ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై08(విజయస్వప్నం.నెట్)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం వైకాపా మండల కన్వీనర్ రాజునాయుడు ఆధ్వర్యంలో ఎంపీపీ పర్వీన్ భాను అధ్యక్షతన వైకాపా నాయకులు,కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సోదరుడు దుద్దుకుంట శ్రీనివాసులురెడ్డి పాల్గొని మాట్లాడుతూ.... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఈకార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, జెడ్పీ సభ్యులు దామోదర్ రెడ్డి,లక్ష్మీరెడ్డి,కోళ్ళ కృష్ణారెడ్డి, సొసైటీ అధ్యక్షులు రామసుబ్బారెడ్డి,మైనారిటీ నాయకులు షామీర్ బాషా,బాబ్జాన్,నిషార్, బాబా ఫకృధ్ధీన్,మధుసూదన్, సూర్యనారాయణరెడ్డి, మిట్టపల్లి శ్రీనివాసులురెడ్డి,వెంకటరంగారెడ్డి, రాఘవయ్య,అక్రమ్, కుమార్,గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శ్రీ అక్కదేవతల ఆలయంలో సోమవార పూజలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై08(విజయస్వప్నం.నెట్)
మండలంలోని అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీ సప్త అక్కదేవతల ఆలయంలో ఆషాఢ తొలి సోమవారం సందర్భంగా పూజారి వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం దర్శనం కోసం విచ్చేసిన దాదాపుగా 300 మంది భక్తులకు తీర్థ ప్రసాదాలు,అన్నదాన కార్యక్రమం నిర్వహించారని కమిటీ సభ్యులు,గ్రామస్తులు తదితరులు తెలిపారు.
$$$__________@@@__________$$$
@పేదలకు ఉచిత ఇసుక వరం
తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం ఎంతో చారిత్రాత్మక నిర్ణయం:మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి,జూలై08(విజయస్వప్నం.నెట్)
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలను,భవన నిర్మాణ రంగ కార్మికులను దృష్టిలో ఉంచుకొని తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం ఎంతో చారిత్రాత్మక నిర్ణయమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.తెలుగుదేశం ప్రభుత్వం సోమవారం ఉచిత ఇసుక విధానం అమలు చేయడంపై పేదలు,భవన నిర్మాణ రంగ కార్మికుల తరఫున మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెదేపా కూటమి ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తెదేపా ప్రభుత్వం నెల రోజుల్లోనే తక్షణం అమలు చేయడంపై అయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ....గత ప్రభుత్వ హయాంలో ఇసుక సిండికేట్ రాజ్యం సాగిందని దీంతో సుమారు 50 వేల కోట్ల ఇసుక జగన్ అండ్ కో స్వంత ఖాతాలోకి పోయిందని ఆరోపించారు.గత ఎన్నికలకు ముందు పేద ప్రజలు,భవన నిర్మాణ రంగ కార్మికులు పడుతున్న కష్టాలను స్వయంగా చూసిన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా పేదలకు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశారు.తెదెపా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అయన స్వాగతించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు,భవన నిర్మాణ రంగ కార్మికులు,సామాన్యులు సైతం ఉచిత ఇసుక పొందేందుకు ఎంతో మంచి పథకం అన్నారు. ఇది పేద ప్రజలకు గొప్ప వరం అన్నారు.ఐదేళ్ల వైకాపా పాలనలో ఇసుకతో వైకాపా నాయకులు కోట్లు దోచుకున్నారని,తెదేపా ప్రభుత్వంలో ఎంతో పారదర్శకంగా పేద ప్రజలకు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన తెదేపా ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత ఇసుక విధానం అమలులోకి రావడంతో పేదల స్వంత ఇంటి కల సాకారం కానుందని అయన హర్షం వ్యక్తం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి