google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : నేడు అయ్యప్ప ఆలయంలో అక్షరాభ్యాసం

16, జూన్ 2024, ఆదివారం

నేడు అయ్యప్ప ఆలయంలో అక్షరాభ్యాసం

 నేడు అయ్యప్ప ఆలయంలో అక్షరాభ్యాసం



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 15(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి ఆలయంలో విద్యా గణపతి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం, కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట శుభకార్యం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు శనివారం తెలిపారు. కదిరి జోగి శ్రీదేవి ఫౌండేషన్ ఛైర్మన్ కోడూరు శ్రీకాంత్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం, హెడ్ కానిస్టేబుల్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్షరాభ్యాసం శుభకార్యం సందర్భంగా ఆలయ అలంకరణ,అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని శుభప్రదం చేయాలని ఆయన కోరారు.

Rephrase with Ginger (Ctrl+Alt+E)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి