google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : భక్తిశ్రద్ధలతో చిన్నారులకు అక్షరాభ్యాసం - ఘనంగా కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట - మెగా డీఎస్సీ ప్రకటన హర్షనీయం:డిటిఎఫ్

17, జూన్ 2024, సోమవారం

భక్తిశ్రద్ధలతో చిన్నారులకు అక్షరాభ్యాసం - ఘనంగా కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట - మెగా డీఎస్సీ ప్రకటన హర్షనీయం:డిటిఎఫ్

భక్తిశ్రద్ధలతో చిన్నారులకు అక్షరాభ్యాసం





 శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్16(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి దేవస్థానం ఆవరణలో ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు ఆధ్వర్యంలో విద్యా గణపతి సన్నిధిలో ఆదివారం చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.కదిరి జోగి శ్రీదేవి ఫౌండేషన్ ఛైర్మన్ కోడూరు శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పూజా కార్యక్రమాలో పాల్గొన్నారు.పురోహితులు సురేష్ శర్మ విద్యా గణపతి విగ్రహానికి అభిషేక పూజలు నిర్వహించి,చిన్నారులకు తల్లిదండ్రుల సమక్షంలో అక్షరాభ్యాసం గావించారు.అనంతరం 186 మంది చిన్నారులకు దాత కోడూరు శ్రీకాంత్ చేతుల మీదుగా ఉచితంగా పలక బలపాలు అందించారు.శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.ఈకార్యక్రమంలో సిటీ కేబుల్ జర్నలిస్ట్ నాగేష్(కదిరి),టైలర్ నిజాం,జిరాక్స్ అశోక్, ట్రాన్స్ కో రవి,సీసీ కెమెరా శంకర్, డబురువారిపల్లి రమేష్,రవి,గణేష్, మధు,భాస్కర్ రెడ్డి,ఎస్బిఐ శీనా,ఆనంద్,మల్లెల రమేష్,గణేష్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఘనంగా కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట



శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు జూన్16(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి ఆలయం ఆవరణలో ఆదివారం  హెడ్ కానిస్టేబుల్ గౌడ్ సహకారంతో జ్యేష్ట మాస దశమి శుభ ఘడియల్లో కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమ్మ పుణ్య దంపతుల విగ్రహ ప్రతిష్ట పురోహితులు పంచరత్న సురేష్ శర్మ వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అందజేయగా విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ ఫకృధ్ధీన్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారని తెలిపారు.ఈకార్యక్రమంలో  ఆలయసేవకులు సీసీ కెమెరా శంకర,ఆనంద్, ఎస్బిఐ శీనా,గణేష్,బంగారు దుకాణం శంకరాచారి, స్టీల్ షాప్ శేఖర్మ,పూజారి రమణ, సందీప్, ట్రాన్స్ కో రవి, మల్లెల రమేష్,రఘురామిరెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

మెగా డీఎస్సీ ప్రకటన హర్షనీయం:డిటిఎఫ్

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్16(విజయస్వప్నం.నెట్)

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మెగా డీఎస్సీ పైల్ పై తొలి సంతకం అని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసారని, ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 16,347 పోస్టులను అన్ని కేటగిరిలో విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని,ఎన్నో సంవత్సరాలుగా టిటిసి,బిఈడి చేసి నిరుద్యోగులు ఏమి చేయాలో తోచక - ఎదురుచూస్తున్నారని,నిరుద్యోగ యువతకు ఇవాళ డీఎస్సీ ప్రకటన శుభ పరిణామని డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గౌస్ లాజమ్,మారుతి ప్రసాద్ లు పేర్కొన్నారు.ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు పెంచాలని,పాఠశాలల విలీనానికి కారణమైన జీవో 117 ను రద్దు పోస్ట్లు ఇంకా పెరగడానికి ఆస్కారం ఉండేదని ఈసందర్భంగా ఆదివారం వారు విలేకరులకు తెలిపారు.

$$$__________@@@__________$$$

నూతన సాంకేతిక  నైపుణ్యాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

ఉప్పర (సగర) పుత్రులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో మాజీ మంత్రి పల్లె - డిఈఓ మీనాక్షి పిలుపు



శ్రీసత్యసాయిజిల్లా హిందూపురం(ఓడిచెరువు) జూన్16(విజయస్వప్నం.నెట్)

హిందూపురం డివిజన్ శ్రీ భగీరథ ఎడ్యుకేషనల్ సేవా ట్రస్ట్ అధ్వర్యంలో శ్రీసత్యసాయిజిల్లాలోని ఉప్పర (సగర) విద్యార్థినీ, విద్యార్థులు 2024 మార్చి మాసంలో పదవ తరగతిలో ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలో 375 మార్కుల పైబడిన విద్యార్థులకు,అలాగే ఇంటర్మీడియటులో 700 పైబడిన మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల  ప్రధానోత్సవం కార్యక్రమం ఆదివారం  స్థానిక సప్తగిరి కళాశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,శ్రీ సత్యసాయిజిల్లా డిఇఓ మీనాక్షి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యకు మించిన సంపద లేదని విద్యతో దేన్నైనా సాధించవచ్చన్నారు.నూతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాల్సిన ఆవశ్యకత విద్యార్థులకు ఎంతైనా ఉందన్నారు. తల్లిదండ్రులను, గురువులను ,సమాజంలోని పెద్దలను గౌరవించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించి సామాజిక  సేవలో భాగస్వాములు కావాలని ఈసందర్భంగా వారు పిలుపునిచ్చారు.అనంతరం ముఖ్య అతిథులు చేతుల మీదుగా విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు - నగదును బహుకరించారు.ఈకార్యక్రమంలో అధ్యక్షుడు ఆదినారాయణ,అనంతపురం శారద, మాజీ జెడ్పిటిసి వెంకటరమణ,సప్తగిరి కళాశాల ఎక్స్ సిఈఓ ఈశ్వరరెడ్డి, మహంతిష్, రాజశేఖర్, కార్యదర్శి ఎల్ఐసి వెంకటేశులు, ట్రెజరర్ పైడేటీ రామాంజినేయులు, కిష్టప్ప, నాగప్ప, జాయింట్ సెక్రటరీ శ్రీరాములు, నాగముని,నాగరాజు, నర్సింహారెడ్డి, ఈశ్వరప్ప, తిమ్మగానిపల్లి రామస్వామి, టీచర్ అశ్వర్తప్ప, గోపాల్ విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు డివిజన్ పరిధిలోని సగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

శ్రీ అక్కదేవతల ఆలయంలో భాస్కర్ రెడ్డి, ప్రభావతి ధంపతుల ప్రత్యేక పూజలు


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 17(విజయస్వప్నం.నెటై)

మండలంలోని అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ  సమీపంలో సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీ అక్కదేవతల ఆలయంలో సోమవారం హానేకళ్లు గ్రామానికి చెందిన చెందిన భాస్కర్ రెడ్డి,ప్రభావతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం విచ్చేసిన  భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారని పూజారి వెంకటేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తేజస్,హేమంత్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

అనుమానస్పద స్థితిలో యువతి మృతి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్17(విజయస్వప్నం.నెట్)

మండలంలోని అల్లాపల్లి పంచాయతీ చౌడంపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ కుమార్తె ప్రమీల అను ఆమె ఇంట్లో తరచు ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుండగా తల్లిదండ్రులు మందలించగా  16వ(తేదీ ఆదివారం) సాయంత్రం 6 గంటలకు ఇంటి నుండి వెళ్లిపోయిందని,ఎంతసేపటికి ఇంటికి రానందున చుట్టుపక్కల వెతకగా కనపడలేదని.17 వతేది సోమవారం ఉదయం 7 గంటల సమయంలో  ప్రమీల చౌడంపల్లి గ్రామ సమీపంలో ఉన్న చెక్ డాం నీటిలో పడి చనిపోయిందని,మృతి పట్ల ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.

$$$__________@@@__________$$$

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే పల్లె సింధూర 

శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి జూన్17(విజయస్వప్నం.నెట్)

సమతా,మమతల సమ్మిళితాన్ని చాటి చెప్పే బక్రీద్ పర్వదిన సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గ  ముస్లిం సోదరుల కుటుంబ సభ్యులకు సోమవారం పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.త్యాగానికి ప్రతీకగా నిలిచిన ఈ వేడుకను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.సన్మార్గంలో నడిపించే పవిత్ర ఖురాన్ అందించిన సూత్రాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరుతూ..మహత్తరమైన త్యాగం నుండి ఆవిష్కృతమైన బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో  ఉత్సాహంగా జరుపుకోవాలని ఆ(అల్లా} భగవంతున్ని ప్రార్ధిస్తున్నారని వారు తెలిపారు.

$$$__________@@@__________$$$

హర్మోనిస్ట్  కళాకారుడు సూరి మృతి పట్ల పలువురు సంతాపం

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 17 (విజయస్వప్నం.నెట్)

మండలంలోని ఓడిచెరువు పంచాయతీ బాబాసాహెబ్ పల్లి గ్రామానికి చెందిన జానపద వృత్తి కళాకారుల సంఘం మండల గౌరవ సలహాదారులు, జిల్లా హర్మోనిస్ట్ కళాకారుల సంఘం సభ్యులు,మండల కళాకారుల సంఘం గురువు ఎస్.సూర్యనారాయణ నాయుడు(హార్మోనిస్ట్ ) సోమవారం మృతి చెందిన విషయం తెలుసుకున్న శ్రీసత్యసాయిజిల్లా జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షులు ఎం.నారాయణ,రాష్ట్ర అధ్యక్షులు పులిమామిడి యాదగిరి తదితరులు ఫోన్ లో కుటుంబ సభ్యులను పరామర్శించి, కళాకారుడు ఎస్.సూర్యనారాయణ ఆత్మ కు శాంతి కలగాలని భగవంతునికి  కోరుకుంటూ,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారన్నారు.మండల నాయకులు సిపిఎం రమణ, శ్రీరాములు,వెంకటేష్, కుళ్ళాయప్ప తదితర డివిజన్, మండలాల కళాకారుల సంఘం సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారన్నారు.

$$$__________@@@__________$$$

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి