గర్భవతుల హై రిస్క్ పరిస్థితులు నివారిద్దాం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్10(విజయస్వప్నం.నెట్)
ముందస్తుగా అవగాహన కలిగి ఉండి గర్భవతుల హై రిస్క్ పరిస్థితులను నివారించగలిగితే సాధారణ ప్రసవాలతో ఆరోగ్యవంతమైన పిల్లలను సంతానంగా పొందవచ్చని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి భాను ప్రకాష్ పేర్కొన్నారు.సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో నెలవారీ రివాజుగా నిర్వహించే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ భౌతిక వీక్షణ హై రిస్క్ లక్షణాలైన యుక్త,మేనరిక వివాహాలు,40 ఏళ్లపైన గర్భవతి వయస్సు,35 సంవత్సరాలు పైన ప్రసవం,145 సె.మీ. లోపు ఎత్తు,42 కేజీల లోపు బరువు,వంధత్వం తర్వాత గర్భధారణ,అలాగే వైద్య సంబంధమైన హైరిస్క్ అంశాలు అనగా దీర్ఘకాలిక రుగ్మతలు,గర్భస్రావగత చరిత్ర,కవలలు,పిండం అసాధారణ స్థితి,తీవ్ర రక్తహీనత,గుండె జబ్బులు,మధుమేహం,హెచ్ఐవి,థైరాయిడ్,కామెర్లు తదితర విషయాల పట్ల అవగాహన కల్గివుండి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాద సంకేత ప్రసవాలను నివారించవచ్చని సూచించారు.ఆరోగ్య విద్యలో భాగంగా ఐరన్,ప్రోటీన్లు,విటమిన్లు,ఖనిజాలతో పోషకాహార ప్రాముఖ్యత,పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వాతావరణ అనుకూలంగా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణ,క్రమం తప్పకుండా గర్భవతి పరీక్షలు,ప్రసవ ప్రణాళిక,ఆసుపత్రి ప్రసవం ప్రాముఖ్యత,ప్రభుత్వ ఆరోగ్య ప్రోత్సాహక పథకాల వినియోగం తదితర విషయాలను ఆయన వివరించారు.ఈ కార్యక్రమానికి హాజరైన 70 మంది గర్భవతులలో 34 మందిని హై రిస్క్ వారిగా గుర్తించి అవసర,అత్యవసర చికిత్స, మిగిలిన వారికి చిరు వ్యాధుల చికిత్స అందించి 21మందికి ఉచిత స్కానింగ్,మందుల పంపిణీ చేశారని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన గర్భవతులు,వారి సహాయకులకు కదిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు,కార్యదర్శి పృథ్వి,నితిన్ లు భోజన సౌకర్యం కల్పించారు.వీరి సేవా గుణాన్ని సిబ్బంది,గర్భవతులు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,ఆశ,ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$__________@@@_________$$$
డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గా షేక్ షర్ఫోద్దీన్ ఎంపిక పట్ల హర్షం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 10(విజయస్వప్నం.నెట్)
డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా షేక్ షర్ఫోద్దీన్ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ కట్టుబడి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.విజయవాడలోని ఎన్జీవో హోంలో 17 వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించిన సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు.రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన షేక్ షర్ఫోద్దీన్ ఎన్నుకున్నారని,ఆయన ఎంపిక పట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్,మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎంసీ నర్సింహులు,సోమశేఖర్ నాయక్,వెంకట చలమయ్య,నాగరాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తానని ఈసందర్భంగా ఆయన తెలిపారు.
$$$__________@@@_________$$$
వారపుసంత బహిరంగ వేలం వాయిదా
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్10(విజయస్వపైనం.నెట్)
మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామంలో కూరగాయల వారపుసంత బహిరంగ వేలం పాట వాయిదా వేసినట్లు ఈఓఆర్డీ రాజశేఖర్ తెలిపారు.వారపుసంత బహిరంగ వేలం కార్యక్రమం సర్పంచ్ అల్లాపల్లి శ్రావణి అధ్యక్షతన నిర్వహించగా గ్రామ కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి హాజరైయ్యారు.ధథవత్తులు చెల్లించిన వ్యక్తులు,ప్రజల సమక్షంలో వారపుసంత బహిరంగ వేలం ప్రారంభించగా ఎల్లేశ్వర్ అనే ఒక్కరు మాత్రమే 330000 అధిక మొత్తంలో వేలం పాడగా,ఇతరులు ఎవ్వరు కూడా అంతకు మించి వేలం పాడకపోవడంతో అధికారులు వారపుసంత బహిరంగ వేలం పాట వాయిదా వేసినట్లు తెలిపారు. నేడు ఓడిచెరువులో.... నేడు(11వతేది) మంగళవారం ఓడిచెరువు పంచాయతీ వేలం పాట మండల కేంద్ర సచివాలయంలో నిర్వహించనున్నట్లు ఈఓఆర్డీ రాజశేఖర్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు బహిరంగ వేలం కార్యక్రమంలో గంట ముందు పాల్గొని ధరవత్తు చెల్లించి నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
$$$__________@@@_________$$$
గ్రామ సమస్యలపైదృష్టి సారించాలి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్10(విజయస్వప్నం.నెట్)
మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సోమవారం సర్వ సభ్య సమావేశం ఎంపీపీ పర్వీన్ భాను,ఎంపీడీవో వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించగా సర్పంచులు,ఎంపీటీసీలు, వివిధ శాఖాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు,విద్యుత్,విద్యా,వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై సమీక్షించారు.సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈకార్యక్రమంలో అన్ని శాఖాధికారులు,సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@_________$$$
ఆశ కార్యకర్తల సేవలు మెరుగుపరుచుకోవాలి:డిఐఓ
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్11(విజయస్వప్నం.నెట్)
ఆశా డే సందర్బంగా మంగళవారం డిస్ట్రిక్ ఇమ్మ్యూనైజేషన్ ఆఫీసర్ నాగేంద్ర నాయక్ మండల ప్రాధమిక ఆరోగ్య వైద్యశాలలో సందర్శించినారు.ఆశా వర్కర్లల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....గర్భిణీలకు,ఆసుపత్రి ప్రసవాలు బాలింతల సేవలు,శిశువుల వ్యాధినిరోధక టీకాలను సకాలంలో వేయించాలని,దీనితో పాటుగా ప్రభుత్వం అందించే ఆరోగ్యం పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ....ఆశ కార్యకర్తల సేవలను మెరుగుపరుచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి భానుప్రకాష్,సబ్ యూనిట్ ఆఫీసర్ దేవలా నాయక్,సూపర్ వైజర్ శశిధర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@_________$$$
ఓడిచెరువు సంత వేలం వాయిదా
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్11(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు పంచాయతీ వారపుసంత బహిరంగ వేలం పాట వాయిదా వేసినట్లు ఈఓఆర్డీ రాజశేఖర్ తెలిపారు.వారపుసంత వేలం పాట మంగళవారం మండల కేంద్రంలో స్థానిక సచివాలయంలో ఈఓఆర్డీ రాజశేఖర్,సర్పంచ్ ముద్దలపల్లి గోవిందు సంయుక్త అధ్యక్షతన గ్రామకార్యదర్శి సుధాకర్,సచివాలయ రామలింగారెడ్డి వేలం పాట నిర్వహించారు.అయితే గతేడాది వారపుసంత వేలంలో 3,95,000 నికరంగా ప్రభుత్వానికి ఆదాయంగా వుండడంతో ఈయేడు 31 మార్చి నెలలో సంతగేటు వేలం ముగిసినందున ఎన్నికల కమిషన్ కోడ్ అమలులో ఉన్నందున అధికారులు 10 వారాల పాటు సంతగేటు వసూళ్లు చేయగా,2025 మార్చి 31 సంతగేటు సమయం ముగుస్తుందని అధికారులు నిభందనలు ప్రకటించారు.దింతో వేలంపాట పాడేందుకు వచ్చిన వారు ఆసక్తి కనబరచలేదు.కేవలం ఒక్కరు మాత్రమే 2లక్షల 10వేలకు వేలం పాట పాడారు. ఈవిషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఉత్తర్వుల బహిరంగ వేలం పాట నిర్వహిస్తారని, అంతవరకు ప్రస్తుతం వేలంపాట వాయిదా వేస్తున్నట్లు పేర్కొంటూ.... ఉత్తర్వులు అందిన తదుపరి వేలంపాట నిర్వహించే కార్యక్రమం వివరాలు ప్రకటిస్తామని ఈఓఆర్డీ రాజశేఖర్ తెలిపారు.
$$$__________@@@_________$$$
చంద్రబాబు ప్రమాణం స్వీకారానికి తరలిన తెలుగు తమ్ముళ్లు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్11(విజయస్వప్నం.నెట్)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి