అతిసార వ్యాప్తిపై తగిన నివారణ చర్యలు తీసుకోవాలి : వైద్యాధికారులకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ఆదేశం
శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి) జూలై 03(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గంలో అతిసార వ్యాప్తితో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తీవ్రంగా స్పందించారు.కొత్తచెరువు మండలంలో అతిసారతో బాధపడుతూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగులు పడుతున్న ఇబ్బందులు బుధవారం ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనంపై ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి స్పందించారు.అప్పటికప్పుడే సత్యసాయి జిల్లా వైద్యాధికారి మంజువాణితో చరవాణిలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.రోజుకు ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయని,ఇది ఎలా వ్యాప్తి చేందుతోందని,వీటికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని వైద్య అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు.ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభమైందని గ్రామాల్లో ప్రజలు త్రాగేనీరు కలుషితం కాకుండా చూడాలని అలాగే పారిశుధ్యం వంటి వాటి విషయాల్లో వైద్య అధికారులు ప్రజలకు తగిన అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని,అదే విధంగా గ్రామాల్లో వైద్య బృందాలు పర్యటించి ఇంటింటా బాధితులను గుర్తించి తగిన చికిత్స నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు,నియోజకవర్గంలో ఎక్కడ అతిసారా వ్యాప్తి చెందకుండా వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారిని మంజులవాణి స్పందించి తక్షణమే హుటాహుటిన కొత్తచెరువు మండలానికి వైద్య బృందాన్ని పంపించారు.అతిసారంపై జిల్లా వైద్య కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వాటి వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు.ఆయా గ్రామాలలో వైద్య అధికారుల బృందాన్ని పంపించి అతిసార వ్యాప్తి చెందకుండా తక్షణ నివారణ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్య అధికారిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
$$$__________@@@__________$$$
ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో ఆశ డే
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు (అమడగూరు)జూలై03(విజయస్వప్నం.నెట్)
అమడగూరు మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో బుధవారం వైద్యులు డా"మూనా,డా"అపర్ణల సంయుక్త ఆధ్వర్యములో నిర్వహించారు.డా"మూనా మాట్లాడుతూ.. ఈనెల1వ తేదీ నుండి ఆగస్టు నెల 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, ఎంఎల్ హెచ్.పిలు ఇంటింటికి తిరిగి డయేరియా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్ఎస్ ద్రావణం,జింక్ మాత్రల ప్రాధాన్యతల గురించి తెలియజేశారు.చేతుల శుభ్రత ,వ్యక్తిగత పరిశుభ్రత గురించి ప్రజలకు వివరించాలని సిబ్బందిని ఆదేశించారు.డా"అపర్ణ మాట్లాడుతూ... ఈనెల 18వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు కుష్ఠువ్యాధి లక్షణాలు గుర్తింపు కార్యక్రమం చేపట్టాలని సిబ్బందికి తెలిపారు.కుష్ఠు వ్యాధిగ్రస్తులను కనుగొని వారికి సకాలములో చికిత్సలు అందించాలన్నారు.వర్ష కాలంలో కీటక జనిత వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.అనంతరం ప్రగతి రిపోర్టుల పై సమీక్ష నిర్వహించారు.సమావేశములోసి.హెచ్.ఓ.ఫక్రుద్దీన్,పి.హెచ్ఎన్.సూర్యకుమారి,సూపర్ వైజర్లు నాగమ్మ, ఇర్ఫాన్ బాషా,ఏ.ఎన్ఎంలు, ఎంఎల్ హెచ్.పిలు,కార్తీక్,ఫార్మాసి ఆఫీసర్ రాము నాయక్,హెల్త్ అసిస్టెంట్ బాలాజీ నాయక్, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ప్లాస్టిక్ వాడకానీ నివారిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం..!
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు (కదిరి)జూలై03(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో బుధవారం హార్ట్ టూ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో కదిరి మండల పరిధిలో ఉన్న బోడేనాయక్ తండా,మీటే నాయక్ తండాలో ప్లాస్టిక్ నియంత్రణా దినోత్సవ సందర్భంగా తండాలో ఇంటింటికి తిరుగుతూ ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే అనర్థాలపై అవగాహనా కల్పిస్తూ......ఖ్యౠృళ్ట ఆయన 100 కుటుంబాలకు ప్లాస్టిక్ రహిత కాటన్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మూడే రవి నాయక్ మాట్లాడుతూ.... గ్రామీణ ప్రాంతంలో పాలిథిన్ కవర్ల,ప్లాస్టిక్ వస్తువులు వాడకం వల్ల పర్యావరణ కాలుష్యానికి,ప్లాస్టిక్ కవర్లు మట్టిలో కలిసిపోయి దీనిఫలితంగా మట్టి సారవంతం దెబ్బతింటుందని,పశువులు ప్లాస్టిక్ కవర్లు తినడంవల్ల మూగజీవాలు మృతి చెందుతున్నాయి...ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్లాస్టిక్ నిరోధించి పర్యావరణ బ్యాగులు వాడాలని కూడా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామకృష్ణ నాయక్,ఈశ్వర్ నాయక్,నాగేందర్,రమేష్,రమణా నాయక్ లు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శ్రీ సత్యసాయి జిల్లా ఐసీడీఎస్ పీడీగా నాగమల్లీశ్వరి
శ్రీసత్యసాయిజిల్లా జూలై03(విజయస్వప్నం.నెట్)
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్) శ్రీసత్యసాయిజిల్లా ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)గా నాగమల్లేశ్వరి నియమితులయ్యారు. జిల్లాలో సీనియర్ సీడీపీఓ ఆమె ఒక్కరే కావడంతో పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటి వరకు పీడీగా కొనసాగిన లక్ష్మీ కుమారి గత నెల 30న ఉద్యోగ విరమణ చేసిన సంగతి తెలిసిందే.ఖాళీ అయిన పీడీ స్థానానికి హిందూపురం సీడీపీఓ రెడ్డి రమణమ్మ, కడప జిల్లా కమలాపురం సీడీపీఓ వసంతబాయి తమ వంతు ప్రయత్నాలు చేశారు.అయితే మడకశిర సీడీపీఓగా కొనసాగుతున్న నాగమల్లేశ్వరి సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ నాగమల్లేశ్వరికే అవకాశం కల్పించారని సమాచారం. బుధవారం పీడీగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాగమల్లేశ్వరిని సీడీపీఓలు,సూపర్ వైజర్లు, కార్యాలయ ఉద్యోగులు నాగమల్లేశ్వరిని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.అందరూ కలసి కట్టుగా పని చేసి,శాఖకు మంచి పేరు తీసుకువద్దామని పీడీ నాగమల్లేశ్వరి ఈసందర్భంగా పిలుపునిచ్చారు.
$$$__________@@@__________$$$
సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై03(విజయస్వప్నం.నెట్)
సచివాలయ సిబ్బంది నిర్దేశిత సమయానికి హాజరుకావాలని డీఎల్ఓ శివారెడ్డి సూచించారు.బుధవారం తుమ్మలకుంట్లపల్లి, వెంకటాపురం,కొండకమర్ల 1,2 సచివాలయాలతో పాటు ఇనగలూరు,సున్నంపల్లి సచివాలయాలను డీఎల్ఓ శివారెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.హాజరు పుస్తకాలు పరిశీలించి, బయోమెట్రిక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సమయపాలన పాటించాలని, ఉదయం 10 గంటల నుండి 5 వరకు కార్యాలయ వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఆయన సూచించారు.విధి నిర్వహణలో భాగంగా సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో వెళ్ళినప్పుడు విజిట్స్ రికార్డులో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.పౌర సేవలు అందించడంలో సిబ్బంది ఏలాంటి నిర్లక్ష్యం వహించరాదని,నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.ఆయన వెంట ఈఓఆర్డీ రాజశేఖర్,గ్రామ కార్యదర్శులు విశ్వనాథ్ రెడ్డి,శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
$$$__________@@@__________$$$
ఎస్టీ విద్యార్థులకు టెట్,డీఎస్సీ ఉచిత శిక్షణ అందించాలి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై03(విజయస్వప్నం.నెట్)
ఎస్టీ విద్యార్థులకు టెట్ డీఎస్సీ ఉచితంగా శిక్షణ తరగతుల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కోరుతూ వినతిపత్రం సమర్పించారని ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు అక్కులప్ప నాయక్ బుధవారం విలేకరులకు తెలిపారు.అమరావతి సచివాలయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణిని గౌరవ పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారన్నారు.ఎస్టీ విద్యార్థులకు టెట్,డీఎస్సీ ఉచితంగా శిక్షణ సౌకర్యం కొరకు ఏర్పాట్లు చేస్తారని మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.చంద్రప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు నాయక్ ఆయన వెంట ఉన్నారు.
$$$__________@@@__________$$$
హిందూ సమాజంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సబబు కాదు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై03(విజయస్వప్నం.నెట్)
భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రంగారెడ్డి ఆధ్వర్యంలో మండల, గ్రామ స్థాయి నాయకులు,కార్యకర్తల సమావేశం మండల కేంద్రంలో నిర్వహించారు.ఈసందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.... లోకసభలో రాహుల్ గాంధీ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ.... రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాల్లో హిందువులు చాలా ఆవేశపరులని,అదేవిధంగా శాంతి భద్రతలకు విగాథం కలిగిస్తారని,చట్టాన్ని చేతిలో తీసుకుంటారని ఇష్టానుసారంగా హిందువులను చులకన చేసి మాట్లాడారని,లోకసభ సమావేశాల్లో ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా హిందువుల మనోభాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం తన అవివేకానికి నిదర్శనమన్నారు.భారతమాత అంటే ఎవరో నాకు తెలీదు అన్న మీ కాంగ్రెస్ వారు ప్రజలను కులమత బేధాలుగా విభజించి పరిపాలించాలనుకుంటున్నారని,అందుకే ప్రజలు అన్ని కులాలు,అన్ని మతాలకు న్యాయం చేసే ఎన్డిఏ కూటమికి గొప్ప విజయాన్ని ఇచ్చారన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ అగ్రనేతల ఆలోచనలు మార్చుకొని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని,లేనిపక్షంలో తీవ్రమైన ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటారని వారు హెచ్చరించారు.ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అశ్వతప్ప,జిల్లా యూత్ సెక్రటరీ నరేష్, విహెచ్పీ,హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శ్రీవారిని దర్శించుకున్న కర్నాటక మంత్రి మునియప్ప
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) కదిరి,జూలై03(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణములో వెలిసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి దర్శనార్థము కర్నాటక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కె.హెచ్ మునియప్ప బుధవారము ఉదయం విచ్చేయగా....ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాస రెడ్దితో పాటు ఆలయ అర్చకులు,రెవిన్యూ అధికారులు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్,పోలీసు శాఖ అదికారులు తూర్పు రాజగోపురము వద్ద మంత్రి కే.హెచ్.మునియప్పకు స్వాగతం పలికి,ఆలయ ప్రదక్షణగా గావించి అనంతరం శ్రీస్వామి,అమ్మవార్ల ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించి,తీర్థ ప్రసాదములు, శ్రీస్వామివారి చిత్రపటము, శేషవస్త్రములతో సన్మానించారు.
$$$__________@@@__________$$$
ఘనంగా విప్లవ వీరుడు అల్లూరి జయంతి వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి జూలై04(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధ్యక్షతన స్వాతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సమావేశంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా నాయకులు,కార్యవర్గ సభ్యులు పాల్గొని అల్లూరి సీతారామరాజు ఆశయాలను తను నమ్మిన సిద్ధాంతాలను గిరిజనులలో తీసుకుపోవాలని,అదేవిధంగా శ్రీసత్యసాయి జిల్లాలో గిరిజనులు,గిరిజన విద్యార్థుల సమస్యలను సత్వరమే పరిష్కారం చేయాలని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు జిల్లా నాయకులు కాలేనాయక్ తెలిపారు.స్పందించిన అదనపు కలెక్టర్ అభిషేక్ కుమార్ రెండు,మూడు రోజులలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి గిరిజనుల సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఏర్పాట్లు, అదే విధంగా ఈ సమావేశానికి గిరిజన సంక్షేమ సంఘాల నాయకులను ఆహ్వానించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ సూచించారన్నారు.
$$$__________@@@__________$$$
పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా: ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి.
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూలై04(విజయస్వప్నం.నెట్)
ఎమ్మెల్యేగా గెలిచి నేటితో నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు,వందనాలు తెలిపారు.ఎమ్మెల్యేగా గెలుపొంది డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న ఆ మధుర క్షణాలు ఎన్నటికీ మరువలేనివని,ఈ విజయం వెనుక ఎందరో కృషి, కష్టం,త్యాగాలు ఉన్నాయని,ఈ విజయం ఎమ్మెల్యేగా నాపై మరింత బాధ్యత పెంచిందని,పల్లె కుటుంబం మీద నమ్మకంతో మరొక్కసారి మా కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఎమ్మెల్యేగా నా విజయానికి పనిచేసిన ప్రతి ఒక్క కుటుంబానికి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ నెల రోజుల కాలంలో ఎందరినో నేరుగా కలుసుకుని సేవ చేసే అవకాశం నాకు లభించినందుకు పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను.చిన్న వయస్సులో ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన ఆ దేవుడికి,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి,మా మామయ్య మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డికి ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేనిదని ఆమె వారికి శిరస్సు వంచి వందనాలు తెలిపారు.ఇదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి యొక్క కష్టసుఖాల్లో భాగస్వామి నవుతానని,వారి కుటుంబ సభ్యురాలిగా అండగా ఉంటానని,పుట్టపర్తి నియోజకవర్గం వర్గాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అడుగుజాడల్లో అభివృద్ధి పథంలో నడిపి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మరోసారి ప్రజలకు, తెదేపా,జనసేన,బిజెపి కూటమి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.పల్లె కుటుంబంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని,విశ్వాసాన్ని,అది ఎల్లప్పుడూ నిలుపుకునేలా అహర్నిశలు కృషి చేస్తానని,మీ సేవలో వుంటూ మరోసారి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
$$$__________@@@__________$$$
అవగాహనతో డయేరియా దూరం
- సి హెచ్ ఓ సుభాషిని
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,జూలై04(విజయస్వప్నం.నెట్)
మండలంలోని గౌనిపల్లి గ్రామంలో దయేరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ముందస్తు అవగాహనతో మెలిగితే ప్రాణాంతకమైన డయేరియా ను దూరం చేసుకోవచ్చని సిహెచ్ఓ సుభాసిని తెలిపారు. జులై ఒకటో తారీకు నుంచి జులై 31 వ తారీకు వరకు డెంగ్యూ మాస ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు.సిహెచ్ఓ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పిల్లలు డయేరియాకు ఎక్కువగా గురవుతున్నారని.డయేరియా అనగా రోజుకు మూడుసార్లు లేదా అంతకన్నా ఎక్కువసార్లు మలంతో పాటు నీటి శాతం ఎక్కువగా విరేచనాలు కావడం గమనించిన అనంతరం పిల్లలు వ్యాధికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.త్రాగునీరు శుభ్రంగా ఉండాలని,పిల్లలు,తల్లులు భోజనానికి ముందు మలవిసర్జన తర్వాత భోజనం తర్వాత కూడా చేతులు రెండు నిమిషాలు పాటు కడుక్కోవాలని,కలుషితమైన ఆహారం తీసుకోకూడదని,పరిసరాలు పరిశుభ్రత ఉంచుకోవాలని,ఎల్లప్పుడూ మరుగుదొడ్లు వాడాలని,బహిరంగంగా మలవిసర్జన చేయకూడదని,రోట వైరస్, తట్టు టీకాలు ఇప్పించాలని వీటితోపాటు విటమిన్ ఏ ద్రావణం తప్పకుండా తొమ్మిది సార్లు ఇప్పించాలని.ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే త్రాపించాలని,విరేచనాలు అయితే ఓఆర్ఎస్ తప్పకుండా త్రాగించాలని,జింక్ మాత్రలు 14 సార్లు వుండాలని సూచించారు. . ప్రమాదకర లక్షణాలు:- తల్లిపాలు త్రాగకపోవడం,ప్రతిదీ వాంతి చేసుకోవడం,తీవ్రమైన నిర్జలీకంగా ఉండడం,అపస్మారక స్థితిలో ఉండడం,మలంలో రక్తం రావడం,వేగంగా శ్వాస తీసుకోవడం,ఫిట్స్ రావడం, అరచేతులు అరికాలు పచ్చగా ఉండటం లక్షణాలు ఉండినచో సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలన్నారు.అలాగే పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.హెచ్.పి వసుంధర,వైద్య సిబ్బంది,,అంగన్వాడి కార్యకర్త సమిమ్,ఆరోగ్య,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
మానవత్వం చాటుకున్న పూర్వ విద్యార్థులు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)నల్లమాడ,జూలై04(విజయస్వప్నం.నెట్)
గత నెల జూన్ 9న 99-2000 10వతరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాలో భాగంగా తోటి విద్యార్థిని భారతి తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని కుమారుడైన అభిలాష్(బిటెక్) ఉన్నత చదువులకొరకు తన ఆర్థిక కష్టాలను మిత్రులందరికీ తెలియజేయడంతో ముందుగా మిత్రుడు మూడే రవి నాయక్ స్పందించి తన చారిటబుల్ ట్రస్ట్ హార్ట్ టూ హెల్ప్(దాత) ఛైర్మన్ బ్రహ్మానందం రెడ్డి ద్వారా 20 వేల రూపాయలు నగదు ఇవ్వడానికి ముందుకు రావడంతో,మిగిలిన పూర్వ విద్యార్థులందరూ స్పందించి వారివారి స్థాయిలో ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చి వారి తరపున 27 వేల రుపాయలు నగదు అందించే ఏర్పాట్లు చేశారు.మొత్తం నగదు 47 వేల రూపాయలు జిల్లా పరిషత్ పాఠశాల వేదికగా గురువారం ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి,లక్ష్మన్న సమక్షంలో పూర్వవిద్యార్థులు మూడే రవి నాయక్,చిల్లగొర్ల రమేష్,మనోహర్,రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారు.పూర్వ విద్యార్థులు తోటి మిత్రుడికి ఆర్థికసాయం అందించడం పట్ల పలువురు అభినందించారు.
$$$__________@@@__________$$$
ఘనంగా వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై04(విజయస్వప్నం.నెట్)
మండలంలోని ఎంబి క్రాస్ గ్రామంలో గురువారం వంగవీటి మోహన్ రంగా 77 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా వంగవీటి మోహన్ రంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ... వంగవీటి మోహన్ రంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని పేర్కొన్నారు.పేద ప్రజల సమస్య కోసం చివరి క్షణం వరకు పోరాడిన గొప్ప ప్రజా నాయకుడు వంగవీటి మోహన్ రంగా అంటూ.... ప్రజల నుండి దూరమై 35 యేళ్లు అయిందని,ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని,ఆయన ఆశయాల అడుగుజాడల్లో నడవాలని వారు ఈసందర్భంగా పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో చుక్కా భైరిశెట్టి,వీరయ్య, నంది ఉత్తప్ప,ముమ్మడి బాలకృష్ణ,సాయి రాయల్,నాగేంద్ర,చాకివేల రమణయ్య,నంది శ్రీనివాసులు, గంగాద్రీ, రామకృష్ణ,భార్గవ,వెంకటేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి