శ్రీఖాద్రీశుని దర్శించుకున్న కర్నాటక లోకాయుక్త జస్టిస్ బి.వీరప్ప
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి జూలై27(విజయస్వప్నం.నెట్)
నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా కదిరి పట్టణంలో స్వయంభూగా వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని కర్నాటక రాష్ట్రం లోకాయుక్త జస్టిస్ బి.వీరప్ప శనివారం కుటుంభసమేతముగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.ముందుగా లోకాయుక్త జస్టిస్ బి.విరప్ప కుటుంబ సభ్యులతో దేవస్థానం వద్దకు చేరుకోగానే ఆలయ తూర్పూ రాజగోపురము వద్ద నుండి పూర్ణకుంభముతో ఆలయ కార్యనిర్వహణాధికారి వెండి దండి శ్రీనివాస రెడ్డి,దేవస్థానము ప్రధాన అర్చకలు స్వాగతం పలికి శ్రీస్వామి,ఆమ్మవార్ల ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీస్వామి వారి చిత్ర పటము,శేషవస్త్రములతో సత్కరించి,తీర్థ ప్రసాదములు అందజేశారు.
$$$__________@@@_________$$$
ఘనంగా శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) జూలై 27(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపై వెలసిన శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి దేవస్థానంలో ఆవరణలో హెడ్ కానిస్టేబుల్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఉపాలయంలో పురోహితులు పంచరత్న సురేష్ శర్మ వేద మంత్రాలతో విగ్రహ ఆరాధన పుణ్యకార్యం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.హెడ్ కానిస్టేబుల్ గౌడ్,సౌభాగ్య దంపతుల ఆధ్వర్యంలో గత నెలన్నర క్రితం శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి దేవస్థానంలో ఆవరణలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి,గోవిందమ్మ పుణ్య దంపతుల ఉపాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేపట్టగా,41 రోజుల మండల కాలం ఆరాధన మాస పూజ్యోత్సవం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారని తెలిపారు.ముందుగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమ్మ పుణ్య దంపతుల విగ్రహానికి జల శుద్ధి, పసుపు,కుంకుమ అర్చన పూజలు నిర్వహించి, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, కర్పూర హారతుల నీరాజనాలతో ప్రత్యేక పూజలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించి, భక్తులకు తీర్థ,అన్నప్రసాదాలు అందించినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు,చిన్నారులు చరిత,స్రుజన,లైన్ మేన్ గంగాధర,ఆలయ సేవకులు బ్యాంక్ శీనా, డబురువారిపల్లి రమేష్,ఆనంద్, సర్వేయర్ గంగులప్ప,మల్లెల రమేష్,మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి దేవస్థానం అభివృద్ధికి దాతలు,భక్తులు,ఆలయ సేవకులు సహయ సహకారాలు అందించడం ఆనందంగా వుంటుందని ఈసందర్భంగా ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.
$$$__________@@@_________$$$
జిల్లా స్థాయి లాంగ్ జంప్ పోటీలో విద్యార్థినీ గౌతమీ ఎంపిక
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై 27(విజయస్ళప్నం.నెట్)
నల్లమాడ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన రూరల్ గర్ల్స్ అథ్లెటిక్స్ మీట్లో ఓబుళదేవరచెరువు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.గౌతమి అండర్-14కేటగిరి నందు లాంగ్ జంప్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించి,ఆగష్టులో అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహించే ఆర్డీటీ సెంట్రల్ మీట్ కు ఎంపికైన సందర్బంగా విద్యార్థిని గౌతమికి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయిలు గోపీనాథ్,ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.
$$$__________@@@_________$$$
అనంతపురం జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూలై27(విజయస్వప్నం.నెట్)
అనంతపురం జిల్లా ఎస్పీ మురళీ కృష్ణని నగరంలోని పోలీస్ విశ్రాంతి భవనంలో శనివారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,పీవీకేకే కళశాల చైర్మెన్ పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి,కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డితో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
$$$__________@@@_________$$$
రిటర్నుల గడువు పెంచండి:డిటిఎఫ్
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై27(విజయస్వప్నం.నెట్)
రిటర్నుల గడువు పెంచాలని ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా ఇన్కమ్ టాక్స్ ఆఫ్ ఇండియా వారికి సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని రిటర్నుల గడువును పెంచాలని జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫారం 26ఏయస్,వార్షిక సమాచార నివేదిక తదితర వివరాలకు సంబంధించిన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని పోర్టల్ లో ఎదురవుతున్న సాంకేతిక కారణాలవల్ల 26ఏయస్ ఏఐఎస్ లను తీసుకోవడం సాధ్యం కావడం లేదని ఓటీపీలు సరిగా రావడంలేదని 26 ఏయస్ లో రిఫ్లెక్ట్ అయినా ఈ-ఫీలింగ్ పోర్టల్ లో రిఫ్లెక్ట్ కావడం లేదని తదితర సాంకేతిక సమస్యలు దృష్టిలో పెట్టుకొని రిటర్నుల గడువు ఆగస్టు 31 వరకు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
$$$__________@@@_________$$$
ఉచిత మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు జూలై27(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో శనివారం శ్రీచౌడేశ్వరి కళ్యాణ మండపంలో అమడగూరు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దొడ్డం అశోక్ మాట్లాడుతూ ఆమడగూరు మండల ఇప్పటి జరగని కనివిని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా మెగా రక్తదాన శిబిర కార్యక్రమానికి అశేష ప్రజానీకం పాల్గొన్నారని,విజయవంతం చేసిన యూత్ అసోసియేషన్ సభ్యులకు మండల ప్రజలకు దాతలకు ధన్యవాదాలు తెలిపారు.ఈకార్యక్రమంలో 68 మంది రక్తదానం చేయడం సంతోషదాయకమని యువత ఇలాగే స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొని సేవాగుణం అలవర్చుకోవాలని యూత్ అసోసియేషన్ తరపున కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగార్జున,గౌరవ సలహాదారు టైలర్ రామాంజి,కోశాధికారి శివ శంకర,కార్యదర్శి సులేమాన్,సభ్యులు బషీర్,సింహ,పిల్ల అంజి,పవన్,షాజహాన్,కాలేశ్,వినయ్,రేవంత్,శివ,రాజా,మధు,బాలాజీ,రాఘవ,చంద్రహాసన్,జూనియర్ కళాశాల సిబ్బంది,సర్పంచ్ షబ్బీర్, నాయకులు శామ్ బాబు నాయుడు,జెడ్పిటిసి శివశంకర్ రెడ్డి,సూర్యనారాయణ రెడ్డి, పాత్రికేయులు,పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
$$$__________@@@_________$$$
పీర్ల చావిడి లోప్రత్యేక పూజలు
నేడు జలది పండుగ ఏర్పాట్లు పూర్తి
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,జూలై27(విజయస్వప్నం.నెట్)
మండలంలోని గుండువారిపల్లి గ్రామ నడిబొడ్డున పీర్ల చావిడిలో కొలువుతీరిన పీర్ల స్వాములకు గత వారం రోజులుగా గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా శుక్రవారం రాత్రి నుండి శనివారం తెల్లవారుజామున వరకు గ్రామస్తులు పెద్ద ఎత్తున చావడి వద్దకు చేరుకుని డప్పు వాయిద్యాలు నడుమ అల్లావు తోక్కారు.అక్కడికి వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు అందజేశారు.చావిడి దగ్గర గుండువారిపల్లి యూత్ ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి గ్రామస్తులకు వినోదం కల్పించారు.పీర్ల పండగను పురస్కరించుకొని గ్రామంలో బంధువులతో హడావుడి కనిపిస్తుంది.నేడు ఆదివారం చివరి రోజు పీర్ల స్వాములకు ఘనంగా జలధి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు గుండువారిపల్లి యూత్ సభ్యులు పేర్కొన్నారు.కావున మండల వ్యాప్తంగా ఉన్న భక్తాదులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున జలధి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
$$$__________@@@_________$$$
అంగనవాడి కార్యకర్త ఆత్మహత్యాయత్నం----
- తెదేపా నాయకుడు ఆంజనేయులు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో చిత్రీకరణ-- ఆంజనేయులును వెంటనే అరెస్టు చేయాలని సిఐటియు నాయకులు,అంగన్వాడి యూనియన్ నాయకులు తహశిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా----
పోలీస్ స్టేషన్ ముట్టడి
చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ హమీ
శాంతించిన యూనియన్ నాయకులు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై 27(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలం కొండకమర్ల పంచాయతీ పరిధిలోని వీరప్పగారిపల్లికి చెందిన అంగన్వాడీ కార్యకర్త నాగమణి తెదేపా నాయకుడు ఆంజనేయులు పెడుతున్న వేధింపులు భరించలేక శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియోలో తమను వేధిస్తున్న ఆంజనేయులుపై విమర్శలు చేస్తూ పురుగులు మందు తాగి అపస్మారస్థితిలోకి వెళ్లింది.విషయం తెలుసుకున్న స్థానికులు బంధువులు,నాగమణిని హుటాహుటిన108 ద్వారా కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐటీయూ,అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన ఓడిచెరువు మండలంలోని వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త నాగమణి రాజకీయ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడంపై అంగన్వాడి యూనియన్ నాయకులు,సిఐటియు నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మండల కేంద్రానికి చేరుకొని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.వారు మాట్లాడుతూ వేధింపులకు గురి చేసిన ఆంజనేయులును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.తహశీల్దార్ ఖాజాబికి వినతి పత్రం అందజేశారు.అనంతరం తహసిల్దార్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా నినాదాలు చేస్తూ తరలి వెళ్లారు.స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన సిఐటియు యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ,శ్రీరాములు,కుళ్లాయప్ప,అంగనవాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు మహాబూన్ నిషా,రంగమ్మ ఆశీర్వాదమ్మ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాగమణికి అంగన్వాడీ పోస్టు వచ్చిందన్నారు. అంతకుముందు ఆంజనేయులు భార్య అంగన్వాడి కార్యకర్తగా ఉండేదని ఆమె బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరారని తొలగిస్తారని తెలుసుకొని స్వచ్ఛందంగా ఆమె రాజీనామా చేసిందన్నారు.అనంతరం వెలుబడిన నోటిఫికేషన్ ద్వారా నాగమణి అంగన్వాడీ కార్యకర్తగా విధులకు చేరిందన్నారు.ఇటీవల తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను విధుల నుంచి తప్పుకుంటే తమ సమీప బంధువును అంగన్వాడీ కార్యకర్తగా చేర్పించుకోవచ్చని ఆంజనేయులు పథకం వేశారని,ప్రస్తుతం పని చేస్తున్న నాగమణిని విధుల నుంచి తప్పుకోవాలని లేనిపక్షంలో నిన్ను నానా ఇబ్బందులు గురి చేస్తామని వేధింపులు చేపట్టడం మొదలుపెట్టాడని,దీంతో పలుమార్లు అంగన్వాడి సిడిపిఓ పిడి తదితరులు గ్రామస్థాయిలో విచారణ చేపట్టారని,ఆమెపై వేసిన ఆరోపణలు నిరాధారణ ఆరోపణలని కొట్టివేయడంతో చేసేది లేక ఆమెను వ్యక్తిగతంగా మానసికంగా బెదిరింపులు చేస్తూ ఒత్తిడికి గురి చేశారన్నారు.ఆంజనేయులు వేధింపులకు తట్టుకోలేనని నాకు మరణమే శరణ్యం అంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడిందని నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ విచారించి బాధితురాలికి తగిన న్యాయం చేస్తామని నిందితునిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అంగన్వాడీ కార్యకర్తకు అండగా యూనియన్ నాయకులు ఉంటామని ఆమెకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు పోరాడుతామని రాజకీయ వేధింపులకు గురి చేస్తున్న వారిపై తక్షణం చర్యలు తీసుకొని శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఆసుపత్రిలో అంగనవాడి కార్యకర్త నాగమణిని పరామర్శించిన సిఐటియు నాయకులు.
ఓడిచెరువు మండలంలోని వీరప్పగారిపల్లి మినీ అంగన్వాడీ కార్యకర్త నాగమణి రాజకీయ పార్టీ శ్రేణుల వేధింపులు తాళలేక శనివారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న సీఐటీయూ నాయకులు పరామర్శించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.ఎల్ నరసింహులు మాట్లాడుతూ ఓడిచెరువు మండలం వీరప్పగారిపల్లికి చెందిన అంగన్వాడి మినీ వర్కర్ నాగమణిని వేధించిన తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలన్నారు. అంగన్వాడి కార్యకర్తలపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంగన్వాడీ కార్యకర్తలను రాజకీయంగా వేధించడం,భయభ్రాంతులకు గురిచేయడం సరైనది కాదన్నారు.ఐసిడిఎస్ అధికారులు కూడా అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగిపోయి అంగన్వాడీ కార్యకర్తలను వేధించడం సరైంది కాదన్నారు. ఇలాంటి వేధింపులు మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.పరామర్శించిన వారిలో అంగన్వాడి యూనియన్ నాయకులు లక్ష్మీదేవి,భాగ్యమ్మ,సుజాత, మోక్ష,వెంకటలక్ష్మి,సిఐటియు నాయకులు జగన్మోహన్,బాబ్ జాన్ తదితరులు ఉన్నారు.
$$$__________@@@_________$$$
అంగన్వాడీ భోధకులపై రాజకీయ వేధింపులు తగదు:ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి ఆంజనేయులు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై27(విజయస్వప్నం.నెట్)
జిల్లా వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు,అంగన్వాడీ, ఆశ,మధ్యాహ్నన భోజన, అవుట్ సోర్సింగ్,ఫీల్డ్ అసిస్టెంట్లు,కాంట్రాక్టు, కార్మికులపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విధుల నుంచి తొలగిస్తామని రాజకీయ వేధింపులకు దిగుతూ,కార్మికులను మానసిక వేధింపులకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని,దీనిని ఏఐటీయూసీ జిల్లా సమితి తరపున ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఈ సందర్బంగా ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ....ఇటీవల కొండకమర్ల పంచాయతీ,వీరప్పగారిపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త నాగమణిపై లేని పోనీ ఆరోపణలు చేస్తూ,జిల్లా అధికారులకు పిర్యాదు చేసి మానసికంగా ఇబ్బంది పెడుతూ అంగన్వాడీ ఉద్యోగం నుంచి తొలగించాలని వేదించడం వల్ల అంగన్వాడీ సెంటర్ లోనే శనివారం ఆమె ఆత్మ హత్యకు పాల్పడటం బాధాకరమని,ఇప్పటికైనా కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేసారు,లేకుంటే శాసనసభ్యులు,మంత్రులను ఎక్కడిక్కడ కార్మికుసంఘాల ఆధ్వర్యంలో అడ్డుకుంటామని ఆయన ఈసందర్భంగా హెచ్చరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి