google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : సికెల్ సెల్ రక్తహీనత ప్రాణాంతకం - నేడు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా వేరుశనగ కాయల పంపిణీ

20, జూన్ 2024, గురువారం

సికెల్ సెల్ రక్తహీనత ప్రాణాంతకం - నేడు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా వేరుశనగ కాయల పంపిణీ

నేడు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా వేరుశనగ కాయల పంపిణీ

శ్రీసత్యసాయిజిల్లా, ఓడచెరువు, జూన్ 18(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండలం,తంగేడుకుంట పంచాయతీ గ్రామంలో నేడు బుధవారం విత్తన వేరుశనగ కాయల పంపిణీ కార్యక్రమం ఉదయం 11 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హాజరై ప్రారంభిస్తారని మండల తెదేపా శ్రేణులు తెలిపారు. మండలంలోని తంగేడుకుంట పంచాయతీలోని శోత్రియ భూముల రైతులకు వేరుశనగ కాయల పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తోపాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి హాజరుకానున్నారని, కావున ఆయా గ్రామాల్లో రైతులు, తెదేపా, జనసేన, బిజెపి, నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు హాజరుకావాలని వారు కోరారు.

$$$__________@@@__________$$$

తెదేపా మాజీ కన్వీనర్ సుబ్బయ్య సతీమణి అంత్యక్రియలకు హాజరైన మాజీ మంత్రి డాక్టర్ పల్లె 


శ్రీసత్యసాయిజిల్లా(అమడగూరు)జూన్ 18(విజయస్వప్నం.నెట్)

అమడగూరు మండలం కందుకూరుపల్లి గ్రామానికి చెందిన తెదేపా మాజీ సింగిల్ విండో అధ్యక్షులు కమ్మల సుబ్బయ్య సతీమతి రమణమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మంగళవారం గ్రామానికి చేరుకుని పార్థివ దేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి,ఆ కుటుంబానికి మనో ధైర్యం నింపారు.సుబ్బయ్య ను ఓదార్చి,అయన కుమారుడు యుగంధర్ కు దైర్యం చెప్పి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ  జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కృష్ణమూర్తి ,తెలుగు  యువత నాయకుడు శ్యామ్ బాబు నాయుడు,ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలే నాయక్,మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, ఓడిచెరువు మాజీ జడ్పిటిసి పిట్టా ఓబుళరెడ్డి, తెదేపా మండల కన్వీనర్ జయచంద్ర, నల్లమాడ మండల మాజీ కన్వీనర్ కేశవ్ రెడ్డి,మాజీ ఎంపిపి బ్రహ్మానంద రెడ్డి,వెంకటరెడ్డి,నంజప్ప,రాజారెడ్డి,నాగేంద్ర రెడ్డి, గాయత్రి,భాస్కర్,జయ,రవి,ఈశ్వర్ రెడ్డి,బోడెప్ప, తెదేపా నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 $$$__________@@@__________$$$

వారపుసంత వేలంపాట 2.04 లక్షలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 18(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో ఓడిచెరువు పంచాయతీ గ్రామ వారపుసంత బహిరంగ వేలం పాట మంగళవారం ఓడిచెరువు సచివాలయంలో సర్పంచ్ ముద్దలపల్లి గోవిందు అధ్యక్షతన నిర్వహించారు. బాబాసాహెబ్ పల్లికి చెందిన రామాంజనేయులు 2లక్షల 4వేల రూపాయలు వేలం పాటలో దక్కించుకున్నారని ఈఓఆర్డీ రాజశేఖర్, కార్యదర్శి రామలింగారెడ్డి తెలిపారు. సరుకులు లోడ్, అన్లోడ్ సంబంధించిన పాటలో ఓడిచెరువు గ్రామానికి చెందిన మహబూబ్ బాషా 84 వేల రూపాయలకు వేలం ద్వారా దక్కించుకున్నరని తెలిపారు.వేలం పాట ద్వారా సమకూర్చిన నిధులతో పంచాయతీ గ్రామ అభివృద్ధికి వినియోగిస్తారని సర్పంచ్ ముద్దలపల్లి గోవిందు, ఈఓఆర్డీ రాజశేఖర్ తెలిపారు.

$$$__________@@@__________$$$

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 18(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల తెదేపా నాయకులు మంగళవారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతూ.... పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సేవలు అభినందనీయమని, తెదేపా కూటమి విజయంపై శుభాకాంక్షలు తెలిపి మండల కేంద్రంలో జౌళి బాబా గృహంలో సన్మానించారని తెదేపా శ్రేణులు తెలిపారు.

$$$__________@@@__________$$$

రైతల సంక్షేమమే తెదేపా ప్రభుత్వ  ధ్యేయం

తంగేడుకుంట శోత్రియ సాగు రైతులందరికి పట్టాలు అందిస్తాం:పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి




శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, జూన్19(విజయస్వప్నం.నెట్)

రైతుల సంక్షేమమే తెదేపా ప్రభుత్వ ధ్యేయమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డిలు పేర్కొన్నారు. ఓడిచెరువు మండలం తంగేడుకుంట పంచాయతీలోని 658 మంది శోత్రియ భూముల సాగు రైతులకు బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేరుశనగ కాయల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. రైతులకు నాణ్యమైన విత్తన వేరుశనక్కాయలు ప్రభుత్వం నుంచి అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు సకాలంలో పంటలు సాగు చేసుకుని అధిక పంట ఉత్పత్తిని సాధించాలని ఆకాంక్షించారు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందనే నానుడి నిజం కావలన్నారు.రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నికల ముందు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెదేపా మేనిఫెస్టోలో కూడా  రైతులను ఆదుకునేందుకు  పంట పెట్టుబడి ఆర్థిక సాయం కింద ప్రతి ఏటా రూ.20 వేలు అందజేసే విధంగా మంచి పథకాన్ని తీసుకొచ్చారని దాన్ని అమలు చేసేలా తెదేపా ప్రభుత్వం త్వరలో కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందన్నారు. భవిష్యత్తులో విపత్తులు వచ్చి వాటి వల్ల పంట నష్టాలు జరిగి  రైతులకు తీవ్ర నష్టం వాటిల్లితే అన్నదాతను ఆదుకునేందుకు  ప్రభుత్వం పంటల భీమాను కూడా తీసుకురానున్నట్లు తెలిపారు.కష్టాల్లో ఉన్న రైతులకు ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని పేర్కొన్నారు.గత వైకాపా ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. జగన్ పాలనలో  రైతులకు కనీసం డ్రిఫ్,స్ప్రింకర్లు ,వ్యవసాయ పరికరాలు కూడా అందించలేదని, వైకాపాది రైతు భక్షక ప్రభుత్వమని అభివర్ణించారు. మండలంలోని తంగేడుకుంట శోత్రియ భూముల సాగు రైతులకు రైత్వారి పట్టాలను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో పుట్టపర్తినియోజకవర్గానికి గాను 18391 క్వింటాలు వేరుశనగ పంపిణీ చేసినట్లు తెలిపారు. తంగేడుకుంట పంచాయతీ పరిధిలోని 650 మంది రైతులకు 610 క్వింటాళ్ల వేరుసెనగను పంపిణీ చేస్తామన్నారు. రైతులకు సరిపడే విత్తన వేరుశన కాయలు ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని,విత్తన కాయలు కావాల్సిన రైతులు వ్యవసాయ యాప్ లో రిజిస్టర్ చేసుకుని ఆయా  రైతుభరోసా కేంద్రాలలో వేరుశెనక్కాయలు పొంది పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. అనంతరం తెదేపా శ్రేణులు అందించిన మొక్కలను నాటి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని భాధ్యతగా తీసుకుని సంరక్షించాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పిట్ట ఓబుళరెడ్డి, మండల కన్వీనర్ జయచంద్ర ,తహసిల్దార్ ఖాజాభి, వ్యవసాయ అధికారి ఇలియాజ్, లాయర్ రాజశేఖర్,ఇతర శాఖ అధికారులు, రైతులు, తెదేపా, జనసేన,bబిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

జిల్లాలో పర్యటించిన కరువు బృందానికి వినతి పత్రం సమర్పించిన బిజెపి నాయకులు

శ్రీసత్యసాయిజిల్లా, పుట్టపర్తి(ఓడిచెరువు)జూన్ 19(విజయస్వప్నం.నెట్)

ఉమ్మడి అనంతపురం జిల్లా ఎక్కువగా రైతులు వ్యవసాయ భూమి వర్షాధారం మీద ఆధారపడతారు ముఖ్యంగా మీ సత్యసాయి జిల్లాలో 90 శాతంపైగా వర్షంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.ఈప్రాంతంలో సకాలంలో వర్షాలు పడకపోవడం పంట నష్టం జరుగుతున్నదని,అకాల వర్షాల కారణంగా తీవ్రంగా పంట నష్టం వాటిల్లుతుందని, తీవ్రమైన ఎండలు,కరువు కాటకాలతో జిల్లా రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్న ప్రాంతంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నామని,ప్రధానంగా ఈ క్రింది విషయాలను కరువు బృందం దృష్టికి తీసుకొస్తున్న పీఎం కిసాన్ సన్మానిది కరువు మండలాలకు ప్రత్యేకంగా గుర్తించి ఎక్కువ నిధులు కేటాయించారని,జిల్లాలో వ్యవసాయ పరిశ్రమంలో ఏర్పాటు చేయాలని,రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి  ఖర్చు విపరీతంగా పెరిగిందని, కానీ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని,ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం లేదని, వ్యవసాయంలో రైతులు అధిక మోతాదులో రసాయన ఎరువులు  వాడడంతో భూసారం నశించి పోతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని, రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ఈజిల్లాలో వేరుశనగ విత్తనాలతో పాటు ప్రత్యామ్నాయ పంటలైన చిరుధాన్యాల సాగు  ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని,ప్రభుత్వం సరఫరా చేస్తున్న విత్తనాలలో నాణ్యత లేని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని,దీనిపైన విచారణ జరిపించాలని,కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు 1 ఎకరాకు 50 వేల రూపాయలు ఇస్తున్న "పరంపరాగత్ కృషి వికాస్ యోజన"నిధులు రైతులకు అందడం లేదని,దీనిపై విచారణ చేపట్టి రైతులకు అందే విధంగా చూడాలని,ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించాలని

బిజెపి కిసాన్ మోర్చ్ ఆర్గానిక్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి,కిసాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమీయుల్లా,మండల అధ్యక్షుడు సురేందర్ రెడ్డి,హనుమంతు యాదవ్,శంకర్ రెడ్డి తదితరులు వినతిపత్రం సమర్పించి కోరినట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

ప్రతి కార్యకర్తకు అండగా ఉంట: ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి



శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,జూన్19 (విజయస్వప్నం.నెట్)

మండలంలోని చౌడంపల్లికి చెందిన వెంకటేష్ కుమార్తె ప్రమీల ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమీల మృతి చాలా బాదాకరమని, మనో ధైర్యంగా ఉండవలసిందిగా కుటుంబ సభ్యులకు సూచించారు. అనంతరం ఇటీవలే మరణించిన బలిజపల్లి గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు బికిలి అక్కులప్ప, తంగేడుకుంట గ్రామానికి చెందిన తలారి సుధాకర్ కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.ప్రతి కార్యకర్తకు నిరంతరం అందుబాటులో ఉంటూ..... అండగా ఉంటామని ఈసందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో తెదేపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

సికెల్ సెల్ రక్తహీనత ప్రాణాంతకం


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 19(విజయస్వప్నం.నెట్)

వారసత్వంగా వచ్చే ఎర్ర రక్త కణాల రుగ్మతల సమూహమైన సికిల్ సెల్ రక్తహీనత వ్యాధి పట్ల అవగాహన, జాగ్రత్తలు లేకుంటే ప్రాణాంతకమైందని వైద్యాధికారి కమల్ రోహిత్ పేర్కొన్నారు.ప్రపంచ సికిల్ సెల్ రక్తహీనత దినం సందర్భంగా బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులకు, బాలింతలకు తదితరలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన  ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి సికిల్ సెల్ రక్తహీనత వ్యాధిని నిర్మూలించే మిషన్ ను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన దరిమిలా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో 0-4 వయసు ఉన్న ఏడు కోట్ల మందికి అవగాహన కల్పిస్తూ సార్వత్రిక నిర్ధారణ పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహించడం ఈ మిషన్ లక్ష్యంగా పేర్కొన్నారు.రక్త కణాల సంఖ్య తగ్గడం, కళ్ళు పసుపు రంగులో మారడం,తీవ్ర కీళ్ల,ఒళ్ళు నొప్పులు, శ్వాసలో ఇబ్బంది,అలసట, గర్భధారణ సమయంలో సమస్యలు, అవయవ నష్టం ఈ వ్యాధి లక్షణాలు కాగా జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి చిన్నపిల్లలకు ఈవ్యాధి ముఖ్యంగా సోకే ప్రమాదముందన్నారు. సకాలంలో పరీక్షలు చేయించుకోవడం, సత్వర చికిత్స ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సుభాషిని, దిల్షాద్, విజయ కుమారి, మురళి, అరుణ జ్యోతి, హేమ, అంజలి, రాధ, బషీరా, వెలుగు అధికారులు, సిబ్బంది మునెప్ప, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఐరన్ మాత్రలతో రక్తహీనతకు దూరం

శ్రీసత్యసాయిజిల్లా (ఓడిచెరువు) అమడగూరు, జూన్ 20(విజయస్వప్నం.నెట్)

ఐరన్ మాత్రలు వాడడం వలన రక్తహీనతకు దూరం అవుతుందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. గురువారం అమడగూరు మండలంలోని గాజులపల్లిలో ఐకేపీ, వైద్య ఆరోగ్య సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో రక్తహీనతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలు రుతుక్రమం సమయంలో రక్తహీనతకు గురౌతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక వైద్యులను సంప్రదించి సూచనలు,సలహాలను పాటించాలన్నారు. అలాగే మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుండగలరని, ప్రభుత్వ ఆసుపత్రిలో విరివిగా లభించే ఐరన్ మాత్రలు తీసుకోవడం వల్ల రక్తహీనతకు గురికాకుండా ఉండేందుకు తోడ్పడుతుంది న్నారు. ఈకార్యక్రమంలో ఏపిఎం గోపాల్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

తెదేపా నాయకులు కుర్లి గెంగిరెడ్డికి గాయాలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్20 (విజయస్వప్నం.నెట్)

మండలంలోని మామ్మిళ్ళకుంట్లపల్లి గ్రామానికి చెందిన మాజీ స్టోర్ డీలర్, తెదేపా నాయకులు గంగిరెడ్డి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయని తెదేపా శ్రేణులు తెలిపారు.బుధవారం తంగేడుకుంట పంచాయతీ గ్రామంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి చేతుల మీదుగా వేరుశనగ విత్తన కాయలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో సున్నంపల్లి గ్రామ సమీపంలో కుక్క ను తప్పించబోయి ద్విచక్ర వాహనం  అదుపుతప్పి ముళ్ళకంపలు పండడంతో గంగిరెడ్డి కాలుకు తీవ్ర గాయాలు కావడంతో కదిరి ఆసుపత్రికి తీసుకెళ్ళి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు శివారెడ్డి, తెదేపా శ్రేణులు తెలిపారు.పలువురు గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగిరెడ్డిని కలిసి యోగా క్షేమాలు అడిగి తెలుసుకుని, ధైర్యంగా వుండాలని తెలిపారన్నారు.

$$$__________@@@__________$$$

నేడు వారపుసంత బహిరంగ వేలం

అమడగూరు జనసేన వార్త జూన్ 20 (విజయస్వప్నం.నెట్)

నేడు 21వతేది శుక్రవారం మధ్యహ్నం 2గంటలకు అమడగూరు పంచాయతీ గ్రామ సచివాలయంలో  అమడగూరు గ్రామ వారపు సంత వేలము పాట నిర్వహించనున్నట్లు ఈఓఆర్డీ నశిమా, గ్రామకార్యదర్శి చంద్ర గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. బహిరంగ వారపుసంత వేలం పాటలో పాల్గొనవలసినవారు 5000 రూపాయులు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని ఆమె పేర్కొన్నారు.

$$$__________@@@__________$$$

మలకవారిపల్లిలో మహిళపై ఎలుగుబంటి దాడి


శ్రీసత్యసాయిజిల్లా, అమడగూరు (ఓడిచెరువు) జూన్21 (విజయస్వప్నం.నెట్)

మండలంలోని  మలకవారిపల్లికి చెందిన అంగజాల నారాయణ భార్య శుక్రవారం ఉదయం  5 గంటల సమయములో బహిర్భూమికి వెళ్ళగా ఎలుగుబంటి దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయని, గమనించిన స్థానికులు వెంటనే  కదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ఆమెకు మెరుగైన చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు.సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు ఎం.రామచంద్రానాయక్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఆర్.హరిప్రసాద్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్,తుమ్మల సౌత్ బీటు సిబ్బంది వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని, గాయపడిన బాధితురాలిని పరామర్శించి, వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారన్నారు. మహిళపై ఎలుగుబంటి దాడితో గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. వన్యప్రాణుల సంచారం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు: యోగ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు

శ్రీసత్యసాయిజిల్లా, అమడగూరు (ఓడిచెరువు) జూన్21 (విజయస్వప్నం.నెట్)

నేడు శుక్రవారం ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు 2014 డిసెంబర్‌లో ఆమోదం పొందిన తర్వాత 2015 జూన్ 21 న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారని, జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల అంశాలపై బిజేపీ శ్రేణులు వివరిస్తూ....జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజుగా గుర్తించి, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజుకు ఆయా ప్రత్యేకతలు కూడా ఉన్నాయని, ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐకాసకి  పీఎం మోదీ సూచించారని వారు పేర్కొన్నారు, అందులో భాగంగా మండల కేంద్రంలో 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా చౌడేశ్వరి కళ్యాణ మండపంలో బీజేపీ నాయుకులు,జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసులు, మండల అధ్యక్షులు  ఇందుకూరి సురేంద్రారెడ్డి, సీనియర్ నాయుకులు ఐ.రాము, గంగులప్ప, ఉత్తప్ప, బొట్టు స్వామి, మండలకిసాన్ అధ్యక్షులు వేమన్నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి, శ్రీనివాసులు, వెంకటనారాయణ, తిప్పన్న, విశ్వనాధ్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, మనోహర, నాగభూషన్, మధు, కళాశాల విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

సమస్యలపై మంత్రులకు ఉపాధ్యాయులు వినతి




శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూన్ 21 (విజయస్వప్నం.నెట్)

1998 డిఎస్సి సమస్యలపై శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంత్రులను కలిసి వినతిపత్రం అందజేశారు.98 ఉపాధ్యాయులందరిని రెగ్యులర్ చేసి ఆదుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బాబుతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడుని కలిసి 98  ఉపాధ్యాయుల సమస్యలను మంత్రులకు వివరించి పరిష్కరించాలని, రాష్ట్ర నాయకులు వివిధ శాఖల మంత్రులను కలిసి వినతిపత్రం అందించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగరాజ్ తెలిపారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డికి, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు గౌరవ పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి