రక్తదాన శిబిరానికి విశేష స్పందన
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై11(విజయస్వప్నం.నెట్)
మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామంలో లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.ఉచిత రక్తదాన శిబిరంలో 35 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. లైఫ్ లైన్ ఫౌండేషన్ ఛైర్మన్ అబూబకర్ సిద్ధిక్ మాట్లాడుతూ.... రక్తదాన శిబిరంలో యువకులు పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో లైఫ్ లైన్ ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్తులతో పాటు శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు అరుణజ్యోతి పాల్గొని దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
$$$__________@@@__________$$$
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే
శ్రీసత్యసాయిజిల్లా (ఓడిచెరువు)పుట్టపర్తి, జూలై11(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా అధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తికి గురువారం విచ్చేసిన మంత్రులు ముందుగా ప్రశాంతి నిలయంలోని శాంతి భవన్ విశ్రాంతి భవనముకు చేరుకున్నారు.శాంతి భవనంలో మంత్రులకు కలెక్టర్,జాయింట్ కలెక్టర్,పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సింధూర రెడ్డి,మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి,దృశ్యాలువతో సత్కరించారు.అనంతరం ప్రశాంతి నిలయంలోని సత్యసాయిబాబా మహాసమాధిని రాష్ట్ర మంత్రులు సత్య కుమార్ యాదవ్,సవితమ్మ,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి దర్శించుకున్నారు.ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్జే రత్నాకర్,సెంట్రల్ ట్రస్ట్ వర్గీయులు దగ్గరుండి సత్య సాయి బాబా మహిమల గురించి ప్రశాంతి నిలయం విశిష్టత,ట్రస్ట్ సేవా కార్యక్రమాలు,ప్రపంచ మానవాళికి బాబా చూపిన మార్గం గురించి గురించి వారికి వివరించారు.
$$$__________@@@__________$$$
4న రాష్ట్ర డ్రైవర్ల అవగాహన సదస్సు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, జూన్11(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండల ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు ఈనెల 14న ఆదివారం స్థానిక సాది మహల్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర డ్రైవర్ల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల అధ్యక్షులు చిరంజీవి గురువారం ఓప్రకటనలో తెలిపారు.ఈకార్యక్రమంలో గౌరవ ముఖ్యఅతిథిగా పాల్గొనాలని నల్లమాడ సిఐని ఆహ్వానించినట్లు వారు తెలిపారు.ఈ అవగాహన సదస్సులో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
$$$__________@@@__________$$$
మండల సమస్యలపై మంత్రికి వినతి
శ్రీసత్యసాయిజిల్లా (ఓడిచెరువు)అమడగూరు జూలై11(విజయస్వప్నం.నేట్)
శ్రీసత్యసాయిజిల్లా అధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి నగరానికి గురువారం రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ విచ్చేసిన సందర్భంగా మండల బిజేపీ నాయకులు కార్యకర్తలు ఆయనని గౌరవ పూర్వకంగా కలిసి ఆమడగూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో సమస్యలను వారిదృష్టికి తీసుకెళ్ళి వినతిపత్రం అందజేశారని తెలిపారు.మంత్రిని కలిసిన వారిలో బీజేపీ మండల అధ్యక్షులు ఇందుకూరి సురేంద్రారెడ్డి, సుబ్బిరెడ్డి రామయ్య తిప్పన్న వున్నారు.
$$$__________@@@__________$$$
ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి జూలై11(విజయస్వప్నం.నెట్)
కదిరి డిపో ఆవరణలో గురువారం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో 73వ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా డిపో పరిధిలోని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు జెండా ఆవిష్కరించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు నబి రసూల్,రీజినల్ కార్యదర్శి జి.పద్మనాభ రావు,రీజినల్ సివిపిఆర్ఎస్ రెడ్డి,డిపో అధ్యక్షులు కాలసముద్రం దివాకర్,డిపో కార్యదర్శి శంకర,గ్యారేజీ కార్యదర్శి రవినాయక్ విచ్చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించిన్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు జిసిఎస్ నాయుడు, కేవీ.రమణ,అనిల్, రవి,ఎంఎన్ రెడ్డి,రామ్మోహన్,మౌలా, గ్యారేజ్ డిపో ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి 73వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
$$$__________@@@__________$$$
దోమల వ్యాప్తిని అరికట్టాలి: ఆర్సీపీ నాయకులు వినతి
శ్రీసత్యసాయిజిల్లా,అమడగూరు(ఓడిచెరువు)జూలై 12(విజయస్వప్నం.నెట్)
మండల వ్యాప్తంగా వర్ష ప్రభావం వల్ల దోమల వ్యాప్తి ఎక్కువై వాటివల్ల డెంగ్యూ,మలేరియా లాంటి విష జ్వరాలు వ్యాపించి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి భాగ్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు.అధికారిణి స్పందించి,తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డివెజినల్ కార్యదర్శి ఎస్ మున్నా, మండల అధ్యక్షులు శ్రీనివాసులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)ఆమడుగూరు,జూలై12(విజయస్వప్నం.నెట్)
మండలంలోని గాజులపల్లి గ్రామం కూడలి సమీపంలో శ్రీమాతశ్రీ వృద్ధాశ్రమంలో శుక్రవారం కొక్కంటి క్రాస్ గ్రామానికి చెందిన ఎల్.శ్రీధర్ (ఏరియా మేనేజర్)ఎం.స్వర్ణ (మహిళా పోలీస్) దంపతుల ముద్దుల కుమార్తె ఎల్.లేభిణిక ప్రధమ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి మాట్లాడుతూ చిన్నారి లేభిణిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఆశ్రమానికి సేవలు అందిస్తున్న దాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
$$$__________@@@__________$$$
విశ్వహిందూ పరిషత్ నూతన కమిటీ ఎంపిక
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు జూలై13(విజయస్వప్నం.నెట్)
అమడగూరు మండల కేంద్రంలో శనివారం గోరంట్ల ప్రఖండ అధ్యక్షులు ఆదినారాయణ(అన్నపూర్ణ హోటల్) ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.జిల్లా ప్రముఖ్ శ్రీనివాసగుప్త, కార్యదర్శి రామచంద్ర,లీలావతి,మాతృశక్తి సంఘటన సహా సంయోజక్ మంజుల,దుర్గావాహిని,త్రిష తదితరులు పాల్గొని మండల విశ్వహిందూ పరిషత్ నూతన కమిటీ కార్యవర్గం ఎంపిక చేశారు.మండల ప్రఖండ అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం, కార్యదర్శిగా నాగేంద్ర, ఉపాధ్యక్షులుగా అంజి, రాంమోహన్,ధర్మప్రసాద్,సహా ప్రముఖ్ ముత్తప్ప, సేవా ప్రముఖ్ నర్సింహులు,సత్సంగ్ ప్రముఖ్ గోవిందు,మాతృశక్తి ప్రముఖ్ ప్రమీలమ్మ, భజరంగ్ దళ్ జయసింహలతో పాటు కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా నూతన ఎస్పీగా వి.రత్న
శ్రీసత్యసాయిజిల్లా జూలై13(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా నూతన ఎస్పీగా వి.రత్న(ఐపిఎస్)నియామకం అయినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మంగళగిరిలోని ఏపిఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్న వి.రత్న ను శ్రీసత్యసాయిజిల్లా ఎస్పీగా డీజీపీ కార్యాలయం నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఎస్వీ మాధవరెడ్డి పార్వతీపురం జిల్లాకి బదిలీ అయ్యారు.నూతన ఎస్పీగా వి.రత్న త్వరలో భాధ్యతలు స్వీకరించనున్నారు.
$$$__________@@@__________$$$
ట్రస్ట్ కు నిత్యావసర సరుకుల అందజేత
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)గోరంట్ల జూలై14(విజయస్వప్నం.నెట్)
గోరంట్ల మండలంలోని చింతమానిపల్లి గ్రామానికి చెందిన మంజుల చారిటబుల్ ట్రస్ట్ కి ఆదివారం ఓడిచెరువు మండలంలోని గౌనిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2004-05 బ్యాచ్ పూర్వవిద్యార్థుల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందచేశారు.2004-05 పూర్వ విద్యార్థులు తమవంతుగా సేకరించిన నిత్యావసర సరుకులు కాకుండా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై మంజుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు,పలువురు అభినందించారు.
$$$__________@@@__________$$$
నూతన బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే
కదిరి పట్టణంలో ఆదివారం ఉదయం 10 గంటలకు కదిరి శాసనసభ సభ్యులు కందికుంట వెంకటప్రసాద్ కదిరి డిపో కు విచ్చేసి, కదిరి, బెంగుళూరు నూతన సర్వీస్ బస్సును ప్రారంభించారు.ఈసందర్భంగా శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ని సన్మానించినట్లు ఆర్టీసీ అధికారులు,సిబ్బంది తెలిపారు.
$$$__________@@@__________$$$
డ్రైవర్స్, క్లినిక్స్ సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి
- రాష్ట్ర అధ్యక్షులు బాబురావు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై14(విజయస్వప్నం.నెట్)
డ్రైవర్లు ప్రతి అంశంపై అవగాహన కల్గివుండాలని ఆల్ ఆంధ్ర డ్రైవర్లు, క్లీనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బాబురావు సూచించారు.మండల కేంద్రంలో ఆదివారం షాదీమహల్ హాల్ లో డ్రైవర్లు క్లీనర్ల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... డ్రైవర్లు,క్లీనర్ల సమస్యలను రాష్ట్ర స్థాయి నాయకులకు సమాచారం అందిస్తే తక్షణమే స్పందించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.దూర ప్రాంతాల్లో ప్రమాద సంఘటన సమయాల్లో డ్రైవర్లు, క్లీనర్లు మరణిస్తే పలు సందర్భాల్లో వారిని అక్కడే అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి నెలకొందని,అలా కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత అంబులెన్స్ సౌకర్యాలు కల్పించి మృతి చెందిన డ్రైవర్లు క్లీనర్లను వారి స్వగ్రామాలకు చేర్చే విధంగా దృష్టి సారించాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రభుత్వం డీజిల్ అమ్మకాలపై ప్రతి లీటరుకు సంక్షేమ పన్ను వసూళ్లు చేసి వాటిని డ్రైవర్లు క్లీనర్ల సంక్షేమ నిధికి జమ చేయాలని డిమాండ్ చేశారు.ప్రతి డ్రైవర్,క్లీనర్ భీమా తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.అనంతరం డ్రైవర్, క్లీనర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు.జిల్లా,మండల కమిటీ నాయకులు చిరంజీవి,వెంకటశివ, సుధాకర్,శివయ్య,ఆనందనాయక్, రహంతుల్లా, హరి,శివారాంరెడ్డి,శ్రీనివాసులు, మురళి,సోము, పురుషోత్తం,బాబ్జాన్,హరినాధరెడ్డి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో లేగదూడ మృతి
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, జూలై 15(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని ఇనగలూరు పంచాయతీ గ్రామానికి చెందిన రైతు ఇద్దే వాసుదేవ రెడ్డికి చెందిన లేగదూడ సోమవారం విద్యుత్ తీగలు సోకి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.గ్రామ సమీపంలో మేత కోసం వెళ్లిన పశువు తెగిపడిన విద్యుత్ తీగలు తగలడంతో షాక్ గురై మృతి చెందినట్లు తెలిపారు.అయితే విద్యుత్ తీగలు తదితర సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన సిబ్బందిలో మార్పు రాలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తెగిపడిన విద్యుత్ తీగలు మార్పించి విద్యుత్ సరఫరా అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
$$$__________@@@__________$$$
చంద్రబాబుతోనే మహిళా సంఘాల పురోభివృద్ధి..!!
మహిళా సంఘాల పుస్తక నిర్వహణలో అనిమేటర్లు కీలకం!
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై15(విజయస్వప్నం.నెట్)
సియం చంద్రబాబు నాయుడుతోనే మహిళా సంఘాల పురోభివృద్ధి సాధ్యమని,మహిళా సంఘాల సాధికారత కోసం ప్రభుత్వం అందించే నిధుల లావాదేవీల పుస్తక నిర్వహణలో అనిమేటర్లు కీలకమని మాజీ జెడ్పీ సభ్యులు పిట్టా ఓబుళరెడ్డి పేర్కొన్నారు.సోమవారం వడ్డివారిపల్లి గ్రామంలో వెలుగు పల్లవి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపియం రమణప్ప సమక్షంలో నూతన అనిమేటర్లు బాధ్యతలు స్వీకరించారు.ఈకార్యక్రమంలో మాజీ జెడ్పీ సభ్యులు పిట్టా ఓబుళరెడ్డి,తెదేపా మండల కన్వీనర్ జయచంద్ర, మాజీ కోఆప్షన్ సభ్యులు టైలర్ నిజాం తదితరులు పాల్గొని మాట్లాడారు.2000 సంవత్సరంలో సియం చంద్రబాబు నాయుడు మహిళలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో వెలుగు పథకం అమలు చేసారని, తద్వారా మహిళలు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకుని పొదుపులు జమ చేసుకుని,రుణాలు తీసుకుని జీవనోపాధులు పెంపొందించుకుని ఆర్థికాభివృద్ధితో పురోభివృద్ధి సాధిస్తున్నారని,అలాంటి పొదుపు సంఘాల పుస్తక నిర్వహణలో అనిమేటర్లు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ శంకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి పీట్లా సుధాకర్, ఎంపీటీసీ శ్రీనివాసులు, ఆర్ఎంపీ జాకీర్,ఇడగొట్టు రామాంజనేయులు, షాను,చాంద్ బాష,షబ్బీర్, అంజనప్ప,మునినాయుడు,మీసేవ సుధాకర్,అంజన్ రెడ్డి, వెంకటేష్ నాయుడు,ముద్దల శ్రీనివాసులు,శ్రీరాములు నాయుడు,హరున్,కిష్టప్ప, చంద్రశేఖర్ రెడ్డి, గంగాద్రీ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి