నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలి
దారిద్ర రేఖకు దిగవన ఉన్న కుటుంబాలను అభివృద్ధి చేయడానికి మీరు తోడ్పాటు అందించాలి
స్టాండ్ అప్ ఇండియా ఎంఎస్ఎం. ఈ పథకాలు ద్వారా ఎస్సీ ఎస్టీ వర్గాలకు విరివిగా రుణాలు అందజేయాలి:-బ్యాంకర్లకు జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ సూచన
శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి, జూలై 5(విజయస్వప్నం.నెట్)
కేటాయించిన లక్ష్యాలను త్వరిత గతిన చేరుకోవాలని బ్యాంకర్లకు జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ సూచించారు. జిల్లా స్థాయి రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ భవనంలో జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలు,వ్యవసాయం, డీఆర్డీఏ,మెప్మా తదితర శాఖల అధికారులు సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు.ఆయా శాఖల పరిధిలోని వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి బ్యాంక్ ద్వారా రుణాలు మంజూరు చేయించాలన్నారు.ఎస్సీ,ఎస్టీ వర్గాల ప్రజలకు స్టాండప్ ఇండియా పథకం ద్వారా విరివిగా రుణాలు అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు.ఏ కారణం చేతనైనా రుణాలు ఇవ్వకున్నా,దరఖాస్తులను తిరస్కరించినా సంబంధిత నివేదికను తనకు అందజేయాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు విరివిగా రుణాలను అందజేయాలని బ్యాంక్ అధికారులు ఆదేశించారు.నిర్లక్ష్యం వహించిన బ్యాంకులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ బ్యాంకర్ల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.త్వరలో సమగ్ర నివేదికలతో ఆయా సంక్షేమ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.ఏ ఏ మండలాలలో ఎంతమంది లబ్ధిదారులు అర్హత సాధించారు,బ్యాంకులు వారిగా వివిధ కులాల వారిగా జాబితాను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ,ఎస్టీలకు వంద శాతం రుణాలు అందజేయలన్నారు. కోళ్లు,పొట్టేళ్లు,పందుల యూనిట్లకు సబ్సిడీ రుణాలను అందజేయాలన్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్ఎం పథకం ద్వారా ఎస్సీ,ఎస్టీ వర్గాల ప్రజలకు 150 కోట్ల రూపాయలు రుణ సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని,అందుకు జిల్లాలోని 23బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.కేవిఐబీ,పిఎంఈజీపీ లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి విరివిగా రుణాలు అందజేయాలని ఈసందర్భంగా ఆయన బ్యాంకర్లకు సూచించారు.నాబార్డ్ ద్వారా చేపట్టే పలు పథకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఇంకా 49 మంది ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులకు వివిధ బ్యాంకులు రుణాలు త్వరితగతిన అందజేయాలని పేర్కొన్నారు. త్వరలో గోరంట్ల సమీపంలో ఆర్ఎస్ఈటీఐ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి స్థల సేకరణ ఏర్పాట్లు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పొటెన్షియల్ క్రెడిట్ ప్లాన్ అనే పుస్తకాన్ని సంయుక్త కలెక్టర్ ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో ఆర్బీఐ బి.గిరిధర్,నాబార్డ్ డీడీఎం అనురాధ,ఎల్డీఎం రమణకుమార్,ఏపీజీబీ బ్యాంకు ప్రతినిధి రమేష్,జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు,డీఆర్డీఏ పీడీ నరసయ్య.మెప్మా పీడీ విజయలక్ష్మి,సెరికల్చర్ జెడి పద్మావతి,పశుసంవర్ధక శాఖ అధికారి,పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా,జౌళి చేనేత శాఖ అధికారి రమేష బాబు,ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్,సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్,నోడల్ అధికారి శివారెడ్డి,గిరిజన సంక్షేమ అధికారి మోహన్ రావు,డిక్కీ జోనల్ ప్రెసిడెంట్ కోలా వెంకట రమణ తదితర సభ్యులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
చిరుధాన్యాల సాగుతో అధిక దిగుబడి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు/అమడగూరు, జూలై05(విజయస్వప్నం.నెట్)
చిరుధాన్యాల సాగుతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని కిసాన్ మోర్చా రాష్ట్ర ఆర్గానిక్ సెల్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం అమడగూరు మండలంలోని తుమ్మల పంచాయతీ గ్రామ రైతులకు చింతా శరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చిరుధాన్యాలు అందజేశారు.తరచుగా వేరుశనగ పంట సాగు చేయడం వల్ల భూసాంద్రత క్షీణించి పోతుందని, వాతావరణంలో మార్పుల వల్ల రైతులు సాగు చేస్తున్న వేరుశనగ పంటలకు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా గిట్టుబాటు ధర లేకపోవడంతో కనీసం పెట్టుబడులు రాక అన్నదాతలు నష్టాల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.ఈలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చిరుధాన్యాల సాగుపై ఆసక్తి చూపాలన్నారు.సాములు,అరకులు,కొర్రలు,అందుకొర్రలు తదితర పంటలు సాగు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తూ.... చిరుధాన్యాల పంటలకు సాదారణ వర్షపాతంతో అధిక దిగుబడి సాధ్యమని,తక్కువ పెట్టుబడితో అధిక రాబడి సాధించవచ్చని ఆయన తెలిపారు.అంతేకాకుండా రసాయన ఎరువుల వాడకంతో పంటల ఉత్పత్తి ద్వారా ఆహార పదార్థాలు వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వివరించారు.ఆర్గానిక్ పద్దతితో చిరుధాన్యాల సాగు చేసే రైతులకు ప్రభుత్వం తక్కువ ధరకు విత్తనాలు అందిస్తుందని తెలిపారు.రైతులు పంటల మార్పిడిలో భాగంగా చిరుధాన్యాల సాగుపై మొగ్గు చూపాలని కోరారు.ఈకార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు రామచంద్ర,వేమనారాయణ,ముస్తాఫా,జయరాం, ఆదినారాయణ,ఈశ్వరయ్య, చలపతి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
కదిరి ఎమ్మెల్యే కందికుంటను కలిసిన ఉపాధ్యాయ బృందం
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) కదిరి జూలై05(విజయస్వప్నం.నెట్)
ఆంధ్ర రాష్ట్ర ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న నిరుద్యోగ యువతలకు బాసటగా నిలిచే విధంగా ... ప్రకటించిన మెగా డీఎస్సీ 16,347 పోస్టులలో ఉర్దూ మీడియం పాఠశాలలకు తగినన్ని పోస్టులను మంజూరు చేసి భర్తీ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని,రాష్ట్ర ద్వితీయ అధికార బాసైన ఉర్దూను,పాఠశాలలను సంరక్షించాలని,జివో నెంబర్ :117 ను రద్దు చేసి ఉర్దూ పాఠశాలలలో ఎస్జీటి పోస్ట్ లను భర్తీ చేయాలని,ఉర్దూ మీడియం ప్రాథమిక,ప్రాథమికోన్నత,జిల్లా ఉన్నత పాఠశాలలో రోల్ కు తగినన్ని ఫోస్టులను భర్తీ చేయాలని,చాలా డిఎస్సీలలో భర్తీ కాని బ్యాక్ లాగ్ పోస్ట్ లను ఈ మెగా డిఎస్సిల్లో భర్తీ చేయాలని, అలాగే ఇంగ్లీషు,తెలుగు మీడియం పాఠశాలల్లో 20 మంది మాతృభాష ఉర్దూ ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఓ ఉర్దూ సబ్జెక్టు పోస్ట్ ను భర్తీ చేయాలని,ఉర్దూ మీడియం,లాంగ్వేజ్ అర్హత కలిగిన వారికే ఉర్దూ మీడియం నందు డి.ఎస్.సి అర్హత కల్పించాలని,ఉర్దూ మీడియం పిఈటీ పోస్ట్ లను భర్తీ చేయాలని,యం.టి.యస్. ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయస్సు ను 60నుంచి 62 పెంచాలని , పి.ఆర్.సి ప్రకటించాలని, కదిరి డివిజన్ కోసం ఉపాధ్యాయ భవన్ నిర్మించడానికి కృషి చేయాలని డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షర్ఫోద్దీన్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్,కార్యవర్గ సభ్యులు మౌలాలి రామకృష్ణ మహమ్మద్ అలీ ఈశ్వర్ వీరారెడ్డి సాయి నాగరాజు తదితరులు శుక్రవారం వారం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కి వివరించి ఈసందర్భంగా వినతిపత్రం అందజేశారు.
$$$__________@@@__________$$$
శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా అమడుగూరు(ఓడిచెరువు) జూలై06(విజయస్వప్నం.నెట్)
అమడగూరు మండలం గాజులపల్లి గ్రామ సమీపంలో శ్రీమాతశ్రీ వృద్ధాశ్రమంలో అమడగూరు మండలానికి చెందిన (కార్పొరేషన్ బ్యాంక్ మేనేజర్) మల్లికార్జున,స్వాతిలక్ష్మి దంపతుల కుమారుడు శ్రేయష్ జన్మదినం సందర్భంగా వేడుకలు నిర్వహించారు.శనివారం శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో పాలు బ్రెడ్లు అందించి,అన్నదాన కార్యక్రమం నిర్వహించారని ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి తెలిపారు.ఈకార్యక్రమంలో దాతలు మల్లిఖార్జున, స్వాతిలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొని వృద్ధుల సమక్షంలో శ్రేయాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆశ్రమ నిర్వాహకులు అరుణజ్యోతి మాట్లాడుతూ శ్రేయస్ (అల్లుడు)కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.అలాగే వారికి వారి కుటుంబ సభ్యులకి ఈసందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
$$$__________@@@__________$$$
గ్రామాల్లో డయేరియాపై అవగాహన
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై06(విజయస్వప్నం.నెట్)
మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో శనివారం మండల ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది డయేరియా వ్యాధి లక్షణాలు, నివారణ పట్ల అవగాహన కల్పించారు. తిప్పేపల్లి పంచాయతీ ఉంట్లవారిపల్లి, ఓడిచెరువు పంచాయతీలో గ్రామాలతో పాటు ఎస్సీ,బీసీ తదితర కాలనీల్లో డయేరియా నివారణ కార్యక్రమాలు నిర్వహించిన్నట్లు ఆరోగ్య ఆశ కార్యకర్తలు తెలిపారు.ఆరోగ్య కార్యకర్త పుష్పాల నాగవేణి,హేమా తదితరులు మాట్లాడుతూ....గ్రామ పరిసర ప్రాంతాలు పరిశుభ్రతగా ఉంచుకోవాలని,మురుగు నీటి నిల్వలను తొలగించుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎక్కువగా పిల్లలు ప్రాణాంతకమైన డయేరియా వ్యాధికి గురవుతారని,నీటి శాతం అధికంగా ఉన్న విరోచనాలు,వాంతులు చేసుకోవడం గమనించి ఆసుపత్రిలో చికిత్స అందించాలని సూచించారు. మలవిసర్జన అనంతరం, భోజనం తర్వాత చేతులను రెండు నిమిషాల పాటు నీటితో కడగాలని, ఏవైనా లక్షణాలు కనబడితే వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించి చికిత్సలు అందించాలని సూచించారు. అనంతరం బాలింతలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు.ఈకార్యక్రమంలో ఆరోగ్య,ఆశ కార్యకర్తలు అరుణ,రమాదేవి,సుజాత,తార,అంగన్వాడీ భోధకులు విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
మాజీ ప్రధాని బాబు జగజ్జివన్ రావుకి ఘన నివాళులు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి, జూలై 06(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణ రోడ్లు,భవనాల శాఖ భవనంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం దళితుల ఆశాజ్యోతి కీ"శే' ఉప ప్రధాని బాబు జగజ్జివన్ రావు వర్థంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈకార్యక్రమంలో శ్రీసత్యసాయిజిల్లా మహాజన జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎల్లంరాజు,దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఘనంగా 30వ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వార్షికోత్సవం
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు జూలై07(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా మహాజన జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం.ఎల్లంరాజు ఆధ్వర్యంలో అమడగూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో ఆదివారం ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ వార్షికోత్సవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమంలో ముందుగా ఎమ్మార్పీఎస్ జెండను ఎగరవేశారు.అలాగే ఎమ్మార్పీఎస్ ఉద్యమనేత 30 సంవత్సరాల పాటు మాదిగ జాతికి అండగా ఉంటూ మాదిగజాతి,కీర్తి,ప్రతిష్టలను పెంచిన శ్రీ మందకృష్ణ మాదిగ 59వ జన్మదినం సందర్భంగా కేకు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.నల్లమాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేంద్రనాథ్ యాదవ్, అమడగూరు సబ్ ఇన్స్పెక్టర్ మక్బూల్ బాషాల సమక్షంలో 200 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.మందకృష్ణ మాదిగ జిందాబాద్ ఏబిసిడి, సాధిస్తాం అంటూ నినాదాలు చేశారు,ఈ కార్యక్రమంలో మహాజన జర్నలిస్ట్ ఫెడరేషన్ మండల అధ్యక్షులు భావయ్య,కార్యవర్గ సభ్యులు ఆనంద్,గంగాధర్, నరసింహులు రవితో పాటు ఎమ్మార్పీఎస్ 1994 ఉద్యమ ఆవిర్భావం నుండి నేటి వరకు వెంట నడిచిన కృష్ణన్న,ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తోళ్ళ నాగభూషణం,ఆదినారాయణ, డైమండ్,గంగాధర్,అంజనప్ప, శివప్ప,మహేష్,వెంకటరమణ, చంద్ర,నాగరాజు,నారాయణ, నాగేంద్ర,సురేష్,శశి కుమార్,శివకుమార్,ప్రసాద్,శ్రీనివాసులు,తోళ్ళ నర్సింహులు, అంజి,తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఘనంగా ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై07(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఆదివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) 30వ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు జెండా ఆవిష్కరణ చేశారు.ముఖ్యఅతిథిగా ఓడిచెరువు గ్రామ సర్పంచ్ ముద్దలపల్లి గోవిందు విచ్చేసి జెండా ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ మాదిగలలో అన్ని రకాలుగా చైతన్యం నింపింది మందకృష్ణ మాదిగ అని తెలిపారు.సమాజంలో కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న అప్పటి రోజులలో మాదిగ అని సగర్వంగా చెప్పుకునే స్థాయికి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ తీసుకొచ్చారని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు దొడ్డప్ప,భావన,రమణ పేర్కొన్నారు.అనంతరం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు.ఏబిసిడి వర్గీకరణ సాధించడమే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ మూడు దశాబ్దాల పాటు ఉద్యమాలు నిర్వహించి మాదిగల లక్ష్యం కోసం అహర్నిశలు పనిచేస్తుందని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లక్ష్మన్న,రామకృష్ణ, ముద్దలపల్లి శ్రీనివాసులు పేర్కొన్నారు.ఎంఈఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్లంరాజు మాట్లాడుతూ త్వరితగతిన పార్లమెంట్లో ఆమోదం తెలిపి మాదిగల చిరకాల వాంఛను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తోళ్ళ నర్సింహులు,ఎర్రదొడ్డి లక్ష్మీపతి,చౌడంపల్లి రామాంజనేయులు,కత్తి ఆనంద్,పలక గంగన్న,చౌడప్ప తంగేడుకుంట కిష్టప్ప,దారా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి