నూతన తహశీల్దార్ గా అనంతాచారి భాధ్యతలు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,ఆగష్టు05(విజయస్వప్నం.నెట్)
మండల నూతన తహశీల్దార్ గా అనంతాచారి సోమవారం భాధ్యతలు చేపట్టారు.కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండల తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తు సాధారణ బదిలీ ప్రక్రియలో భాగంగా జిల్లా ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఓడిచెరువు తహశీల్దార్ గా అనంతాచారి నియమించగా,నూతనంగా భాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.ఇక్కడ పనిచేస్తున్న తహశీల్దార్ ఖాజాభి మదనపల్లి మండలానికి బదిలీపై వెళ్ళారు.రిసర్వే డిప్యూటీ తహశీల్దార్ జాకిర్ హుస్సేన్,సిఎస్డీటీ రమాదేవి, ఇన్చార్జి ఆర్ఐ భరత్ కుమార్,విఆర్ఓలు, సిబ్బందితో కలిసి నూతనంగా భాధ్యతలు చేపట్టిన తహశీల్దార్ అనంతాచారికి పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా స్వాగతం పలికారు. నూతన తహశీల్దారుకు పలువురు శుభాకాంక్షలు ఓడిచెరువు మండల తహశీల్దార్ అనంతాచారి సోమవారం నూతనంగా భాధ్యతలు స్వీకరించగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మండల తెదేపా,బిజేపీ నాయకులు రెవెన్యూ కార్యాలయంలో నూతన తహశీల్దార్ అనంతాచారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ జెడ్పీ సభ్యులు పిట్టా ఓబు రెడ్డితో పాటు తెదేపా శ్రేణులు,బిజేపీ నాయకులు రంగారెడ్డి,డాక్టర్ హరికృష్ణ, అశ్వర్ధప్ప, జిల్లా యువమోర్ఛ కార్యదర్శి నరేష్, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మారెప్ప, సీనియర్ నాయకులు రామిరెడ్డి,నాగరాజురెడ్డి,లక్ష్మిపతి,నాగార్జున, మనోహ,డీలర్లతో కలిసి సంఘం నాయకులు తదితరులు నూతన తహశీల్దార్ అనంతాచారికి శుభాకాంక్షలు తెలిపారు.
$$$__________@@@__________$$$
రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
- సిపిఐ నాయకులు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,ఆగష్టు05(విజయస్వప్నం.నెట్)
వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని సిపిఐ నాయకులు సోమవారం డిప్యూటీ తహశీల్దార్ జాకిర్ హుస్సేన్ కు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి చలపతి నాయుడు మాట్లాడుతూ....గతేడాది వర్షాలు లేకపోవడంతో గత ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమయ్యిందని, అధికారంలోకి వచ్చిన తెదేపా కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. ఈయేడు ఇప్పటి వరకు వర్షాలు కురవక పోవడంతో 20% రైతులు విత్తనాలు విత్తలేని దయనీయ స్థితిలో వున్నారని,ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంటల పెట్టుబడి నిధి ద్వారా ప్రతి రైతుకు 20 వేలు ఇవ్వాలని,బిందు సేద్యం పరికరాలు 90% సబ్సిడీతో అందించాలని,తెలంగాణ ప్రభుత్వం తరహాలో ప్రతి రైతుకు 2లక్షలు రుణాలు మాఫీ చేయాలని,హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ఆయకట్టుకు నీరు అందించాలని,60 ఏళ్ల నిండిన రైతులకు 10 ఫించన్ అందించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని తదితర రైతు సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని పేర్కొంటూ డిప్యూటీ తహశీల్దార్ జాకిర్ హుస్సేన్ కు కు వినతిపత్రం అందజేశారని తెలిపారు.ఈకార్యక్రమంలో సుధాకర్, రవికుమార్, లక్ష్మినరసు, వెంకటనర్సు, రమణ, ఎల్లప్ప, మల్లప్ప తదితర రైతులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
సేంద్రియ పంటల సాగుతో అధిక రాబడి: బిజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా
అమడగూరు జనసేన వార్త ఆగష్టు06
వ్యవసాయం సేంద్రియ పద్ధతుల్లో చేయాలని బిజెపి కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
కదిరి మండలం ఎర్రదొడ్డి గ్రామానికి చెందిన యువ రైతులు ఇమ్రాన్, ముజాహిద్ పొలాల్లో సేంద్రియ పద్ధతులు వ్యవసాయం చేయాలని బొప్పాయి పంట సాగు చేస్తున్న, ఆ పంటను మంగళవారం బిజెపి కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి పరిశీలించి, వారికి సేంద్రీయ ఎరువులు ఎలా వాడాలి, సేంద్రియ ఎరువుల వల్ల ప్రయోజనాలు తదితర విషయాలను వివరించారు. వ్యవసాయ వ్యవసాయంలో రైతులు విపరీతమైనటు వంటి రసాయన ఎరువులు వాడడం కారణంగా రైతుకు వ్యవసాయం భారంగా మారిందని,పెట్టుబడులు కూడా అధికమవుతున్నాయని ఆయన తెలిపారు.సేంద్రియ వ్యవసాయం,ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం ద్వారా పంటలు పండించడంతో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు సాధించవచ్చని తెలిపారు.సేంద్రియ పద్ధతులతో పండించిన పంటలకు ప్రస్తుతం మార్కెట్లో గిరాకీ కూడా ఎక్కువగా ఉందని,ప్రజలు కొనుక్కోవడానికి శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.కరోనా తర్వాత ప్రజలు ఆహారం విషయంలో శ్రద్ధ చూపుతున్నారని ఆరోగ్యం విషయంలో సేంద్రియ పద్ధతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తదితర దుంప కూరగాయలను ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, విజయకు మార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఉపాధ్యాయుల పని భారం తగ్గింపుపై హర్షం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు06(విజయస్వప్నం.నెట్)
ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు ఆ పాఠశాలలోని మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేసే బాధ్యతల నుంచి తొలగింపుపై డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి గౌస్ లాజమ్,మారుతి తదితర ఉపాధ్యాయ బృందం మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్దుబాటు కు ముందే జీవో 117ని రద్దు చేయాలని,పాఠశాల విద్యాశాఖ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ లో టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టిస్) సమాచారం సేకరిస్తుందన్నారని,ఇది ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం అంటూ ఉపాధ్యాయులు భావిస్తున్నారని దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలన్నారు.జివో 117వల్ల ప్రాథమిక పాఠశాలలో చాలావరకు మూతపడే పరిస్థితి ఉందని ఇదేకొనసాగితే దాని ప్రభావం ఉన్నత పాఠశాలపై పడుతుందన్నారు.టీస్ నందు పీహెచ్ సంబంధించి వివరాల నమోదుకు అవకాశం లేదని వాటికి సంబంధించిన వివరాలకు నమోదు కొరకు అవకాశం కల్పించాలని వారు కోరారు.కావున వెంటనే జీవో 117 రద్దు చేయాలని ప్రభుత్వానికి ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు.
$$$__________@@@__________$$$
ప్రభుత్వ వసతి గృహాలలొ మౌలిక సదుపాయాలు కల్పించాలి
కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ ధర్నా
శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి,ఆగష్టు06(విజయం స్వప్నం.నెట్)
ప్రభుత్వ వసతి గృహాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం పుట్టపర్తిలోని స్థానిక గణేష్ సర్కిల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు హాస్టల్ విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి ప్రధాన గేటు వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు.అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నల్లజోడు పవన్,చంద్రశేఖర్ రెడ్డి లు మాట్లాడుతూ శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా జులై 20 నుండి 30 తారీకు వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వసతి గృహాలను సందర్శించారని,వందకు పైగా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ ప్రభుత్వ వసతి గృహాలు ఉండగా ఇందులో పదుల సంఖ్యలో శిధిలావస్థకు చేరాయని,ముఖ్యంగా కొన్ని హాస్టల్లో మౌలిక సదుపాయాలకు చాలా దూరంగా ఉన్నాయని,అంతేకాకుండా సొంత భవనాలు లేక విద్యార్థులు చాలి చాలని అద్దె భవనాల్లో ఉంటూ ఇబ్బందులకు గురవుతున్నారని,పెండింగ్లో ఉన్న మెస్,కాస్మోటిక్ చార్జీలు,విడుదల చేయాలన్నార.విద్యా సంవత్సరం మొదలయ్యి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు దుప్పట్లు,ట్రంక్ పెట్టెలు,విద్యార్థులకు అందలేదని,బాలికల వసతి గృహాల్లో శానిటరీ ఫ్యాట్స్ అందుబాటులో ఉంచాలని,ఈ విషయం పైన గతంలో కూడా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ప్రయోజనం లేదని,ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆఫీస్ బేరర్స్ అరుణ్ కుమార్ రెడ్డి,శేషం మహేంద్ర,నరసింహమూర్తి నాయకులు దేవరాజ్, పవన్, గణేష్, గౌతమ్, సాయి, ప్రేమ్ కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
సచివాలయంలో సియం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే ఫొటోలు ఏర్పాటు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు06(విజయస్వప్నం.నెట్)
మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామ ఒకటవ సచివాలయంలో మంగళవారం సచివాలయ ఉద్యోగులకు తెదేపా,జనసేన పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూ రెడ్డి ఫోటోలు అందజేశారు.
$$$__________@@@__________$$$
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తాను
- తెదేపా నాయకులు రామాంజులుతో నారా లోకేష్
శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి (మంగళగిరి) ఆగష్టు06(విజయస్వప్నం.నెట్)
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ని వారి స్వగృహంలో మంగళవారం అమడగూరు మండల తెదేపా నాయకులు(టీఎన్ఎస్ఎఫ్ నాయకులు)రామాంజులునాయుడు మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై మాట్లాడారని తెలిపారు.తెదేపా కోసం కష్టపడి సేవలందించిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు,గౌరవాన్ని ఇస్తామని భరోసా ఇచ్చారని,మీరు పార్టీకి ఎనలేని కృషి చేశారని తనకు అన్ని విషయాలు తెలుసునని తప్పకుండ అన్నిరకాలుగా ఆదుకుంటానని మంత్రి నారా లోకేష్ భరోసాను ఇచ్చారని రామాంజులు నాయుడు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇడగొట్టు రాంబాబు,కిరణ్ కుమార్ నాయుడు తదితరులు మంత్రి నారా లోకేష్ ని కలిసిన వారిలో వున్నారన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి