google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : అంగన్వాడి కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ సంబరాలు - జాతీయ రహదారుల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి : జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ - కార్పొరేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలి..!! - పండ్ల తోటల పెంపకం కోసం దరఖాస్తులు చేసుకోవాలి - వరంగల్ లో మాదిగల ఆత్మగౌరవ కవాతు జయప్రదం చేయండి

26, జూన్ 2024, బుధవారం

అంగన్వాడి కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ సంబరాలు - జాతీయ రహదారుల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి : జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ - కార్పొరేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలి..!! - పండ్ల తోటల పెంపకం కోసం దరఖాస్తులు చేసుకోవాలి - వరంగల్ లో మాదిగల ఆత్మగౌరవ కవాతు జయప్రదం చేయండి

అంగన్వాడి కేంద్రాల్లో  గ్రాడ్యుయేషన్ సంబరాలు


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు, జూన్25(విజయస్వప్నం.నెట్)

అంగన్వాడి కేంద్రాలు చిన్నారులకు దేవాలయాల వంటివని సిడిపిఓ వరలక్ష్మి పేర్కొన్నారు.మంగళవారం మండలంలోని అల్లాపల్లి పంచాయతీ గౌరపురం సెక్టార్ పరిధిలో గ్రామాల అంగన్వాడి కేంద్రాల్లో సిడిపిఓ వరలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించారు.అందులో భాగంగా అంగన్వాడి కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు,ఆట పాటలతో అల్లరించేందుకు వారికి తగిన ప్రోత్సాహ బహుమతులతో పాటు అంగన్వాడి కేంద్రాలకు వచ్చే విధంగా చిన్నారులు ప్రోత్సహించేందుకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు.అలాగే అంగన్వాడి కేంద్రాల్లో పూర్వపు విద్యను చిన్నారులకు అందించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించడానికి అంగన్వాడి కేంద్రాలు దోహదపడతాయన్నారు.ప్రతి తల్లిదండ్రులు చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపాలని ఆమె ఈసందర్భంగా కోరారు.ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.అనంతరం చిన్నారులు,తల్లిదండ్రులతో కలిసి అంగన్వాడీ పిలుస్తోంది,బడిబాట ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ విజయకుమారి,అంగన్వాడి భోధకులు షీమిమ్,వెంకట నర్సమ్మ,పార్వతమ్మ ,సనందమ్మ,సుకన్య,ప్రమీలమ్మ,వసంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

వరంగల్ లో మాదిగల ఆత్మగౌరవ కవాతు జయప్రదం చేయండి:మహాజన జర్నలిస్ట్ ఫెడ రేషన్ జిల్లా అధ్యక్షులు ఎల్లం రాజు

శ్రీసత్యసాయిజిల్లా, అమడగూరు(ఓడిచెరువు) జూన్ 25(విజయస్వప్నం.నెట్)

ఎమ్మార్పీఎస్ 30 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో లక్షలాది మంది మాదిగలతో  జూలై 7 న వరంగల్ లో మాదిగల ఆత్మగౌరవ కవాతు నిర్వహిస్తున్నారని,ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగల జీవితాల్లో మార్పు వస్తుందని,మాదిగలకు విద్య,ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సత్య సాయి జిల్లా మహాజన జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎల్లంరాజు మంగళవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.2024  ఫిబ్రవరి 6,7,8 తేదీల్లో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపైన విచారణ జరిగిందని,త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై అంతిమ తీర్పు రాబోతున్నదని,తద్వారా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కావడానికి వీలవుతుందని ఆయన తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎస్సీ వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారని,తాను అధికారంలోకి వస్తే జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేసి,ఎస్సీ లోని అన్ని కులాలకు సామాజిక న్యాయం చేసే బాధ్యత తీసుకుంటారని ఎన్నికల ప్రచార సభల్లో కూడా చంద్ర బాబు నాయుడు చెప్పారని ఆయన గుర్తుచేశారు.బిజెపి సైద్ధాంతికంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉందని,ఈ తరుణంలో మాదిగల ఆకాంక్షలను మరింత బలంగా వినిపించేందుకు ఛలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రచారం నిమిత్తం అమడగురు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాజన జర్నలిస్టు ఫెడరేషన్ సత్యసాయి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో హలో మాదిగ చలో వరంగల్ కరపత్రాలను విడుదల చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహాజన జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు నరసింహులు,రవి,రామాంజులు,సురేష్,సోమశేఖర్,శీన,రాము తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

జాతీయ రహదారుల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి

-జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్



సత్యసాయిజిల్లా పుట్టపర్తి(ఓడిచెరువు) జూన్25(విజయస్వప్నం.నెట్)

జాతీయ రహదారుల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లాలోని పుట్టపర్తి పరిధిలోని బుక్కపట్నం తదితర మండలాల్లో 2వ ప్యాకేజీ కింద చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణం పనులను పరిశీలించారు.ఆయన వెంట ఆర్డీఓ భాగ్యరేఖ,సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రోడ్లకు భూములు కోల్పోయిన రైతులకు సంబంధించిన ఆధార్,బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలని, రైతుల భూముల సర్వే నెంబర్లు,విస్తీర్ణం నష్ట పరిహారంతో కూడిన జాబితాలు సిధ్ధం చేయాలని,ప్రతి రైతుకు పరిహారం అందించాలని, త్వరితగతిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.అనంతరం ఓడిచెరువు మండలంలోని గాజుకుంటపల్లి సమీపంలో జాతీయ రహదారుల నిర్మాణం పనులను పరిశీలించారు.            సివిల్ సప్లై గోడౌన్ పరిశీలించిన జేసీ     ఓడిచెరువు మండలంలోని బియ్యం గోడౌన్, పెట్రోల్ బంకులను మంగళవారం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.... బియ్యం గోడౌన్,పెట్రోల్ బంకులను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులను, సిబ్బందికి ఆదేశించారు.మండలంలోని కస్తూరిబా బాలికల పాఠశాల సమీపంలో బియ్యం గోడౌన్, పెట్రోల్ బంకులను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి, గోడౌన్ పైభాగంలో స్వల్పంగా దెబ్బ తిన్న రేకుల గోడలను మరమ్మతులు చేయించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బియ్యం నిల్వ రికార్డులు పరిశీలించారు.పెట్రోల్ బంకుల్లో సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవాలు అందించాలని ఆయన సూచించారు.అంతక ముందు ఇనగలూరు పంచాయతీ గాజుకుంటపల్లి వద్ద టోల్ ప్లాజా ఏర్పాటు చేసే భూమి స్థలాన్ని పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ,తహశీల్దార్ ఖాజాభీ,సిఎస్డీటీ రమాదేవి,ఆర్ఐ నాగేంద్ర, విఆర్ఓ రమణస్వామి తదితర సిబ్బంది పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

కార్పొరేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలి..!!

కార్పొరేట్ భాష్యం,కేశవ రెడ్డి పాఠశాలల గుర్తింపు రద్దు చెయ్యాలి...:

పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ డిమాండ్

శ్రీసత్యసాయిజిల్లా (కడప) జూన్25(విజయస్వప్నం.నెట్)

కార్పొరేట్ భాష్యం, కేశవరెడ్డి పాఠశాలలలోని అధిక ఫీజులు, అనుమతులు పైన విచారణ చేసి, గుర్తింపును రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్ధి, యువజన సంఘం(పిఆర్ఎస్ వైఎఫ్) రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం కడప నగరంలోని పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ....జిల్లాలోని కార్పొరేట్ భాష్యం,కేశవరెడ్డి పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తమ పాఠశాలల పేర్లతో టెక్స్ట్ బుక్స్,నోట్ బుక్స్,మెటీరియల్స్ ను ముద్రించి మార్కెట్ ధరలకంటే మూడురెట్లు అధికంగా ఎమ్మార్పీ రేట్లు నిర్ణయించి,టై,బెల్ట్,షూ,యూనిఫామ్ లు కూడా అధిక ధరలతో విద్యాహక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలను వ్యాపార కేంద్రంగా మార్చి విద్యార్ధి తల్లిదండ్రులను దోపిడీకి గురిచేస్తున్నప్పటికి విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ వారి దోపిడీకి సహకరిస్తున్నారని మండిపడ్డారు.అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకంటే అధికంగా వసూలు చేస్తూ విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ,కార్పొరేట్ స్కూల్స్ సంబంధించి ప్రైమరీ క్లాసులకు మున్సిపాలిటీలో 11 వేల రూపాయలు,కార్పొరేషన్ లో 12 వేల రూపాయలు, సెకండరీ క్లాసులకు మున్సిపాలిటీలో 15 వేల రూపాయలు, కార్పొరేషన్ లో 18 వేల రూపాయలు ఈ విధమైన ఫీజులను విద్యార్థి,తల్లిదండ్రుల నుండి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కానీ ప్రైమరీ క్లాసులకే 25 వేల నుంచి 30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని,సెకండరీ క్లాసులకు 40 నుంచి 50 వేలు రూపాయలు పైగా వసూలు చేస్తూ విద్యార్ధి తల్లిదండ్రుల పైన భారాన్ని మోపుతున్నారని, విద్యాహక్కు చట్టం ప్రకారం ఫీజులు వివరాలు నోటీసు బోర్డు లో ఉంచాలని నిభందనలు చెపుతున్నప్పటి భాష్యం,కేశవరెడ్డి పాఠశాలలో నోటీసు బోర్డులో ఫీజుల వివరాలు ఉంచటం లేదన్నారు.విద్యా హక్కు చట్టం సెక్షన్ 42 ప్రకారం కార్పొరేట్ పాఠశాలలైన భాష్యం,కేశవరెడ్డి  స్కూల్స్ లో 25% శాతం ఉచిత సీట్లు ఇవ్వాల్సి ఉందని,ఎస్సీలకు 10 శాతం,ఎస్టీలకు 4 శాతం,బీసీ లకు 6శాతం,అనాధ,వికలాంగులకు 5 శాతం ఇవ్వాలని నిభందనలు ఉన్నాయని,కానీ ఇవ్వకుండా విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని వారు విచారం వ్యక్తం చేశారు. కార్పొరేట్ భాష్యం,కేశవరెడ్డి పాఠశాలల్లో విద్యార్థులకు ప్లే గ్రౌండ్ సౌకర్యం కూడా కల్పించడం లేదని,క్వాలిఫైడ్ టీచర్స్ తో తరగతులు నిర్వహించడం లేదని వారు తెలిపారు.కార్పొరేట్ భాష్యం, కేశవరెడ్డి పాఠశాలల గుర్తింపు పత్రాలపైన,పై తెలిపిన సమస్యలపైన విచారణ జరిపించి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిఆర్ఎస్ వైఎఫ్ జిల్లా కన్వీనర్ నాగేంద్రబాబు,జిల్లా నాయకులు వెంకటేష్,సుధీర్,విష్ణు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

పండ్ల తోటల పెంపకం కోసం దరఖాస్తులు చేసుకోవాలి

ఎంపీడీవో వరలక్ష్మి
ఎంపీడీవో వరలక్ష్మి

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు జూన్25(విజయస్వప్నం.నెట్)

మండలములోని పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంటూ....ఉపాధి హామీ పథకం ద్వారా 2024 25 ఆర్థిక సంవత్సరం ఆసక్తి కలిగిన రైతులు పండ్ల తోటల పెంపకం నందు మామిడి,చీని,సపోటా, జామ,అల్లనేరేడు తదితర మొక్కల పెంపకం చేపట్టే రైతులకు ఉచితముగా ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కులు అందిస్తామని,కావున ఐదు ఎకరాల లోపు కలిగి ఉండి చిన్న సన్నకారు రైతులు ఎంపీడీవో కార్యాలయం నందు సంప్రదించాలని మంగళవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి కే.వరలక్ష్మి ఓప్రకటనలో తెలిపారు.

$$$__________@@@__________$$$

డ్రగ్స్ కు నో చెబుదాం... బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం

మాదక ద్రవ్యాల వల్ల భవిష్యత్తు అందాకారం

పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలి

దేశ భవిష్యత్తును కుంగదీసే  మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలిద్దాం

సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవ్ రెడ్డి  ఐపీఎస్





శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూన్26(విజయస్వప్నం.నెట్)

యువత మత్తుకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కు నో చెప్పి తమ  భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక  దినోత్సవం సందర్భంగా బుధవారం హిందూపురం పట్టణంలో చిన్న మార్కెట్ నుండి  భారీ ర్యాలీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ  ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ విచ్చేసి ఈ సందర్భంగా పట్టణంలోని చిన్న మార్కెట్ నుండి పట్టణంలోని కళాశాల,పాఠశాల విద్యార్థులతో కలిసి పోలీసులు,అధికారులు ఏర్పాటు చేసిన ర్యాలీని జండా ఊపి ఎస్పీ గారు  ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన  బహిరంగ సభలో యువతి,యువకులను ఉద్దేశించి  ఎస్పీప్రసంగించారు.

  ప్రస్తుతం సమాజంలో యువతి,యువకులు మత్తుకు అలవాటు పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని,అంతేగాక  చిన్నచిన్న పరిశ్రమంలో పనిచేసే కార్మికులు,కూలీలు వీటికి అలవాటు పడి కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు  దాపరిస్తున్నాయన్నారు.పిల్లలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని,అలాంటి మీరు మత్తు పదార్థాలకు బానిసలై భావితరాలను కోల్పోతున్నారన్నారు.తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా తమ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉంటారని కలలుగన్న వారి కళలను బుగ్గిపాలు చేస్తున్నారని,డ్రగ్స్ వాడడం వల్ల, మైండ్ తో పాటు,ఆలోచించే శక్తిని  కోల్పోతున్నడమే,సామాజిక ,మానసిక,శారీరక,అనారోగ్యాలు,ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతు సంఘం నుండి దూరమవుతున్నారన్నారు.సంఘంలో పలువురు డ్రగ్స్ కు అలవాటు పడి,డబ్బుల కోసం నేరాలు హత్యలకు సైతం పాల్పడుతు,మంచి భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు.దేశంలో ఎక్కడైనా రాష్ట్రాల అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా యువత ఆశయాలు ప్రధానమని,అందుకోసం ఎవరు డ్రగ్స్ జోలికి వెళ్లకూడదన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడిన విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టమని,కేవలం కౌన్సిలింగ్ మాత్రమే ఇస్తామని,డ్రగ్స్ విక్రయించే వారిపైనే ఉక్కు పాదం మోపి కఠిన చర్యలు  తీసుకోవడమే కాక  కేసులు నమోదు చేస్తామని ఎస్పీ ఈసందర్భంగా హెచ్చరించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,హోం మంత్రి  డ్రగ్స్ రహిత రాష్ట్రంగా  చేయాలన్న సంకల్పంతో ఉన్నారని మనమందరం రూపుమాపే విధంగా ముందుకెళ్లాలన్నారు.ప్రతి విద్యార్థి,విద్యార్థులు తమ పాఠశాల సమీప ప్రాంతాలలో కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ ఎవరైనా గంజాయి  విక్రయిస్తున్నారన్న సమాచారం తెలిస్తే  వెంటనే పోలీసులకు సమాచారం  అందిస్తే వారి వివరాలను గోప్యంగా కూడా ఉంచుతామన్నారు.జిల్లాలో పోలీసు యంత్రాంగం   గంజాయి స్థావరాలపై దాడులు నిర్వహిస్తు,రూపుమాపేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని,గంజాయి ఎక్కడెక్కడ ఉందో వాటి మూలాలకు వెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.ప్రతి కేసులో విచారణ జరిపి ఎవరు వీటికి కారకులయ్యారు,అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పమన్నారు.సమాజాన్ని కాపాడాల్సిన యువతి,యువకులు డ్రగ్స్ అలవాటును విడి బంగారు  భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలన్నా ఎస్పీ సూచించారు.ప్రాణాంతకమైన మత్తు పదార్థాలకు  మాదక ద్రవ్యాలకు  నో  చెప్పి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొని  తల్లిదండ్రుల కన్న కలలను  నిజం చేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.ఈసందర్భంగా విద్యార్థుల చేత ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు.ఈకార్యక్రమంలో , ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఏఎస్పి నాగభూషణం,సేబ్ ఏఈ ఎస్.సుబ్రహ్మణ్యం,పెనుగొండ డిఎస్పి బాజీ జాన్ సైదా,సిఐలు శ్రీనివాసులు,రియాజ్ అహ్మద్,శ్రీనివాసులు,ఎస్ఐలు,పట్టణవాసులు,విద్యార్థులు,పోలీస్  సిబ్బంది పాల్గొన్నారు.       ఓడిచెరువులో....      శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మండల కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శ్రీ విజ్ఞాన్ పాఠశాల ఆవరణలో ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి,డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించారు.డ్రగ్స్ క్రయ విక్రయాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వంశీకృష్ణ హెచ్చరించారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, పోలీసులు పాల్గొన్నారు.               అమడగూరులో.... అమడగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు,పోలీసులతో కలిసి ఎస్ఐ మగ్బుల్ బాషా ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం పోలీసుస్టేషన్ నుండి పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ప్రధాన కూడలిలో ప్రిన్సిపాల్ ప్రభాకర్,అధ్యాపక బృందం సమక్షంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

$$$__________@@@__________$$$

బాధ్యత తో పని చేయండి నిజాయితీగా  ప్రజలకు సేవ చేయండి

పుట్టపర్తి నియోజకవర్గ అధికారులతో మాజీ మంత్రి పల్లె



శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి జూన్ 26(విజయస్వప్నం.నెట్)

ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రజల కోసం కష్టపడి పని చేయాలని మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అధికారులకు సూచించారు.పుట్టపర్తి లోని  ఎమ్మెల్యే నివాసంలో బుధవారం నియోజకవర్గ అధికారులతో వివిధ శాఖల వారీగా సంక్షేమం,అభివృద్ధి పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లులాంటివన్నారు.ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ప్రజల కోసం బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు నిజాయితీగా పనిచేసినప్పుడే తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.గత ప్రభుత్వంలో అభివృద్ధి పడక వేసిందని గుర్తు చేశారు.ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సాదించారని ఆయన ఆశయాల అడుగుజాడల్లో మనమంతా బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చూపాలని,అనవసరంగా కార్యాలయం చుట్టూ తిప్పుకోద్దని అధికారులకు సూచించారు.ప్రభుత్వం అందజేసే సంక్షేమం ఫలాలు అర్హులైన పేదలకు అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశ్యమన్నారు.  ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా అడుగులు పడాలని సిఎం ఆకాంక్ష అన్నారు.క్షేత్ర స్థాయిలో ఎలాంటి పొరబాట్లు లేకుండా సక్రమంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ద్వామా పిడి ప్రసాద్,ఎపిడి లు శ్రీనివాస్ రెడ్డి,రఘునాథ్,వెలుగు డిపిఎం రామ్మోహన్ ఏరియా కోఆర్డినేటర్లు సీసీలు,ఏపీవోలు సూర్యనారాయణ,మధు,మున్సిపల్ ఉద్యోగులు,సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

29న ఉచిత కంటి వైద్య శిబిరం

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్26(విజయస్వప్నం.నెట్)

ఈనెల 29వతేది శనివారం ఓడిచెరువు మండల కేంద్రంలో మా మెడికల్ స్టోర్స్ వారి ఆధ్వర్యంలో పుట్టపర్తి అల్ట్రా విజన్ ఐ కేర్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి,మందులు అందించి,అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తారని పేర్కొంటూ....29వతేది ఓడిచెరువు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజలు చేరుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుధవారం మా మెడికల్ స్టోర్స్ యాజమాన్యం తెలిపారు.

$$$__________@@@__________$$$

నవోదయ విద్యాలయ ప్రవేశానికి విద్యార్థినీ గగన ఎంపిక

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,జూన్27(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రానికి చెందిన ఏవీఎస్ ట్రెడర్స్ ఆదినారాయణరెడ్డి కుమార్తె ఇందుకూరి గగన నవోదయ విద్యాలయంలో 9వతరగతి ప్రవేశానికి ఎంపికైనట్లు బంధువులు తెలిపారు.జీవనజ్యోతి పాఠశాలలో 8వతరగతి చదువుకుంటూ.... 2024-25 నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ హాజరై ప్రకటించిన ఫలితాల్లో ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.ఓసి కేటగిరిలో డివిజన్ స్థాయిలో విద్యార్ధిని ఇందుకూరి గగన ఒకరు మాత్రమే నవోదయ విద్యాలయంలో ఎంపికైనట్లు తెలిపారు.శ్రీసత్యసాయిజిల్లా లేపాక్షి నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి ఎంపికైన సందర్భంగా తల్లిదండ్రులు,వడ్డివారిపల్లి గ్రామస్తులు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ఏలాంటి కోచింగ్ తీసుకోకుండా స్వతహాగా ఎంట్రన్స్ టెస్ట్ లో ర్యాంకు సాధించి నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి ఎంపిక కావడంతో పలువురు విద్యార్ధిని ఇందుకూరి గగనను అభినందించారు.

$$$__________@@@__________$$$

శ్రీ మాతృ శ్రీ వృద్దాశ్రమం కు భూమిరెడ్డి విరాళం

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,జూన్27(విజయస్వప్న.నెట్)

అమడగూరు మండలంలోని గాజులపల్లి సమీపంలో శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో నిర్వాహకురాలు అరుణజ్యోతి వృద్ధులకు అందిస్తున్న సేవలను గుర్తించిన ఏమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తనయుడు సాయి శ్రీనివాస్ రెడ్డి వృద్ధుల సౌకర్యార్థం తన వంతుగా 15వేల రూపాయలను బుధవారం మండల కేంద్రంలో ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతికి అందజేశారు. భవిష్యత్తులో ఆశ్రమ అభివృద్ధికి తన వంతుగా మరిన్ని సేవలను అందిస్తామని దాత తెలిపారు.తమ సేవలను గుర్తించి ఆశ్రమానికి ఆర్థిక సహకారం అందించిన ఏమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కుమారుడు సాయి శ్రీనివాస్ రెడ్డికి ఈసందర్భంగా నిర్వాహకురాలు అరుణజ్యోతి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామాంజులునాయుడు,తెలుగు యువత నాయకులు శ్రీనివాసులు,మీసేవ సుధాకర్,డ్రిప్ నాగరాజు, బోనాల రామాంజి,రమేష్,బాలకృష్ణ,తెలుగు మహిళా కార్యకర్త సరళ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$


శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూన్ 27(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి తెదేపా కార్యాలయంలో గురువారం  రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు.పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొని రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళులు అర్పించారు.రామోజీరావు మృతి మీడియా రంగానికి తీరని లోటని వారు పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మండలాల తెదేపా  నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

కళాకారుల సంఘం సభ్యులపై కేసు కొట్టివేత

శ్రీసత్యసాయిజిల్లా జూన్ 27(విజయస్వప్నం.నెట్)

జానపద వృత్తి కళాకారుల సంఘం భజన కళాకారులపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అక్రమంగా పెట్టిన కేసు తిరుపతి న్యాయస్థానం కొట్టివేసిందని జానపద వృత్తి కళాకారుల సంఘం అనంతపురం,శ్రీసత్యసాయిజిల్లా (ఉమ్మడి జిల్లా)అధ్యక్షుడు ఎం.నారాయణ గురువారం విజయస్వప్నం.నెట్ ప్రతినిధికి తెలిపారు.తితిదే అధికారులకు భజన కళాకారులకు ఇచ్చిన ఆర్డర్లను అమలుపరచాలని దానివల్ల ధర్మ ప్రచారం మరింత పెరుగుతుందని అధికారులను అడిగితే జీర్ణించుకోలేని తితిదే అధికారులు 5 సంవత్సరాల క్రితం అక్రమ కేసు భజన కళాకారులపై పెట్టి ఐదు సంవత్సరాల ఆరు నెలలు కోర్టు చుట్టూ తిప్పి శిక్ష వేయించాలని చూశారని, అయితే భజన కళాకారులు  చేసే ధర్మమైన ఉద్యమం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రచారం కోసమే అని గ్రహించిన స్వామి వారు ధర్మం గెలవాలని ధర్మో రక్షతి రక్షితః అనే మాటను నిలబెట్టే విధంగా తిరుపతి ధర్మాసనం రుజువు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు.అక్రమంగా పెట్టిన కేసులు కొట్టివేసి 5 లక్షల మంది భజన కళాకారులకు ప్రతినిధులుగా ఉన్నటువంటి నాయకులకు న్యాయమూర్తి న్యాయం చేశారని,ఇది ధర్మ ప్రచారం నిర్వహిస్తున్న భజన కళాకారుల గెలుపగా అభిప్రాయపడ్డారు.ఈ కేసులో రాష్ట్ర అధ్యక్షులు పులిమామిడి యాదగిరి(తిరుపతి)ఎం. నారాయణ అనంతపురం, శ్రీసత్యసాయిజిల్లా)వి.ముని చంద్ర (చిత్తూరు)జే.శ్రీనివాసులు (తిరుపతి)జి.సుబ్బిరెడ్డి (అనంతపురం)జయ రామప్ప (కర్ణాటక) వున్నారని, కేసు కొట్టివేసిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

$$$__________@@@__________$$$

ఎమ్మెల్సీ తనయుడికి స్వాగతం పలికిన తెదేపా శ్రేణులు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్27(విజయస్వప్నం.నెట్)

మండలంలోని సున్నంపల్లి పంచాయతీ ఎంబీ క్రాస్ వద్ద గురువారం తెదేపా నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి తనయుడు సాయి శ్రీనివాసులురెడ్డికి ఘన స్వాగతం పలికారు.బెంగుళూరు నుండి కడపకు వెళ్తుండగా మార్గమధ్యంలో మహమ్మదాబాద్ క్రాస్ గ్రామ తెలుగుదేశం కార్యాలయం వద్దకు చేరుకున్న సాయి శ్రీనివాసులురెడ్డికి గ్రామ తెదేపా శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన తెదేపా శ్రేణులను ఆప్యాయంగా పలకరించి, కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో గ్రామ తెదేపా కన్వీనర్ బోనాల రామాంజనేయులు, చదివే నరసింహారెడ్డి,వెంకటేష్, రమేష్,వాటర్ బాలకృష్ణ, వీరయ్య,రమణ,సూరి తదితర తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి