గడ్డం నర్సింహులుకి ఘన సన్మానం
ఓడిచెరువు మండలంలోని గౌనిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న గడ్డం నర్సింహులు పదవి విరమణ సందర్భంగా శనివారం ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ.... రికార్డ్ అసిస్టెంట్ గా గడ్డం నర్సింహులు అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు.అనంతరం గడ్డం నర్సింహులు దంపతులకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
$$$___________@@@__________$$$
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్29(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా మా మెడికల్ ఫిరోజ్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.అల్ట్రా విజన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ బొగ్గు సురేష్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది.అమడగూరు,ఓడిచెరువు,నల్లమాడ,గోరంట్ల మండలాల గ్రామీణ ప్రాంతాల నుండి కంటి సమస్యలతో వచ్చిన 133 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి పుట్టపర్తి పట్టణంలో సత్యమ్మ గుడి సమీపంలో అల్ట్రా విజన్ ఐ కేర్ హాస్పిటల్ నందు ఉచితంగా శస్ర్త చికిత్సలు అందించనున్నట్లు వైద్యులు తెలిపారు.ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది రాజేష్,సుధాకర్, అమృత,అనిత,నాగమణి,వర్షిణి తదితరులు పాల్గొన్నారు.
$$$___________@@@__________$$$
విద్యార్థులతో బడికి పోతాం ర్యాలీ
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్29(విజయస్వప్నం.నెట్)
మండలంలోని అల్లాపల్లి పంచాయతీ గౌనిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేను బడికి పోతా... కార్యక్రమములో భాగంగా విద్యార్థులతో కలిసి ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ రియాజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొని బడి మానేసిన విద్యార్థులను బడిలో చేర్చడం,పిల్లలను బడి మానకుండా ఉండేటట్లు చూడడం, సీజనల్ వ్యాధులపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.అనంతరం గ్రామ వీధుల గుండా నేను బడికి వెళ్తాం... పిల్లల చదువు-భవితకు వెలుగు,పనికి ఎందుకు తొందర-చదువుకో ముందర,పెద్దలకు పనికి -పిల్లలు బడికి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు బృందం పాల్గొన్నారు.
$$$___________@@@__________$$$
ఐవిడీ కేంద్రానికి ద్విచక్ర వాహనం అందజేత
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్29(విజయస్వప్నం.నెట్)
ఏకల్ గ్రమోతన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓడిచెరువు మండల కేంద్రంలో ఐవిడీ కేంద్రానికి ఒక ద్విచక్ర వాహనాన్ని అందించగా, ద్విచక్ర వాహనానికి శనివారం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద పూజా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భముగా ఐవిడీ కేంద్రం అధ్యక్షులు పిట్టా ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఎవరయినా కంప్యూటర్,టైలరింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి గల యువత ఐవిడీ కేంద్రంలో సంప్రదించి మీ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు, ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా యూత్ సెక్రెటరీ నరేష్ బాబు, ఐవిడీ కేంద్రం కోఆర్డినేటర్ బి.శ్రీరాములు,కంప్యూటర్ భోధకులు శ్రీనాథ్, కుట్టు శిక్షణ భోధకులు పార్వతి,హేమ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. వివరాల కోసం 7981168356 నెంబరును సంప్రదించాలని సూచించారు.
$$$___________@@@__________$$$
పదవీ విరమణ కండక్టర్ కు సన్మానం
శ్రీసత్యసాయిజిల్లా కదిరి జూన్30(విజయస్వప్నం.నెట్)
కదిరి డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తు పదవి విరమణ పొందిన గంగిరెడ్డికి ఆదివారం ఎంప్లాయిస్ యూనియన్ కదిరి డిపో కమిటీ ఘనంగా సన్మానించారు.గత 25 సంవత్సరాలుగా కండక్టర్ గా సెవలందించి,చిన్న పొరపాటు లేకుండా పదవి విరమణ పొందిన గంగిరెడ్డికి ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేసి అభినందించారు.ఎంప్లాయిస్ యూనియన్ సీనియర్ నాయకులు కాలసముద్రం క్రిష్టయ్య మాట్లాడుతూ....ఉద్యగికి పదోన్నతులు,పదవి విరమణలు సాధారణమని, కండక్టర్ గంగిరెడ్డి సేవాలు అభినందనీయమని కొనియాడారు.పదవి విరమణ పొందిన గంగిరెడ్డికి శాలవాతో సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలోఎంప్లాయిస్ సీనియర్ నాయకులు కే.కృష్ణయ్య,జిసిఎస్ నాయుడు,ఆర్ఎస్ రెడ్డి,కదిరి డిపోఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కే.దివాకర్,కార్యదర్శి పి.శంకరప్ప,కోశాధికారి కే.హరికుమార్,ఎస్.సోమశేఖర్ రెడ్డి,రమణ,సురేందర్,ఎరపరెడ్డి,గంగిరెడ్డి,పి.శివయ్య,హృదయరాజ,ఎన్ బి రెడ్డి,గోవిందు,విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూపదవి విరమణ పొందిన గంగిరెడ్డిసేవలను కొనియాడారు.
$$$___________@@@__________$$$
చరిత్రలో నిలిచిపోయే సియం చంద్రబాబు: చింతా శరత్ కుమార్ రెడ్డి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్30(విజయస్వప్నం.నెట్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 65 లక్షల మంది ఫింఛన్ దారులకు ఇంటింటికి వెళ్లి 7 వేల రూపాయలు పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం దేశ చరిత్రలోనే మొదటి రాష్ట్రంగా నిలుస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఎన్డీయే మంత్రివర్గ సహచర బృందానికి బిజెపి కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి ఓప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఫింఛన్ 4000 రూపాయలు మాట చెప్పిన నాటి నుండి పెంచిన వెయ్యి రూపాయలు మూడు నెలలకు మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి అవ్వ,తాతలకు,వికలాంగులకు పెంచిన 3000 కలిపి 6000 రూపాయలు దేశంలోని ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలేదని ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టి స్వయంగా పింఛన్ దారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తున్న మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు దక్కుతుందని,దీంతో రాష్ట్ర చరిత్ర నిలిచిపోతున్నారని ఆయన పేర్కొన్నారు.గత ప్రభుత్వం 1000 పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాల పాటు పట్టిందని,చంద్రబాబు నాయుడు కేవలం 15 రోజుల్లోనే 1000 రూపాయలు అవ్వ తాతలకు,వికలాంగులకు 3000 రూపాయలు పెంచినారని దీన్ని బట్టి ప్రజల పట్ల ఎవరికి సామాజిక బాధ్యత ఉన్నదో అర్థమవుతుందని ఆయన అన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడానికి మీకు భగవంతుడు మరింత శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని బిజెపి కిసాన్ మోర్చా స్టేట్ ఆర్గానిక్ సెల్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి కోరారు.
$$$___________@@@__________$$$
పాల ధరలు తగ్గించటంతో శ్రీజ పాడి రైతుల ఆందోళన
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 30(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రం లో నిర్వహించబడె శ్రీజ పాల కేంద్రం లో గత నెలకు ఈ నెల కు ఒకేసారి 5రూపాయలు తగ్గించడం తో ఆందోళనకు గురై నా రైతులు సిబ్బందిని రమ్మని కొరగా శనివారం రాత్రి పాలకేంద్రానికి వచ్చిన సూపర్‌వైజర్ లక్ష్మీరెడ్డి మరియు సిబ్బంది మీ పాలు నాన్యత లేవని తిరస్కరిస్తు పాల రైతుల పై దుర్బాషాలాడటంతో రైతులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు రోడ్డు పై పాలు పరబోసి రైతులు నిరసన తెలియజేసారు.దాంతో సిబ్బంది చేసేదిమిలేక పాలు తీసుకోవటం జరిగింది.
$$$___________@@@__________$$$
నేడు ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేపట్టే కార్యక్రమం షెడ్యూల్
శ్రీసత్యసాయిజిల్లా జూన్30(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండలంలో నేడు(సోమవారం)ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపడతారని,అలాగే బుక్కపట్నం మండలంలో ఉదయం 7 గంటలకు,పుట్టపర్తి మున్సిపాలిటీ, రూరల్ లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు,నల్లమాడ మండలంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు,ఓడి చెరువు మండలంలో 11.45 నుంచి 12.45 గంటల వరకు,అమడ గూరు* మండలంలో మధ్యాహ్నం 1 గంటలకు పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని ఎమ్మెల్యే ప్రధాన కార్యాలయ అధికారులు ఆదివారం ఓప్రకటనలో తెలిపారు.ఎమ్మెల్యేతో పాటు మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,ఆర్డీఓ భాగ్యరేఖ,ఆయా మండల తహశీల్దార్లు,ఎంపిడిఓలు,డీ ఆర్ డి ఎ వెలుగు,సచివాలయ అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు,ఇతర శాఖల అధికారులు,తెదేపా,జన సేన,బిజెపి అభిమానులు తదితరులు పాల్గొంటారని తెలిపారు.
$$$___________@@@__________$$$
పేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా
దేశ చరిత్రలో తొలిసారి ఒకే రోజు ఏపిలో రూ.4408 కోట్ల ఫింఛన్ నగదు పంపిణీ.
ఎన్నికల హామీలో మూడవ సంతకం పింఛన్లు పెంపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం.
పేదల భద్రత చంద్రన్న బాధ్యత...
ఇకపై నెలనెలా 1వ తేదిన ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ పండుగ
పుట్టపర్తి నియోజకవర్గంలో ఊరు ,వాడ వాడలా సాగిన పింఛన్ల పంపిణీ పండుగ
ఎన్టీఆర్, చంద్రబాబు,పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం.
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ
(అమడగూరు,నల్లమాడ,ఓడి చెరువు)జూలై01(విజయస్వప్నం.నెట్)
తెదేపా ప్రభుత్వం పేద ప్రజలకు ఎన్టీఆర్ భరోసాను ఇచ్చి అండగా నిలుస్తోందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు పేర్కొన్నారు.పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ మండలం రాగానిపల్లి,గోపేపల్లి, నల్లమాడ బీసీ కాలనీ,చౌటకుంటపల్లి, ఓడిచెరువులో కొండక మార్ల,ఓడి చెరువు బీసీ కాలని,ఆమడగూరు ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిల చేతుల మీదుగా సోమవారం ఎన్టీఆర్,ముఖ్యమంత్రి చంద్రబాబు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.పలువురు ఫించన్ లబ్ధిదారులకు పింఛన్ నగదు పంపిణీ చేశారు.పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రతి ఊరు, వాడల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది.ఫించన్ తీసుకొంటున్న ప్రతి లబ్ధిదారుల మొహాల్లో చిక్కని చిరునవ్వులు కనిపించాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ....దేశ చరిత్రలో తొలిసారి ఒకే రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద ఎత్తున 65,18,496 మంది లబ్ధిదారులకు రూ.4408 కోట్ల ఫించన్ నగదు పంపిణీ చేసిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో మూడవ సంతకం పింఛన్లు పెంపు తో ముఖ్యమంత్రి చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.ఈ రాష్ట్ర పేదల భద్రత చంద్రన్న బాధ్యత తీసుకున్నారన్నారు.ఇకపై పేదలకు నెల నెలా 1 న తేదిన పింఛన్లు పంపిణీ ఇంటివద్ద నే ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.పెంచిన పింఛన్లతో ప్రభుత్వానికి ప్రతి నెల రూ.819 కోట్లు అదనపు బారం పడినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసం ఎంత శ్రమైనప్పటికి కూడా ఇలాంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.గడిచిన మూడు మాసాలకు కలిపి పింఛన్ల పంపిణీ కోసం చేస్తున్న ఖర్చు రూ.1650 కోట్లు అదనపు బారం ప్రభుత్వం మోస్తోందన్నారు.గత ప్రభుత్వం విడతల వారీ పెంపు అంటూ పేదలకు చేసిన మోసంతో ఒక్కొక్కరికి రూ.32000 నష్టం వాటిల్లిందని గుర్తు చేశారు.తెదెపా ప్రభుత్వం తీసుకొచ్చిన పెంపుతో నేడు లబ్ధిదారులు ఒక్కొక్కరికి రూ.4000 చొప్పున అందిస్తోందని పేర్కొన్నారు.గత వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఫించన్ దారులను కూడా తీవ్ర మోసం చేసిందన్నారు.పింఛన్లు పెంపును చేపట్టిన తెదేపా ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు ఎల్లకాలం ఆదరించాలని కోరారు.అనంతరం కల్లూరు పింఛన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు.అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ ఆయా మండల తహశీల్దార్లు,ఎంపిడిఓ లు,సచివాలయ ఉద్యోగులు,ఇతర శాఖ అధికారులు,స్థానిక తెదేపా,జన సేన, బీజేపీ అభిమానులు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
$$$___________@@@__________$$$
విద్యా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి:: డిటిఎఫ్ నాయకులు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై01 (విజయస్వప్నం.నెట్)
ఆంధ్ర రాష్ట్ర ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న నిరుద్యోగ యువతలకు బాసటగా నిలిచే విధంగా ... ప్రకటించిన మెగా డీఎస్సీ 16,347 పోస్టులలో ఉర్దూ మీడియం పాఠశాలలకు తగినన్ని పోస్టులను మంజూరు చేసి భర్తీ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని,రాష్ట్ర ద్వితీయ అధికార బాషైన ఉర్దూను,పాఠశాలలను సంరక్షించాలని,జివో నెంబర్ :117 ను రద్దు చేసి ఉర్దూ పాఠశాలలలో ఎస్జీటి పోస్ట్ లను భర్తీ చేయాలని,ఉర్దూ మీడియం ప్రాథమిక,ప్రాథమికోన్నత,జిల్లా ఉన్నత పాఠశాలలో రోల్ కు తగినన్ని ఫోస్టులను భర్తీ చేయాలని,చాలా డిఎస్సీలలో భర్తీ కాని బ్యాక్ లాగ్ పోస్ట్ లను ఈ మెగా డిఎస్సిల్లో భర్తీ చేయాలని, అలాగే ఇంగ్లీషు,తెలుగు మీడియం పాఠశాలల్లో 20 మంది మాతృభాష ఉర్దూ ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఓ ఉర్దూ సబ్జెక్టు పోస్ట్ ను భర్తీ చేయాలని,ఉర్దూ మీడియం,లాంగ్వేజ్ అర్హత కలిగిన వారికే ఉర్దూ మీడియం నందు డి.ఎస్.సి అర్హత కల్పించాలని,ఉర్దూ మీడియం పిఈటీ పోస్ట్ లను భర్తీ చేయాలని డిటిఎఫ్ జిల్లా నాయకులు గౌస్ లాజమ్ సోమవారం ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డికి వివరించి ఈసందర్భంగా వినతిపత్రం అందజేశారు.
$$$___________@@@__________$$$
విద్యను వ్యాపారంగా చేస్తున్న జ్ఞాన సాయి పై చర్యలు తీసుకోవాలి:ఎబివిపి నాయకులు డిమాండ్
$$$___________@@@__________$$$
ఇనగలూరులో ఫింఛన్లు పంపిణీ
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు జూలై01(విజయస్వప్నం.నెట్)
మండలంలోని ఇనగలూరు పంచాయతీ గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటల నుండి చంద్రన్న ఫింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం రామిరెడ్డిపల్లి,బోడెద్దులపల్లి గ్రామాల్లో ఫింఛన్లు పంపిణీ చేపట్టారు.ఈకార్యక్రమంలో డిజిటల్ అసిస్టెంట్ చౌడప్ప, అగ్రికల్చర్ ఎంపీహెచ్ఓ రెడ్డప్ప,మాజీ జెడ్పీ సభ్యులు పిట్టా ఓబుళరెడ్డి,తెదేపా మాజీ మండల కన్వీనర్ లక్కినేని రామానాయుడు, టీఎన్ఎస్ఎఫ్ శబరీష్ నాయుడు,పాలఏకరీ సంఘం జిల్లా నాయకులు,తెదేపా నాయకులు రాశినేని లక్ష్మినరసింహ నాయుడు(తూవంకపల్లి)మాజీ కోఆప్షన్ సభ్యులు టైలర్ నిజాం,తెదేపా నాయకులు భాస్కర్ రెడ్డి,అబ్బులు ఫింఛన్ దారులు తదితరులు పాల్గొన్నారు.
$$$___________@@@__________$$$
నేడు సీఐటీయూ శిక్షణ తరగతులు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై01(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో జూలై2(నేడు)సిఐటియు ఆధ్వర్యంలో విద్య,వైజ్ఞానిక తరగతుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ,సీఐటీయూ సీనియర్ నాయకులు రమణ,మండల అధ్యక్షులు కుళ్ళాయప్ప,మండల కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ.....ఈ శిక్షణ తరగతులను బోధించడానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల్,సీఐటీయూ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ హాజరవుతున్నారని,ప్రజా సంఘాలు,వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో భవనిర్మాణ కార్మిక సంఘం నాయకులు సూరి, కేశవ, విజయ్, కుమార్, ప్రసాద్, శ్రీనివాసులు, లక్ష్మీపతి, భాస్కర్, రామాంజులు, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
$$$___________@@@__________$$$
తుమ్మల గ్రామంలో ఫింఛన్లు పంపిణీ
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు(ఓడిచెరువు) జూలై01(విజయస్వప్నం.నెట్)
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం తుమ్మల గ్రామ పంచాయతీలో పింఛన్లు పంపిణీ చేపట్టారు.ఈకార్యక్రమంలో బిజెపి కిసాన్ మార్చ్ ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..... రాష్ట్రంలో పెన్షన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,చంద్రబాబు నాయుడుకి,డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి,పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూర రెడ్డికి గ్రామ ప్రజల తరఫున పెన్షనర్లు తరపున కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు.గత ప్రభుత్వం 1000 పెంచడానికి ఐదు సంవత్సరాలు పెడుతుందని ,ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కేవలం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే 4000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసులు, తెదేపా ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి కాలే నాయక్,గ్రామ కమిటీ అధ్యక్షులు చంద్రమోహన్, ఐడిటిపి శ్రీనివాసులు,జనసేన నాయకులు శంకర,రహమతుల్లా,చంద్రమోహన్, నాగప్ప, పద్మనాభ, నాగముని, అంగనవాడి భోధకులు సరలమ్మ,గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.
$$$___________@@@__________$$$
ఇనగలూరులో ఫింఛన్లు పంపిణీ
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు జూలై01(విజయస్వప్నం.నెట్)
మండలంలోని ఇనగలూరు పంచాయతీ గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటల నుండి చంద్రన్న ఫింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం రామిరెడ్డిపల్లి,బోడెద్దులపల్లి గ్రామాల్లో ఫింఛన్లు పంపిణీ చేపట్టారు.ఈకార్యక్రమంలో డిజిటల్ అసిస్టెంట్ చౌడప్ప, అగ్రికల్చర్ ఎంపీహెచ్ఓ రెడ్డప్ప,మాజీ జెడ్పీ సభ్యులు పిట్టా ఓబుళరెడ్డి,తెదేపా మాజీ మండల కన్వీనర్ లక్కినేని రామానాయుడు, టీఎన్ఎస్ఎఫ్ శబరీష్ నాయుడు,పాలఏకరీ సంఘం జిల్లా నాయకులు,తెదేపా నాయకులు రాశినేని లక్ష్మినరసింహ నాయుడు(తూవంకపల్లి)మాజీ కోఆప్షన్ సభ్యులు టైలర్ నిజాం, ఎబివిపి వాసు,తెదేపా నాయకులు భాస్కర్ రెడ్డి,అబ్బులు ఫింఛన్ దారులు తదితరులు పాల్గొన్నారు.
$$$___________@@@__________$$$
ఎగువపల్లిలో ఇంటింటికి పింఛన్లు పంపిణీ
శ్రీసత్యసాయిజిల్లా కదిరి జూలై 01(విజయస్వప్నం.నెట్)
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సూచనల మేరకు సోమవారం కదిరి మండలం బ్రహ్మాణపల్లి పంచాయతీ ఎగువపల్లిలో ఇంటి ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. ఎన్నకల హామీ మేరకు పెంచిన పింఛన్లు అందించిన సియం నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెదేపా శ్రేణులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎగువపల్లి తెదేపా నాయకులు గిరి నాయుడు, మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి