google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన ఏర్పాట్లు - ఎలుగుబంట్లు సంచారం అటవీ అధికారులు స్పందించండి:పెద్దగుట్టపల్లి గ్రామస్తులు - క్రీడల్లో రాణించిన కస్తూరిబా విద్యార్థినీలు - బడిలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం

31, జులై 2024, బుధవారం

ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన ఏర్పాట్లు - ఎలుగుబంట్లు సంచారం అటవీ అధికారులు స్పందించండి:పెద్దగుట్టపల్లి గ్రామస్తులు - క్రీడల్లో రాణించిన కస్తూరిబా విద్యార్థినీలు - బడిలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం

ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన ఏర్పాట్లు


శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి(ఓడిచెరువు) జూలై28(విజయస్వప్నం.నెట్)

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను జయప్రదం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సబితా అధికారులకు ఆదేశించారు.ఆదివారం పుట్టపర్తి కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటనపై జిల్లా కలెక్టర్ చేతన్,జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.మంత్రి సబితా ఈసందర్భంగా మాట్లాడుతూ సామాజిక భద్రత ఫింఛన్లు నగదు 4వేలకు పెంచి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకుగా అండగా నిలిచారన్నారు.మడకశిర మండలంలోని గుండుమల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని,ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.అనంతరం ఎస్పీ రత్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత చర్యలు చేపడతామని తెలిపారు. హెలిప్యాడ్,ముఖ్యమంత్రి పాల్గొనే వేదిక వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్,ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి,కందికుంట వెంకటప్రసాద్, ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి,ఆర్డీవో భాగ్యరేఖ,డిఎస్ఓ వంశీకృష్ణారెడ్డి తదితర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.     గుండుమలలో మంత్రి పరిశీలన  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన సందర్భంగా మడకశిర మండలంలోని గుండుమల గ్రామంలో మంత్రి సబిత పర్యటించి, ఏర్పాట్లు పరిశీలించారు.ఫింఛన్లు పంపిణీ చేసే లబ్దిదారులతో మాట్లాడారు.అనంతరం పాలిటెక్నిక్ కళాశాల  మైదానంలో సియం పర్యటన కోసం ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు.

$$$__________@@@__________$$$

వైభవంగా మొహరం వేడుకలు 

 




 శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు/ ఆమడగూరు,జూలై28(విజయస్వప్నం.నెట్)

అమడగూరు మండల పరిధిలో గుండువారిపల్లి,చిన్నగానిపల్లి గ్రామాల్లో పీర్ల చారవిడిలో  కొలువుతీరిన  పీర్ల స్వాములకు గత వారం రోజులుగా గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ.... రెండు రోజులుగా రాత్రివేళల్లో గ్రామస్తులు పెద్ద ఎత్తున చావిడి వద్దకు చేరుకుని డప్పు వాయిద్యాలు నడుమ నృత్యాలతో అల్లావుతొక్కుతూ నృత్యాలు చేశారు.భక్తులందరికీ ప్రసాదాలను అందజేశారు. చావిడి వద్ద గుండువారిపల్లి యూత్ ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి,పీర్ల పండగను పురస్కరించుకొని గ్రామస్తులంతా వారి బంధువులను ఆహ్వానించారు. బంధు మిత్రులతో గుండువారిపల్లి, చిన్నగానపల్లి గ్రామాలు కళకళలాడాయి.ఆదివారం చివరి రోజు పీర్ల స్వాములకు ఘనంగా జలధి కార్యక్రమాన్ని నిర్వహించారని గుండువారిపల్లి, చిన్నగానపల్లి గ్రామస్తులు,యువకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో చిన్నగానపల్లి గ్రామ పెద్దలు జి.నరేందర్ రెడ్డి,జి వెంకటరెడ్డి,శేఖర్ రెడ్డి,రామచంద్రరెడ్డి,గుండువారిపల్లి గ్రామ పెద్దలు వీరారెడ్డి,నంజిరెడ్డి,గోపాల్ రెడ్డికృష్ణారెడ్డి యువత మనోహర్ రెడ్డి,రాజా,గ్రామస్తులు వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

ఓడిచెరువులో పీర్లు పండుగ

ఓడిచెరువు మండలంలోని ఎం.కొత్తపల్లి, తంగేడుకుంట, ఓడిచెరువు గ్రామాల్లో ఘనంగా మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.ఓడిచెరువు పీర్ల చావిడి వద్ద గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని అగ్నిగుండం వద్ద డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఘనంగా జలథి ఉత్సవ వేడుకలు నిర్వహించారు.అంతక ముందు పీర్లను పురవీధుల్లో ఊరేగిస్తూ బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు,అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

$$$__________@@@__________$$$

మహిళల ఆరోగ్యానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక దృష్టి 

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి జూలై28(విజయస్వప్నం.నెట్)

గ్రామీణ ప్రాంత గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక చొరవతో వాటికి అవసరమయ్యే  మందులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు అయ్యేలా సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ చర్యలు తీసుకున్నారు.

ఈ మధ్య జరిగిన అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అలాగే సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జులై 11న జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ప్రసవ సమయంలో గ్రామీణ ప్రాంత పేద మహిళలు పడే ఇబ్బందులను గుర్తుచేస్తూ వారి ప్రాణాలు కాపాడే టెర్బ్యూటాలియన్ మెడిసిన్ ను,ఆల్ట్రాసౌండ్ ట్రాన్సడుసర్ మెషిన్ ను జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తే గర్భిణీ స్త్రీల ప్రాణాలు కాపాడ వచ్చునని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.దీనికి వెంటనే జిల్లా కలెక్టర్ చేతన్ ప్రత్యేక చర్యలు తీసుకొని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కోరిన మందులను,ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ చేతన్ ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు.ఈసందర్భంగా కలెక్టర్ చేతన్ కు,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

$$$__________@@@__________$$$

ఎలుగుబంట్లు సంచారం

అటవీ అధికారులు స్పందించండి:పెద్దగుట్టపల్లి గ్రామస్తులు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై28(విజయస్వప్నం.నెట్)

మండలంలోని పెద్దగుట్టపల్లి సమీప ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా నల్లగుట్ట పరిసరాల్లో ఎలుగుబంట్లు సంచారిస్తుండడంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు.అమడగూరుమండలం మహమ్మదాబాద్ గ్రామ సమీపంలో కొండ గుట్టల్లో ఇటివల ఎలుగుబంట్లు సంచారం తెలిసిందే, మహమ్మదాబాద్ గ్రామంలో కొండ నుండి మండలంలోని పెద్దగుట్టపల్లి సమీప నల్లగుట్టలోకి ఎలుగుబంట్లు వస్తుంటాయని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు.పొలాల్లో సంచారిస్తుండడంతో భయాందోళనలు చెందుతున్నారు.ఇప్పటికైన అటవీ అధికారులు స్పందించి గ్రామాల్లో ఎలుగుబంట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

$$$__________@@@__________$$$

క్రీడల్లో రాణించిన కస్తూరిబా విద్యార్థినీలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై29(విజయస్వప్నం.నెట్)

నల్లమాడ మండలంలో ఇటీవల నిర్వహించిన అండర్ 14 విభాగంలో షాట్ ఫుట్, రన్నింగ్ క్రీడల్లో ఓడిచెరువు మండలంలోని కస్తూరిబా బాలికల పాఠశాల విద్యార్థులు ప్రతిభే కనబరిచారు. షాట్ ఫుట్ అండర్ 16 విభాగంలో శృతి ప్రధమ స్థానంలో, షాట్ ఫుట్ అండర్ 14 విభాగంలో శారణ్య ద్వితీయ స్థానంలో, రన్నింగ్ అండర్ 14 విభాగంలో స్వప్న ప్రధమ స్థానంలో నిలిచి, జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైనట్లు ఎస్ఓ గీతబాయి, వ్యాయామ ఉపాధ్యాయురాలు దేవి తెలిపారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.

$$$__________@@@__________$$$

స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు హర్షణీయం

సియం చంద్రబాబు నాయుడుకి అభినందనలు: బిజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు

శ్రీసత్యసాయిజిల్లా,అమడగూరు,జూలై 29(విజయస్వప్నం.నెట్)

భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు,శాస్త్రవేత్తలు,విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్,డొక్కా సీతమ్మ,అబ్దుల్ కలాంపేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి బిజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఆర్గానిక్ సెల్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేర్లు పెట్టుకొన్నారని,అలాంటి దుస్సంప్రదాయానికి మంగళంపాడి,విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించే మహనీయుల పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామనికి  నాంది పలికినందుకు ఈసందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.పాఠశాల విద్యార్థులకు అందించే విద్యా కానుక ద్వారా యూనిఫాం,పుస్తకాలు,స్కూల్ బ్యాగ్,బూట్లు,సాక్స్ లాంటి విద్యాసామాగ్రి ఇస్తున్నారని,ఈ పథకాన్ని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితమని,ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి,ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా,భారత తొలి ఉపరాష్ట్రపతిగా,2వ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశంగా వుంటుందని,ఈ పేరు పెట్టడం ద్వారా లక్షలాదిమంది ఉపాధ్యాయులు గౌరవాన్ని కాపాడడంమే కాకుండ వారందరి మనసును గెలుచుకున్నరని అభిప్రాయం వ్యక్తం చేశారు.మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరు పెట్టుకున్నారని,ఇందుకు భిన్నంగా అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని,ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ వంటి సేవమూర్తి పేరుతో వారి దయాగుణం,సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయని,సమాజంలో సేవాగుణం విద్యార్థి దశ నుంచి వారిలో అలవర్చుకుంటాన్నారు.మన దేశపు మిస్సైల్ మ్యాన్ డా.అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందని,పేద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకొన్నారని,తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారని,అబ్దుల్ కలాం  జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుందని,విద్యార్థి దశ అంటే అబ్దుల్ కలాం లాంటి గొప్ప మహనీయుని యొక్క జీవితం విశేషాలు విద్యార్థులు తెలుసుకొనే అవకాశం కలుగుతుందని,ఎంతోమంది భావి భారత పౌరులు ప్రభావితం చేయగలుగుతుందని పేర్కొన్నారు.కోట్లాదిమంది యువకులు జీవితాలను ప్రభావితం చేసింది స్వామి వివేకానంద పేరును ఏదైనా ఒక యువతకు సంబంధించిన పథకానికి పెట్టాలని ఆయన ఈసందర్భంగా కోరారు.మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారని,ఆ మహనీయుల దివ్యాశ్సీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు  నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయని ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్,భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

$$$__________@@@__________$$$

బడిలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై29(విజయస్వప్నం.నెట్)

మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డే సందర్భంగా శిక్షా సప్తఆహ్(శుభ తిథి భోజనం కార్యక్రమం)లో భాగంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.మండలంలోని ఎంబి క్రాస్ గ్రామ ప్రాధమిక పాఠశాలలో సర్పంచ్ ధారా లక్ష్మీదేవి ఆధ్వర్యంలో పథకాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారన్నారు. ఉపాధ్యాయ బృందం,ఎంపీటీసీ శ్రీనివాసులు, ధారా,నాగేంద్ర,స్కూల్ కమిటీ ఛైర్మన్ రామాంజనేయులు, రమేష్, రాజేష్,బాలకృష్ణ, జనసేన విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.అల్లాపల్లి పంచాయతీ గౌనిపల్లి గ్రామ పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపాధ్యాయ బృందం ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... పాఠశాల మోనులో పొందుపరిచిన భోజనంతో పాటు పౌష్టికాహారం విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. ప్రత్యేకంగా తయారుచేసిన పాయసం, భోజనాలు ఏర్పాటు చేసి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మహ్మద్ రియాజ్, ఉపాధ్యాయ మోహన్ రెడ్డి,నాగరాజు, రిటైర్డ్ టీచర్ జీవి ఆదినారాయణ, రామలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

శ్రీస్వామి వారి హుండీ లెక్కింపు మొత్తం రూ.90,73,407/-


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి జూలై 30(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో సంబందించిన హుండిల లెక్కింపు మంగళవారం పూర్తి చేయగా  రు.90,73,407/-లు 66 రోజులు మొత్తం నగదుగా వచ్చిందని, బంగారు 23 గ్రామలు 855 మీల్లి గ్రామాలు, వెండి 310 గ్రామాలు,విదేశి కరెన్సీ యూఎస్ఏ(అమెరికా) 43 డాలర్లు, సౌదీ అరేబియా1.00, నేపాల్ : 5.00, కోవెట్ :1.00 హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి అధ్వర్యములో లెక్కింపు చేపట్టగా,హుండీ లెక్కింపు పర్యవేక్షణాధికారిగా డి.రమేష్ బాబు, సీనియర్ సహాయకులు,జిల్లా దేవాదాయశాఖ కార్యాలయం, శ్రీసత్యసాయి జిల్లా వారు హాజరైయ్యారు.హుండి లెక్కింపు కార్యక్రమములో  దేవస్థానము సిబ్బంది,ఎస్.బి.ఐ బ్యాంకు కదిరి మేనేజర్ బి.హరిప్రసాద్,బ్యాంకు సిబ్బందితో పాటు వివిధ సేవా సంస్థ సభ్యులు  పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

రాజముద్రతో పాస్ పుస్తకాలు హర్షణీయం

- బిజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై30(విజయస్వప్నం.నెట్)

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు తీసుకురావడం హర్షణీయమని భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్. ఆకుతోట హరికృష్ణ తెలిపారు.ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ.... ప్రజల ఆస్తి పత్రాలపై జగన్ ఫోటో ఎందుకని  వాపోయిన రైతన్నలు,లాండ్ టైటలింగ్ యాక్ట్ భయపడిన రైతన్నలకు ఇకపై జనం ఆస్తులపై జగన్ దిష్టిబొమ్మలు ఉండవని,ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు  మాటిచ్చారని,ముఖ్యమంత్రి అయ్యాక రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తున్నారని,జగన్ ప్రభుత్వం తన బొమ్మలు,రంగుల కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టిందని,జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా రూ. 700 కోట్ల వరకు ప్రజాధనం వృధా అయ్యిందన్నారు.ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ప్రజల కోరిక మేరకు పట్టాదారు పాసుపుస్తకాలు,భూమి యాజమాన్యపు హక్కు పత్రాలపై రాజముద్రతో పంపిణీ చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి యొక్క వివరాలు,మ్యాప్ ద్వారా డైరెక్ట్ గా భూమి దగ్గరికి వెళ్లే అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి  ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

$$$__________@@@__________$$$

శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయానికి  సప్లైయర్స్  సామాగ్రి వితరణ


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,జులై 30(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలోని  శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి దేవస్థానానికి సంటికే నగర్, ఎలక్ట్రానిక్ సిటీ,బెంగళూరు నివాసులు నారాయణ స్వామి కళావతి దంపతులతో కలిసి ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో శ్యామియానాలు -3,కుర్చీలు -60,టేబుల్స్ -12,సైడ్వాల్స్ -3,కార్పేట్ 120,మీటర్స్ వస్తువులు అందజేశారు.ఈసందర్భంగా ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ.... కోరికలు తీర్చే అమ్మవారి మహిమలకు ఆకర్షితులై వారి కుల దైవాన్ని కోలుచుకునేందుకు భక్తులు ఈవిదంగా సహాయపడటం చాలా సంతోషకరమని,దాత కుటుంబానికి అమ్మవారి ఆశిస్సులు ఉండాలని కోరుకుంటూ దేవస్థానం తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

$$$__________@@@__________$$$

ఫీర్ల పండుగ వేడుకల్లో అన్నదానం


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,జూలై30(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని గుండువారిపల్లి గ్రామంలో యువత,గ్రామ ప్రజలు మొహరం(ఫీర్లు)పండుగ సందర్బంగా ఫీర్ల చావిడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం గ్రామ పెద్దల సహకారంతో వైభవంగా మొహరం వేడుకలు నిర్వహించారు.జలథి సందర్భంగా యువత ముందుండి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని సేవాభావం ఏర్పర్చు కోవాలని గ్రామం పేరు మండల,క్షేత్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని గ్రామ పెద్దలు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గుండువారిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

నేడు కొండకమర్లలో ఉచిత గుండె వైద్యశిబిరం

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై30(విజయస్వప్నం.నెట్)

మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామ ఉర్దూ పాఠశాలలో నేడు(బుధవారం)ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు మంగళవారం ఓప్రకటనలో తెలిపారు.లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్క్ సూపర్ స్పెషాలిటీ గుండె ఆసుపత్రి వైద్యులతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి గుండె నొప్పి,ఛాతీ నొప్పి, గుండె దడ,ఆయాసం,గుండెలో మంట,ఛాతీలో బరువుగా వుండడం,కాలు వాపులు రావడం,చెమటలు పట్టడం తదితర వ్యాధులకు చికిత్స అందిస్తారని,అలాగే ‍ బ్లడ్ షుగర్,బిపి,ఈసీజీ,2డి ఎకో ద్వారా వైద్య సేవలు అందిస్తారని కార్యనిర్వహాకులు సాథక్ బాషా,అబ్లు, జావేద్,ఆట ఉల్లా సర్,సాదిక్ లు పేర్కొన్నారు.నేడు బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని,వివిధ వ్యాధుల చికిత్సలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని,కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి