హాస్టల్ విద్యార్థులు పదిలో వందశాతం ఉత్తీర్ణత
డివిజన్ స్థాయిలో ప్రధమశ్రేణిలో నెంబర్ వన్ వార్డెన్ బోధనలతో విద్యార్థుల ప్రతిభ
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై25(విజయస్వప్నం.నెట్)
సాంఘిక సంక్షేమ సమీకృత శాఖ బాలుర వసతి గృహం వార్డెన్ డి.రవీంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక శిక్షణ, క్రమశిక్షణ, విద్యా భోధనలతో ఓడిచెరువు మండల కేంద్రానికి సమీపంలో(వడ్డివారిపల్లి వద్ద)ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహంలో పదవ తరగతిలో 12 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.డివిజన్(జిల్లా)స్థాయిలో 2023-24 పది ఫలితాల్లో 8మంది విద్యార్థులు ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత,ద్వితీయ శ్రేణిలో నలుగురు ఉత్తీర్ణత సాధించడంతో ఓడిచెరువు సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహం ముందు వరుసలో నిలవడం మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదిలో 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత 2023-24 విద్యా సంవత్సరంలో మండల కేంద్రంలో ప్రభుత్వ జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులకు,సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహంలో హాస్టల్ వార్డెన్ రవీంద్రనాథ్ రెడ్డి ప్రతి రోజూ ప్రత్యేక తరగతులు నిర్వహించి,క్రమశిక్షణతో కూడిన శిక్షణతో విద్యా భోధనలు అందించడమే కాకుండా,మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించి, ఉల్లాసంగా,ఉత్సాహం కోసం విద్యార్థులకు క్రీడలు నిర్వహించి ఆత్మ స్థైర్యం నింపి బోధనలు అందించి వసతి గృహంలో సేవా కార్యక్రమాలు అలవర్చడంతో ఉత్తమ ఫలితాలు సాధింస్తారని వార్డెన్ రవీంద్రనాథ్ రెడ్డి అభిప్రాయాన్ని పలువురు ఏకీభవిస్తున్నారు.ఈయేడు పదవ తరగతిలో వసతి గృహంలో 12 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ప్రధమ శ్రేణిలో 8మంది,ద్వితీయ శ్రేణిలో నలుగురు ఉత్తీర్ణత సాధించి డివిజన్ స్థాయిలో వంద శాతం ఉత్తమ ఫలితాలు సాధించిన సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహం ప్రధమ స్థానంలో నిలవడం విశేషం. వార్డెన్ బోధనలతో పెరిగిన విద్యార్థుల శాతం సమీకృత బాలుర వసతి గృహంలో వార్డెన్ రవీంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక శిక్షణ తరగతులు,క్రమశిక్షణతో కూడిన విద్యా భోధనలు అందించడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం,వంటశాలలో భోజనాలు తయారు చేసే సిబ్బందికి దగ్గర వుండి రుచి శుచికరంగా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంతో విద్యార్థులను వసతి గృహంలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం విశేషం.ప్రస్తుతం విద్యా సంవత్సరంలో 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల శాతం 95 మంది చేరడం(కేవలం 5 మంది విద్యార్థులు మాత్రమే చేరడం తరువాయి)విశేషంగా వుంది.
$$$__________@@@__________$$$
విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి:మోడల్ స్కూల్ విద్యార్థినీలకు అవగాహన కల్పించిన సిఐ
అమడగూరు జనసేన వార్త జూలై25(విజయస్వప్నం.నెట్)
మండలంలోని మోడల్ స్కూల్ లో సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ అలవర్చుని విద్యా అభ్యసించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ఏలాంటి చెడు వ్యాపకాలకు గురికాకుండా,పరిచయం లేని వారితో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు, ఆడపిల్లలకు గుడ్ టచ్, బాడ్ టచ్ ల గురించి వివరించారు. ముఖ్యముగా విద్యార్థి దశ నుంచే సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసులు, జమేధర్ సుధాకర్, విజయ్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఘనంగా మొహర్రం వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా,అమడగూరు(ఓడిచెరువు)జూలై25(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలోని పీర్లచావిడి వద్ద గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ముజావర్లు రఫీ ఖాన్ మాట్లాడుతూ ఈఅన్నదాన కార్యక్రమానికి సహాయం చేసిన అమడగూరు గ్రామ ప్రజలకు ముఖ్యంగా యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసిన గ్రామ పెద్దలకు,పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముజావర్లు మేకల భాష,రఫీఖాన్,చాంద్ బాషా,గ్రామస్తులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
కదిరి పోలీసుస్టేషన్లో తనిఖీ చేపట్టిన జిల్లా ఎస్పీ
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి జూలై25(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణం వన్ టౌన్ పోలీసుస్టేషన్ ను గురువారం శ్రీసత్యసాయిజిల్లా ఎస్పీ వి.రత్న ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.డిఎస్పీ శ్రీలత, టౌన్ సిఐ పుల్లయ్య,రూరల్ సిఐ వెంకటేశ్వర్లు ఎస్పీ వి.రత్నకు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా స్వాగతం పలికారు. పోలీసుస్టేషన్ లో చెరశాల,కంప్యూటర్ గదులు, రికార్డులను ఎస్పీ పరిశీలించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ....యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని,వాహనాలపై అతివేగంగా విచ్చలవిడిగా డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.కదిరికి ఎక్కడ నుండి ఎవరు రవాణా చేసి మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారని నిఘా వుంచి తమ పోలీస్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ చేసే విధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
మహమ్మదాబాదులో ఎలుగుబంటి సంచారం
భయాందోళనలలో గ్రామ ప్రజలు
శ్రీసత్యసాయిజిల్లా,అమడగూరు(ఓడిచెరువు)జూలై25(విజయస్వప్న.నెట్)
మండలంలోని మహమ్మదాబాద్ పంచాయతీ గ్రామ సమీప నల్లగుట్టలో ఎలుగుబంట్లు సంచారిస్తు విషయం తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు.గతంలో గ్రామానికి చెందిన ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేయడంతో అప్రమత్తమై ప్రాణాలు అరచేతిలో పట్టుకొని మహిళ తప్పించుకొన్నట్లు తెలిపారు. తరచుగా గ్రామ సమీపంలో నల్లగుట్టలో ఎలుగుబంట్లు సంచారిస్తు పొలాల్లో పంటలను నష్టపరుస్తున్న విషయంపై అటవీ అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఆరుబయట ఆడుకునే చిన్నారులపై,ఒంటరిగా పొలానికి వెళ్ళే వారిపై ఎలుగుబంట్లు ఎటువైపు నుంచి దాడులు చేస్తాయోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
$$$__________@@@__________$$$
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవాలు అందిస్తా
- ఏడీసిసీ బ్యాంక్ మేనేజర్ టి.గోపాల్
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై25(విజయస్వప్నం.నెట్)
మండల ప్రాథమిక వ్యవసాయ పరస్పర సహకార(ఏడిసిసీ)బ్యాంక్ మేనేజర్ గా రెండు రోజుల క్రితం టి.గోపాల్ భాధ్యతలు స్వీకరించారని తెలిపారు. ముదిగుబ్బ బ్రాంచ్ నుండి ఓడిచెరువు బ్రాంచ్ మేనేజర్ భాధ్యతలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.రైతులకు, ఖాతాదారులకు, మహిళా సంఘాల గ్రూపు సభ్యులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవాలు అందిస్తారని పేర్కొన్నారు.
ఆధార్ అప్డేట్ సేవలు సద్వినియోగం చేసుకోండి
అమడగూరు,జనసేన వార్త, జూలై26
మండలంలోని మహమ్మదాబాదు గ్రామ సచివాలయాన్ని పరిశీలించి,ఆధార్ అప్డేట్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆధార్ కార్డులో పేర్లు, చిరునామా,చరవాణి అంకెలు, సవరణలు తదితర వివరాలు మార్చుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎన్.అశోక్ కుమార్ రెడ్డి, ఎంఈఓ జీలన్ బాషా, డిజిటల్ అసిస్టెంట్ అశోక్, చంద్రశేఖర్, విజయకుమారి,పంచాయతీ గ్రామ కార్యదర్శి సునియా, మహిళా పోలీసు జ్యోతి,సిబ్బంది చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఈనెల 31న ఉచిత గుండె వైద్యశిబిరం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై26(విజయస్వప్నం.నెట్)
మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామ ఉర్దూ పాఠశాలలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు.లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్క్ సూపర్ స్పెషాలిటీ గుండె ఆసుపత్రి వైద్యులతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి గుండె నొప్పి, ఛాతీ నొప్పి, గుండె దడ, ఆయాసం, గుండెలో మంట, ఛాతీలో బరువుగా వుండడం,కాలు వాపులు రావడం, చెమటలు పట్టడం తదితర వ్యాధులకు చికిత్స అందిస్తారని,అలాగే బ్లడ్ షుగర్, బిపి, ఈసీజీ, 2డి ఎకో ద్వారా వైద్య సేవలు అందిస్తారని కార్యనిర్వహాకులు సాథక్ బాషా,అబ్లు, జావేద్, ఆట ఉల్లా సర్, సాదిక్ లు పేర్కొన్నారు.31 బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, వివిధ వ్యాధుల చికిత్సలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
$$$__________@@@__________$$$
ఆర్ఎంపీలు నిబంధనలతో చికిత్స సేవలందించాలి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై26(విజయస్వప్నం.నెట్)
వైద్య ఆరోగ్యశాఖ తనిఖీ బృందం శుక్రవారం మండలవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు.ఆర్ఎంపీలు తగిన అర్హత కలిగి వుండి ప్రభుత్వ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ప్రజలకు చికిత్స సేవలందించాలని డాక్టర్ జోత్స్నా,డాక్టర్ సునీల్ సూచించారు. గ్రామాల్లో ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న చికిత్స కేంద్రాలను,వారి సర్టిఫికెట్లను పరిశీలించి నివేదికను తయారు చేసి జిల్లా ఉన్నతాధికారులకు అందించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల వైద్యాధికారి కమల్ రోహిత్,ఆరోగ్య విస్తరణాధికారి నాగేష్, ఆరోగ్య, విద్య బోధకులు సుశీలమ్మ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి