జర్నలిస్టులపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు సరి కాదు: కదిరి వర్కింగ్ జర్నలిస్టులు
శ్రీసత్యసాయిజిల్లా (ఓడిచెరువు)కదిరి జూలై18(విజయస్వప్నం.నెట్)
మీడియా ప్రతినిధులపై వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన అనుచిత, అవమాన, అహంకార వ్యాఖ్యలు ఉపసంహరించుకుని,జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని కోరుతూ మహాజన జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎల్లంరాజు ఆధ్వర్యంలో కదిరి ఆర్ అండ్ బి బంగ్లా వద్ద గురువారం కదిరి పట్టణ వర్కింగ్ జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా మహాజన జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంరాజు మాట్లాడుతూ విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పై వస్తున్న ఆరోపణ వ్యవహారం గురించి పాత్రికేయ సమావేశంలో విజయసాయి రెడ్డిని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను ఏరా పోరా అంటూ మీడియా ప్రతినిధులను అవమానపరిచారన్నారు.బాధ్యత గల పదవిలో ఉండి సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడిన తీరు సరైనది కాదని,బేషరతుగా మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు ఈసందర్భంగా హెచ్చరించారు,
ఈ కార్యక్రమంలో కదిరి పట్టణ వర్కింగ్ జర్నలిస్టులు అమృతరాజ్,సోమశేఖర్,హరి యాదవ్, రాము, చలపతి, మాధవ్, హరి, సునీల్, ఫారుక్, సాదిక్, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
$$$_________@@@_________$$$
రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పాత్రి కేయులపై వ్యాఖ్యలు అనుచితం :మండల పాత్రికేయులు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు జూలై18(విజయస్వప్నం.నెట్)
రాజ్యం సభ్యులు విజయసాయిరెడ్డిని సస్పెండ్ చేయాలని స్థానిక బస్టాండ్ ప్రాంతం నుండి పాత్రికేయులు,రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులతో కలిసి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పాత్రికేయులపై అనుచిత వ్యాఖ్యలు పాత్రికేయులు వారి కుటుంబాలను అవమానించే విధంగా టీవీ5 యాజమాన్యాన్ని మహా న్యూస్ ఛానల్ ని వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాత్రికేయులకు సంఘీభావం తెలిపి ఆందోళన చేపట్టారు.విజయసాయిరెడ్డి తక్షణమే జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని,లేదంటే అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నిరసనగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ర్యాలీగా వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి,అలాగే డిప్యూటీ తహశిల్దార్ వెంకటరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.అంతక ముందు విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ చేపట్టి విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.ఈకార్యక్రమంలో మండల పాత్రికేయులు.జి.నరసింహులు (మనం న్యూస్)కే.గంగాధర (జనసేనన్యూస్)రామకృష్ణ (పబ్లిక్ వాయిస్)హనుమంతు(విశాలాంధ్ర)లక్ష్మీపతి(జనసముద్రం) సోమశేఖర్(మీ న్యూస్) మురళి(వజ్ర)నరసింహులు(అక్షర)తదితర మండల విలేకరులు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు మున్నా రామచంద్ర శ్రీనివాసులు సత్యప్ప తదితరులు పాల్గొన్నారు.
$$$_________@@@_________$$$
పలు కుటుంబాలను పరామర్శించిన మాజీమంత్రి పల్లె
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు జూలై18(విజయస్వప్నం.నెట్)
మండలంలోని అల్లాపల్లి పంచాయతీ సల్లవారిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజేంద్ర అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించి మనోధైర్యంతో ఉండాలని,కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అనంతరం ఇటీవలే కొండకమర్లకు చెందిన జి.రామచంద్రప్ప ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని కుటుంబాన్ని మాజీమంత్రి పల్లె పరామర్శించారు.నవాబుకోటకు చెందిన నారాయణ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారని తెదేపా శ్రేణులు తెలిపారు.
మాజీమంత్రి పల్లె పరామర్శ
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై18(విజయస్వప్నం.నెట్)
మండలంలోని డబురువారిపల్లి పంచాయతీ దిగుపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ బిసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అంజన్నప్ప మాతృమూర్తి సాలమ్మ(76) గురువారం మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాలు వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఈకార్యక్రమంలో తెదేపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$_________@@@_________$$$
జర్నలిస్టులపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు సబబు కాదు:మండల జర్నలిస్టులు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,జూలై18(విజయస్వప్నం.నెట్)
రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సబబు కాదని,అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మండల జర్నలిస్టులు గురువారం సిఐ రాజేంద్రనాధ్ యాదవ్,ఏఎస్ఐ రమణారెడ్డికి ఫిర్యాదు చేశారు.ఉన్నత పదవిలో ఉన్న విజయసాయిరెడ్డి జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని,జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.ఇలాగే జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ ర్యాలీగా పోలీసుస్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేశారు.సిఐటియూ,ఆర్సీపీ నాయకులు పోరాటాల శ్రీరాములు,మున్నా, రామచంద్ర,ప్రజా సంఘాల నాయకులు పీట్లా సుధాకర్ తదితరులు సంఘీభావం తెలిపారు.మండల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు.
$$$_________@@@_________$$$
కుల ధృవీకరణ పత్రాలు త్వరితగతిన పూర్తి చేయాలి: ఆర్డీవో భాగ్యరేఖ
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై18(విజయస్వప్నం.నెట్)
గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ పేర్కొన్నారు.గురువారం రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ ఖాజాభీ సమక్షంలో విఆర్ఓలకు సమావేశం ఏర్పాటు చేసి ఆర్డీఓ భాగ్యరేఖ మాట్లాడుతూ.... ప్రధానంగా గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి కులాల వారిగా కుటుంబ యజమాని పేరు నమోదు చేసి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు (సుమోటో) అందించేందుకు చర్యలు తీసుకోవాలని, సేకరించిన సమాచారంతో కులధృవీకరణ పత్రాలు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.రేషన్ కార్డుల దరఖాస్తులు,రేషన్ కార్డులు పరిశీలన, కార్డుదారులకు సరుకులు పంపిణీ,సరుకుల ధరల పట్టిక సూచిక బోర్డులు ఏర్పాటు తదితర అంశాలపై ఆమె విఆర్ఓలకు సూచనలిచ్చారు. గ్రీన్ వే, ఫోర్ లైన్ రోడ్డు నిర్మణా పనులు కొనసాగుతున్నాయని,80% పరిహారం అందించారని, మిగిలిన 20% పరిహారం రైతులకు త్వరలో చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.భూ సమస్యలపై సిబ్బంది ఎప్పటికప్పుడు స్పందించాలని,గ్రామాల నుండి కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి దృష్టి సారించాలని ఆమె సూచించారు.విద్యార్థుల కుల,ఆదాయ ధృవీకరణ పత్రాలు అందించాలని సూచించారు. ఈకార్యక్రమంలో రీసర్వే డీటి జాకీర్,విఆర్ఓలు పాల్గొన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి