిపారన్నారు.పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన పాత్రికేయులు 2024 అక్రిడిటేషన్ కార్డు కలిగిన వారు హెల్త్ ఇన్స్యూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే రూ.1250 లు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వయంగా చెల్లిస్తున్నారని,అక్రిడేషన్ ఉండి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇంకా కట్టలేని పాత్రికేయులు పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రసాద్ నెట్ సెంటర్ 8074868582 నెంబరును సంప్రదించి, అక్కడే ఆన్లైన్ చేసి ఆ ప్రభుత్వ చలానా రశీదు తీసుకొని పుట్టపర్తి జిల్లా సమాచార పౌర సంబంధాల కార్యాలయంలో మీ చలానా రశీదు తో పాటు అక్రిడిటేషన్,కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు జిరాక్స్ కాఫీలతో పాటు,కుటుంబ సభ్యుల పోటోలు అందజేయాలని సూచించారు.2024 మార్చి నుంచి ఈ ప్రీమియం 2025 వరకు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని,గతంలో 2023 మార్చి నుంచి 2024 ఫిబ్రవరి 31 లోపు ప్రీమియం కట్టిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదని,ఇలాంటి వారు మళ్ళీ కొత్తగా ప్రీమియం చేసుకోవాలని,లేదంటే కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మన పాత్రికేయులకు వర్తించదని తెలిపారన్నారు.
$$$__________@@@__________$$$
గాజుకుంటపల్లిలో ఛౌక ధాన్యపు డిపో ప్రారంభం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు13(విజయస్వప్నం.నెట్)
మండలంలోని ఇనగలూరు పంచాయతీ గాజుకుంటపల్లి గ్రామంలో షాపు నెంబర్ 18 ఛౌక ధాన్యపు డిపో మంగళవారం తెదేపా నాయకులు ప్రారంభించారు.నూతన డీలర్ల నియామక ప్రక్రియలో భాగంగా గ్రామానికి చెందిన తెదేపా నాయకులు నాగరాజు భార్య నందినికి షాప్ 18 కేటాయించారని తెలిపారు.మండల మాజీ కన్వీనర్(మాజీ ఎంపీటీసీ)రామానాయుడు, రైతు సంఘం నాయకులు ఆంజన్ రెడ్డి, నాయకులు బూదిలి సాంబశివారెడ్డి,ఇద్దే రఘునాథరెడ్డి,మనోహర్ తదితరులు పాల్గొని కార్డుదారులకు రేషన్ పంపిణీ చేశారు.ఛౌక ధాన్యపు డిపోలో అందుబాటులో ఉంటూ ప్రతి కుటుంబానికి నెలనెలా రేషన్ అందిస్తామన్నారు.ఈసందర్భంగా మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు.
$$$__________@@@__________$$$
పంద్రాగస్టు వేడుకల మైదానాన్ని కలెక్టర్ సందర్శన
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఆగష్టు14(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంలో పుట్టపర్తి ఎస్పీ కార్యాలయం సమీపంలో 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పెరేడ్ మైదానాన్ని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ బుధవారం పరిశీలించారు. పోలీస్ కవాతు,భద్రత ఏర్పాట్లు,శకటాల ప్రదర్శన,స్టాల్స్ ఏర్పాట్లను పెరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ పరిశీలించి,అదనపు సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.జేసి అభిషేక్ కుమార్,జిల్లా ఎస్పీ వి.రత్న, అడిషనల్ ఎస్పీ విష్ణు,ఆర్డీవో భాగ్యరేఖ, తహశీల్దార్ అనుపమ వివిధ శాఖల అధికారులు సిబ్బంది కలెక్టర్ వెంట వున్నారు.
$$$__________@@@__________$$$
పంచాయతీల అభివృద్ధికి సర్పంచులే కీలకం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు14(విజయస్వప్నం.నెట్)
గ్రామ కార్యదర్శుల సహకారంతో పంచాయతీ గ్రామ సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కీలకమని ఎంపీడీవో వరలక్ష్మి పేర్కొన్నారు.పంచాయితీ గ్రామ కార్యదర్శులకు,సర్పంచులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు బుధవారం సమావేశంలో పాల్గోని మాట్లాడారు.గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, కేటాయించిన నిధులను వీధిలైట్లు,తాగునీరు సౌకర్యాలు,డ్రైనేజీలు, పారిశుద్ధ్య పనులను చేపట్టాలన్నారు.చెరువుల్లో చేపల పెంపకం,అటవీ ఫలాలు సంపద,తడి చెత్త,పొడి సేకరణ,చెత్త నుండి ఎరువు తయారు షెడ్లలో వర్మీకం పోస్ట్లు ఏర్పాట్లు తదితర వనరులను వినియోగించి,మౌళిక సదుపాయాలు కల్పించాలని,పంచాయతీ అభివృద్ధికి గ్రామ కార్యదర్శుల సహకారంతో పంచాయతీ సర్పంచులు కీలకమని పేర్కొన్నారు.పంచాయతీ గ్రామాల్లో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలు మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారం అందించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.ఈకార్యక్రమంలో పర్యవేక్షకులు పూల రెడ్డప్ప, గ్రామ పంచాయతీ సర్పంచులు,కార్యదర్శులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
సజావుగా సర్వసభ్య సమావేశం
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు,ఆగష్టు14(విజయస్వప్నం.నెట్)
మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం ఎంపీడీవో మునెప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖాధికారులు మాట్లాడుతూ ఇంటి స్థలాల బిల్లులు,రోడ్ల నిర్మాణ పనులు, మొక్కల పెంపకం గురించి, ఉపాధి హామీ పనులు,విద్యావిధానాలపై,చెట్ల పెంపకంపై,ప్రజల ఆరోగ్య విషయాలపై,చర్చించారు.ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మండల అభివృద్ధికి అందరూ తోడ్పడాలని ఈసందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రామనాథరెడ్డి,ఎంఈఓ జీలన్ బాషా,ఎంపీపీ ప్రసాద్ రెడ్డి,జెడ్పిటిసి కవిత శంకర్ రెడ్డి,ఎంపీటీసీలు,సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడికి గాయాలు
శ్రీసత్యసాయజిల్లా ఓడిచెరువు,ఆగష్టు14(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండల పరిధిలోని మహమ్మదాబాద్ క్రాస్ శివాలయం సమీపంలో బుధవారం సాయంత్రం కొండకమర్ల గ్రామానికి చెందిన పవన్ కుమార్ వెల్డింగ్ పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తు అదుపు తప్పి కింద పడడంతో గాయాలైన సంఘటన గమనించిన స్థానికులు 108 కి సమాచారం అందించారు. 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన యువకుడికి ప్రధమ చికిత్స అందిస్తూ కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
$$$__________@@@__________$$$
విజయస్వప్నం.నెట్ వీక్షకులకు
78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
$$$__________@@@__________$$$
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి