google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : గ్యారెంటీ పెన్షన్ స్కీం(జిపిఎస్)చట్టం నిలిపివేతపై డిటిఎఫ్ హర్షం - ట్రిపుల్ ఐటీకి రెయిన్బో విద్యార్థి ఎంపిక - శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో తొలి ఏకాదశి వేడుకలు - ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ లో శ్రీవిజ్ఞాన్ విద్యార్థిని దివ్యశ్రీ - ఆలయాల్లో తొలి ఏకాదశి పూజలు - కుష్ఠు నివారణకు పారదర్శక సర్వే అవసరం

18, జులై 2024, గురువారం

గ్యారెంటీ పెన్షన్ స్కీం(జిపిఎస్)చట్టం నిలిపివేతపై డిటిఎఫ్ హర్షం - ట్రిపుల్ ఐటీకి రెయిన్బో విద్యార్థి ఎంపిక - శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో తొలి ఏకాదశి వేడుకలు - ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ లో శ్రీవిజ్ఞాన్ విద్యార్థిని దివ్యశ్రీ - ఆలయాల్లో తొలి ఏకాదశి పూజలు - కుష్ఠు నివారణకు పారదర్శక సర్వే అవసరం

గ్యారెంటీ పెన్షన్ స్కీం(జిపిఎస్)చట్టం నిలిపివేతపై డిటిఎఫ్ హర్షం

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై16(విజయస్వప్నం.నెట్)

గ్యారెంటీ పెన్షన్ పథకం(జిపిఎస్)గెజిట్ ను  రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడంపై డిటిఎఫ్ నాయకులు మంగళవారం బక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు‌.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ....ఉద్యోగ,ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్దించాలని,12వ పిఆర్సి ప్రక్రియ మొదలు పెట్టాలని, ఆలోపు మద్యంతర భృతి విడుదల చేయాలన్నారు.బాలికలపై అత్యాచారం అరికట్టే విధంగా పాఠ్యాంశాల్లో  మార్పులు చేయాలని ఈసందర్భంగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

$$$__________@@@__________$$$

ట్రిపుల్ ఐటీకి రెయిన్బో విద్యార్థి ఎంపిక

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై17(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని వేమరెడ్డిపల్లి సమీపంలో రెయిన్బో పాఠశాలలో చదివిన నల్లమాడ మండలంలోని గంగాపురం గ్రామానికి చెందిన రైతు మిట్టపల్లి అమర్నాథ్ రెడ్డి కుమారుడు మేఘనాథ్ రెడ్డికి శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించినట్లు రెయిన్బో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  బుధవారం తెలిపారు. ఈ నెల 27న విద్యార్థి మేఘనాథరెడ్డి కౌన్సెలింగ్ హాజరై ఐటీలో ప్రవేశం పొందనున్నట్లు ఆయన తెలిపారు. రైన్బో పాఠశాలలో విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, తద్వారా ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బాగా చదివి, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించినట్లు విద్యార్థి మేఘనాథరెడ్డి తెలిపారు. 2023-2024 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు లో ఓడిచెరువు మండల స్థాయిలో 593 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన  విద్యార్థి మేఘనాథరెడ్డిని రైన్బో పాఠశాల యాజమాన్యం,ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

$$$__________@@@__________$$$

శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో తొలి ఏకాదశి వేడుకలు


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడుగూరు జూలై17(విజయస్వప్నం.నెట్)

మండలంలోని గాజులపల్లి గ్రామ కూడలి సమీపంలో శ్రీమాతశ్రీ వృద్ధాశ్రమంలో బుధవారం తొలి ఏకాదశి పురష్కరించుకుని కందుకూరిపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ,పుణ్యవతి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి,4 బియ్యం బస్తాలు అందజేశారు.ఈ కార్యక్రమానికి నరసింహారెడ్డి,లక్ష్మీనారాయణ రెడ్డి,జౌళిబాబా, శ్రీరంగస్వామినాయుడు, రామంజి, ఎల్లప్ప, కే.ఉత్తప్ప, లక్ష్మీపతి విచ్చేయగా,  ముఖ్య అతిథులుగా మండల ఎస్సై మక్బూల్ బాషా హాజరైయ్యారు.ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి  మాట్లాడుతూ వెంకటరమణ, పుణ్యవతి దంపతులు తొలి ఏకాదశి సందర్భంగా వృద్ధుల సమక్షంలో వేడుకలు నిర్వహించి,అన్నదానం నిర్వహించి ఆశ్రమానికి సహయ సహకారాలు అందించడం ఆనందంగా వుంటుందని,ఈసందర్భంగా దంపతులకు,కుటుంబ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.దాతలు భవిష్యత్తులో మరెన్ని సేవలు అందించాలని ఆమె కోరారు.

$$$__________@@@__________$$$

ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ లో  శ్రీవిజ్ఞాన్ విద్యార్థిని దివ్యశ్రీ

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై 17(విజయస్వప్నం.నెట్)

శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో  చదివిన విద్యార్థిని దివ్యశ్రీ ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిందని, నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన దివ్యశ్రీ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తమ పాఠశాలలో చదివి పదవ తరగతిలో అత్యధికంగా 583 మార్కులు సాధించి త్రిబుల్ ఐటీలో సీటు సాధించడం సంతోషంగా ఉందని బుధవారం శ్రీ విజ్ఞాన్ కరస్పాండెంట్ మస్తాన్ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థిని దివ్యశ్రీ మాట్లాడుతూ... తాను బాల్యం నుంచి శ్రీ విజ్ఞాన్ పాఠశాలలో చదివానని,అక్కడ క్రమశిక్షణతో కూడిన విద్యను బోధించడంతోనే పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించానని,అందువలనే తనకు త్రిబుల్ ఐటీలో సీటు వచ్చిందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపక బృందం,క్టకరెస్పాండెంట్ మస్తాన్ విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.

$$$__________@@@__________$$$

ఆలయాల్లో తొలి ఏకాదశి పూజలు


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై17(విజయస్వప్నం.నెట్)

ఆషాడ మాసంలో తొలి ఏకాదశి సందర్భంగా  బుధవారం కొండకమర్ల గ్రామంలో చెన్నకేశవస్వామి  ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు పురోహితులు  మడుగుల సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.దర్శనం  కోసం విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.తొలి ఏకాదశి సందర్భంగా మండలంలోని పలు గ్రామ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి ఆలయంలో అభిషేకాలు,అర్చన పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించి,కర్పూర హారతి నీరాజనాలు అందించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారని ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.

$$$__________@@@__________$$$

కుష్ఠు నివారణకు పారదర్శక సర్వే అవసరం


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై 17(విజయస్వప్నం.నెట్)

కుష్ఠువ్యాధి నివారణ కార్యక్రమాలు పరిపూర్ణంగా విజయవంతం కావాలంటే సర్వే పారదర్శకంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో బుధవారం సమావేశం ఏర్పాటు చేసి  కుష్టువ్యాధి నివారణ,బాధితుల గుర్తింపు ఎల్ సి డి కార్యక్రమంపై సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్టు వ్యాధి ఆరోగ్య సమస్యగానే కాకుండా సామాజిక అంశంగా కూడా పరిగణించబడుతుందని,ఈసందర్భంగా అవగాహన ఆరోగ్య విద్యాబోధన బాధ్యత ఆరోగ్య సిబ్బందిదేనని, అలాంటప్పుడు అపోహలు,అనుమానాలు తొలగిపోయి, స్వచ్ఛందంగా కుష్ఠువ్యాధి నిర్ధారణ పరీక్షకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారని తెలిపారు.ఆయన ఎల్సిడిసి కార్యక్రమ వివరాలు తెలుపుతూ.... కుష్టు వ్యాధిని నివారించే కార్యక్రమంలో భాగంగా  ప్రతి సంవత్సరం జూలై మాసంలో 14 రోజులు పాటు నిర్వహించే ఈ కార్యక్రమం ఈనెల 18వ తేదీ నుండి ఆగస్టు 2 వ తేదీ వరకు నిర్వహిస్తరని,ఆరోగ్య సిబ్బంది ద్వారా ఇంటింటా సర్వేతో గుర్తించి,అనుమానిత లక్షణాల వ్యక్తులకు పరీక్షలు,‌చికిత్స నిర్వహించి,ఉచితంగా మందులు అందిస్తామన్నారు.ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి అర్హులైన వారిని  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పథకం ప్రోత్సాహ సిఫార్సు గా తెలిపారు. వ్యాధి తదుపరి అంశాల గురించి వైద్యాధికారి కమల్ రోహిత్ వివరిస్తూ లక్షణాలుగా ప్రాథమిక దశలో శరీరంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు,మాధ్యమిక దశలో నాడీ వ్యవస్థ విచ్చిత్తి,తుది దశలో అంగవైకల్యం ఏర్పడుతుందని,కావున వ్యాధి నిర్మూలన కన్నా వ్యాధి నివారణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ  జాగ్రత్త వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారులు,ఎం ఎల్ హెచ్ పి లు,ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

సీఐటీయూ మండల కన్వీనర్ గా కుళ్లాయప్ప ఎంపిక

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై17(విజయస్వప్నం.నెట్)

మండల సిఐటియు నూతన కన్వినింగ్ కమిటీని బుధవారం ఎన్నుకున్నారు.మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో సమావేశం ఏర్పాటు చేశారు. సీనియర్ నాయకులు రమణ సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై సిఐటియూ నూతన కమిటీని ఎంపిక చేశారు. మండల సిఐటియు కన్వీనర్ గా కుళ్లాయప్ప,కో కన్వీనర్ గా పోరాటాల శ్రీరాములు, కమిటీ  కార్యసభ్యులుగా కేశవ, శ్రీనివాసులు, అంగన్వాడి వరలక్ష్మి, మణిమాల, శ్రీనాథ్, రమణమ్మ, నిర్మల, భాగ్యమ్మ, సుగుణమ్మ, లక్ష్మీదేవి, సాలెమ్మ, ఇందిరమ్మ, రామలక్ష్మమ్మలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కన్వీనర్ గా ఎంపికైన కుల్లాయప్ప,కో కన్వీనర్ పోరాటాల శ్రీరాములు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోయి  పరిష్కారం దిశగా ఉద్యమాలు చేపట్టి, కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి