google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : శ్రీసత్యసాయిజిల్లా కలెక్టర్ గా టీఎస్ చేతన్ నియామకం - సీఐటీయూ ఆధ్వర్యంలో వైద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు - విద్యార్థులకు నగదు ప్రోత్సాహం చేసిన రమణ దంపతులు - పురోహితులు పి.నాగేంద్రశర్మ మృతి పట్ల సంతాపం

3, జులై 2024, బుధవారం

శ్రీసత్యసాయిజిల్లా కలెక్టర్ గా టీఎస్ చేతన్ నియామకం - సీఐటీయూ ఆధ్వర్యంలో వైద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు - విద్యార్థులకు నగదు ప్రోత్సాహం చేసిన రమణ దంపతులు - పురోహితులు పి.నాగేంద్రశర్మ మృతి పట్ల సంతాపం

శ్రీసత్యసాయిజిల్లా కలెక్టర్ గా టీఎస్ చేతన్ నియామకం

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూలై 02(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయిజిల్లా కలెక్టర్ గా టీఎస్ చేతన్ ను నియమించినట్లు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం శ్రీసత్యసాయిజిల్లా కలెక్టర్ గా ఉన్న అరుణ్ బాబును పల్నాడు జిల్లా కలెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

$$$_________@@@__________$$$

సీఐటీయూ ఆధ్వర్యంలో వైద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై02(విజయస్వప్నం.నెట్)

మండలంలోని మహమ్మదాబాద్ క్రాస్ గ్రామంలో మంగళవారం సిఐటియూ ఆధ్వర్యంలో విద్యా వైజ్ఞానిక అవగాహన శిక్షణ తరగతులను నిర్వహించారు.ముందుగా వివి రమణ జండా ఆవిష్కరణ చేయగా,సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ అధ్యక్షతన శిక్షణ తరగతులు ప్రారంభించారు.సిఐటియూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ లు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై అవగాహన కల్పించి, బోధించారు.ఈ శిక్షణ తరగతులను బోధించడానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల్ సహకారంతో సిఐటియు విశిష్టత పోరాటాలు సిఐటియు ఉద్యమాలు అనుభవాలు గురించి గంటన్నర పాటు  బోధించారు.మధ్యాహ్నం సిఐటియు నిర్మాణం,సంఘం ప్రతిష్ట వివరాలపై సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి బోధించారు.కార్మికులకు,భవననిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని,సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని,మరణించిన కార్మికుల కుటుంబంలో వారికి ఇన్సూరెన్స్ కార్ సౌకర్యం కల్పించి వాళ్ల కుటుంబాన్ని ఆదుకోవాలని,సంక్షేమ పథకాలు అమలు చేయాలని సభ్యులు సమీక్షించారు.అంగన్వాడీ,ఆశ కార్మికులకు,పంచాయతీ కార్మికులకు,ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలని,సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గ్రావిటీ ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని,స్వచ్ఛభారత్ కార్మికులకు,పంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కనీసం 26 వేలు అమలుచేయాలని,ఆటో కార్మికులపైన పోలీసు వేధింపులు లేకుండా చలానాలు రద్దు చేయాలని,కార్మికులు లేబర్ చట్టాలను అమలు చేయాలని,కార్మికులకు సంక్షేమ ఏర్పాటు చేయాలని అలా లేని పక్షంలో రాబోయే కాలంలో ఉద్యమాలు ఉదృత చేస్తామని చర్చించినట్లు తెలిపారు.కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని,లేబర్ చట్టాల అమలు చేయాలని ,కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో  మండల అధ్యక్షులు కుళ్ళాయప్ప,కార్యదర్శి శ్రీరాములు, సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు గంగాధర,బాబా,వేమన్న,భవననిర్మాణ కార్మిక సంఘం నాయకులు సూరి,సురేంద్ర,శ్రీనివాసులు,మహేంద్ర,గంగులప్ప,నాగరాజ,సూరి అనుబంధ సంఘాల కార్మికులతో పాటు అంగన్వాడీ ప్రాజెక్టు లీడర్లు,సెక్టార్ లీడర్లు రంగమ్మ, ఆశీర్వదమ్మ, కిష్టమ్మ, ఆదిలక్ష్మి, సుజాత, ఉమాదేవి, సునీత, గంగాదేవి, పద్మావతి, స్వర్ణ, వరలక్ష్మి, నాగరత్నమ్మ, మణిమాల, సునీత, స్వచ్ఛభారత్ కార్మికులు రమేష్, రమణమ్మ, గంగులమ్మ, మహిళా సంఘం నాయకురాలు కాంతమ్మ, కళావతమ్మ తదితరులు పాల్గొన్నారు.

$$$_________@@@__________$$$

విద్యార్థులకు నగదు ప్రోత్సాహం చేసిన రమణ దంపతులు



శ్రీసత్యసాయిజిల్లా(అమడగూరు) జూలై02(విజయస్వప్నం.నెట్)

అమడగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2023_24 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులలో 500 మార్కులు దాటిన ప్రతి విద్యార్థికి రమణ దంపతులు తన కుమార్తె పావని జ్ఞాపకార్థం ప్రోత్సహిస్తూ(20వేలు)నగదు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ బాబు మాట్లాడుతూ ....ఈ విధంగా మా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించినందుకు రమణ దంపతులకు అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.500 పైగా మార్కులు సాధించిన విద్యార్థుల జాబితా మేరకు ఈక్రింది విధంగా అందజేశారు. చందు 590(5000/-), ఆశ 580 (4000/-) రితిక 569 (3000/-) ఇందు 527 (2000/-) సుహేల్ ఖాన్ 512 (1000/-) శృతి 512(1000/-) అందజేశారు.ఉపాధ్యాయులు మాట్లాడుతూ మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు రమణ దంపతులకు, కుటుంబ సభ్యులకు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

$$$_________@@@__________$$$

పురోహితులు పి.నాగేంద్రశర్మ మృతి పట్ల సంతాపం

పురోహితులు పి.నాగేంద్ర శర్మ ఫైల్ ఫోటో

శ్రీసత్యసాయిజిల్లా(అమడగూరు)జూలై02(విజయస్వప్నం.నెట్)

మండలంలోని శితిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పురోహితులు పి.నాగేంద్ర శర్మ మంగళవారం ఉదయం మృతి చెందగా పలువురు రాజకీయ నాయకులు,వివిధ గ్రామ ప్రజలు,రైతులు సందర్శించి పార్థివదేహానికి  పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.గ్రామ పురోహితులు పి.నాగేంద్ర శర్మ మృతి సమాచారం అందుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నియోజకవర్గంలో అంద్దుబాటులో లేనందున ఫోన్ లో కుటుంబ సభ్యులను పరామర్శించి,మనో ధైర్యం నింపారని,తెదేపా అండగా వుంటుందని భరోసా ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి