మండల వాల్మీకి అధ్యక్షురాలుగా నాగవేణి
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు22(విజయస్వప్నం.నెట్)
మండల నూతన వాల్మీకి సంఘం అధ్యక్షురాలుగా మిట్టపల్లి పంచాయతీ గ్రామానికి చెందిన బోగీ నాగవేణి గురువారం ఏకగ్రీవంగా ఎంపికైనట్లు పేర్కొంటూ.... తనకు రాష్ట్ర వాల్మీకి కోర్ కమిటీ ఉపాధ్యక్షులు కుర్లపల్లి మోహన్ ఉత్తర్వులు పంపినట్లు నూతన వాల్మీకి మండల అధ్యక్షురాలు నాగవేణి తెలిపారు.
$$$__________@@@__________$$$
నేడు ఉపాధి హామీ పథకంపై గ్రామసభలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు ఆగష్టు22(విజయస్వప్నం.నెట్)
మండల వ్యాప్తంగా 10పంచాయతీ గ్రామాల్లో నేడు (శుక్రవారం)మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులను గుర్తింపు కోసం గ్రామసభలు నిర్వహిస్తారని గురువారం ఎంపిడిఓ మునెప్ప ఓప్రకటనలో పేర్కొంటూ....గ్రామ పంచాయితీల వారిగా షెడ్యూల్ విడుదల చేశారు.అమడగూరు,చీకురేవుపల్లి,జౌకుల కొత్తపల్లి,కసముద్రం,మహ్మదాబాద్,కొట్టువారిపల్లి,పూలకుంటపల్లి,తుమ్మల పంచాయతీ గ్రామాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి గుండువారిపల్లి,చినగానిపల్లి పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులు, సర్పంచులు,ఎంపీటీసీలతో కలిసి సంబంధిత అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించే ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు.కూలీలు,మేట్లు, శ్రమశక్తి సంఘాల సభ్యులు, గ్రామ సంఘాల సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొని ఉపాధి హామీ పథకం ద్వారా పనులను గుర్తిస్తారని తెలిపారు.
$$$__________@@@__________$$$
ఈ పంట నమోదు పరిశీలించిన ఏఓ
అమడగూరు,జనసేన వార్త, ఆగష్టు22
మండలంలోని చిన్నగానిపల్లి,చీకిరేవులపల్లి,కసముద్రం పంచాయతీ గ్రామ రైతు సేవా కేంద్రాల్లో గురువారం మండల వ్యవసాయాధికారి వెంకటరమణాచారి ఈ పంట నమోదు ప్రక్రియ పరిశీలించి, సిబ్బందికి సూచనలు,సలహాలిచ్చారు.ప్రతి రైతు ఈ పంట నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
$$$__________@@@__________$$$
శ్రీమాతశ్రీ వృద్ధాశ్రమంలో చిన్నారి పుట్టినరోజు వేడుకలు
అమడగూరు,జనసేన వార్త, ఆగస్టు 22
మండలంలో గాజులపల్లి గ్రామ సమీపంలో శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ బాబాకలందర్ దంపతుల ముద్దుల చిన్నారి సారియా 6వ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఆశ్రమానికి ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా చేయూతనిస్తూ సహాయ సహకారాలు అందిస్తామని కేలండర్ పేర్కొన్నారు.
ఆశ్రమ నిర్వాకరాలు అరుణజ్యోతి మాట్లాడుతూ చిన్నారి సారియాకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
$$$__________@@@__________$$$
గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,ఆగస్టు23(విజయస్వప్నం.నెట్)
రాష్ట్రంలో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి,డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కి,నారా లోకేష్ కి, పల్లె సింధూర రెడ్డి కి తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మండలం కేంద్రంలో పంచాయతీలో అమడగూరు గ్రామసభ కార్యక్రమంలో అధికారులు తెదేపా నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ గ్రామసభల్లో పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తులు వీధి దీపాలు, మురుగునీరు, సిమెంటు రహదారులు, గ్రామాలలో రోడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు ఉపాధి హామీ పథకం ద్వారా పని దినాలు పెంచడం అనేక సమస్యలపై అధికారులు గ్రామ ప్రజలు చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ షబ్బీర్ పంచాయితీ కార్యదర్శి చంద్ర, టెక్నికల్ అసిస్టెంట్ అశోక్, వేల్పర్ ఎడ్యుకేషన్ సుని, అసిస్టెంట్ ఇంజనీరింగ్,ఏవో వెంకటరమణాచారి,ఫీల్డ్ అసిస్టెంట్ రామంజి, డి.మూర్తి,బూత్ కన్వీనర్ బి ఎన్బి మూర్తి జనసేన నాయకుడు శ్రీనాథ. తెదేపా మహిళా నాయకురాలు గాయత్రి,భాస్కర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,నారాయణ,రామంజి తెదేపా శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఓడిచెరువులో.... మండల వ్యాప్తంగా శుక్రవారం 14 పంచాయతీ గ్రామ కార్యాలయాల్లో గ్రామసభలు నిర్వహించారు.మండల కేంద్రంలో ఒకటవ సచివాలయంలో ఎంపీడీవో వరలక్ష్మి అధ్యక్షతన గ్రామసభ ప్రారంభించారు.సర్పంచ్ ముద్దలపల్లి గోవిందు, ఎంపీపీ షామీర్ పర్వీన్ భాను, మాజీ జెడ్పీ సభ్యులు పిట్టా ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు.మహాత్మగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు,గ్రామాల్లో మౌళిక సదుపాయాలు, వ్యవసాయ రంగంలో ఉపాధి హామీ అనుసంధానం తదితర అంశాలపై సమీక్షించారు. ఈకార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రామలింగారెడ్డి, తెదేపా, జనసేన, బిజెపి కూటమి సభ్యులు జయచంద్ర, సీసీ కెమెరా శంకర్, టైలర్ నిజాం, పీట్లా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు 200 రోజులు పని దినాలు పెంచాలని,ఇతర ప్రాంతాలకు ఉపాధి పనులకు వెళ్ళేందుకు కూలీలకు అదనంగా ఛార్జీలు చెల్లించాలని తదితర అంశాలపై సిపియం నాయకులు రమణ, కుళ్ళాయప్పలు సున్నంపల్లి పంచాయతీ గ్రామసభలో అధికారులకు వినతిపత్రం అందించినట్లు తెలిపారు.
$$$__________@@@__________$$$
గుండె పోటుతో వ్యక్తి మృతి
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,ఆగస్టు 23(విజయస్వప్నం.నెట్)
అమడగూరు మండల పరిధిలో ఏ.కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం మంజుల గంగులప్ప పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి గుండె పోటుతో ఆకస్మిక మృతి చెందారని బంధువులు తెలిపారు.మృతినికి ఇద్దరు కుమారులు వున్నారు.విషయం తెలుసుకున్న గ్రామస్తులు గంగులప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి,మంచి మనిషి గంగులప్ప మన మధ్య లేకపోవటం భాద కారణమని, వారికీ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
$$$__________@@@__________$$$
పాడి రైతులకు అవగాహన
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు24(విజయస్వప్నం.నెట్)
మండలంలోని మల్లెలవాండ్లపల్లిలో శనివారం ఉచిత గర్భ కోశ చికిత్సా శిబిరం ఏర్పాటు చేసి జిల్లా పశు గణాభివృద్ది సంస్థ వారు ఉచిత మందుల పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 90% కచ్చితత్వంతో పేయి దూడల పుట్టుకను ఉద్దేశించి లింగ నిర్ధారిత వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయు పథకం ప్రాచుర్యనిమిత్తం,ఆ పథకానికి మంచి పశువుల ఎన్నికకు, రైతుల అవగాహన కొరకు, గ్రామంలో అన్ని పశువులను పరీక్షించుట కొరకు ఉచిత గర్భకోశ చికిత్స శిబిరము ఏర్పాటు చేపట్టారన్నారు. 1350/- విలువ గల రెండు సూదులను,850/- సబ్సిడీ పోగా 500/- మాత్రమే చెల్లిస్తే, మొత్తంగా పేయిదూడలను పొందే సూదులను ప్రభుత్వం వారు సరఫరా చేస్తున్నారని తెలిపారు.పైగా, రెండు సూదులు వేసినా కట్టకపోతే 500/- తిరిగి వెనక్కి ఇవ్వడం, పొరపాటున కుర్ర దూడ పుడితే 250/- వాపస్ ఇవ్వడం,విదేశీ జాతులనే కాక స్వదేశీ జాతులైన గిర్,సాహివాల్,తార్పర్కార్ వంటి కావలసిన బ్రీడ్ లను ఎంపిక చేసుకొనే అవకాశం ఉండడం,పుట్టేది పేయిదూడ కనుక ఈనునప్పుడు ఆవుకు కష్టం లేకుండా ఈనడం,పుట్టే పేయిదూడ చూడి నిలిస్తే 20% అధిక పాలనిచే శక్తి కలిగి ఉండడం అనునవి ప్రత్యేక లాభదాయకమైన అంశమలని డి.ఎల్.డి.ఏ.,అనంతపురం జిల్లా కార్యనిర్వహణాధికారి డాక్టర్ టి.వి.సుధాకర్ తెలిపారు.భవిష్యత్తులో ఈ లింగ నిర్ధారిత వీర్యము అత్యధిక ప్రాచుర్యం పొందుతుందని, గ్రామములో అత్యధిక పాడి కొరకు పేయిదూడలు మాత్రమే పొందే ఆధునిక సాంకేతిక విప్లవముగా ఈ పథకం మారగలదని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు.
అదే గ్రామములో, పశువులలో చూడి నిర్ధారణ,తిరిగి ఎదకు వస్తూ కట్టకుండా నిలిచిపోయినవి, పూర్తిగా ఎదకురానివి లాంటి సుమారు 33 పశువులకు గర్భకోశవ్యాధుల నిపుణుడు అయిన డాక్టర్ టి.వి. సుధాకర్ గర్భకోశ పరీక్షలు నిర్వహించారు.నట్టల నివారణ మందులు 12వాటికి తాపారు, సాధారణ కేసులు 9 చూసి వాటికి తగు వైద్యం అందించి, సలహాలు, సూచనలిచ్చారు.
ముఖ్యంగా, పాడి పశువులలో మంచి కట్టు శాతం రావటానికి ఆఖరు దశలో ఉన్నపుడు కృత్రిమ గర్భధారణ చేయిస్తే మాత్రమే చూడి నిలుస్తుందని తెలుసుకోవడం, షుమారు 11-15 ఎద లక్షణాలు ఉన్నప్పటికీ, 2,3 చూపినా ఆ పశువు ఎదలో ఉందని రైతు తెలుసుకోగలగడం,స్థానికంగా విరివిగా లభ్యమగుచున్న సుబాబుల్ ఆకు వాడకం,ఈనిన మూడు నెలల లోపే కృత్రిమ గర్భధారణ చేయించడం,ఏడాదికో దూడ లక్ష్యంగా ప్రత్యేక మైన మేపు, యాజమాన్యం పాటించడం, తద్వారా పశువు తన జీవితకాలంలో సాధ్యమైనన్ని ఎక్కువ ఈతలు ఈనడం వలన అధిక దూడలు,అధిక పాలదిగుబడి పొంది తద్వారా అధిక రాబడి పొందడం,ఎద సూది చేసిన తర్వాత 20 రోజుల పాటు బెల్లం నీళ్లు,టెంకాయ నీళ్లు లాంటివి త్రాగించడం,రోజుకి 100 గ్రాముల ఎముకల పొడి తినిపించడం,మునగాకు, కరివేపాకు మేపడం లాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం లాంటి విషయాలపై రైతులకు ప్రత్యేక అవగాహనా సదస్సు ఏర్పాటు చేసి పశువులకు సరైన పోషణ కొరకు పచ్చి మేత,దాణాలతో పాటు కొండ చిగిరాకు, మునగాకు, కరివేపాకు, మొలకెత్తిన పెసలు, ఉలవలు, సద్దలు, రాగులు మేపినట్లైతే హార్మోన్స్ లోపం మరియు పోషకార లోపాలు లేకుండా చేసి,పశువులను త్వరగ చూలు కట్టించ వచ్చునని తెలిపారు.
గర్భకోశ వ్యాధులతో ఉన్నవాటిని, ఎద లక్షణాల పశువులను, చూడి పశువులను చూపించి తగు జాగ్రత్తలు, నివారణోపాయాలు సూచిస్తూ, డాక్టర్ టి.వి.సుధాకర్ హాజరైన రైతులకు, ఏహెచ్ఏ లకు, పశువైద్యులకు ప్రత్యేక శిక్షణ, మెలుకువలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండల పశువైద్యాధికారి సి. ప్రవీన్ కుమార్, ఏహెచ్ఏలు, జిఎంఎస్ లు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శ్రీ జ్ఞానసాయిలో కృష్ణాష్టమి వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు, ఆగష్టు24(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో శ్రీ జ్ఞానసాయి విద్యానికేతన్ లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.చిన్నారులు కన్నయ్య,గోపిక,రాధాకృష్ణల వేషధారణలతో ఆకట్టుకున్నారు.ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు అలరిస్తూ.... ఆటపాటలతో సందడి చేశారు. ఉపాధ్యాయ బృందం సాంప్రదాయ దుస్తులు ధరించి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. కరస్పాండెంట్ మోహన్ రెడ్డి చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు.విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఖాద్రీశుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) కదిరి,ఆగష్టు24(విజయస్వప్నం.నెట్)
నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి సుజాత నేడు శనివారం సాయంత్రం 5.30 గంటలకు విచ్చేయగా,గౌరవనీయులైన జడ్జి సుజాతకి ఆలయ తూర్పూ రాజగోపురము వద్ద నుండి పూర్ణకుంభముతో ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాస రెడ్డి, ఉపప్రధాన అర్చకలు ఎ.కుమార్ రాజాచార్యులు, ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీస్వామి,ఆమ్మవార్ల ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీస్వామి వారి చిత్ర పటము,శేషవస్త్రములతో సత్కరించి,తీర్థ ప్రసాదములు సమర్పించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.
$$$__________@@@__________$$$
వాహనాలును తనిఖీ చేసిన ఎస్ఐ
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,ఆగష్టు24(విజయస్వప్నం.నెట్)
మండల కర్ణాటక సరిహద్దులో శనివారం ఎస్ఐ వెంకటనారాయణ ముమ్మరంగా వాహనాలను తనకి నిర్వహించారు.ప్రతి వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని,వాహనాలకు సంబంధించిన ఆర్సీలు లైసెన్సులు హెల్మెట్లు ఉండాలని పరిమితికి మించి ప్రయాణీకులను తరలించకూడదని,అతివేగం చాలా ప్రమాదకరమని,ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలను నడపరాదని,కర్ణాటక మద్యం అమ్మిన సరఫరా చేసిన వారిపై అధికారుల ఆదేశాల మేరకు జరిమానాలు,జైలు శిక్షలు విధిస్తామని హెచ్చరించారు.సరిహద్దు గ్రామ పరిసరాల్లో,వివిధ వాహనాలు తనిఖీలు నిర్వహించి, వాహనదారులకు, ప్రయాణికులకు ఎస్ఐ అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి