google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : ఏపికి పోలవరం,అమరావతి నిర్మాణమే చంద్రబాబు డ్రీమ్. బాబు నాయుడు కుమార్తె అనూష శ్రీ మంతం కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి పల్లె - మధ్యాహ్నం భోజనం పరిశీలన - ఘనంగా అక్కదేవతల ఎలవగంప ఉత్సవం.

29, జూన్ 2024, శనివారం

ఏపికి పోలవరం,అమరావతి నిర్మాణమే చంద్రబాబు డ్రీమ్. బాబు నాయుడు కుమార్తె అనూష శ్రీ మంతం కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి పల్లె - మధ్యాహ్నం భోజనం పరిశీలన - ఘనంగా అక్కదేవతల ఎలవగంప ఉత్సవం.

ఘనంగా అక్కదేవతల ఎలవగంప ఉత్సవం.



శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,జూన్ 28(విజయస్వప్నం.నెట్)

మండలంలోని పగడాలవారిపల్లిలో పూజారి పెద్ద నారాయణప్ప కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శుక్రవారం శ్రీఅక్కదేవతల యలవగంప ఉత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా పగడాలవారిపల్లి గ్రామస్తులు  ప్రతి ఇంటి నుంచి పసుపు,కుంకుమ,గాజులతో యలవగంప ఉత్సవం గిరుగుల వాయిద్యాలతో భక్తిశ్రద్ధలతో  పురవీధుల్లో భక్తులకు దర్శనార్థం  ఊరేగింపు నిర్వహించారు. అక్కదేవతల ప్రతిరూపంగా ఎడు మంది చిన్నారులతో సాంప్రదాయ బద్దంగా పూజలు  నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాలు పాల్గొన్నారు.పరిసర గ్రామాల నుండి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదలుఅందజేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

$$$__________@@@__________$$$

మధ్యాహ్నం భోజనం పరిశీలన

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్27(విజయస్వప్నం.నెట్) 

మండల కేంద్రంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన వంటలను అధికారులు పరిశీలించారు.ఎంఈఓలు సురేష్ బాబు,రమణలతో కలిసి మాజీ జెడ్పీ సభ్యులు పిట్టా ఓబుళరెడ్డి విద్యార్థులకు మోను మేరకు భోజనాలు తయారు చేస్తున్నారా.... లేదా.... అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందాల్సిన అంశంపై ఏజెన్సీ నిర్వాహకులకు వివరించారు.ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిణి శోభారాణి, పాఠశాల కమిటీ ఛైర్మన్ జయచంద్ర నాయుడు, మాజీ కోఆఫ్షన్ టైలర్ నిజాం, పీట్లా సుధాకర్,చాంద్ బాష, వెంకటేష్,షబ్బీర్,షాను,ఆరీఫ్, ఏజెన్సీ నిర్వాహకులు శ్రీనివాసులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

$$$__________@@@__________$$$

ఏపికి పోలవరం,అమరావతి నిర్మాణమే చంద్రబాబు డ్రీమ్.

బాబు నాయుడు కుమార్తె అనూష శ్రీ మంతం కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి పల్లె 



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 28(విజయస్వప్నం.నెట్)

ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికైన పోలవరం,అమరావతి నిర్మాణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరికని మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.

ఓడిచెరువు మండలం చింతమానిపల్లి పంచాయతీలో టిడిపి నాయకులు బాబు నాయుడు కుమార్తె అనూష శ్రీమంతం కార్యక్రమానికి శుక్రవారం పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు.అనుషకు మాజీ మంత్రి అక్షింతలు వేసి ఆశీర్వదించారు.అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులతో అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ,ఇది ప్రజా ప్రభుత్వమని,సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలకు న్యాయం చేస్తామన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి చెందుతుందని అయన ఆకాంక్షించారు.ఏపికి పోలవరం,అమరావతి నిర్మాణం పూర్తి చేయడమే ఈ ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యమన్నారు.అంతే కాకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమించే వ్యక్తి అని అన్నారు.భావితరాల వారికి ఉపయోగపడే విధంగా రాష్ట్ర నిర్మాణం కోసం చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమన్నారు.తెదేపా,జన సేన, బీజేపీ కూటమికి అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఓడి చెరువు మండలంలోని ఆల్లాపల్లి పంచాయతీలో పర్యటించారు.పగడాలవారి పల్లి,చౌడంపల్లిలో జరిగిన పలు  కార్యక్రమాలకు హాజరయ్యారు. అక్కడి నుంచి కొత్త చెరువు మండలం శ్యాం పురంలో నిర్వహించిన ఎద్దుల పరుగు పందెం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పరుగు పందెంలో గెలిచిన ఎద్దుల బండి రైతులకు నగదు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి