google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : పుట్టపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవాలు - ఎంపీడీవో కార్యాలయంలో వర్షపు నీటికి అడ్డుకట్ట - అక్షరాభ్యాసం కార్యక్రమానికి ఆహ్వానం - ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించండి : ప్రధానోపాధ్యాయులు

14, జూన్ 2024, శుక్రవారం

పుట్టపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవాలు - ఎంపీడీవో కార్యాలయంలో వర్షపు నీటికి అడ్డుకట్ట - అక్షరాభ్యాసం కార్యక్రమానికి ఆహ్వానం - ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించండి : ప్రధానోపాధ్యాయులు

పుట్టపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవాలు


శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూన్12(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి నియోజకవర్గంలో అన్ని మండలాలలో చంద్రబాబు నాయుడు నాల్గవసారి ముఖ్యమంత్రి ప్రమాణం సందర్భంగా బుధవారం తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

ఓడిచెరువు మండల కేంద్రంలో మాజీ జెడ్పీ సభ్యులు పిట్టా ఓబుళరెడ్డి,మండల కన్వీనర్ జయచంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి వందలాది తెదేపా,జనసేన, బిజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమక్షంలో బస్టాండ్ వద్ద బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.అనంతరం భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాలతో పాలాభిషేకం చేసిన తెలుగుదేశం, జన సేన, బీజీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పుట్టపర్తి  నియోజకవర్గానికి చెందిన టీడీపీ ,జన సేన,బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నాల్గవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంతో పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఆనందోత్సాహాలతో హోరెత్తించారు.కేక్ కట్ చేసి, రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుని జై తెదేపా కూటమి, జై చంద్రబాబు  నినాదాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటాయి.

$$$__________@@@__________$$$

ఎంపీడీవో కార్యాలయంలో వర్షపు నీటికి అడ్డుకట్ట

 శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 13(వఇజయస్వప్నం.నెట్) 

ఓడిచెరువు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలోకి వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో బురద మడుగు తలపించే విధంగా వున్న విషయం గమనించిన  మాజీ సింగల్ విండో అధ్యక్షులు టిడిపి నాయకులు మహేశ్వర్  రెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సూచనల మేరకు వర్షపు నీటికి అడ్డుకట్ట వేశారు.వర్షం పడిందంటే వీధుల్లోని వర్షపు నీరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలోకి వచ్చి చేరుతోంది.దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.గమనించిన మహేశ్వర్ రెడ్డి వర్షపు నీరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలోకి రాకుండా మట్టిని తోలి అడ్డుకట్ట వేశారు.దీంతో స్థానిక ప్రజలు పలు శాఖల అధికారులు మహేశ్వర్ రెడ్డిని అభినందించారు ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో వర్షపు నీరు ప్రవహిస్తున్నందున తక్షణమే కార్యాలయం ముందు మట్టి తోలడం జరిగిందన్నారు.

$$$__________@@@__________$$$

అక్షరాభ్యాసం కార్యక్రమానికి ఆహ్వానం 

ఓబుళదేవరచెరువు జూన్13(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపై వెలసిన శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి దేవస్థానంలో ఈనెల(జూన్)16న నిర్వహించే అక్షరాభ్యాసం శుభకార్యక్రమానికి ఐసిడిఎస్ సిడీపిఓ వరలక్ష్మిని ఆహ్వానించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు. గురువారం ఎంబి క్రాస్ గ్రామ సమీపంలో శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సీడీపిఓ వరలక్ష్మిని గౌరవ పూర్వకంగా కలిసి కరపత్రం అందించి అక్షరాభ్యాసం శుభకార్యంలో పాల్గొనాలని ఆహ్వానించినట్లు ఆయన పేర్కొన్నారు.6 ఏళ్ల లోపు చిన్నారులకు జూన్ 16న ఆదివారం 8 గంటల నుండి 10:30 వరకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించి, ఉచితంగా పలక, బలపాలు అందించి తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అదే రోజు తెల్లవారుజామున 5 గంటల నుండి 7:30 వరకు హెడ్ కానిస్టేబుల్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూజలు నిర్వహిస్తారన్నారు.ఈకార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు,గ్రామ ప్రజలు పాల్గొని శుభప్రదం చేయాలని ఆయన కోరారు.ఆలయ సేవకులు బ్యాంకు శీనా తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ప్రభుత్వ బడుల్లో  పిల్లల్ని చేర్పించండి : ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ రియాజ్

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 13 (విజయస్వప్నం.నెట్)

మండలం గౌనిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల మహమ్మద్  రియాజ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ పాఠశాలల  గ్రామాలను గురువారం ఉపాధ్యాయ బృందంతో సందర్శించి   తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలని ప్రభుత్వ బడుల్లో చేర్పించండని,నైపుణ్యం గల ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య బోధనలు అందించి ఉత్తమ ఫలితాలు సాధింస్తారని ఆయన భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి,నరసింహారెడ్డి,పీఎం భాష, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు


అమడగూరు(ఓడిచెరువు) జూన్ 13(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయిజిల్లా అమడుగూరు మండలంలోని గాజులపల్లి గ్రామం కూడలిలో శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో గురువారం ఓడిచెరువు మండలం,తిప్పేపల్లి గ్రామానికి చెందిన పి.సోమశేఖర్,గణన ప్రసన్న దంపతుల కుమారుడు పి.దీశ్విక్ గగన్ జన్మదినం సందర్భంగా ఆశ్రమంలో నూతన వస్త్రాలు వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.దేశ్వీక్ గగన్ కి పుట్టినరోజు ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి శుభాకాంక్షలు తెలిపి ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పి.దేశ్విక్ గగన్ జన్మదిన సందర్భంగా ఆశ్రమం తరఫున వృద్ధుల తరఫున ఆశీస్సులు అందించారని, అలాగే కుటుంబ సభ్యులు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరినట్లు దేవుని తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి