google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : వలసల నివారణ ధ్యేయంగా ఉపాధి పనులు కల్పించాలి - గర్భవతుల హై రిస్క్ పరిస్థితులు నివారిద్దాం - ప్రయాణికుల సౌకర్యార్థం బస్సుషెల్టర్లు ఏర్పాటు చేయాలి: బిజేపీ నాయకులు - దోమల నివారణ చర్యలు చేపట్టాలి:ఆర్సీపీ నాయకులు వినతి

10, జులై 2024, బుధవారం

వలసల నివారణ ధ్యేయంగా ఉపాధి పనులు కల్పించాలి - గర్భవతుల హై రిస్క్ పరిస్థితులు నివారిద్దాం - ప్రయాణికుల సౌకర్యార్థం బస్సుషెల్టర్లు ఏర్పాటు చేయాలి: బిజేపీ నాయకులు - దోమల నివారణ చర్యలు చేపట్టాలి:ఆర్సీపీ నాయకులు వినతి

దోమల నివారణ చర్యలు చేపట్టాలి:ఆర్సీపీ నాయకులు వినతి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు డిచెరువు జూలై08(విజయస్వప్నం.నెట్)

మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో దోమలు వ్యాపించడంతో ప్రజలు ఆనారోగ్యాలౌతున్నారని ఉన్నతాధికారులు స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు సోమవారం తహశీల్దార్ ఖాజాభీకి వినతిపత్రం అందజేశారు.ఆర్సీపీ డివిజన్ కార్యదర్శి మున్నా,రైతుసంఘం నాయకులు ఆకుతోట రామచంద్ర మాట్లాడుతూ.... దోమలు వ్యాపించడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాంతులు, విరేచనాలు,జ్వరాల బారినపడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ.... ఇబ్బందులు పడుతున్నారని,అధికారులు స్పందించి ఫాగింగ్ ద్రావణం పిచ్చికారీ చేయించి దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రజలను కాపాడాలని వారు కోరారు.అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

$$$__________@@@__________$$$

ప్రయాణికుల సౌకర్యార్థం బస్సుషెల్టర్లు ఏర్పాటు చేయాలి: బిజేపీ నాయకులు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై08(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల కేంద్రంలో శివాలయం వద్ద,వైయస్సార్ సర్కిల్ దగ్గర బస్సు షెల్టర్లు ఆక్రమణకు గురయ్యాయని వెంటనే పూలు,పండ్లు వ్యాపారస్తులను,హోటళ్ళను ఖాళీ చేయించి బస్సు షెల్టర్ లను ప్రయాణికుల సౌకర్యాలు ఉపయోగించాలని కోరుతూ సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో  మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిణి వరలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. స్కూలు పిల్లలు,వృద్దులు, గర్భిణీ స్త్రీలు అదేవిధంగా చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని,కావున అధికారులు స్పందించి ప్రజల ప్రయాణ సౌకర్యార్థం బస్సుషెల్టర్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రంగారెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ హరికృష్ణ,అశ్వతప్ప,బీజేవైఎం జిల్లా కార్యదర్శి నరేష్ బాబు,నాగార్జున,రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

గర్భవతుల హై రిస్క్ పరిస్థితులు నివారిద్దాం



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై09(విజయస్వప్నం.నెట్)

ముందస్తుగా అవగాహన కలిగి ఉండి గర్భవతుల హైరిస్క్  పరిస్థితులను నివారించ గలిగితే సాధారణ ప్రసవాలతో ఆరోగ్యవంతమైన పిల్లలను సంతానంగా పొందవచ్చని మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి భానుప్రకాష్ పేర్కొన్నారు.మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలవారీ రివాజుగా నిర్వహించే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతిక వీక్షణ హై రిస్క్ లక్షణాలు అయిన యుక్త,మేనరిక వివాహాలు,40 సంవత్సరాలు పైన గర్భవతి,35 సంవత్సరాలు పైన ప్రసవం,145 సె.మీ.లోపు ఎత్తు,42 కేజీల లోపు బరువు,వంధత్వం తర్వాత గర్భధారణ,అలాగే వైద్య సంబంధమైన హైరిస్క్ అంశాలు అనగా దీర్ఘకాలిక రుగ్మతలు,గర్భస్రావ గత చరిత్ర,కవలలు,పిండం అసాధారణ స్థితి,తీవ్ర రక్తహీనత,గుండె జబ్బులు,మధుమేహం,హెచ్ఐవి,థైరాయిడ్,కామెర్లు మొదలగు విషయాల పట్ల అవగాహన ఏర్పరచుకొని జాగ్రత్తలు తీసుకుంటే ముందస్తుగా ప్రమాద సంకేత ప్రసవాలను నివారించవచ్చని సూచించారు.ఆరోగ్య విద్యలో భాగంగా ఐరన్,ప్రోటీన్లు,విటమిన్లు, ఖనిజాలతో పోషకాహార ప్రాముఖ్యత,పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వాతావరణ అనుకూలంగా  వ్యాప్తి చెందే వ్యాధుల నివారణ,క్రమం తప్పకుండా గర్భవతి పరీక్షలు,ప్రసవ ప్రణాళిక,ఆసుపత్రి ప్రసవం ప్రాముఖ్యత,ప్రభుత్వ ఆరోగ్య ప్రోత్సాహక పథకాల వినియోగం తదితర విషయాల గురించి  బోధించారు.ఈ కార్యక్రమంలో హాజరైన 70 మంది గర్భవతులలో 34 మంది ని హై రిస్క్ వారిగా గుర్తించి అవసర,అత్యవసర చికిత్స,తదుపరి వారికి చిరు వ్యాధుల  చికిత్స అందించి 21మందికి ఉచిత స్కానింగ్, మందుల పంపిణి చేశారు మ. ఈ కార్యక్రమానికి హాజరైన గర్భవతులకు,వారి సహాయకులకు కదిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్,సెక్రటరీ పృథ్వి,నితిన్,డాక్టర్ రోబ్,డాక్టర్ కవిత కుటుంబ సభ్యులు ఆర్గనైసేడ్  పి.లక్ష్మీదేవి,వనిత, విష్ణులు భోజన సౌకర్యం కల్పించారు.వీరి సేవా భావనకు సిబ్బంది,గర్భవతులు, తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది,ఆరోగ్య, ఆశ కార్యకర్తలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

వలసల నివారణ ధ్యేయంగా ఉపాధి పనులు కల్పించాలి


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై09(విజయస్వప్నం.నెట్)

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో చేపట్టే ఉపాధి పనులు రైతులకు ఉపయోగకరంగా వున్న వాటికీ ప్రాధాన్యత ఇవ్వాలని తెదేపా మండల కన్వీనర్ జయచంద్ర, మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి పేర్కొన్నారు.మంగళవారం ఉపాధిహామీ పథకంలో నూతన  ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేపట్టే వారి జాబితాను ఎంపిడిఓ కార్యాలయంలో సూపరిండెంట్ పూలరెడ్డప్ప,ఈఓఆర్డి రాజశేఖరలకు అందజేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ 90 శాతం ఫీల్డ్ అసిస్టెంట్లును ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ అభ్యర్థులకు కేటాయించి సామాజిక న్యాయం చేశామని తెలిపారు.నూతనంగా నియామకమైన ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ.... ఉపాధిపనులు సంవృద్ధిగా కల్పించి వలసల నివారణకు కృషి చెయ్యాలని కోరారు.కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాసులు, తెదేపా నాయకులు,కార్యకర్తలు ఆర్ఎంపీ డా,,జాకీర్ అహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

అక్రమంగా తరలిస్తున్న బియ్యం వాహనం సీజ్

అమడగూరు జనసేన వార్త జూలై09:- 

మండల పరిధిలోని మారుతిపురం వద్ద మంగళవారం ముందస్తు సమాచారం మేరకు ఎ‌‌స్ఐ మగ్బుల్ బాషా ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ నిర్వహిస్తుండగా దాదాపుగా 61 బస్తాల(3టన్నులు)ప్రభుత్వ ప్రజా వ్యవస్థ సరఫరా బియ్యంతో ఏపీ నుండి కర్ణాటక రాష్ర్టానికి తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకుని సీజ్ చేసి,కర్ణాటక రాష్ట్రం బిళ్ళూరు గ్రామానికి చెందిన రవి,కొలిమిరాల్లపల్లి సుధాకర్ ను,ఓడిచెరువు మండలానికి చెందిన డ్రైవర్ బాబాను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


$$$__________@@@__________$$$

ఎంఈవో2 పోస్టును మండల పరిషత్ విద్యాశాఖ అధికారిగా పేరు మార్చాలి:డిటిఎఫ్

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై09 (విజయస్వప్నం.నెట్)

సమగ్ర శిక్ష అభియాన్ లో పని చేస్తున్న ఉద్యోగులకు మే, జూన్ నెలల జీతాలు చెల్లించాలని,ఎంఈఓ2 పోస్టును మండల పరిషత్ విద్యాశాఖఅధికారిగా పేరు మార్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మంగళవారం ఒక ప్రకటనలోకోరారు. వీరికి మండల పరిషత్ లోని ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల జీతాల చెల్లింపు తనిఖీ అధికారాలు శాఖపరమైన అన్ని అధికారులను బదలాయించాలని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గౌస్ లాజమ్ మారుతి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి