ఉచిత గుండె వైద్యశిబిరానికి విశేష స్పందన
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై31(-విజయస్వప్నం.నెట్)
మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామ ఉర్దూ పాఠశాలలో బుధవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్క్ సూపర్ స్పెషాలిటీ గుండె ఆసుపత్రి వైద్యులతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి గుండె నొప్పి,ఛాతీ నొప్పి, గుండె దడ,ఆయాసం,గుండెలో మంట,ఛాతీలో బరువుగా వుండడం,కాలు వాపులు రావడం,చెమటలు పట్టడం తదితర వ్యాధులకు,అలాగే బ్లడ్ షుగర్,బిపి,ఈసీజీ,2డి ఎకో ద్వారా 142 మందికి పరీక్షలు నిర్వహించి,వైద్య సేవలు అందించినట్లు కార్యనిర్వహాకులు సాథక్ బాషా,అబ్లు, జావేద్,ఆట ఉల్లా సర్,సాదిక్ లు తెలిపారు నేడు బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని తెలిపారు.అనంతరం లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్క్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారని పేర్కొన్నారు.
$$$__________@@@__________$$$
అంగన్వాడీ కార్యకర్తను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలి
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుళు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై31(విజయస్వప్నం.నెట్)
మండలంలోని వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త నాగమణి ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుళు డిమాండ్ చేశారు.మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుళు ధర్నా చేపట్టారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వీరప్పగారిపల్లి మినీ అంగన్వాడీ కార్యకర్త నాగమణిని ఆంజనేయులు వేధించడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయన్నారు.ఈక్రమంలోనే వీరప్పగారిపల్లి గ్రామానికి చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త నాగమణిని ఉద్యోగం నుండి తొలగిస్తామని అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు సోదరుడు వెంకటేసులు నిత్యం వేధింపులకు గురి చేసి బెదిరిస్తున్నారని, దీనిని తట్టుకోలేక నాగమణి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని,విధిల్లో నాగమణి అందుబాటులో ఉంటూ బాగా పనిచేస్తుందని గ్రామానికి చెందిన బాలింతలు, గర్భిణులు,పిల్లల తల్లిదండ్రులు వివరించిన కూడా ఆకారణంగా గ్రామానికి చెందిన ఆంజనేయులు,తమ్ముడు వెంకటేసులు అంగన్వాడీ కార్యకర్త నాగమణిపై లేనిపోని ఆరోపణలు చేసి ఆమె ఆత్మహత్యాయత్నానికి కారకులైనారని, వీరిని వెంటనే అరెస్ట్ చేసి, అంగన్వాడీ కార్యకర్త నాగమణికి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహశీల్దార్ జాకిర్ హుస్సేన్ కు వినతిపత్రం అందజేశారు.ఉదయం 11 గంటల నుండి 3 వరకు ధర్నా చేపట్టి అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు.రాజకీయ వేధింపులు,తొలగింపులు కొనసాగితే ఉమ్మడి జిల్లాలకు చెందిన వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలతో సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు,వెంకటేష్,బాబావలి,జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ,జిఎల్.నరసింహులు,జిల్లా కోశాధికారి సాంబశివ, మండల కన్వీనర్ కుళ్ళాయప్ప, అంగన్వాడీ యూనియన్ నాయకురాళ్ళు రంగమ్మ,ఆశీర్వదమ్మ, మణిమాల, లక్ష్మీదేవి,అరుణమ్మ,కిష్టమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
మూడెకరాల భూమి నిరుపేదలకు ఇవ్వాలి
శ్రీసత్యసాయిజిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ ఛైర్మన్ కదిరప్ప
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై31(విజయస్వప్నం.నెట్)
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్ళు కావస్తోందని, ఇప్పటికీ ఎంతో మంది భూమి లేని నిరుపేదలుగా జీవిస్తున్నారని, అభ్యంతరం లేని ప్రభుత్వ(అసైన్డ్) భూములు సాగు చేసుకోవడానికి నిరుపేదలకు 3 ఎకరాలు చొప్పున పంపిణీ చేయాలని బుధవారం శ్రీసత్యసాయిజిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఛైర్మన్ బి.కదిరప్ప డిమాండ్ చేశారు.కాంగ్రస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వంలో వెనుకబడిన ఎస్సీ వర్గాల ప్రతి కుటుంబానికి అసైన్డ్ భూములు పంపిణీ చేశారని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు.నిరుపేదలకు అందుబాటులో ఉంటూ....కష్ట సమయాల్లో ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.జిల్లా వ్యాప్తంగా అసైన్డ్ భూములు మెండుగా ఉన్నాయని, నిరుపేదలకు 3 ఎకరాల చొప్పున ఇవ్వాలని, వీటి పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
$$$__________@@@__________$$$
ఎస్సీ వర్గీకరణ సుప్రీం తీర్పు పై ఎమ్మార్పీఎస్ నాయకుల హర్షం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు01(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో గురువారం అంబేద్కర్ కూడలిలో ఎమ్మార్పీఎస్ నాయకులు సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను సమర్ధిస్తూ తీర్పు వెలువడించడంతో స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు.ముందుగా అంబేద్కర్ విగ్రహానికి,ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధినేత మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లక్ష్మన్న, బావన్న,రమణ,కత్తి ఆనంద్, ఓడిచెరువు గ్రామ పంచాయతీ సర్పంచ్ ముద్దలపల్లి గోవిందు,ఎర్ర దొడ్డప్పలు మాట్లాడుతూ మూడు దశాబ్దాల క్రితం వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో 21 మంది యువకులతో ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం,ఎంతో మంది మాదిగ యువకుల త్యాగాలు వున్నాయని,30 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల్లో ఎంతో మంది జైలుకెళ్ళడం, ఎంతో మంది ప్రాణాలు త్యాగాలు చేశారన్నారు.వివిధ రూపాల్లో ఉద్యమాల ఫలితంగా సుప్రీం కోర్టులో ఏడుగురు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని తీర్పును వెలువడించడం మాదిగల చారిత్రక విజయంగా అభివర్ణించారు. సుప్రీంకోర్ట్ ధర్మాసనానికి మాదిగజాతి తరపున ధన్యవాదాలు తెలిపారు. తెఈకార్యక్రమంలో సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీనివాసులు,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొచ్చు కదిరప్ప,రామకృష్ణ,ధారా వెంకటరాముడు,నరసింహులు,తోల నాగభూషణ రామాంజనేయులు, గేరివి మహేష్, లక్ష్మీపతి, అక్కులప్ప, రామారావు, మహేంద్ర, ఫక్కిరప్ప, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందాలి
ప్రజల మొహల్లో చిరునవ్వు చిందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం
- ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఆగష్టు01(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయమే 95శాతం పూర్తి చేసిన పింఛన్లు పంపిణీ కార్యక్రమం పూర్తి చేసినట్లు తెలిపారు.ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 60 కేజీల కేక్ కట్ చేసి ఓడి చెరువు తెలుగు తమ్ముళ్లు శుభాకాంక్షలు తెలిపారు.నియోజవర్గంలో ఫింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.నల్లమాడ ఓడిచెరువు,అమడగూరు మండలాల్లో నూతన ఛౌక ధాన్యపు డిపోలు ప్రారంభించారు.ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ
....ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని,ప్రజల మొహల్లో చిరునవ్వులు చిందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిరకాల స్వప్నమన్నారు.సామాజిక పింఛన్లు రెట్టింపు చేయడంతో పేదల మొహాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు పేర్కొన్నారు.
నల్లమాడ, ఓడి చెరువు మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా మైనార్టీ సోదరులు తుమ్మల మహబూబ్ బాషా,జౌళి బాబా,సాదిక్ వలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 60 కిలోల కేక్ ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. టీడీపీ మండల కన్వీనర్ జయచంద్రతో పాటు పీట్ల సుధాకర్, లక్ష్మీనారాయణ రెడ్డి,రమణ రెడ్డి, రామాంజినేయులు నాయక్,కంచి సురేష్, సుధాకర్, గంటా శ్రీనివాసులు, ఓబుల్ రెడ్డి,నరసింహబాబు, శేఖర్, రామాంజి, అంజినప్ప, అంజన్ రెడ్డి,సాంబా,మస్థానమ్మ ,అబ్లు హుసేన్,వైదేహి,తెదేపా కార్యకర్తలు ఎమ్మెల్యేకి పూల వర్షం కురిపిస్తూ టపాసులు కాల్చి ఘన స్వాగతం పలికారు.
తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ముందస్తుగా గురువారం పుట్టపర్తి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఓడి చెరువు లోని అయన నివాసంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే జన్మదినం శుక్రవారం కావడంతో ఆమె కుటుంబ సభ్యులతో కలసి తిరుపతికి బయలుదేరి వెళ్తుండడంతో నియోజకవర్గంలో ఆమె ప్రజలకు అందుబాటులో ఉండ రనే సమాచారంతో గురువారం నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు ముందస్తుగా కేకులు ఏర్పాటుచేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుయుత నియోజకవర్గం అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి దంపతులు ఎమ్మెల్యేకి పసుపు ,కుంకుమ ,చీర ను అందజేశారు.అంతకు ముందు పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండలం అప్పలవాండ్లపల్లిలో ఉదయం 6 గంటలకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా సామాజిక ఫింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు, నియోజకవర్గంలోని ఊరువాడలా అన్ని మండలాలు,గ్రామాల్లో పింఛన్లు పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ పింఛన్లు పంపిణీతో పాటు నల్లమాడ మండలంలో నల్లమాడ,ఎద్దులవాండ్లపల్లి తాండా,ఎద్దులవాండ్లపల్లి,ఓడి చెరువు మండలం డబురువారిపల్లి,ఓడిచెరువు, ఆమడగూరు మండలంలో కందుకూరిపల్లి గ్రామాల్లో పింఛన్లు పంపిణీ తోపాటు కొన్ని చౌక ధాన్యపు డిపోలు అక్కడక్కడ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తోపాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్లు రూ.4వేలు,వికలాంగుల పింఛన్లు 6వేలు,దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులకు,డయాలసిస్ రోగులకు 10వేలు,రూ15వేలకు పెంచి పేదలకు సాయం అందించడానికి తెదేపా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందన్నారు.అవ్వ తాత కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పెద్ద కొడుకుగా,అక్కా చెల్లికి ఇంటి పెద్దన్నయ్య లా అండగా ఉన్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఓక్కరికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు.కులం,మతం ప్రాంతం వర్గాలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు హామీలను అమలు చేసేలా ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారని,ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని…
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)ఆగష్టు01(విజయస్వప్నం.నెట్)
మడకశిర నియోజకవర్గం, గుండుమల గ్రామంలో గురువారం సామాజిక భద్రతా ఫింఛన్లు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వాగతం పలికి అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాలలో పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి గౌన్లు,మాస్కులు అందచేత
శ్రీసత్యసాయిజిల్లా కదిరి(ఓడిచెరువు) ఆగష్టు01(విజయస్వఫ్నం.నెట్)
కదిరి పట్టణంలో గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి పూర్వపు కార్యదర్శి డాక్టర్ సి.వి మదన్ కుమార్ ఆధ్వర్యంలో కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ విభాగానికి సంబంధించిన 100 శాస్త్ర చికిత్స గౌన్లు,మాస్కులను కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్,డాక్టర్ ఎండి హుస్సేన్ కి అందజేశారు.ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి ప్రెసిడెంట్ తాయి నితిన్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కదిరి ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని,ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ కేసులు ఎక్కువని,దీని వలన ఎక్కువమంది కిడ్నీ బారిన పడుతున్నారని,ఇటువంటి వారు ఖరీదైన చికిత్స నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లేవారని,కానీ ఇటీవల కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని.ఈ డయాలసిస్ విభాగానికి తన వంతు సహకారంగా డాక్టర్ సి.వి.మదన్ కుమార్ దాదాపు 35 వేల రూపాయలు సంబంధించిన డయాలసిస్ సర్జికల్ సామాగ్రిని అందజేశారన్నారు.రాబోయే కాలంలో కదిరి ప్రాంత వైద్య విభాగానికి సంబంధించి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సెక్రెటరీ నాగార్జున,పచ్చి పులుసు రాఘవేంద్ర,శ్రీనివాస్ ప్రశాంత్,కిషోర్ కుమార్ రెడ్డి,రంజిత్,తాయి శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి,అభినయ్, గణేష్,నామా రఘు,రాజీవ్, రాజశేఖర్ రెడ్డి,సోమశేఖర్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
పాడి ఆవుకు ప్రాణం పోసిన వెటర్నరీ డాక్టర్
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు ఆగష్టు02(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని గుండువారిపల్లి గ్రామంలో శుక్రవారం మజ్జిగ కృష్ణారెడ్డికి చెందిన పాడి ఆవు గత 15 రోజులుగా అనారోగ్యంతో మేత మేయలేని పరిస్థితిని గమనించి మండల ఇంచార్జ్ పశువైద్య అధికారి హరినాథ్ రెడ్డికి సమాచారం ఇవ్వగా ఇంఛార్జి వైద్యులు చూచనలతో డాక్టర్ రామేశ్వర్,డాక్టర్ శ్రీనివాసులు ఆవుకు శస్త్రచికిత్స చేసి పాడి పశు ఆవు ప్రాణాన్ని కాపాడారని పాడి రైతు పేర్కొంటూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.గతం లో కూడా డాక్టర్ రామేశ్వర్ ప్రజలకు నిరంతరం అందుబాటులో వుండి ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించేవారాని గ్రామస్తులు కొనియాడుతూ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కి సహాయకులు గా ఏహెచ్ఏలు గోవర్ధన్ రెడ్డి, రాజశేఖర్,కార్తీక్,శ్వేతవాహణ్ పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఏపి ఆర్థిక పురోగతి సాధించాలని కోరుకొంటున్నాఆటంకాలు లేకుండా పోలవరం,అమరావతి నిర్మాణం త్వరగా పూర్తి కావాలి:కాణిపాకం వరసిద్ధి వినాయక సన్నిధిలో పూజలు,కలియుగ దైవం వెంకన్న దర్శనానికి పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఆగష్టు02(విజయస్వప్నం.నెట్)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోగతి సాధించాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆకాంక్షించారు. ఏపి ప్రజల ఆకాంక్ష అయిన పోలవరం,అమరావతి నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తి కావాలని చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో శుక్రవారం పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి కుటుంబ సభ్యులు తోపాటు కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డి దంపతులు వినాయకుని దర్శించుకొని ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు.
పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జన్మదినం సందర్భంగా కాణిపాక వరసిద్ది వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితులు వేద మంత్రోశ్చరణల మధ్య ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పల్లె సిందూర రెడ్డి కుటుంబ సభ్యులను వేద పండితులు ఆశీర్వదించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ....ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి కోరుకొన్నట్లు తెలిపారు.రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం కళ్లల్లో ఆనందం కలిగించేలా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆమె ఆకాంక్షించారు.మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ....ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆ వినాయకుడిని ప్రార్తించినట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ తో పాటు పుట్టపర్తి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకొంటున్నానట్లు ఆయన తెలిపారు.దేశంలో ఏపీ ఆర్థిక పురగతి సాధించి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని,ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవతలను కోరుకున్నారు.అనంతరం కాలినడకన తిరుపతి వెంకన్న దర్శనానికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తోపాటు ఎమ్మెల్యే కుమార్తె విన్స్ ,వియాన్ రెడ్డి కుటుంబ సభ్యులు,మాజీ డిజిపి శంకర్ రెడ్డి దంపతులు కాలినడకన బయలుదేరి వెళ్ళినట్లు తెలిపారు.
$$$__________@@@__________$$$
ఘనంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జన్మదిన వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు, ఆగస్టు02(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం ఓడిచెరువు మండల కేంద్రంలో తెదేపా శ్రేణులు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు.స్థానిక అభయాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పేరు మీదుగా అర్చకులు తోయారాజుస్వామి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు ఓబుల్ రెడ్డి,నియోజకవర్గ మైనారిటీ నాయకులు టైలర్ నిజాం,నాయకులు కుసుమవారిపల్లి జయరాం రెడ్డి,సాంబశివరెడ్డి,గంగిరెడ్డి,మల్లికార్జున,అంజన్ రెడ్డి,ఛౌట కిష్టప్ప,చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి ఆచారి,డాక్టర్ ఆర్ఎంపీ కృష్ణ, చిన్నపరెడ్డి,శివప్ప తదితరులు పాల్గొన్నారు.
కొండకమర్ల తెదేపా కార్యాలయంలో....
ఓడిచెరువు మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.తెదేపా కార్యాలయంలో ఆర్ఎంపీ డాక్టర్ జాకీర్ ఆధ్వర్యంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ మిఠాయిలు పంచి పెట్టారు.ఈకార్యక్రమంలో ఎస్సీ సెల్ గంగాద్రీ,బడిశం సురేష్,గండికోట ఇర్షాద్, సుబ్బారాయుడు,తెదేపా శ్రేణులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
$$$__________@@@__________$$$
శిశువుకు ముర్రిపాలే శ్రేష్టం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు03(విజయస్వప్నం.నెట్)
శిశువు పుట్టిన గంటలోపే తల్లి ముర్రుపాలు అందిస్తే బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుందని సిడిపిఓ వరలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని సున్నంపల్లి పంచాయతీ చౌడేపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా గర్భిణులు,బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించి,తల్లిపాలను బిడ్డలకు 6నెలల వరకు అందించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుందని అవగాహన కల్పించారు.పుట్టిన గంటల లోపు ముర్రుపాలు బిడ్డలకు పట్టించడం వల్ల భవిష్యత్తులో నిమోనియా, అతిసార వంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయని,పిల్లల మేధస్సుకు దోహదపడ్డాతాయని, బిడ్డలకు 6 నెలల పాటు తల్లిపాలు అందిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుండగలరని తెలిపారు.సూపర్వైజర్ విజయకుమారి పాల్గొని తల్లి పిల్లల ఆరోగ్యం అడిగి తెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో అంగన్వాడీ భోధకులు సుగుణమ్మ,సుజాత,లక్ష్మీదేవి, రత్నమ్మ,చంద్రకళ,రమణమ్మ, భువనేశ్వరి,ఆయాలు, చిన్నారుల తల్లులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ప్రకృతి వ్యవసాయం-సంపూర్ణ ఆరోగ్యం
జిల్లా వనరుల కేంద్రం ,పుట్టపర్తి ఏడిఏ జె.సనా వూల్లా
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు02(విజయస్వప్నం.నెట్)
మండలంలోని డబురువారిపల్లి పంచాయతీ బత్తినపల్లి గ్రామానికి చెందిన రైతు కే.శ్రీనివాసులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించి పండించిన ఏ-గ్రేడ్ నమూనా 7 రకాల కూరగాయలు మొక్కజొన్న,సజ్జ పంటల సాగు చేస్తున్న పొలమును శుక్రవారం జిల్లా వనరుల కేంద్రం, పుట్టపర్తి ఏడిఏ జె.సనావూల్లా సందర్శించి రైతు సోదరులకు నిరంతర నికర ఆదాయం పొందుటకు ఏ గ్రేడ్ నమూనా పద్ధతి ద్వారా పంటలను పండించాలని సూచించినట్లు రైతులు తెలిపారు.అదేవిధంగా రైతు అక్కులప్ప వేరుశనగ ఏటీఎం నమూనా పద్ధతిని అనుసరించి పండించిన ఎనిమిది రకాల కూరగాయలు ఆకుకూరలు పంట పొలాన్ని సందర్శించి,ఈ పద్ధతి ద్వారా కలుగు,ప్రయోజనాలను గురించి రైతులకు అవగాహన కల్పించారు.అనంతరం ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి పంటలు పండించడం వలన పురుగు మందులు,రసాయన ఎరువులు వాడకం చాలా వరకు తగ్గించి నేల మరియు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా నాణ్యమైన అధిక నికర ఆదాయం రైతులు పొందవచ్చునని ఏడిఏ సన్నావుల్లా రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఇలియాస్ మహమ్మద్, విఎస్ఏ భరత్,ఆత్మ ఏటీఎం మౌనిక,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఉచిత గుండె వైద్యశిబిరానికి విశేష స్పందన
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై31(-విజయస్వప్నం.నెట్)
మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామ ఉర్దూ పాఠశాలలో బుధవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్క్ సూపర్ స్పెషాలిటీ గుండె ఆసుపత్రి వైద్యులతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి గుండె నొప్పి,ఛాతీ నొప్పి, గుండె దడ,ఆయాసం,గుండెలో మంట,ఛాతీలో బరువుగా వుండడం,కాలు వాపులు రావడం,చెమటలు పట్టడం తదితర వ్యాధులకు,అలాగే బ్లడ్ షుగర్,బిపి,ఈసీజీ,2డి ఎకో ద్వారా 142 మందికి పరీక్షలు నిర్వహించి,వైద్య సేవలు అందించినట్లు కార్యనిర్వహాకులు సాథక్ బాషా,అబ్లు, జావేద్,ఆట ఉల్లా సర్,సాదిక్ లు తెలిపారునేడు బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని తెలిపారు.అనంతరం లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్క్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారని పేర్కొన్నారు.
$$$__________@@@__________$$$
మూడెకరాల భూమి నిరుపేదలకు ఇవ్వాలి: శ్రీసత్యసాయిజిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ ఛైర్మన్ కదిరప్ప
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై31(విజయస్వప్నం.నెట్)
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్ళు కావస్తోందని, ఇప్పటికీ ఎంతో మంది భూమి లేని నిరుపేదలుగా జీవిస్తున్నారని, అభ్యంతరం లేని ప్రభుత్వ(అసైన్డ్) భూములు సాగు చేసుకోవడానికి నిరుపేదలకు 3 ఎకరాలు చొప్పున పంపిణీ చేయాలని బుధవారం శ్రీసత్యసాయిజిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఛైర్మన్ బి.కదిరప్ప డిమాండ్ చేశారు.కాంగ్రస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వంలో వెనుకబడిన ఎస్సీ వర్గాల ప్రతి కుటుంబానికి అసైన్డ్ భూములు పంపిణీ చేశారని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు.నిరుపేదలకు అందుబాటులో ఉంటూ....కష్ట సమయాల్లో ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.జిల్లా వ్యాప్తంగా అసైన్డ్ భూములు మెండుగా ఉన్నాయని, నిరుపేదలకు 3 ఎకరాల చొప్పున ఇవ్వాలని, వీటి పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
$$$__________@@@__________$$$
అంగన్వాడీ కార్యకర్తను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలి
-సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుళు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై31(విజయస్వప్నం.నెట్)
మండలంలోని వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త నాగమణి ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుళు డిమాండ్ చేశారు.మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుళు ధర్నా చేపట్టారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వీరప్పగారిపల్లి మినీ అంగన్వాడీ కార్యకర్త నాగమణిని ఆంజనేయులు వేధించడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయన్నారు.ఈక్రమంలోనే వీరప్పగారిపల్లి గ్రామానికి చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త నాగమణిని ఉద్యోగం నుండి తొలగిస్తామని అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు సోదరుడు వెంకటేసులు నిత్యం వేధింపులకు గురి చేసి బెదిరిస్తున్నారని, దీనిని తట్టుకోలేక నాగమణి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని,విధిల్లో నాగమణి అందుబాటులో ఉంటూ బాగా పనిచేస్తుందని గ్రామానికి చెందిన బాలింతలు, గర్భిణులు,పిల్లల తల్లిదండ్రులు వివరించిన కూడా ఆకారణంగా గ్రామానికి చెందిన ఆంజనేయులు,తమ్ముడు వెంకటేసులు అంగన్వాడీ కార్యకర్త నాగమణిపై లేనిపోని ఆరోపణలు చేసి ఆమె ఆత్మహత్యాయత్నానికి కారకులైనారని, వీరిని వెంటనే అరెస్ట్ చేసి, అంగన్వాడీ కార్యకర్త నాగమణికి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహశీల్దార్ జాకిర్ హుస్సేన్ కు వినతిపత్రం అందజేశారు.ఉదయం 11 గంటల నుండి 3 వరకు ధర్నా చేపట్టి అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు.రాజకీయ వేధింపులు,తొలగింపులు కొనసాగితే ఉమ్మడి జిల్లాలకు చెందిన వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలతో సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు,వెంకటేష్,బాబావలి,జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ,జిఎల్.నరసింహులు,జిల్లా కోశాధికారి సాంబశివ, మండల కన్వీనర్ కుళ్ళాయప్ప, అంగన్వాడీ యూనియన్ నాయకురాళ్ళు రంగమ్మ,ఆశీర్వదమ్మ, మణిమాల, లక్ష్మీదేవి,అరుణమ్మ,కిష్టమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఎస్సీ వర్గీకరణ సుప్రీం తీర్పు పై ఎమ్మార్పీఎస్ నాయకుల హర్షం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు01(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో గురువారం అంబేద్కర్ కూడలిలో ఎమ్మార్పీఎస్ నాయకులు సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను సమర్ధిస్తూ తీర్పు వెలువడించడంతో స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు.ముందుగా అంబేద్కర్ విగ్రహానికి,ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధినేత మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లక్ష్మన్న, బావన్న,రమణ,కత్తి ఆనంద్, ఓడిచెరువు గ్రామ పంచాయతీ సర్పంచ్ ముద్దలపల్లి గోవిందు,ఎర్ర దొడ్డప్పలు మాట్లాడుతూ మూడు దశాబ్దాల క్రితం వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో 21 మంది యువకులతో ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం,ఎంతో మంది మాదిగ యువకుల త్యాగాలు వున్నాయని,30 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల్లో ఎంతో మంది జైలుకెళ్ళడం, ఎంతో మంది ప్రాణాలు త్యాగాలు చేశారన్నారు.వివిధ రూపాల్లో ఉద్యమాల ఫలితంగా సుప్రీం కోర్టులో ఏడుగురు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని తీర్పును వెలువడించడం మాదిగల చారిత్రక విజయంగా అభివర్ణించారు. సుప్రీంకోర్ట్ ధర్మాసనానికి మాదిగజాతి తరపున ధన్యవాదాలు తెలిపారు.తెఈకార్యక్రమంలో సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీనివాసులు,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొచ్చు కదిరప్ప,రామకృష్ణ,ధారా వెంకటరాముడు,నరసింహులు,తోల నాగభూషణ రామాంజనేయులు,గేరివి మహేష్,లక్ష్మీపతి,అక్కులప్ప,రామారావు,మహేంద్ర,ఫక్కిరప్ప,అనిల్ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి గౌన్లు,మాస్కులు అందచేత
కదిరి పట్టణంలో గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి పూర్వపు కార్యదర్శి డాక్టర్ సి.వి మదన్ కుమార్ ఆధ్వర్యంలో కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ విభాగానికి సంబంధించిన 100 శాస్త్ర చికిత్స గౌన్లు,మాస్కులను కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్,డాక్టర్ ఎండి హుస్సేన్ కి అందజేశారు.ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి ప్రెసిడెంట్ తాయి నితిన్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కదిరి ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని,ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ కేసులు ఎక్కువని,దీని వలన ఎక్కువమంది కిడ్నీ బారిన పడుతున్నారని,ఇటువంటి వారు ఖరీదైన చికిత్స నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లేవారని,కానీ ఇటీవల కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని.ఈ డయాలసిస్ విభాగానికి తన వంతు సహకారంగా డాక్టర్ సి.వి.మదన్ కుమార్ దాదాపు 35 వేల రూపాయలు సంబంధించిన డయాలసిస్ సర్జికల్ సామాగ్రిని అందజేశారన్నారు.రాబోయే కాలంలో కదిరి ప్రాంత వైద్య విభాగానికి సంబంధించి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సెక్రెటరీ నాగార్జున,పచ్చి పులుసు రాఘవేంద్ర,శ్రీనివాస్ ప్రశాంత్,కిషోర్ కుమార్ రెడ్డి,రంజిత్,తాయి శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి,అభినయ్, గణేష్,నామా రఘు,రాజీవ్, రాజశేఖర్ రెడ్డి,సోమశేఖర్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందాలి
ప్రజల మొహల్లో చిరునవ్వు చిందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం
-ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఆగష్టు01(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయమే 95శాతం పూర్తి చేసిన పింఛన్లు పంపిణీ కార్యక్రమం పూర్తి చేసినట్లు తెలిపారు.ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 60 కేజీల కేక్ కట్ చేసి ఓడి చెరువు తెలుగు తమ్ముళ్లు శుభాకాంక్షలు తెలిపారు.నియోజవర్గంలో ఫింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.నల్లమాడ ఓడిచెరువు,అమడగూరు మండలాల్లో నూతన ఛౌక ధాన్యపు డిపోలు ప్రారంభించారు.ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ
....ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని,ప్రజల మొహల్లో చిరునవ్వులు చిందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిరకాల స్వప్నమన్నారు.సామాజిక పింఛన్లు రెట్టింపు చేయడంతో పేదల మొహాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు పేర్కొన్నారు.
నల్లమాడ, ఓడి చెరువు మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా మైనార్టీ సోదరులు తుమ్మల మహబూబ్ బాషా,జౌళి బాబా,సాదిక్ వలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 60 కిలోల కేక్ ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. టీడీపీ మండల కన్వీనర్ జయచంద్రతో పాటు పీట్ల సుధాకర్,లక్ష్మీనారాయణ రెడ్డి,రమణ రెడ్డి,రామాంజినేయులు నాయక్,కంచి సురేష్ ,సుధాకర్ ,గంటా శ్రీనివాసులు,ఓబుల్ రెడ్డి,నరసింహబాబు,శేఖర్,రామాంజి,అంజినప్ప,అంజన్ రెడ్డి,సాంబా,మస్థానమ్మ ,అబ్లు హుసేన్,వైదేహి,తెదేపా కార్యకర్తలు ఎమ్మెల్యేకి పూల వర్షం కురిపిస్తూ టపాసులు కాల్చి ఘన స్వాగతం పలికారు.
తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ముందస్తుగా గురువారం పుట్టపర్తి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఓడి చెరువు లోని అయన నివాసంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే జన్మదినం శుక్రవారం కావడంతో ఆమె కుటుంబ సభ్యులతో కలసి తిరుపతికి బయలుదేరి వెళ్తుండడంతో నియోజకవర్గంలో ఆమె ప్రజలకు అందుబాటులో ఉండ రనే సమాచారంతో గురువారం నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు ముందస్తుగా కేకులు ఏర్పాటుచేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుయుత నియోజకవర్గం అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి దంపతులు ఎమ్మెల్యేకి పసుపు ,కుంకుమ ,చీర ను అందజేశారు.అంతకు ముందు పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండలం అప్పలవాండ్లపల్లిలో ఉదయం 6 గంటలకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా సామాజిక ఫింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు, నియోజకవర్గంలోని ఊరువాడలా అన్ని మండలాలు,గ్రామాల్లో పింఛన్లు పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ పింఛన్లు పంపిణీతో పాటు నల్లమాడ మండలంలో నల్లమాడ,ఎద్దులవాండ్లపల్లి తాండా,ఎద్దులవాండ్లపల్లి,ఓడి చెరువు మండలం డబురువారిపల్లి,ఓడిచెరువు, ఆమడగూరు మండలంలో కందుకూరిపల్లి గ్రామాల్లో పింఛన్లు పంపిణీ తోపాటు కొన్ని చౌక ధాన్యపు డిపోలు అక్కడక్కడ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తోపాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్లు రూ.4వేలు,వికలాంగుల పింఛన్లు 6వేలు,దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులకు,డయాలసిస్ రోగులకు 10వేలు, రూ15వేలకు పెంచి పేదలకు సాయం అందించడానికి తెదేపా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందన్నారు.అవ్వ తాత కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పెద్ద కొడుకుగా,అక్కా చెల్లికి ఇంటి పెద్దన్నయ్య లా అండగా ఉన్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఓక్కరికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు.కులం,మతం ప్రాంతం వర్గాలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు హామీలను అమలు చేసేలా ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారని,ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రజా ప్రతినిధులు, తెదేపా,జనసేన,బిజెపి నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.డబురువారిపల్లిలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి చేరుకోగానే భారీగా బాణాసంచా కాల్చి జన్మదినం సందర్భంగా కేక్ కట్ మిఠాయిలు పంచిపెట్టి తెదేపా శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సూచనల మేరకు శేషయ్యగారిపల్లి తాండలో సర్పంచ్ రేణుకా బాయి, తుమ్మలకుంట్లపల్లి గ్రామంలో సర్పంచ్ వేళమద్ది శ్రీదేవి చేతుల మీదుగా నూతన ఛౌక ధాన్యపు డిపోలు ప్రారంభించారు. ఈసందర్భంగా డీలర్లు ఎమ్మెల్యే, మాజీమంత్రి పల్లె కు కృతజ్ఞతలు తెలిపారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)ఆగష్టు01(విజయస్వప్నం.నెట్)
మడకశిర నియోజకవర్గం,గుండుమల గ్రామంలో గురువారం సామాజిక భద్రతా ఫింఛన్లు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వాగతం పలికి అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాలలో పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ప్రకృతి వ్యవసాయం-సంపూర్ణ ఆరోగ్యం
-జిల్లా వనరుల కేంద్రం ,పుట్టపర్తి ఏడిఏ జె.సనా వూల్లా
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు02(విజయస్వప్నం.నెట్)
మండలంలోని డబురువారిపల్లి పంచాయతీ బత్తినపల్లి గ్రామానికి చెందిన రైతు కే.శ్రీనివాసులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించి పండించిన ఏ-గ్రేడ్ నమూనా 7 రకాల కూరగాయలు మొక్కజొన్న,సజ్జ పంటల సాగు చేస్తున్న పొలమును శుక్రవారం జిల్లా వనరుల కేంద్రం, పుట్టపర్తి ఏడిఏ జె.సనావూల్లా సందర్శించి రైతు సోదరులకు నిరంతర నికర ఆదాయం పొందుటకు ఏ గ్రేడ్ నమూనా పద్ధతి ద్వారా పంటలను పండించాలని సూచించినట్లు రైతులు తెలిపారు.అదేవిధంగా రైతు అక్కులప్ప వేరుశనగ ఏటీఎం నమూనా పద్ధతిని అనుసరించి పండించిన ఎనిమిది రకాల కూరగాయలు ఆకుకూరలు పంట పొలాన్ని సందర్శించి,ఈ పద్ధతి ద్వారా కలుగు,ప్రయోజనాలను గురించి రైతులకు అవగాహన కల్పించారు.అనంతరం ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి పంటలు పండించడం వలన పురుగు మందులు,రసాయన ఎరువులు వాడకం చాలా వరకు తగ్గించి నేల మరియు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా నాణ్యమైన అధిక నికర ఆదాయం రైతులు పొందవచ్చునని ఏడిఏ సన్నావుల్లా రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఇలియాస్ మహమ్మద్, విఎస్ఏ భరత్,ఆత్మ ఏటీఎం మౌనిక,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
పాడి ఆవుకు ప్రాణం పోసిన వెటర్నరీ డాక్టర్
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు ఆగష్టు02(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని గుండువారిపల్లి గ్రామంలో శుక్రవారం మజ్జిగ కృష్ణారెడ్డికి చెందిన పాడి ఆవు గత 15 రోజులుగా అనారోగ్యంతో మేత మేయలేని పరిస్థితిని గమనించి మండల ఇంచార్జ్ పశువైద్య అధికారి హరినాథ్ రెడ్డికి సమాచారం ఇవ్వగా ఇంఛార్జి వైద్యులు చూచనలతో డాక్టర్ రామేశ్వర్,డాక్టర్ శ్రీనివాసులు ఆవుకు శస్త్రచికిత్స చేసి పాడి పశు ఆవు ప్రాణాన్ని కాపాడారని పాడి రైతు పేర్కొంటూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.గతం లో కూడా డాక్టర్ రామేశ్వర్ ప్రజలకు నిరంతరం అందుబాటులో వుండి ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించేవారాని గ్రామస్తులు కొనియాడుతూ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కి సహాయకులు గా ఏహెచ్ఏలు గోవర్ధన్ రెడ్డి, రాజశేఖర్,కార్తీక్,శ్వేతవాహణ్ పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శిశువుకు ముర్రిపాలే శ్రేష్టం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు02(విజయస్వప్నం.నెట్)
శిశువు పుట్టిన గంటలోపే తల్లి ముర్రుపాలు అందిస్తే బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుందని సిడిపిఓ వరలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని సున్నంపల్లి పంచాయతీ చౌడేపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా గర్భిణులు,బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించి,తల్లిపాలను బిడ్డలకు 6నెలల వరకు అందించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుందని అవగాహన కల్పించారు.పుట్టిన గంటల లోపు ముర్రుపాలు బిడ్డలకు పట్టించడం వల్ల భవిష్యత్తులో నిమోనియా, అతిసార వంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయని,పిల్లల మేధస్సుకు దోహదపడ్డాతాయని, బిడ్డలకు 6 నెలల పాటు తల్లిపాలు అందిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుండగలరని తెలిపారు.సూపర్వైజర్ విజయకుమారి పాల్గొని తల్లి పిల్లల ఆరోగ్యం అడిగి తెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో అంగన్వాడీ భోధకులు సుగుణమ్మ,సుజాత,లక్ష్మీదేవి, రత్నమ్మ,చంద్రకళ,రమణమ్మ, భువనేశ్వరి,ఆయాలు, చిన్నారుల తల్లులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఘనంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జన్మదిన వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు, ఆగస్టు02(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం ఓడిచెరువు మండల కేంద్రంలో తెదేపా శ్రేణులు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు.స్థానిక అభయాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పేరు మీదుగా అర్చకులు తోయారాజుస్వామి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు ఓబుల్ రెడ్డి,నియోజకవర్గ మైనారిటీ నాయకులు టైలర్ నిజాం,నాయకులు కుసుమవారిపల్లి జయరాం రెడ్డి,సాంబశివరెడ్డి,గంగిరెడ్డి,మల్లికార్జున,అంజన్ రెడ్డి,ఛౌట కిష్టప్ప,చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి ఆచారి,డాక్టర్ ఆర్ఎంపీ కృష్ణ, చిన్నపరెడ్డి,శివప్ప తదితరులు పాల్గొన్నారు. కొండకమర్ల తెదేపా కార్యాలయంలో.... ఓడిచెరువు మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.తెదేపా కార్యాలయంలో ఆర్ఎంపీ డాక్టర్ జాకీర్ ఆధ్వర్యంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ మిఠాయిలు పంచి పెట్టారు.ఈకార్యక్రమంలో ఎస్సీ సెల్ గంగాద్రీ,బడిశం సురేష్,గండికోట ఇర్షాద్, సుబ్బారాయుడు,తెదేపా శ్రేణులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఏపి ఆర్థిక పురోగతి సాధించాలని కోరుకొంటున్నా
ఆటంకాలు లేకుండా పోలవరం,అమరావతి నిర్మాణం త్వరగా పూర్తి కావాలి:కాణిపాకం వరసిద్ధి వినాయక సన్నిధిలో పూజలు,కలియుగ దైవం వెంకన్న దర్శనానికి పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఆగష్టు02(విజయస్వప్నం.నెట్)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోగతి సాధించాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆకాంక్షించారు. ఏపి ప్రజల ఆకాంక్ష అయిన పోలవరం,అమరావతి నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తి కావాలని చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో శుక్రవారం పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి కుటుంబ సభ్యులు తోపాటు కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డి దంపతులు వినాయకుని దర్శించుకొని ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు.
పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జన్మదినం సందర్భంగా కాణిపాక వరసిద్ది వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితులు వేద మంత్రోశ్చరణల మధ్య ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పల్లె సిందూర రెడ్డి కుటుంబ సభ్యులను వేద పండితులు ఆశీర్వదించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ....ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి కోరుకొన్నట్లు తెలిపారు.రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం కళ్లల్లో ఆనందం కలిగించేలా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆమె ఆకాంక్షించారు.మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ....ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆ వినాయకుడిని ప్రార్తించినట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ తో పాటు పుట్టపర్తి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకొంటున్నానట్లు ఆయన తెలిపారు.దేశంలో ఏపీ ఆర్థిక పురగతి సాధించి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని,ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవతలను కోరుకున్నారు.అనంతరం కాలినడకన తిరుపతి వెంకన్న దర్శనానికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తోపాటు ఎమ్మెల్యే కుమార్తె విన్స్ ,వియాన్ రెడ్డి కుటుంబ సభ్యులు,మాజీ డిజిపి శంకర్ రెడ్డి దంపతులు కాలినడకన బయలుదేరి వెళ్ళినట్లు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి