google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : పశువైద్య శిబిరానికి విశేష స్పందన - నూతన ఎస్పీని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే,మాజీ మంత్రి - హుడా చైర్మన్ గా అవకాశం కల్పించండి - కుక్కల దాడిలో 10 గొర్రెల మృతి - అంగన్వాడీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలి: తహశీల్దార్ కు మహిళలు వినతి - విశ్వకర్మ యోచన పథకానికి దరఖాస్తులు:బిజేపీ యువ నాయకులు - విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేయాలి: డీటీఎఫ్ నాయకులు

22, జులై 2024, సోమవారం

పశువైద్య శిబిరానికి విశేష స్పందన - నూతన ఎస్పీని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే,మాజీ మంత్రి - హుడా చైర్మన్ గా అవకాశం కల్పించండి - కుక్కల దాడిలో 10 గొర్రెల మృతి - అంగన్వాడీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలి: తహశీల్దార్ కు మహిళలు వినతి - విశ్వకర్మ యోచన పథకానికి దరఖాస్తులు:బిజేపీ యువ నాయకులు - విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేయాలి: డీటీఎఫ్ నాయకులు

పశువైద్య శిబిరానికి విశేష స్పందన



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై19(విజయస్వప్నం.నెట్)

మండలంలోని కొండకమర్ల, ఆకుతోటపల్లి గ్రామాల్లో శుక్రవారం మండల పశుసంవర్ధక వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ముద్ద చర్మ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఎల్ఎస్డీ వ్యాక్సిన్ వైద్యశిబిరం నిర్వహించారు.పాడి రైతులు శిబిరంలో ఆవులకు టీకాలు వేయించారు.ముద్ద చర్మ వ్యాధి లక్షణాలు,నివారణ తదితర అంశాలపై వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ సూచనలిచ్చారు.పశు వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది.ఈకార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@_________$$$

నూతన ఎస్పీని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే,మాజీ మంత్రి



శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి జూలై19(విజయస్వప్నం.నెట్)

నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వి.రత్నని శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి వారు శుభాకాంక్షలు తెలిపారు.పుష్పగుచ్చం అందించి దృశ్యాలువతో సన్మానించారు.ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు.సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి ఎస్పీ వి.రత్న శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పి విష్ణువర్ధన్ పుట్టపర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిని, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

$$$__________@@@_________$$$

కన్న తండ్రిపై తనయుడు దాడి


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై 19(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రానికి చెందిన కన్న తండ్రిపై తన కుమారుడు దాడి చేసినట్లుగా శుక్రవారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారని ఏఎస్ఐ రమణారెడ్డి తెలిపారు.మండల కేంద్రంలో పాత మసీదువీధిలో నివాసం ఉంటున్న కలిమి లింగప్పకి ఇరువురు భార్యలు ఉన్నట్లు తెలిపారు.సమీప చెరువు గట్టు వద్దకు సాయంత్రం పశువులకు మేత కోసం వెళ్ళగా,అంతక ముందే రెండవ భార్య కుమారుడు మల్లికార్జున కాపుకాచి ఆస్తి విషయంపై తండ్రిని నిలదీయగా,ఆస్తి విషయం కోర్టులో ఉండడంతో సమయం పడుతుందని ఓపిగ్గా ఉండాలని బదులు చెప్తుండగా కుమారుడు మల్లికార్జున ఆవేశంగా తండ్రిపై దాడి చేయడంతో తండ్రి లింగప్పకు తీవ్ర గాయాలయ్యాయని గమనించిన బంధువులు వెంటనే స్ధానిక ప్రాధమిక వైద్యశాలకు తరలించారు.మెరుగైన చికిత్స కోసం అనంతపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంటూ.... లింగప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రమణారెడ్డి తెలిపారు.

$$$__________@@@_________$$$

హుడా  చైర్మన్ గా అవకాశం కల్పించండి

శ్రీసత్యసాయిజిల్లా (పుట్టపర్తి) జూలై19(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి పట్టణానికి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు ఊరు వాకిలి సురేష్ నాయుడు గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ను కలిసి  సాయిబాబా చిత్రపటాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీకి  చేసిన సేవలను గుర్తించి పుట్టపర్తి  హుడా చైర్మన్ గా తన అభ్యర్థత్వాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా నారా లోకేష్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించినట్లు ఊరువాకిలి సురేష్ నాయుడు శుక్రవారం తెలిపారు. పాదయాత్రలో సురేష్ నాయుడు చేసిన సేవ కార్యక్రమాలు ఈ సందర్భంగా లోకేష్ సురేష్ తో చర్చించినట్లు ఆయన తెలిపారు.నారా లోకేషను కలిసిన వారిలో ఆవుల సుబ్రమణ్యం.చక్రధర్ నాయుడు.మూలింటి చలపతి.వెంకటరముడు.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@_________$$$

కుక్కల దాడిలో 10 గొర్రెల మృతి


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై20(విజయస్వప్నం.నెట్)

మండలంలోని డబురువారిపల్లి పంచాయతీ దిగువపల్లికి చెందిన జరిపిటి అంజనప్ప గొర్రెల మందపై శనివారం తెల్లవారుజామున కుక్కలు దాడి చేయడంతో 10 గొర్రెలు మృతి చెందగా దాదాపుగా లక్ష రూపాయలు నష్టం వాటిల్లిందని బాధితుడు అంజనప్ప వాపోయారు.40 గొర్రెలను పాలికి తీసుకుని మేపుతుండగా,యధా ప్రకారం ఊరి బయట గొర్రెల మందలోకి తొలినట్లు తెలిపారు.ఉదయం గొర్రెలు అరుపులు విని గొర్రెల దొడ్డి వద్దకు వెళ్ళి చూడగా దాడి చేసిన కుక్కలు పారిపోయారని, అప్పటికే 8 గొర్రెలు మృతి చెందగా, గాయపడిన రెండు గొర్రెలకు చికిత్స అందించే లోపు మృతి చెందినట్లు తెలిపారు.గొర్రల పెంపకంతో జీవనం సాగిస్తున్న గొర్రెలు కుక్కల దాడిలో 10 గొర్రెలు మృతి చెందడంతో నష్టం వాటిల్లిందని బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు. బాధితుడిని తెదేపా రాష్ట్ర బిసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అంజనప్ప, తెలుగుయువత కార్యవర్గ సభ్యులు ప్రసాద్, బూత్ కన్వీనర్ రాకేష్ తదితరులు పరామర్శించారు.కుక్కల దాడిలో 10 గొర్రలు మృతి చెందిన విషయం, జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఆదుకునేందుకు కృషి చేస్తామని భాధితుడికి హామీ ఇచ్చారు.

$$$__________@@@_________$$$

అంగన్వాడీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలి: తహశీల్దార్ కు మహిళలు వినతి


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై20(విజయస్వప్నం.నెట్)

లబ్దిదారులకు సమయానికి సక్రమంగా పౌష్టికాహారం అందించకుండ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలని వీరప్పగారిపల్లి గ్రామ మహిళలు డిమాండ్ చేశారు.శనివారం రెవెన్యూ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్త నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టారు.వీరికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి మున్నా, రైతుసంఘం నాయకులు రామచంద్ర, తెదేపా బిసీ సెల్ నాయకులు ఇడగొట్టు రామాంజనేయులు మద్దతు పలికారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... వీరప్పగారిపల్లి గ్రామ అంగన్వాడీ కార్యకర్త సక్రమంగా పౌష్టికాహారం అందించకుండ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ.... అంగన్వాడీ కేంద్రానికి హాజరుకాలేదన్నారు.ప్రభుత్వం అందించే పౌష్టికాహారం బాలింతలకు,చిన్నారులకు, గర్భిణీలకు,కిశోర బాలికలకు అందించలేదని,ఈవిషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకోలేదని,ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిర్లక్ష్యం వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం తహశీల్దార్ ఖాజాభీకి వినతిపత్రం అందజేశారు.ఈకార్యక్రమంలో మహిళలు ఈశ్వరమ్మ,వరలక్ష్మి,గౌతమి గ్రామస్తులు ఈశ్వరయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@_________$$$

విశ్వకర్మ యోచన పథకానికి దరఖాస్తులు:బిజేపీ యువ నాయకులు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై 20(విజయస్వప్నం.నెట్)

దేశ ప్రధాని నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోచన పథకానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని బిజేపీ యువ నాయకులు వీరాంజనేయులు, వేమారెడ్డిపల్లి సురేష్ సూచించారు.దేశ వ్యాప్తంగా ఆర్థికంగా,సామాజికంగా వెనుకబడిన తరగతుల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ప్రతి పేద,మధ్య తరగతి కుల వృత్తుల వారికి (కుమ్మరి,వడ్రంగి,రజక, అల్లికలు)వర్తించాలనే విశ్వకర్మ యోచన పథకానికి ప్రవేశ పెట్టిందని, వారివారి ఖాతాల్లోకి జమ చేసి ఆర్థికాభివృద్ధి తోడ్పడుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.విశ్వకర్మ యోచన పథకానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని వారు ఈసందర్భంగా తెలిపారు.

$$$__________@@@_________$$$

విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేయాలి: డీటీఎఫ్ నాయకులు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై 21(విజయస్వప్నం.నెట్)

పాఠశాలలు ప్రారంభమై దాదాపు 40 రోజులు కావస్తున్నప్పటికీ ఇంకా అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేయకపోవడం భావ్యం కాదని వెంటనే అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల స్థానంలో మిగులు ఉపాధ్యాయులు పని సర్దుబాటు ద్వారా నియమించాలని,ఎస్ఎస్ఏలో వున్న ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని,ఉపాధ్యాయులకు బోధనేతర పనులను తగ్గించాలని,అవసరమైన ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలలకు మిగులు ఉపాధ్యాయులను పని సర్దుబాటు ద్వారా పంపాలని ఆయన ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు.డీటీఎఫ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

$$$__________@@@_________$$$

ఊరూవాడా.... సాయి నామస్మరణ






శ్రీసత్యసాయిజిల్లా (ఓడిచెరువు)అమడగూరు జూలై21(విజయస్వప్నం.నెట్)

అమడగూరు మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆదివారం గురుపౌర్ణమి సందర్భంగా షిర్డీ సాయిబాబా చిత్రపటాలకు వివిధ పుష్పాలతో అలంకరించి నామస్మరణలతో ఘనంగా వేడుకలు నిర్వహించారు.మండలంలోని జౌకుల కొత్తపల్లి, అమడగూరు గ్రామాల్లో వెలసిన శ్రీ షిర్డీ సాయిబాబా మందిరాల్లో బాబా సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు,సాయి శరణం బాబా శరణం అంటూ భక్తులు సాయి నామస్మరణలతో అభిషేకాలు,అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిర్డీ సాయిబాబా చిత్రపటాలకు వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక వాహనాల్లో భక్తుల దర్శనార్థం డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు.పురువీధుల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కాయకర్పూరం సమర్పించి భక్తిశ్రద్ధలతో భజన గీతాలు ఆలపించారు.వందలాది భక్తులకు ఆయా గ్రామాల్లో తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సేవా సమితి ప్రతినిధులు వెంకటరెడ్డి తదితరులు తెలిపారు. ఉదయం నుండి రాత్రి వరకు చిన్నారులుయువత, మహిళలు,భక్తులు సాయి శరణం బాబా శరణం నామస్మరణలు, గీతాలు ఆలపిస్తూ భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.          ఓడిచెరువులో గురుపౌర్ణమి వేడుకలు   ఓడిచెరువు మండలంలోని గ్రామాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.నల్లగుట్టపల్లి గ్రామ మహిళలు,భక్తులు సమీపంలో సాయిబాబా మందిరానికి మామిడి ఆకుల తోరణాలు, కొబ్బరి మట్టలతో సుందరంగా తీర్చిదిద్దారు.బాబా చిత్రపటానికి వివిధ రకాల రంగు రంగుల పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి నీరాజనాలతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.అనంతరం వందలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.గాజుకుంటపల్లి,మిట్టపల్లి,గౌనిపల్లి తదితర గ్రామాల్లో గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథ భజనలు, భక్తిగీతాలు ఆలపించి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

$$$__________@@@_________$$$

ప్రశాంతి నిలయంలో గురుపూర్ణిమ వేడుకలు: పాల్గొన్న మాజీ మంత్రి పల్లె




శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూలై 21(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా ప్రశాంతి నిలయంలో  గురుపూర్ణిమ వేడుకలకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు.ఆదివారం ప్రశాంతి నిలయంలో గురుపూర్ణిమ వేడుకలకు ముఖ్య అతిథిగా హిమాచల ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా విచ్చేయగా శ్రీ భగవాన్ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కార్యదర్శి ఆర్జే రత్నాకర్,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు హాజరై యజుర్వేద మందిరంలో కాసేపు ప్రశాంతంగా గడిపారు.అనంతరం శ్రీభగవాన్ సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్నారు.

అనంతరం  శాంతిభవనంలో  విశ్రాంతి తీసుకుంటున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కు మాజీ మంత్రి డాక్టర్ పల్లె పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా చిత్రపటాన్ని బహూకరించారు.

వాసవి సత్రంలో ఆర్యవైశ్యుల సంఘం కోట సత్యం, కార్యవర్గ ఆధ్వర్యంలో గురుపూర్ణిమ వేడుకల సందర్భంగా ఆదివారం పుట్టపర్తి వాసవి సత్రంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్న వితరణ చేశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె  మాట్లాడుతూ...,అన్నం పరబ్రహ్మ స్వరూపమని,ప్రతి మనిషికి అది నిత్య ప్రసాదం లాంటిదన్నారు.అన్నదానికి మించిన దానం మరొకటి లేదని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ ఎంతో కొంత తమ శక్తి మేరకు అన్నదానం చేస్తే పుణ్య ఫలం దక్కుతుందన్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తో పాటు ఆర్యవైశ్య సంఘం నాయకులు కోట సత్యం,వాసు, ప్రవీణ్ కుమార్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@_________$$$

చంద్రన్న సారధ్యం లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి

అక్కమ్మ దేవతల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలి:అక్కమ్మ  దేవతల పరుషలో ఎమ్మెల్యే సింధూర,మాజీ మంత్రి పల్లె పూజలు


శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి జూలై21(విజయస్వప్నం.నెట్)

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆకాంక్షించారు. పుట్టపర్తి మండలం సుబ్బరాయునిపల్లి శివారి ప్రాంతంలో ఉన్న అక్కదేవతల జాతరకు ఎమ్మెల్యే సింధూరతో పాటు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వీరికి ఆలయ పూజారులతో పాటు స్థానిక ప్రజలు పూలమాలవేసి ఘనంగా స్వాగతం పలికారు.ఎద్దుల బండిపైకెక్కి అక్కడేవతల ఆలయం చుట్టూ వారు ప్రదక్షిణ చేశారు.అనంతరం ఆలయంలో పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ,  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో  ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మ దేవతల చల్లని దీవెనలు ఈ రాష్ట్ర ప్రజలపై నిత్యం ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.అలాగే ఈయేడు వర్షాలు బాగా కురిసి రైతాంగం కళ్లల్లో ఆనందం కలిగించేలా దేవతల దీవెనలు ఇవ్వాలని కోరుకున్నారు.పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరిగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవతలను ప్రత్యేకంగా ప్రార్థించినట్లు వారు  తెలిపారు.ఈకార్యక్రమంలో పుట్టపర్తి మండల తెదేపా నాయకులు,కన్వీనర్ విజయ కుమార్, శ్రీరామ్ నాయక్,బొమ్మయ్య శ్రీరామ్ రెడ్డి,పుల్లప్ప,తెదేపా,జనసేన,బిజెపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి