పుట్టపర్తి అభివృద్ధికిశ సహయ సహకారాలు అందించండి
మంత్రులకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి వినతి
శ్రీసత్యసాయిజిల్లా, పుట్టపర్తి(ఓడిచెరువు) జూన్ 22(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించి సహయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పలువురు రాష్ట్ర మంత్రులను కలిసి కోరారు.ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డితో పాటు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శనివారం రాష్ట్ర ప్రధాన సచివాలయంలో పలువురు రాష్ట్ర మంత్రులను గౌరవ పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ముందుగా శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ ఫరూక్ ను కలిసి పుట్టపర్తిలో ఇప్పటికే 90%పూర్తయిన షాదీమహల్ ను గత ప్రభుత్వం విస్మరించిందని తగిన నిధులు కేటాయించాలని కోరాగా మంత్రి స్పందించి త్వరలో నిధులు మంజూరు చేసి షాదీమహల్ ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తెలిపారు.అలాగే వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను, చేనేత,బిసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ,జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును,రోడ్లు, భవనాల శాఖ మంత్రి బిసీ జనార్ధన్ రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.పుట్టపర్తి కేంద్రంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం మౌళిక సదుపాయాలు కల్పించలేదని వివిధ శాఖల మంత్రులకు వివరించి అభివృద్ధికి సహయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి కోరారు.చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన పల్లె సింధూరరెడ్డిని రాష్ట్ర మంత్రులు అభినందించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టడం మధురానుభూతి: ఎమ్మెల్యే పల్లె సింధూర పుట్టపర్తి మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం మధురానుభూతి పొందినట్లు పేర్కొంటూ.... తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటూ.... వారి ఆశయాలను,సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని,నా భర్త పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి,మామయ్య మాజీమంత్రి పల్లె రఘునాథ్ సహయ సహకారాలతో పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవాలు అందిస్తూ.... పుట్టపర్తి అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.(ఈసందర్భంగా రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చం నాయుడుని మర్యాదపూర్వకంగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు)
$$$___________@@@__________$$$
మొక్కులు తీర్చుకున్న తెలుగు తమ్ముళ్లు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్ 22(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గం తొలి మహిళా శాసనసభ్యురాలుగా పల్లె సింధూరరెడ్డి శనివారం ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా మండలంలో పలువురు తెలుగు తమ్ముళ్లు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి,మొక్కులు తీర్చుకున్నారు.మండలంలోని దిగువపల్లికి చెందిన రాష్ట్ర బిసీ సెల్ కార్యదర్శి జే.అంజనప్ప కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారని విలేకరులకు తెలిపారు.అలాగే మండలంలోని కొండకమర్ల మాజీ ఎంపీటీసీ నాగిరెడ్డిగారి రాజారెడ్డి,జయమ్మ దంపతులు, శంకరయ్య, గంగాద్రీ,గురుమూర్తి,నారాయణస్వామి,చండ్రాయుడు, శ్రీనివాసులు పలువురు తెదేపా శ్రేణులు పుట్టపర్తి మండలంలోని గంగిరెడ్డిపల్లి శ్రీ ఆంజనేయస్వామివారి దేవస్థానంలో ఎమ్మెల్యేగా పల్లె సింధూరరెడ్డి అఖండ విజయం సాధించి ప్రమాణస్వీకారం చేసిన శుభ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించి,101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
$$$___________@@@__________$$$
కొండకిందతాండలో ఏరువాక పూజలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి జూన్ 22(విజయస్వప్నం.నెట్)
ఏరుపాక పౌర్ణమి సందర్భంగా కొండకింద తండాలో శనివారం పొలాల్లో ఏరువాక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.భారతదేశం వ్యవసాయంలో ఏరువాక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది.ప్రాచీన కాలం నుండి రైతులు ఏరువాక పౌర్ణమి సందర్భంగా తమ పంట పొలాల్లో పూజ నిర్వహించి ఆరోజు నుంచి పంట పొలాల పనులను ప్రారంభించే వారిని,కానీ గడిచిన కొంతకాలంగా వ్యవసాయంలో యాంత్రికరణ విపరీతంగా పెరిగిపోవడంతో ఈ సాంప్రదాయ పద్ధతులు మర్చిపోతున్నారని బిజెపి కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.పంట సాగుచేసే రైతు భూమిని తల్లిగా భావించి పూజ నిర్వహించాలని,ఇది మర్చిపోవడంతో నేడు పంటలు సరిగా పడటం లేదని,ప్రతి రైతు భూమిని మాతృమూర్తిగా భావించాలని ఆయన సూచించారు.జిల్లాలో వేరుశనగ పంట…
$$$___________@@@__________$$$
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు, జూన్23(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో ఆదివారం అంబేద్కర్ కూడలిలో బీజేపీ మండల అధ్యక్షుడు రంగారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళులు అర్పించారు.డాక్టర్.శ్యాం ప్రసాద్ ముఖర్జీ 1901 జులై 6న కలకత్తాలో జన్మించారని,మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీ,సప్లై మినిస్టర్ గా నెహ్రూ క్యాబినెట్లో పనిచేశారని. తర్వాత నెహ్రూ క్యాబినెట్ నుంచి బయటికి వచ్చేసి భారతీయ జన సంఘ్ పార్టీని స్థాపించారని,ఒక దేశానికి ఇద్దరు ప్రధాన మంత్రులు ఉండకూడదని.ఒకటే రాజ్యాంగం,ఒకటే ప్రజాస్వామ్యం.ఒకటే దేశం- ఒకటే చట్టం అనే నినాదంతో ప్రజలలో చైతన్యం కల్పించారని.అప్పట్లో భారతదేశంలో నెహ్రూ ప్రధానమంత్రి కాగా జమ్మూ కాశ్మీర్ కు ఫరూక్ అబ్దుల్లా ప్రధానమంత్రిగా ఉండేవారని.దీనిని వ్యతిరేకించడం వలన శ్రీనగర్ లో 1953లో జూన్ 23న అతనిని(ముఖర్జీని)హత్య చేశారని బిజేపీ శ్రేణులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి,ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన వర్ధంతి రోజు ఘనంగా నివాళులర్పించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అశ్వర్ధప్ప,డాక్టర్ హరికృష్ణ,జిల్లా యూత్ సెక్రెటరీ నరేష్ బాబు,మండల నాయకులు వెంకటరమణ,రాజశేఖర్,కిష్టప్ప,సీనియర్ నాయకులు వీర,సురేష్,రామిరెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అమడగూరులో....
ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు,ఇద్దరు ప్రధాన మంత్రులు,రెండు జెండాలు ఉండకూడదని జాతీయవాద భావంతో పోరాటం సాగిస్తూ అనుమానాస్పద రీతిలో మరణించిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డా..శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఆమడగూరు బీజేపీ మండల అధ్యక్షులు ఇందుకూరి సురేంద్రారెడ్డి,సీనియర్ నాయకులు ఐ.రాము,సుబ్బిరెడ్డి,ఉత్తప్ప,విశ్వనాధ్ రెడ్డి,రమణ తదితరులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
$$$___________@@@__________$$$
మాతృశ్రీ వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో వైద్యశిబిరం
శ్రీసత్యసాయిజిల్లా,అమడగూరు(ఓడిచెరువు)జూన్23(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలోని అమడగూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు అరుణజ్యోతి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం సప్తగిరి మెడికల్ కాలేజ్ రీసర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల జనరల్ సర్జరీ (దివ్యార్క్)జనరల్ మెడిసిన్ (నేల్పటిల్)ఆర్థోపెడిక్ (శరత్ గౌడ)ఎకో టెక్నీషియన్స్ (అనుష్క,అశ్వర్య) బెంగళూరు వారి సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహించారు.సామాజిక సేవకుడు అఖిల భారత ఫ్రీడం ఫైటర్ షాహిద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారుక్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించగా వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది.ఉచిత వైద్యశిబిరంలో మంజుల వాణి,రాము,బి.మూర్తి,వి.రామంజి,డి.అశోక్,సూరి మెడికల్,హరి జేకేపల్లి,టైలర్ రామాంజీ, సోమశేఖర్,ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి కుటుంబసభ్యులు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని సేవలందించారు.ఈసందర్భంగా సామాజిక సేవకుడు ఉమర్ ఫాకూర్ ఖాన్ మాట్లాడుతూ.... సప్తగిరి మెడికల్ కాలేజ్ రీసర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఆశమ నిర్వాహకులు అరుణ జ్యోతి మాట్లాడుతూ..... ఇక ముందు కూడా ఉచిత వైద్యశిబిరాలు సామాజిక సేవలు కోసాగించాలని, వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.సప్తగిరి మెడికల్ కాలేజీ రిజిస్టర్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల బెంగళూరు వైద్యులు దాదాపు 150 నుంచి 200 మందిని దాదాపు 5 వేల రూపాయల ఎకో. ఈసీజీ. కార్డియా ఫిట్నెస్. బిపి షుగర్ తదితర వ్యాధులకు ఉచితంగా పరీక్షలు,చికిత్సలు నిర్వహించారు. శస్త్రచికిత్సలకు 20 మందిని బెంగళూరు సప్తగిరి స్పెషాలిటీ వైద్యశాల ఇతర పరీక్షలకు రిఫర్ చేశారు.ఆశ్రమ నిర్వాహకురాలు అరుణ జ్యోతి,విచ్చేసిన ముఖ్యఅతిధులందరూ కలిసి సప్తగిరి సూపర్ స్పెషాలిటీ వైద్యులకు,సిబ్బందికి గౌరవించి సన్మానించారు.ఈఉచిత వైద్య శిబిరానికి అందరూ ఆశ్రమ నిర్వాహకురాలు,బంధువులు, మిత్రులు,అమడుగూరు ప్రజలు,చికిత్సల కోసం వచ్చిన వారు అందరూ కలసి ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అరుణ జ్యోతి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ వైద్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
$$$___________@@@__________$$$
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్. వెంకట రెడ్డి మృతి:సంతాపం తెలిపిన పుట్టపర్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి
శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి జూన్23(విజయస్వప్నం.నెట్)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు నాయకత్వంలో సేవలందించిన తెదేపా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.వెంకట్ రెడ్డి (87) ఆదివారం మృతి చెందారు.సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం మలకవేముల గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి మృతి పట్ల పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ఆ కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నాయకులు వెంకటరెడ్డి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారు సంతాపం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి అన్నయ్య గత కొన్నేళ్లుగా నాకు ఎంతో మ…
$$$___________@@@__________$$$
ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి కృషి చేయాలి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్24(విజయస్వప్నం.నెట్)
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న నిరుద్యోగ యువతలకు బాసటగా నిలిచే విధంగా ... ప్రకటించిన మెగా డీఎస్సీ 16,347 పోస్టులలో ఉర్దూ మీడియం పాఠశాలలకు తగినన్ని పోస్టులను మంజూరు చేసి భర్తీ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ద్వితీయ అధికార బాషైన ఉర్దూను, పాఠశాలలను సంరక్షించాలని, జివో నెంబర్ :117 ను రద్దు చేసి ఉర్దూ పాఠశాలలలో ఎస్జీటి పోస్ట్ లను భర్తీ చేయాలని, ఉర్దూ మీడియం ప్రాథమిక,ప్రాథమికోన్నత,జిల్లా ఉన్నత పాఠశాలలో రోల్ కు తగినన్ని పోస్ట్ లను భర్తీ చేయాలని,చాలా డిఎస్సీలలో భర్తీ కాని బ్యాక్ లాగ్ పోస్ట్ లను ఈ మెగా డిఎస్సిల్లో భర్తీ చేయాలని,ఇంగ్లీషు,తెలుగు మీడియం పాఠశాలల్లో 20 మంది మాతృభాష ఉర్దూ ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఓ ఉర్దూ సబ్జెక్టు పోస్ట్ ను భర్తీ చేయాలని,ఉర్దూ మీడియం,లాంగ్వేజ్ అర్హత కలిగిన వారికే ఉర్దూ మీడియం నందు డి.ఎస్.సి అర్హత కల్పించాలని,ఉర్దూ మీడియం పిఈటీ పోస్ట్ లను భర్తీ చేయాలని డిటిఎఫ్ జిల్లా నాయకులు గౌస్ లాజమ్ సోమవారం ఓప్రకటనలో తెలిపారు.
$$$___________@@@__________$$$
మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డికి ఘన నివాళ్ళు
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూన్24(విజయస్వప్నం.నెట్)
నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్.వెంకటరెడ్డి పార్థివ దేహాన్ని సోమవారం ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి,యువ నాయకుడు పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసి, తెదేపా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
$$$___________@@@__________$$$
శ్రీ అక్కదేవతల ఆలయంలో ప్రత్యేక పూజలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) జూన్24(విజయస్వప్నం.నెట్)
అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీ సప్త అక్కదేవతల ఆలయంలో సోమవారం గొల్లపల్లికి చెందిన వెంకటేశ్వరరెడ్డి,సునీత దంపతులు,కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శనం కోసం విచ్చేసిన 250 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారని పూజారి వెంకటేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారన్నారు.
$$$___________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూన్ 24(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ అరుణ్ బాబు అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.ప్రజల నుండి పలు సమస్యలపై వినతులు స్వీకరించి, పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
$$$___________@@@__________$$$
ఆలయంలో అన్నదాన సత్రానికి 10వేలు విరాళం
శ్రీసత్యసాయిజిల్లా (ఓడిచెరువు)జూన్ 24(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మండలంలోని అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీ సప్త అక్కదేవతల ఆలయం ప్రాంగణంలో నూతన అన్నదాన సత్రమునకు గోరంట్ల మండలానికి చెందిన ఉమాదేవి,శివయ్య దంపతులు 10వేలు విరాళం పూజారి వెంకటేష్ కు అందించారు.దర్శనం కోసం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్నదాన సత్రం నిర్మాణ పనులు చేపట్టేందుకు దాతలు రమాదేవి,శివయ్య దంపతులు 10వేలు అందించడంపై పూజారి వెంకటేష్,ఆలయ పూజరి,ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు తదితరులు ఆనందం వ్యక్తం చేస్తూ.... దంపతుల సేవా గుణాన్ని అభినందించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి