16న వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్టస్ధాపన
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్08 (విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపై వెలసిన శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి ఆలయం ఆవరణలో ఈనెల(జూన్)16 ఆదివారం కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.శనివారం హెడ్ కానిస్టేబుల్ గౌడ్ అందించిన శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహానికి జలాలతో శుద్ది చేసి పూజలు నిర్వహించారన్నారు.హెడ్ కానిస్టేబుల్ గౌడ్ సహయ సహకారంతో ఉపాలయ నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.ఈనెల 16వతేది ఉదయం 6గంటల నుండి 8 గంటల వరకు హెడ్ కానిస్టేబుల్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో ఉభయదారులతో కలిసి కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమ్మ విగ్రహానికి అభిషేకాలు పూజలు చేపట్టి అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉపాలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెడ్ కానిస్టేబుల్ గౌడను పలువురు అభినందించారు. ఈనెల 16న విగ్రహ ప్రతిష్ట, అక్షరాభ్యాసం శుభకార్యం కార్యక్రమాల్లో పాల్గొని శుభప్రదం చేయాలని భక్తులను, ప్రజలను కోరారు.ఈకార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగి పుల్లప్ప, టైలర్ నిజాం, కదిరి జోగి శ్రీదేవి ఫౌండేషన్ ఛైర్మన్ కోడూరు శ్రీకాంత్, ఈశ్వరమ్మ ఆలయ పూజారి వెంకటరమణ, ధర్మప్రచార మండల ప్రముఖ్ సుబ్బరాజు, టైలర్ రాము, మల్లెల రమేష్, రాధాకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
జివో 117 రద్దు చేయాలి:డీటీఎఫ్
శ్రీ సత్యసాయి జిల్లా జూన్ 08(విజయస్వప్నం.నెట్)
విజయవాడలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ 17వ కౌన్సిల్ సమావేశంలో శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంబంధించిన దీర్ఘకాలిక ఆర్థిక బకాయిలపై నూతన ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. విద్యకు ప్రతిబంధకంగా మారిన జీవో 117 రద్దు చేయాలని, నూతన ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ స్కీం వర్తింపచేయాలని, మెగా డీఎస్సీ వీలైనంత త్వరలో ప్రభుత్వం నిర్వహించాలని కోరారు. సిపియస్ రద్దు కు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని, ఈ హెచ్ఎస్ పథకాన్ని సరిచేసి సక్రమంగా వినియోగంలోకి తేవాలని, ఏపీ జిఎస్ఐ మిస్సింగ్ క్రెడిట్లను గత షెడ్యూల్ ఆధారంగా వారే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
$$$__________@@@__________$$$
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే కందికుంట
శ్రీసత్యసాయిజిల్లా కదిరి జూన్ 09 (విజయస్వప్నం.నెట్)
ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారు సంతోషంగా ఉద్యోగం చేసుకునేటట్లు చేయగలమని కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. ఆదివారం కదిరి డిపో మేనేజర్ మైనుద్దీన్, అసిస్టెంట్ మేనేజర్లు హరిత, హరి మోహన్, అసోసియేషన్ నాయకులు ఎన్వి రమణ, రామకృష్ణ, బైరిశెట్టి, అశ్వర్థమయ్య, నారాయణస్వామి, రామచంద్ర, బాబు, ఖాన్ తదితరులు కదిరి శాసనసభ్యులు కందికుంటను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కదిరి డిపోకు రావలసిన నూతన బస్సు సర్వీసులు రూట్లపై సమీక్షించారు. కదిరి డిపో అభివృద్ధికి తన వంతు కృషి చేయగలరని నాయకులకు ఆయన హామీ ఇచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి