google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలి:సీఐటీయూ - 30శాతం మధ్యంతరభృతిని ప్రకటించాలి:-ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు హరి ప్రసాద్ రెడ్డి - అంగన్వాడీ సమస్యలపై తహశీల్దారుకు వినతి - బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన

11, జులై 2024, గురువారం

అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలి:సీఐటీయూ - 30శాతం మధ్యంతరభృతిని ప్రకటించాలి:-ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు హరి ప్రసాద్ రెడ్డి - అంగన్వాడీ సమస్యలపై తహశీల్దారుకు వినతి - బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన

అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలి:సీఐటీయూ


శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు జూలై10(విజయస్వప్నం.నెట్)

అంగన్వాడి కోర్కెల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు రమణ,మండల అధ్యక్షులు కుళ్లాయప్ప, మండల కార్యదర్శి  శ్రీరాములు,ఐసిడిఎస్  ప్రాజెక్ట్  కార్యదర్శి రంగమ్మ అధ్యక్షులు ఆశీర్వాదమ్మ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని వైయస్సార్ సర్కిల్లో మానవహారం ఏర్పటూ చేసి నినాదాలు చేశారు.అనంతరం తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేసి ఆర్ఐ నాగేంద్రకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.అంతక ముందు వారు మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు అధికారం లోకి వచ్చాయని,గతంలో బీజేపీ ప్రభుత్వం అంగన్వాడీ లకు వేతనాలు పెంచుతామని, ఐసీడీఎస్ ను బలోపేతం చేస్తామని,ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదని. సుప్రీం కోర్టు  అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయమని ఇచ్చిన తీర్పును పక్కన పెట్టారని,వివిధ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో అధికార పార్టీ నాయకులు అంగన్వాడీలను బలవంతంగా రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారని, అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేస్తున్నారని,హెల్పర్లు మానుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, రాజకీయ పార్టీల నాయకుల వేధింపులను అరికట్టాలని, మన రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం అంగన్వాడీల కోరికల దినోత్సవం సందర్భంగా 42 రోజులు సమ్మె కాలంలో ఇచ్చిన మినిట్స్ కాపీలోనే అంశాలు వెంటనే జీ.ఓలు ఇవ్వాలని ఈ క్రింది సమస్యలో పరిష్కరించాలని వివరిస్తూ.... ఐసిడిఎస్ బలవంతం చేయాలని,బడ్జెట్ పెంచాలని,అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని,ఐఎల్ సి సిఫారసుల ప్రకారం కనీస వేతనాలు 26 వేలు, పెన్షన్ ఐఎస్ఐ అమలు చేయాలని, అంగన్వాడి ప్రీ స్కూల్ బలపేతం  చేయాలని,ఐదు సంవత్సరం లోపు పిల్లలు ప్రైవేట్ కాన్వెంట్లకు వెళ్లకుండా సర్క్యులర్ ఇవ్వాలని,లేబర్ కోడ్ ను రద్దు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనియన్ లీడర్లు మణిమాల, షమీం, వరలక్ష్మి, విమలమ్మ, ఆదిలక్ష్మి, కార్యకర్తలు స్వర్ణ, సునంద, జయమ్మ, శ్యామల, మంజుల, చంద్రకళ, రత్నమ్మ ,వెంకట నరసమ్మ, పార్వతి, సుకన్య, శ్యామలమ్మ, భారతి, కళావతి, అఖిల, సుజాత తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

30శాతం మధ్యంతరభృతిని ప్రకటించాలి:-ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు హరి ప్రసాద్ రెడ్డి

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,జూలై10(విజయస్వప్నం.నెట్)

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటవుతున్న ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని,12వ పీఆర్సీని నియమించడంతో పాటు,మధ్యంతరభృతిని (ఐఆర్‌) ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరి ప్రసాద్ రెడ్డి  డిమాండ్‌ చేశారు.బుధవారం మండలంలోని ఎస్ టి యు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆమడగూరు,పూలకుంటపల్లి, తుమ్మల,చిన్నగానిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగ,ఉపాధ్యా యులకు పీఆర్సీ ఇవ్వాలని,2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలుచేయాలని,ఇప్పటికే యేడాది కాలం గడిచిపోయిందని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు మద్యంతర భృతి(ఐఆర్) ప్రకటిస్తామని హామీ ఇచ్చారని,హామీ మేరకు ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే 30 శాతం మధ్యంతరభృతిని  ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నవేళ,పెరుగుతున్న ధరల సూచికనుగుణంగా జీతభత్యాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలిపారు.12వ పీఆర్సీని నియమించడంతో పాటు, ఉద్యోగ, ఉపాద్యాయులకు 11వ పీఆర్సీలో జరిగిన నష్టాన్ని భర్తీచేసి,ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.ప్రాథమిక విద్యా వ్యవస్థకు గొడ్డలి పెట్టుగా పరిణమిస్తున్న 117 జీవోను రద్దు చేయాలని,తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపచేయాలని,2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పాత పెన్షన్ అమలు చేయాలని,అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో ఎస్టియు నాయకులు సుధాకర్,జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీ ప్రసాద్,ఎస్ టి యు నాయకులు నారాయణస్వామి,ఈశ్వర్,మహేశ్వర్ రెడ్డి,పాండురంగయ్య,మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

అంగన్వాడీ సమస్యలపై తహశీల్దారుకు వినతి

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) ఆమడుగూరుజూలై10(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో బుధవారం అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి వినతిపత్రం అందజేశారు.ఈ హసందర్భంగా సిఐటియూ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ,ప్రాజెక్టు కార్యదర్శి రంగమ్మ,కోశాధికారి కిష్టమ్మలు మాట్లాడుతూ.... కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,గ్రాడ్యుటీ సౌకర్యం కల్పించాలని,పిఎఫ్ఈఎస్ఐ కల్పించాలని,అక్రమ తొలగింపులు ఆపాలని,రాజకీయ వేధింపులు నియంత్రించాలని,సంక్షేమ పథకాల అమలు చేయాలని,సమాన పనికి సమాన వేతనం కనీసం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కిష్టమ్మ,పద్మ,తులసి,సరళ,తులసి,మమత,అశ్వనమ్మ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై10(విజయస్వప్నం.నెట్)

మండలంలోని గ్రామీణ ప్రాంతాల ఖాతాదారుల పట్ల ఎస్బిఐ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బుధవారం స్టేట్ బ్యాంక్ ఎదుట రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి మున్నా, రైతుసంఘం నాయకులు ఆకుతోట రామచంద్ర,శివమ్మ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్బిఐ అధికారులు ఖాతాదారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ.... సేవలు అందించడంలో విఫలమయ్యారని, ఖాతాల నెంబర్ల హోల్లో చూపడంతో, వాటిని తొలగించడానికి వారం రోజులు బ్యాంక్ చుట్టూ తిప్పుకుంటూ అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ కాలయాపన చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విచారణ జరిపి సరైన సమయానికి లబ్దిదారులకు సేవాలు అందించాలని వారు కోరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి