google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ - మహిళా పోలీసుల సమస్యలు పరిష్కారిస్తా:శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న - శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో.... వందేమాతరం సభ్యుల సేవలు - వెంకటాపురం పంచాయతీలో గ్రామసభ - కందికుంట నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ శుభవార్త....!!

25, జులై 2024, గురువారం

తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ - మహిళా పోలీసుల సమస్యలు పరిష్కారిస్తా:శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న - శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో.... వందేమాతరం సభ్యుల సేవలు - వెంకటాపురం పంచాయతీలో గ్రామసభ - కందికుంట నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ శుభవార్త....!!

తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జాయింట్ కలెక్టర్

అధికారులతో  జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సమీక్ష




శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువుఅమడగూరు జూలై24(విజయస్వప్నం.నెట్)

ఆమడగూరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.అనంతరం మండల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారురెవిన్యూ సమస్యలపై ఆరా తీసి రికార్డులు పర్యవేక్షణ వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల భూముల రికార్డులను  ప్రత్యేక గదుల్లో భద్రపరిచాలని,ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పటిష్ట భద్రతను పెంచుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.జాయింట్ కలెక్టర్ విలేకర్లతో మాట్లాడారు.రిజర్వుడ్ ల్యాండ్  నకిలీ పట్టాల వ్యవహారంఫై జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా అన్ని సమస్యలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జేసీ తెలిపారు.

 ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి వంశీకృష్ణ,తహసిల్దార్  రామనాథరెడ్డి,ఆర్ఐ ఈశ్వరయ్య,సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి,రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఓడిచెరువులో జేసీ ఆకస్మిక  తనిఖీ

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై 24(విజయస్వప్నం.నెట్)

మండల తహశీల్దార్ కార్యాలయంలో  జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ బుధవారం కంప్యూటర్ గది,రికార్డులు తనిఖీ చేశారు.అనంతరం  రెవెన్యూ సమస్యలపై ఆరా తీసి,అన్ని రకాల భూముల వివరాలు అధికారులను అడిగి  తెలుసుకున్నారు.భూములకు సంబంధించిన రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలని,విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు,విఆర్ఓలకు సూచించారు.తహశీల్దార్ ఖాజాభీ,సివిల్ సప్లై డిటీ రామాదేవి,రీసర్వే డీటి జాకీర్ హుస్సేన్,విఆర్ఓలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

మహిళా పోలీసుల సమస్యలు పరిష్కారిస్తా

- శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న

ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన మహిళా పోలీసులు

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడుగూరు జూలై24(విజయస్వప్నం.నెట్)

జిల్లాలోని మహిళా పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న హామీ ఇచ్చారు.జిల్లాకు బదిలీపై కొత్తగా వచ్చినా ఎస్పీ రత్నను మహిళా పోలీసుల సంఘం రాయలసీమ జోన్ అధ్యక్షరాలు (అమడగూరు మండలానికి చెందిన) ఎంవీ భవాని,(ధర్మవరం పట్టణానికి చెందిన)మహిళా పోలీస్ కృష్ణవేణి ఆధ్వర్యంలో జిల్లాలోని పలువురు మహిళా పోలీసులతో పాటు ఎస్పీ రత్నను పుట్టపర్తిలో ఆమె ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారని బుధవారం తెలిపారు.ముందుగా మహిళా పోలీసుల సంఘం ప్రతినిధులు నూతన ఎస్పీ వి.రత్నకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం క్షేత్ర స్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్పీకి వివరించారు.దీనిపై ఎస్పీ వి.రత్న సానుకూలంగా స్పందిస్తూ.. త్వరలోనే మహిళా పోలీసులందరితో ప్రత్యేక సమావేశం నిర్వహించి,అందరి సమస్యలు తెలుసుకుంటానని,వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు.

$$$__________@@@__________$$$

శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో....

వందేమాతరం సభ్యుల సేవలు


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు జూలై24(విజయస్వప్నం.నెట్)

మండలంలోని  గాజులపల్లి గ్రామ సమీపంలో శ్రీమాతశ్రీ వృద్ధాశ్రమంలో బుధవారం కొక్కంటి క్రాస్ వందేమాతరం టీం సభ్యుల ఆధ్వర్యంలో ఒక నెలకు సరిపడా బియ్యం  నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వృద్ధులకు సేవలందించారు.అనాధలకు,నిర్భాగ్యులకు ఆదరణగా నిలిచి వారిని సొంత కుటుంబ సభ్యుల కంటే అభిమానంగా చూసుకుంటున్న నిర్వాహకురాలు అరుణజ్యోతికి వందేమాతరం టీం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వందేమాతరం సభ్యులు సంకు వెంకటరమణ,బాగేపల్లి అశోక్,నవీన్,సుబ్బయ్య,బాలు గడి సుధాకర్ వందేమాతరం టీం సభ్యులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్న  వందేమాతరం టీం సభ్యులందరికీ పేరుపేరునా ఆశ్రమం తరపున వృద్ధుల తరపున ప్రతి ఒక్కరికి ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి కృతజ్ఞతలు తెలిపారు.జన్మదిన,వివాహ వార్షికోత్సవాలు వృద్ధాశ్రమంలో  నిర్వహించే విధంగా ముందుకు రావాలని,విలాసాలకు ఖర్చుపెట్టే డబ్బులు వృద్ధులకు, అనాధలకు ఒక పూట కడుపు నింపుతుందని, వందేమాతరం టీం సభ్యులు పేర్కొంటూ.... సహాయం చేయాలనుకున్న దాతలు ఈ నెంబర్;9381750414 సంప్రదించాలని కోరారు.

$$$__________@@@__________$$$

ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నిరాశ

- డీటీఎఫ్ నాయకులు

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) జూలై 24(విజయస్వప్నం.నెట్) 

కేంద్ర బడ్జెట్ ఉద్యోగ,ఉపా ధ్యాయులకు తీవ్ర నిరాశ కల్గించిందని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) నాయకులు వాపోయారు. శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్ష,ప్రధానకార్యదర్శి గౌస్ లాజమ్,మారుతి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి షర్ఫోద్దీన్ విలేకరులకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీపీఎస్ విధానంలో మార్పులు తెస్తామని చెబుతూనే పాత పెన్షన్ విధానంపై ప్రస్తావన తీసుకురాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఉద్యోగుల ఇన్కమ్ ట్యాక్సు సంబంధించి పాత విధానం కంటే కొత్త విధానంలో పన్ను ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారుకొత్త పన్నుల విధానానికే రాయితీలు ప్రకటించడం ఉద్యోగులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసేలా ఉందన్నారు.కేటాయించాల్సి ఉండగా, ప్రస్తుత బడ్జెట్లో 3.25 శాతం నిధులు కేటాయించారన్నారు. వచ్చే ఐదేళ్లలో నాలుగు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెబు తున్న ప్రభుత్వం గడిచిన పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కనీసం ప్రస్తావించలేదన్నారు.ద్రవ్యోల్బణం 4 శాతానికి తగ్గిందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి చెప్పారని,అందుకనుగుణంగా ధరలు తగ్గలేదన్నారు.ఇప్పటికైనా మధ్య తరగతి ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ పునరుద్ధరించే దానిపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.పాత పన్నుల విధానంలో రూ. 7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా మినహాయింపు ఇచ్చేలా స్లాబ్ విధానాన్ని సవరించాలన్నారు. కనీసం లక్ష రూపాయలు స్టాండర్డ్ డిటెక్షన్గా మినహాయింపు ఉండాలని వారు ఈసందర్భంగా కోరారు.

$$$__________@@@__________$$$

రాష్ట్రానికి అధిక నిధుల కేటాయింపుపై హర్షం 

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు జూలై24(విజయస్వప్నం.నెట్)

కేంద్రం రాష్ర్టానికి అధిక నిధులు కేటాయింపుపై మండల తెదేపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో  తెదేపా హిందూపురం పార్లమెంటు రైతు సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లుగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అన్న మాటే గట్టిగా వినపడలేదని,గతంలో అధికారంలో ఉన్న జగన్ సర్కారు పట్టించుకోలేదన్నారు.ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మాట పలుమార్లు మార్మోగిందని నవ్యాంధ్రకు రెండు కళ్ళు లాంటి రాజధాని అమరావతి,పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆర్థికంగా భరోసా లభించిందని హర్షణీయం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రధాని ఫనరేంద్ర మోడీకి,ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కి,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు.టఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి కాలే నాయక్,మాజీ ఎంపీటీసీ రాజారెడ్డి,ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, దొడ్డం మూర్తి,సప్లైయర్ రమేష్ ఉత్తప్ప,తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

వెంకటాపురం పంచాయతీలో గ్రామసభ

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై24(విజయస్వప్నం.నెట్)

మండలంలోని వెంకటాపురం పంచాయతీలో సర్పంచ్ శంకర్ రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించగా,ఎమ్పీటీసీ శ్రీనివాసులు,గ్రామకార్యదర్శి నౌషాద్ హాజరై మాట్లాడుతూ.... గ్రామాల్లో డ్రైనేజీలు,ట్యాంకులు,కాలువల వద్ద మురుగు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,పరిసరాలు అశుభ్రంగా వుంటే దోమలు వ్యాపించి విషజ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని కావున వ్యక్తిగత,పరిసరాలు పరిశుభ్రత పాటించాలని వారు గ్రామస్తులకు సూచించారు.గ్రామాలలో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారిస్తామని ఈసందర్భంగా వారు తెలిపారు.ఈకార్యక్రమంలో నారపరెడ్డి,రఘునాథరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

కందికుంట నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ శుభవార్త....!!

టెట్, డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ..!

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) కదిరి జూలై24(విజయస్వప్నం.నెట్)

కదిరి నియోజకవర్గంలోని డీఎస్సీ,టెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కేంద్రాన్ని కందికుంట నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు,ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటనలో తెలిపారు.ఉచిత శిక్షణ తరగతులలో అన్ని సబ్జెక్టులు బోధించే విధంగా. అనుభవజ్ఞులైన  అధ్యాపకులతో డిఎస్సీ,టెట్ అభ్యర్థులకు ఉచితంగా తరగతులను బోధించే ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంటూ....ఉచిత శిక్షణా తరగతులకు హాజరు కావాలనుకున్న డీఎస్సీ,టెట్ అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.వివరాల కోసం యం,నాగేష్ 9000034688 నంబరుకు ఫోన్ చేసి డిఎస్సీ,టెట్ అభ్యర్థులు  ఈనెల జులై 31వతేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.ఉచిత శిక్షణ కేంద్రం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేస్తారని,మరింత సమాచారం కొరకు పైన కనపరిచిన ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి