శ్రీ అక్కదేవతల ఆలయంలో ప్రత్యేక పూజలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై 22(విజయస్వప్నం.నెట్)
మండలంలోని అల్లాపల్లి పంచాయతీ,దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీ సప్త అక్కదేవతల ఆలయంలో సోమవారం పూజారి వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం దర్శనం కోసం విచ్చేసిన 250 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారని కమిటీ సభ్యులు తెలిపారు.
$$$_________@@@__________$$$
ఆలయాల అభివృద్ధికి సహకారం ఇవ్వండి: పుట్టపర్తి ఎమ్మెల్యే, మాజీమంత్రి
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూలై22(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి తగిన సహకారం ఇవ్వాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి కోరారు.సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... పుట్టపర్తి నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా నిధులు అందించి ప్రత్యేకంగా ఆదుకోవాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.తన మామగారు పల్లె రఘునాథ్ రెడ్డి మంత్రిగా వున్నప్పుడు 2014 నుండి 2019 వరకు పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం అప్పట్లో అయ్యన్నపాత్రుడు మంత్రిగా వున్నప్పుడు నిధులు మంజూరు చేసారని గుర్తు చేశారు.అలాగే పుట్టపర్తి నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి సహకారం ఇవ్వాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి కోరారు.
$$$_________@@@__________$$$
అంగన్వాడీ కార్యకర్త వైఖరిపై కలెక్టర్ కు ఫిర్యాదు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి జూలై22(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలోని వీరప్పగారిపల్లి మినీ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం పిల్లలకు అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్త వైశాఖపై ఆ గ్రామ మహిళలు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు.పౌష్టికాహారం అందించకుండ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న విషయంపై ప్రశ్నిస్తే దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్న అంగనవాడి కార్యకర్తపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు వీరప్పగారిపల్లి గ్రామస్తులు తెలిపారు.
$$$_________@@@__________$$$
సబ్ స్టేషన్ ని ముట్టడించిన రైతులు-అధికారుల స్పందన కరువు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై రైతన్నల ఆగ్రహం
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు జూలై22(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని చినగానపల్లి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో తరచూ విద్యుత్ కోతలపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ.... సోమవారం మండల కేంద్రానికి చేరుకొని స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. గ్రామస్తులు మాట్లాడుతూ పంటలు పెట్టి తీర మొలక మలిచే సమయానికి విద్యుత్ అంతరాయంతో తీవ్ర నష్టం వాటిల్లి పంటలను కోల్పోవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చీకటిలో బిక్కు బిక్కు మంటూ భయాందోళనలకు గురవుతున్నారని, రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ఎవరిది బాధ్యతని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించి బోరు మోటార్లకు విద్యుత్ సరఫరా సక్రమంగా ఇవ్వాలని కోరారు. చినగానపల్లి పంచాయతీలోని చిన్నపానిపల్లి ఆకులవారిపల్లి, ఈడిగవారిపల్లి, మారుతీపురం, బి.కొత్తపల్లి.సాదులవాండ్లపల్లి,కమ్మవారిపల్లి, రామనాథపురం, అమడగూరు పంచాయతీలో ఏ కొత్తపల్లి,పుట్లవాండ్లపల్లి, ఫెరంవాండ్లపల్లి గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు,నవీన్, నరసింహులు, వెంకటరమణ, రామస్వామి, ఆంజనేయులు, నారాయణ,శివశంకర్ తదితరులు పాల్గొన్నారు
$$$_________@@@__________$$$
సిఐటియు మండల కన్వీనర్ గా మద్దె కేశవ ఎంపిక
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు(ఓడిచెరువు)
అమడగూరు మండల కేంద్రంలోని స్ధానిక ఎస్సీ బాలుర వసతి గృహం ఆవరణంలో మంగళవారం సిఐటియు జిల్లా నాయకుల ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేసి సిఐటియు మండల నూతన కార్యవర్గం కమిటీ ఎంపిక చేశారు.ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మినారాయణ, ఓడిచెరువు మండల కన్వీనర్ కుళ్లాయప్ప హాజరై నూతన మండల కమిటీ లో భాగంగా సిఐటియు మండల కన్వీనర్ గా ఏ.పుట్లవాండ్లపల్లికి చెందిన మద్దె కేశవ, కో కన్వీనర్ గా కసముద్రం మా భాష, కోశాధికారిగా బావయ్య,వేణు.కమిటీ కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, కుళ్లాయప్ప మాట్లాడుతూ మండల కన్వీనర్లుగా ఎంపికైనందుకు అభినందిస్తూ.....కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని ఏ కార్మికుడికి ఎక్కడ సమస్య వచ్చినా దక్షిణం స్పందించి వారి సమస్యలకే పోరాటాలు నిర్వహించాలని తెలుపుతూ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం మండల కన్వీనర్ గా ఎన్నికైన కేశవ మా భాష మాట్లాడుతూ ఇంతటి అవకాశం ఇచ్చినందుకు సిఐటియు నాయకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్మికులకు న్యాయం జరిగేలా పోరాడుతామని ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా వృత్తి పట్ల కార్మికుల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగనవాడి లీడర్లు కిష్టమ్మ, సరస్వతి, ఆశా లీడర్ అలివేలమ్మ, భవన నిర్మాణ కార్మిక సంఘం సుధాకర,అమడగూరు మండల కన్వీనర్ కేశవ, కో కన్వీనర్ భాష, కోశాధికారి బావయ్య,కమిటీ సభ్యులు ఆటో యూనియన్ అధ్యక్షులు సుధాకర్,ఉపాధ్యక్షులు ఏ.మారప్ప, వేణుగోపాల్, వెంకటరమణ, మురళి, రామాంజి, మహేంద్ర, మూర్తి, నరసింహులు సౌలు కుంట్ల, సిఐటియు నాయకులు, కార్యకర్తలు, డ్రైవర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
$$$_________@@@__________$$$
ట్రిపుల్ ఐటీకి విద్యార్థులు ఎంపిక
అమడగూరు జనసేన వార్త జూలై23
మండల పరిధిలోని మహమ్మదాబాద్ మస్తాన్ రెడ్డి ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాలలో 10వతరగతి చదివిన విద్యార్థులు ప్రశాంత్,విష్ణుప్రియ ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంగళవారం తెలిపారు.2023-24 విద్యా సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో తనకంటివారిపల్లికి చెందిన ఎస్. శ్రీనివాసులు,సుజాత దంపతుల కుమారుడు ఎస్.ప్రశాంత్ 582,అదే గ్రామానికి చెందిన టి.మురళి,చంద్రకళ కుమార్తె తవళం విష్ణుప్రియ 576 మార్కులు సాధించి ప్రధమ స్థానంలో నిలవడం విశేషమని ఉపాధ్యాయ బృందం తెలిపారు.పాఠశాలలో విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని,తద్వారా ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బాగా చదివి ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించినట్లు విద్యార్థులు ప్రశాంత్, విష్ణుప్రియ తెలిపారు.ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు మస్తాన్ రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు,సహచర విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.
$$$_________@@@__________$$$
ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయింపు ఎన్డీయే ఘనత
బిజేపీ మండల అధ్యక్షులు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు జూలై 23(విజయస్వప్నం.నెట్)
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి బిజేపీ ఎన్డీయే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించారని,ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి రూ.15000 కోట్లు,జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ కి అధిక నిధుల కేటాయింపు,వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కి ఈ ఏడాది నిధులు కేటాయింపు,ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసిన ఎన్డీయే ప్రభుత్వమని,ప్రధాని నరేంద్ర మోడీకి,కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు,ఏపీ సియం చంద్రబాబు నాయుడుకి బిజేపీ మండల అధ్యక్షులు ఇందుకూరి సురేంద్ర రెడ్డి ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన
బడ్జెట్ అంశాలపై మాట్లాడుతూ....
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం, అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు, ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం,పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,రైతులకు జీవనాడి పోలవరం,భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందని,ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం,విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం,హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు,విద్యుత్, రోడ్లు,హైవేల అభివృద్ధికి నిధులు, విశాఖ- చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు,ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ,రాయలసీమ,ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు,ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు,అలాగే ముద్ర రుణాలు 10లక్షల నుండి 20లక్ష లకి పెంచడం,ఈబడ్జట్ లో మహిళలకీ పెద్ద పిటా వేశారని పేర్కొంటూ.... బడ్జెట్ కేటాయింపులపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఈసందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి, నిర్మలసీతారామన్ కి, చంద్రబాబు నాయుడుకీ మరోసారి ఇందుకూరి సురేంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
$$$_________@@@__________$$$
ఘనంగా జలథి ఉత్సవం అమడగూరు, ఓడిచెరువులో పీర్లు పండుగ
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు/ అమడుగూరు జూలై23(విజయస్వప్నం.నెట్)
అమడగూరు మండల కేంద్రంలో మంగళవారం పీర్ల పండుగ కనుల పండుగ ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుండి అగ్నిగుండ ప్రవేశం చేసి, అనంతరం పీర్లను చావడి నుండి గ్రామ పుర వీధుల్లో ఊరేగింపుగా భక్తుల దర్శనార్థం ఇంటింటికి వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.చిన్నారులు, యువకులు,గ్రామస్తులు చక్కెర చదివింపులు,దుత్తల ఊరేగింపులో కోరికలు నెరవేర్చమని కోరుకున్నారు.డబ్బు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఫీర్ల జలథి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముజావర్లు రఫీఖాన్,చాంద్ బాష,బాబా,ఇమ్రాన్, గ్రామస్తులు వెంకటేష్,శ్రీనివాసులు,రాము, వెంకటరమణ,నాగరాజు,పెద్దలు,మల్లికార్జున,యోగి,ప్రతాప్, సోమశేఖర్, శ్రీకాంత్,కరీముల్ల, మహేష్,ఇలియాజ్,విష్ణు, బావాజీ,నిరంజన్,నవీన్,అంజి, అమడగూరు యూత్,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓడిచెరువులో పీర్ల పండుగ మండల పరిధిలోని నల్లగుట్టపల్లి, గాజుకుంటపల్లి గ్రామాల్లో మంగళవారం జలధి సందర్భంగా పురవీధుల్లో పీర్లు ఊరేగించారు.అగ్నిగుండం వద్ద యువకులు,గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ.... భక్తిశ్రద్ధలతో జలధి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఏఎస్ఐ కిశోర్ రెడ్డి,పోలీసులు పాల్గొని కార్యక్రమాలు సజావుగా నిర్వహించారు.
రైతులకు అందుబాటులో ఉండాలి
:సమీక్ష సమావేశంలో ఏడీ
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై23(విజయస్వప్నం.నెట్)
మండలంలోని రైతు సేవా కేంద్రంలో మంగళవారం కదిరి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్.సత్యనారాయణ వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడుతూ.... కౌలు రైతులకు గుర్తింపు ఆకార్డులు అందించాలని,మట్టి నమూనాలు సేకరించి త్వరగా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కి పంపించాలని,రైతు సేవ కేంద్రాలలో ఎరువులు నిల్వ ఉంచాలని,పిఎం కిసాన్ ఫిజికల్ వెరిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని,మండలంలోని పంటల ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు, అనంతరం కొండకమర్ల పరిధిలో శేషయగారిపల్లి పరిస్థితులపై తాండా భాస్కర్ నాయక్ పొలంలో వేరుశనగ పంటను పరిశీలించి,పంటను ఆశించిన ఆకుముడతకు నివారణలో భాగంగా పంటకి క్లోరిపైరిఫాస్ 2మీలీ/లీటర్లు,అలాగే ప్రొఫినోఫాస్ 2 మీ.లీ/లీటరు ఆకుమచ్చ తెగులు కి మ్యంకోజెబ్ 3గ్రాములు/లీటరు లేదా హెక్సాకొన జోల్ 2 మీలీ/lలీటర్ నీటిలోకి కలిపి పిచికారి చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.
ఈసమావేశంలో వ్యవసాయాధికారి ఇలియాజ్ మహమ్మద్,రైతులు సేవా కేంద్రం శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై23(విజయస్వప్నం.నెట్)మండలంలోని రైతు సేవా కేంద్రం అధికారులతో మంగళవారం కదిరి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్.సత్యనారాయణ వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడుతూ.... కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించాలని,మట్టి నమూనాలు సేకరించి త్వరగా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కి పంపించాలని,రైతు సేవ కేంద్రాలలో ఎరువులు నిల్వ ఉంచాలని,పిఎం కిసాన్ ఫిజికల్ వెరిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని,మండలంలోని పంటల పరిస్థితులపై ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు, అనంతరం కొండకమర్ల పరిధిలో శేషయగారిపల్లి తాండా భాస్కర్ నాయక్ పొలంలో వేరుశనగ పంటను పరిశీలించి,పంటను ఆశించిన ఆకుముడతకు నివారణలో భాగంగా పంటకి క్లోరిపైరిఫాస్ 2మీలీ/లీటర్లు,అలాగే ప్రొఫినోఫాస్ 2 మీ.లీ/లీటరు ఆకుమచ్చ తెగులు కి మ్యంకోజెబ్ 3గ్రాములు/లీటరు లేదా హెక్సాకొన జోల్ 2 మీలీ/lలీటర్ నీటిలోకి కలిపి పిచికారి చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.
ఈసమావేశంలో వ్యవసాయాధికారి ఇలియాజ్ మహమ్మద్, రైతులు సేవా కేంద్రం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
$$$_________@@@__________$$$
డబురువారిపల్లిలో పారిశుద్ధ్య పనులు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మండల పరిధిలోని డబురువారిపల్లి పంచాయతీ గ్రామంలో మంగళవారం చేపట్టిన శానిటేషన్ పనులను జిల్లా పంచాయతీ అధికారి పరిశీలించి,సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.ఈఓఆర్డిడీ,గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
పారిశుద్ధ్య పనులు పరిశీలించిన జిల్లా అధికారి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మండల పరిధిలోని డబురువారిపల్లి పంచాయతీ గ్రామంలో మంగళవారం చేపట్టిన శానిటేషన్ పనులను జిల్లా పంచాయతీ అధికారి విజయకుమార్ పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.గ్రామస్తులు సోమవారం గ్రీవెన్స్ లో కలెక్టర్ కు గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదు చేయగా, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి గ్రామాన్ని సందర్శించి డ్రైనేజీ పూడిక తీయించి చేపట్టిన పారిశుద్ధ్య పనులు పరిశీలించినట్లు ఈఓఆర్డిడీ రాజశేఖర్,గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు.
$$$_________@@@__________$$$
మిని అంగన్వాడీ కార్యకర్తపై విచారణ
మండలంలోని కొండకమర్ల పంచాయతీ వీరప్పగారిపల్లి గ్రామ మినీ అంగన్వాడీ కార్యకర్త నాగమణి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తోందని, సమయపాలన పాటించాలేదని తదితర ఫిర్యాదులపై మంగళవారం ఐసిడిఎస్ పీడీ నాగమల్లేశ్వరి స్థానిక అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేపట్టారు.మినీ అంగన్వాడీ కార్యకర్త నాగమణి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ.... ఇష్టానుసారం వ్యవహరిస్తున్న అంశాలపై సోమవారం గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కు స్ధానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన కలెక్టర్ సంభందించిన శాఖా పీడీ నాగమల్లేశ్వరికి తెలిపి వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించగా,పీడీ నాగమల్లేశ్వరి మినీ అంగన్వాడీ కార్యకర్తపై ఫిర్యాదు మేరకు లబ్దిదారులతో, గ్రామస్తులతో విచారణ చేపట్టినట్లు తెలిపారు. గ్రామస్తులు, లబ్దిదారులు ఇచ్చిన వివరాలను నివేదికలో పొందుపరిచి జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు పీడీ నాగమల్లేశ్వరి తెలిపారు. జిల్లా కలెక్టర్ నిర్ణయం మేరకు అంగన్వాడీ కార్యకర్తపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.ఈకార్యక్రమంలో ఆంజనేయులు, రామచంద్ర, గౌతమి, వరలక్ష్మి, రత్నమ్మ, ఈశ్వరమ్మ, నరేష్, సోము, కేశవ, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి