google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : ప్రశంస పత్రం అందుకున్న పవన్ కు అభినందనలు - డిఎస్సీ ఫైల్ పై సియం చంద్రబాబు తొలి సంతకంపై హర్షం - కొండకమర్లలో బడిబాటపై అవగాహన ర్యాలీ -

15, జూన్ 2024, శనివారం

ప్రశంస పత్రం అందుకున్న పవన్ కు అభినందనలు - డిఎస్సీ ఫైల్ పై సియం చంద్రబాబు తొలి సంతకంపై హర్షం - కొండకమర్లలో బడిబాటపై అవగాహన ర్యాలీ -

ప్రశంస పత్రం అందుకున్న పవన్ కు అభినందనలు

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువ,జూన్14(విజయస్వప్నం.నెట్)

సన్న జీవాల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులు గురించి వివరించినందుకు డిప్యూటీ డైరెక్టర్ సి.వెంకట్ రెడ్డి చేతుల మీదుగా పవన్ కుమార్ కు ప్రశంస పత్రము అందించినట్లు శుక్రవారం తెలిపారు:నంద్యాల జిల్లా,పేపల్లి మండలం, హుస్సైనపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సన్న జీవాలు పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులు గురించి వివరించినందుకు శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మండలంలోని పగడాలవారిపల్లి గ్రామానికి చెందిన ఏ.టి.పవణ్ కుమార్ ను సన్మానించడంతో పాటు డిప్యూటీ డైరెక్టర్ వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందజేశారని తెలిపారు. ప్రశంసా పత్రం అందుకున్న పవన్ కుమార్ ను అభినందిస్తూ.... గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

$$$__________@@@___________$$$

డిఎస్సీ ఫైల్ పై సియం చంద్రబాబు తొలి సంతకంపై హర్షం

 శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూన్14(విజయస్వప్నం.నెట్)

2024 ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ ఎన్నికల మేనిఫెస్టోలో మెగా డిఎస్సీ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీ ఉద్యోగాల ఫైల్ పైన సంతకం,అదేవిధంగా 16 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు విడుదల చేయడం,గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేని అసమర్ధ పాలనకు ప్రజలు చరమగీతం పలికి,ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో గుర్తిండిపోయే విధంగా 2024 ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగిందని,ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు మొదటి సంతకమే మెగా డీఎస్సీ ఫైల్ పైన  చేయడం ఆంధ్ర రాష్ట్ర యువత భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వడం జరిగిందని, ఉపాధ్యాయ ఉద్యోగ భర్తీకి జీవో జారీ చేసిన సందర్భంగా  శుక్రవారం విలేకరుల సమావేశంలో పుట్టపర్తి నియోజకవర్గ తెలుగు యువత కమిటీ తరఫున హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఓబుళరెడ్డి,నల్లమాడ మండల అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి,కార్యదర్శులు బడా మధుసూదన్ రెడ్డి,బడా మహేష్ రెడ్డి,ఐ టి డి పి నల్లమాడ మండలం అధ్యక్షుడు పవన్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@___________$$$

కొండకమర్లలో బడిబాటపై అవగాహన ర్యాలీ

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్14(విజయస్వప్నం.నెట్)

మండలంలోని కొండకమర్ల ఒకటి,రెండు అంగన్వాడి కేంద్రాల్లో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించినట్లు అంగన్వాడి భోధకులు తెలిపారు.రహమతునిస, విజయమ్మ ఆయాలు సరస్వతి,రిహానా ఆధ్వర్యంలో చిన్నారులు,తల్లిదండ్రులతో కలిసి గ్రామంలో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి,బడిబాటపై అవగాహన కల్పించారన్నారు.

$$$__________@@@___________$$$

వైభవంగా శ్రీఅక్కదేవతలు ఎలావ గంప ఊరేగింపు


శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి (గోరంట్ల)

మండల పరిధిలోని బుధిలివాండ్లపల్లి గ్రామంలోఈశ్వరమ్మ,వెంకటరమణప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీఅక్కదేవతల యలవగంప ఉత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బుధిలీవాండ్లపల్లి గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి పసుపు,కుంకుమ,గాజులు,పచ్చ సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీఅక్కదేవతలు కొలువైన ఇంటి నుంచి బుధిలీవాండ్లపల్లి పుర వీధుల్లో ఎలావగంప ఉత్సవ ఊరేగింపు  గురువయ్యల ఉరుములు, వాయిద్యాలతో దర్శనం ఇస్తూ ఆలయం వద్దకు చేరుకుని అక్కదేవతల ప్రతిరూపంగా ఏడు మంది చిన్నారులకు ఒళ్ళు నింపే కార్యక్రమం నిర్వహించి,ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

$$$__________@@@___________$$$

నేడు ఎమ్మెల్యే పల్లే సింధూర రెడ్డి పుట్టపర్తికి రాక

 శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూన్ 14(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి నేడు(శనివారం) ఉదయం 10 గంటలకు పుట్టపర్తికి రానున్నారని తెదేపా కార్యాలయం ద్వారా శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు.పుట్టపర్తిలోని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, తెదేపా యువ నేత పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి హాజరుకానున్నారని,ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  ప్రజలకు అందుబాటులో ఉంటారని,పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా నాయకులు,కార్యకర్తలు కుటుంబ సభ్యులు అలాగే జనసేన,బిజెపి కుటుంబ సభ్యులు అధికారులు అనధికారులతో ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి సమావేశం కానున్నారని, కావున తెదేపా,జనసేన,బీజీపీ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

$$$__________@@@___________$$$

ఎంఎల్ఏ విజయంపై మొక్కులు తీర్చుకున్న నాయకులు

 శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 15(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి ఎంఎల్ఏ గా పల్లెసింధూరరెడ్డి గెలిసినందుకు, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని ఎంపీటీసీ శ్రీనివాసులు, కార్యకర్తలు వెంకటరామిరెడ్డి,అంజనరెడ్డి తదితరులు తిరుమల కొండలోని 300 మొక్కాళ్ళ మెట్లను మోకాళ్లాపై నడచి తెదేపాపై తమ భక్తిని చాటుకున్నారని,ఎం.కొత్తపల్లి గ్రామంలో కే.వెంకటరంగారెడ్డి కుటుంబసభ్యులు గ్రామస్తులతో కలసి శ్రీ ఆంజనేయస్వామికి పురోహితులు మురళీ స్వామి చేత ఆకుపూజ చేసి,101 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కుబడిని తీర్చుకొన్నారని తెలిపారు.పూజ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి అంజినప్ప, మసీనియర్ నాయకుడు బొడ్డుజయన్న,మాజీ కో -అప్సన్ మెంబర్ నిజాం,కరుణాకరరెడ్డి, సునీల్,సామలఅంజనరెడ్డి, మజయరామిరెడ్డి, ఇద్దేరఘునాథరెడ్డి,జీ.సాంబశివారెడ్డి,ఎం.కొత్తపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొని పూజా కార్యక్రమం శుభప్రదం చేశారన్నారు.అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారన్నారు.

$$$__________@@@___________$$$

రామాలయంలో మిథునం మాస పూజోత్సవం

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 15(విజయస్వప్నం.నెట్)

మిథునం శుభదినం పురష్కరించుకుని అల్లాపల్లి పంచాయతీ గౌనిపల్లి గ్రామ శ్రీకోదండ రామాలయంలో శనివారం అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీరామ,శ్రీ సీతాదేవి,శ్రీ లక్ష్మణస్వామి,శ్రీ ఆంజనేయస్వామి,శ్రీవినాయక, శ్రీ సుబ్రమణ్య స్వామికి శనివార అభిషేక ఆకుపూజలు,  ప్రత్యేక అలంకరన,అష్టోత్తర పూజలు అర్చకులు సురేష్ శర్మ  నిర్వహించారు.మిథునం పూజోత్సవం సందర్భంగా గ్రామస్తులు పూజా సామాగ్రి అందించారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

$$$__________@@@___________$$$

అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష



శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూన్ 15(విజయస్వప్నం.నెట్)

పుట్ట పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శనివారం పుట్టపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.

ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే, మాజీమంత్రి శ్రీసత్యసాయిజిల్లా ఎస్పీ మాధవరెడ్డిని శనివారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలిసి మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చం అందించి మాట్లాడారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి