google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : పుట్టపర్తి తొలి మహిళా ఎమ్మెల్యేగా పల్లె సింధూరరెడ్డి - మొక్కలు నాటి సంరక్షించాలి - ముమ్మాటికీ నిజమైన ముగ్గురు యోధుల ప్రదేశ్ సర్వే -

9, జూన్ 2024, ఆదివారం

పుట్టపర్తి తొలి మహిళా ఎమ్మెల్యేగా పల్లె సింధూరరెడ్డి - మొక్కలు నాటి సంరక్షించాలి - ముమ్మాటికీ నిజమైన ముగ్గురు యోధుల ప్రదేశ్ సర్వే -

పుట్టపర్తి తొలి మహిళా ఎమ్మెల్యేగా పల్లె సింధూరరెడ్డి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్04(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యేగా పల్లె సింధూరరెడ్డి 8760 ఓట్ల మెజారిటీతో వైకాపా అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై విజయం సాధించి,పుట్టపర్తి నియోజకవర్గంలో తొలి మహిళా ఎమ్మెల్యేగా పల్లె సింధూరరెడ్డి గుర్తింపు పొందారు.పుట్టపర్తి నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చేసిన సేవలు,అభివృద్ధి పనులు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవడంతో పల్లె సింధూరరెడ్డి విజయానికి దోహదపడ్డాయని పలువురు పేర్కొంటున్నారు.తన మామ మాజీమంత్రి పల్లె రఘునాథ్ వారసురాలిగా రాజకీయ ప్రవేశం చేసి తొలి ప్రయత్నంలోనే గెలుపొంది,అతి చిన్న వయసులోనే నియోజకవర్గ తొలి మహిళా శాసనసభ్యురాలుగా పల్లె సింధూరరెడ్డి గుర్తింపు పొందారు.విజయం సాధించిన పల్లె సింధూరరెడ్డి తన మామ మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆశయాల అడుగుజాడల్లో పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి పధంలో పయనిస్తోందని మండలాల గ్రామీణ ప్రాంతాల అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పల్లె సింధూరరెడ్డి విజయం సాధించడంపై నియోజకవర్గ వ్యాప్తంగా తెదేపా నాయకులు, కార్యకర్తలు,అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

$$$__________@@@__________$$$

మొక్కలు నాటి సంరక్షించాలి



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్05(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో బుధవారం ఐవీడీ కమ్యూనిటీ హాలులో ఏకల్ గ్రామోదన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మండల సంచ్ అధ్యక్షులు పిట్టా ప్రభాకర్ రెడ్డి,సంచ్ కోఆర్డినేటర్ బి.శ్రీరాములు, కే.శ్రీనాథ్ ల సమక్షంలో చిన్నారులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.అనంతరం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించి,ప్రతి ఒక్కరూ.... మొక్కులు నాటి చెట్లను పెంచడంలో ఆసక్తి కనబరిచాలని పేర్కొన్నారు.అంతక ముందు చిన్నారులతో కలిసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, ప్రతి ఒక్కరూ మొక్కులు నాటాలి, పరిరక్షణ భాధ్యతగా తీసుకోవాలి అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.

$$$__________@@@__________$$$

ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డికి అభినందనల వెల్లువ



శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూన్ 05(విజయస్వప్నం.నెట్) 

పుట్టపర్తి కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డితో కలిసి సత్యమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తెదేపా శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. పల్లె సింధూరరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

$$$__________@@@__________$$$

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూన్08(విజయస్వప్నం.నెట్)

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ని స్వగృహంలో బుధవారం  పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జి పల్లె, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గౌరవ పూర్వకంగా కలిసి మాట్లాడారని తెదేపా శ్రేణులు తెలిపారు.

$$$__________@@@__________$$$

ముమ్మాటికీ నిజమైన ముగ్గురు యోధుల ప్రదేశ్ సర్వే 

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్06(విజయస్వప్నం.నెట్)

సీనియర్ జర్నలిస్టు,ముద్ర బ్యాంకు చైర్మన్,సామాజిక సేవతత్పురుడు తిప్పినేని రామదాసప్పనాయుడు రచనలో గత రెండు నెలల క్రితం వెలువడిన ముగ్గురు యోధుల ప్రదేశ్ పుస్తక సర్వేలో చెప్పిన విధంగా 2024 ఎన్నికల్లో వైసిపి పార్టీకి 15 ఎంఎల్ఏ స్థానాలకు పరిమితం అన్న సర్వే ముమ్మాటికీ వంద శాతం నిజమైనదని పుట్టపర్తి నియోజకవర్గ పాల ఏకిరి సంఘం అధ్యక్షుడు రాచినేని లక్ష్మినరసింహ నాయుడు స్పష్టం చేశారు.గురువారం మండల కేంద్రంలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ....రచయిత రామదాసప్పనాయుడు ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవలు కార్యక్రమాలు చేపట్టారని, అందులో భాగంగా ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు తెలంగాణలో వరుసగా మూడు సంవత్సరాలు రక్తదానం శిబిరాలు నిర్వహించి ప్రజల నుంచి 4 వేల యూనిట్లు రక్తం స్వీకరించి ప్రభుత్వానికి అందించినందుకు అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళ సై నుంచి బంగారుపతకం అందుకొన్నారని ఆయన తెలిపారు.గత మూడు దశాబ్దలుగా సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతలపై రచయితగా,జర్నలిస్టుగా అనేక వ్యాసాలు,పుస్తకాలు రచనలపై హైకోర్టు,సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం ప్రశంసించడం జరిగిందన్నారు.సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి తీర్పులపై సీజేఐ యన్వి రమణ తీర్పులు మార్పులు,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోరాటపటిమను తెలిపే మరో సూర్యుడు,పేదల న్యాయమూర్తి కిష్టప్ప,ప్రజాబందు సిద్దరామయ్య పేరుతో పలు పుస్తకాలు రచయిత రామదాసప్ప నాయుడు రచించినట్లు తెలిపారు. అదేవిదంగా రామదాసప్ప నాయుడు ఏప్రిల్ మాసంలో రచించిన ముగ్గురు యోధుల ప్రదేశ్ పుస్తకమును మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తిలో ఆవిష్కరించారని,అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై నిర్వహించిన సర్వేలో 2019 ఎన్నికల్లో 151 ఎంఎల్ఏ ,22 ఎంపీలు పొందిన వైసిపి పార్టీపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి వుందని కావున 2024 ఎన్నికల్లో 15 ఎంఎల్ఏ,3 ఎంపీ స్థానాలకు పరిమితం కావడం జరుగుతుందని స్పష్టం చేశారని తెలిపారు.దీనికి ప్రధానకారణం వైఎస్ జగనమోహనరెడ్డి ఒంటెద్దు పోకడలు,ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులుతో జైల్లో పెట్టించడం,ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి అంశాలు ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నట్లు పుస్తకంలో పేర్కొన్నట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా:ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

నూతన ఎమ్మెల్యేలు కలిసిన ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు


శ్రీసత్యసాయిజిల్లా కదిరి జూన్ 07(విజయస్వప్నం.నెట్)

ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఎంప్లాయిస్ యూనియన్ యూనియ గౌరవ అధ్యక్షుడు,నూతనంగా కదిరి శాసనసభ్యులుగా ఎన్నికైన కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. నూతన శాసనసభ్యులుగా ఎంపికైన కందికుంట వెంకటప్రసాద్ ని శుక్రవారం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పుట్టపర్తి రీజినల్ కమిటీ, కదిరి డిపో కమిటీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎంప్లాయిస్ యూనియన్ గౌర అధ్యక్షుడు కందికుంట వెంకటప్రసాద్ కదిరి శాసనసభ్యులుగా ఎంపిక కావడం ఆనందదాయకం, అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా తనను కలిసిన ఆర్టీసీ ఉద్యోగులతో కందికుంట ప్రసాద్ ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలోఎంప్లాయిస్ యూనియన్ పుట్టపర్తి రీజినల్ కార్యదర్శి జివైపీ రావు,సివి పిఆర్ఎస్ రెడ్డి,జిసిఎస్ నాయుడు,డిపో కార్యదర్శి పి. శంకరప్ప,డిపో కోశాధికారి కే.హరికుమార్,హెచ్.సుధీందర్, సింహ,సలాం భాష,ఎం.రవి,ఎస్.కే. వలీ,హృదయ రాజు,గ్యారేజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

రైతులకు నాణ్యమైన విత్తన వేరుశెనగ కాయలు సరఫరా చేయండి

విత్తన కాయల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు:- అధికారులకు సూచించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

 శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి, జూన్07(విజయస్వప్నం.నెట్)

నాణ్యమైన విత్తన వేరుశనగ కాయలను అర్హులైన రైతులందరికి సరఫరా చేయాలని పుట్టపర్తి నియోజకవర్గం నూతన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి వ్యవసాయ అధికారులకు సూచించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో  రైతులకు పంపిణీ చేస్తున్న విత్తన వేరుశనగ కాయల సరఫరాపై ఆమె శుక్రవారం విజయవాడ నుంచి వ్యవసాయ అధికారులతో ఫోన్ లో  వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తన కాయల సరఫరాపై ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ....పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 19045 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కాయలు కేటాయించినట్లు తెలిపారు.ఇందులో అమడగూరు మండలానికి 3864 క్వింటాళ్లు,ఓడి చెరువు మండలానికి 4567 క్వింటాళ్లు,నల్లమాడ మండలానికి 5089 క్వింటాళ్లు,బుక్కపట్నం మండలానికి 1483 క్వింటాళ్లు,కొత్తచెరువు మండలానికి 1576 క్వింటాళ్లు,పుట్టపర్తి మండలానికి 1776 క్వింటాళ్ల విత్తన కాయలు కేటాయించారని,అలాగే ఓడిచెరువు మండలంలోని తంగేడుకుంట పంచాయతీ గ్రామాల్లో శోత్రీయం భూముల రైతులకు అదనంగా 690 క్వింటాళ్ల  విత్తన వేరుశనగ కాయలు కేటాయించారని పేర్కొన్నారు.ఈ శోత్రియం భూములు కలిగిన  రైతులు ఇప్పటికే పట్టాదార్ పాస్ పుస్తకం కలిగి ఉండి వ్యవసాయ ప్రభుత్వ యాప్ లో ఆర్బీకే కేంద్రాల్లో  ఇప్పటికే విత్తన కాయల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ విత్తన వేరుశనక్కాయలు ఇప్పటికే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఇంకా పట్టాదార్ పాస్ పుస్తకం లేని అలాంటి రైతులకు ఆఫ్ లైన్ ద్వారా అధికారులు నమోదు చేసుకొని ఆ రైతులందరికీ విత్తన వేరుశెనగ కాయలు పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి భరోసా ఇచ్చారు.

 విత్తన కాయలు లేవని రైతులెవరూ అధైర్యపడవద్దని,ప్రతి ఒక్కరికీ అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని,కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు అండగా ఉంటారని ఆమె రైతులకు భరోసా ఇచ్చారు.ప్రస్తుతం జిల్లాలో తొలకరి వర్షాలు  బాగా కురుస్తున్నాయని వ్యవసాయ పంటలు సాగు చేయడానికి  ఇదే మంచి సమయమని రైతులకు సూచించారు. ప్రతి రైతు సకాలంలో పంటలు సాగు చేసుకొనేలా సిద్ధం కావాలని  ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రైతాంగానికి పిలుపనిచ్చారు.

$$$__________@@@__________$$$


శ్రీసత్య సాయిజిల్లా పుట్టపర్తి జూన్ 07(విజయస్వప్నం.నెట్)

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి కుటుంబ సభ్యులు విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పల్లె సింధూర రెడ్డిని అధినేత చంద్రబాబు నాయుడు  అభినందించారు.

$$$__________@@@__________$$$

అక్కమ్మ వారికి మొక్కులు తీర్చుకున్న తెదేపా అభిమాని


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 07(వఇజయస్వప్నం.నెట్)

 పుట్టపర్తి నియోజకవర్గం శాసనసభ్యురాలుగా పల్లె సింధూర రెడ్డి  ఎన్నిక కావాలని కొండకమర్ల గ్రామం పోలేవాండ్ల కొత్తపల్లిలో వెలసిన శ్రీ అక్కమ్మ వారికి మంజుల రెడ్డి మొక్కులు తీర్చుకున్నారు.నల్లమాడ మండలం చెరువువాండ్లపల్లికి చెందిన మంజులా రెడ్డి ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్నారు.తాను నమ్మిన అక్కదేవతలను రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావాలని పుట్టపర్తిలో సింధూర రెడ్డి  శాసనసభ్యులుగా ఎన్నిక కావాలని ముక్కుకున్నారని అందులో భాగంగా శుక్రవారం తన కోరిక తీర్చిన అక్కదేవత లకు పూజలు నిర్వహించి,కేక్ కట్ చేసి,100 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారని తెదేపా శ్రేణులు తెలిపారు.భవిష్యత్తులో పోలేవాండ్లకొత్తపల్లిలో ప్రజల సౌకర్యార్థం మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బడిశం రామాంజనేయులు,పోలేవాండ్ల కొత్తపల్లి గ్రామస్తులు పందిపోటు శంకర,వెంకటేష్,కేశవ,కొండకమర్ల పి.గంగాద్రి,నవాబుకోట మాజీ డీలర్ ఆనంద్,ఎస్సీ సెల్ నాయకులు పి.తిరుపాలు,ధారా వెంకట రాముడు,పోలేవండ్ల కొత్తపల్లి గ్రామ తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

16న అయ్యప్ప ఆలయంలో అక్షరాభ్యాసం


ఓడిచెరువు,జూన్ 07(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బంగారు బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఈనెల(జూన్)16వతేది ఆదివారం అక్షరాభ్యాసం శుభకార్యం పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో  శుక్రవారం పరిపాలనాధికారి పూల రెడ్డప్ప సమక్షంలో అక్షరాభ్యాసం కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు మాట్లాడుతూ.... 5 వయసు నుండి పాఠశాల చేర్పించే చిన్నారులకు తొలి అక్షరం - జ్ఞానామృతం నినాదంతో కదిరి జోగి శ్రీదేవి ఫౌండేషన్ ఛైర్మన్ కోడూరు శ్రీకాంత్ ఆధ్వర్యంలో పురోహితులు పంచరత్న సురేష్ శర్మ వారిచే అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొంటూ.... అక్షరాభ్యాసం శుభకార్యంలో పాల్గొనే వారు ఈనెల 12వతేది లోపు చిన్నారుల పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. అక్షరాభ్యాసం గావించాలనే తల్లిదండ్రులు 9885578756,9908342433 నెంబర్లను సంప్రదించి చిన్నారుల పేర్లు, వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.16న ఆదివారం ఉదయం 7:30 నుండి 10:30 వరకు అక్షరాభ్యాసం,చిన్నారులకు పలక,బలపం అందించిన అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం తదితర సౌకర్యాలు భక్తులకు కల్పిస్తామని ఆయన తెలిపారు.మండల ధర్మప్రచార, అధ్యాత్మిక గ్రామ వికాస్ ప్రముఖ్ చంద్రశేఖర్,రమణ నాయక్,మల్లెల రమేష్,నర్సింహులు తదితరులు కరపత్రాలు అందించి, కార్యక్రమాన్ని శుభప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

$$$__________@@@__________$$$

కులాచారాలను కాపాడుకుందాం : సమరసత సేవా ఫౌండేషన్


శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు,జూన్ 07(విజయస్వప్నం.నెట్)

కుల దైవాన్ని పూజిద్దాం, కుల గురువులను గౌరవిద్దాం, తోటి వారిని ఆదరిస్తూ సమాజ శ్రేయస్సుకు పాటుపడుదామని సమరసత సేవా ఫౌండేషన్ డివిజన్ ధర్మ ప్రచారఖ్ గోరంట్ల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.శుక్రవారం మండల కేంద్రములోని అభయాంజనేయ స్వామి ఆలయంలో మండల,గ్రామ స్థాయి సంయోజక్ సభ్యులకు సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ.... దేశంలో ప్రతి కులానికి ఓ ఉదాత్తమైన చరిత్ర, సామాజిక ధార్మిక ప్రయోజనం, సమున్నత స్థానం ఉందని, ప్రతి కులంలోను సామాజిక,ఆధ్యాత్మిక జాగృతి కోసం కృషి చేసిన ఆదర్శ పురుషులు, మానవతా మూర్తులు ఎందరో ఉన్నారని, స్వాతంత్ర్య సమరంలోను, ఆతర్వాత నవభారత నిర్మాణ ప్రక్రియలోను అన్ని కులాల వారి సమాన ప్రాతినిధ్యం, సమిష్టి కృషి ఉందని, సనాతన ధర్మానికి మాత్రమే స్వంతమైన ఈ మహోన్నత కుల వ్యవస్థ గొప్పతనాన్ని,ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ ఆవశ్యకతను అవగతం చేసుకుని, ఎవరికి వారు బలవంతులవుతూ.... జాతిని ధర్మాన్ని తద్వారా దేశాన్ని బలమైన శక్తిగా రూపొందించాలని పేర్కొన్నారు.మండల సంయోజక్ ప్రముఖ్ సభ్యులు నీలకంఠ రెడ్డి,విజయసింహా మాట్లాడుతూ....కుల దైవాన్ని పూజిద్దాం,కుల గురువులను గౌరవిద్దాం తోటి వారిని ఆదరిస్తూ సమాజ శ్రేయస్సుకు పాటుపడుదామని,ఇంట్లో కులం, ఇంటి బయట మనమంతా బంధువులమని గ్రామ స్థాయిలో నినాదించాని వారు కోరారు.అనంతరం కరపత్రాలు విడుదల విడుదల చేశారు. ఈకార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల ప్రచార సంయోజక్ రిటైర్డ్ ఎంఈఓ ఎస్.నరసింహీలు,మండల మహిళా కన్వీనర్ కుళ్ళాయమ్మ,సహాయకులు చిన్నమ్మ,గ్రామ సంయోజక్ కన్వీనర్లు సి.శివారెడ్డి, వెంకటరాముడు, అక్కులప్ప, వెంకట్రామిరెడ్డి, చలపతి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి